
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్స్: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైరానామౌ మంఝరి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించడంతో.. పక్కింట్లో ఉండే రైతు సంజయ్ అనే వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను.. పామును కొట్టి చంపేశాడు. ఆ తర్వాత దాన్ని చేతికి చుట్టుకుని ఊరంగా తిరిగాడు. ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘నన్ను కరవడానికి ఈ పాముకు ఎంత ధైర్యం’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని పలుమార్లు మళ్లీ కొరికాడు.
చనిపోయిన పామును పక్కకు తీసేందుకు కొంతమంది ప్రయత్నించినా.. అతడు దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. చివరకు స్థానికులు అతన్ని ఎలాగోలా ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు.. అతడికి సంబంధిత ఇంజెక్షన్ ఇచ్చి, కొంతసేపటి తర్వాత ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. పాముకాటు ప్రమాదకరమైనది కావడంతో ఇలాంటి సందర్భాల్లో పామును పట్టుకోవడం లేదా చంపేందుకు ప్రయత్నించడం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Read Latest AP News And Telangana News And International News And Telugu News





