
తిరుపతి(ఎస్వీయూ): 200 అడుగుల జాతీయ పతాకానికి విద్యార్థులు అంకెల ఆకారంలో వందనం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తిరుపతిలోని ముత్యాల రెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మరి కొంతమంది విద్యార్థులు 80 ఆకారంలో కూర్చొని పతాకానికి నేలను తాకుతూ నమస్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు సురేష్ అధ్యక్షతన విద్యార్థులు జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. అంకెల రూపంలో విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





