
గైనకాలజిస్టు లేక.. స్కానింగ్ మిషన్ నిరుపయోగం
వడమాలపేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ మిషన్ ఉన్నా మహిళలకు ఉపయోగం లేకుండా పోయింది. గైనకాలజిస్టు లేకపోవడంతో సుమారు మూడేళ్లుగా స్కానింగ్ మిషన్ వినియోగానికి నోచుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మహిళలు, గర్భిణులు అవసరమైన స్కానింగ్ పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గైనకాలజిస్టును నియమించి, స్కానింగ్ మిషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు







