
ఆంధ్రప్రదేశ్ పై ఓవైపు ఎల్ నినో (EL Nino)ప్రభావం కనిపిస్తున్నా.. మరోవైపు బంగాళాఖాతంలో పరిస్ధితుల కారణంగా అడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా అల్పపీడన పరిస్ధితులు (AP Weather) కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో బుధవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.AP SIR: ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ..!ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు (మంగళవారం) విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains)కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!మరోవైపు ఇవాళ సాయంత్రం 5గంటల వరకూ అనకాపల్లి జిల్లా పరవాడలో 37.5 మిమీ వర్షం కురిసింది. అలాగే విజయనగరం జిల్లా వేపాడలో 32.9మిమీ వర్షంె, అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెంలో 32మిమీ, కొప్పాకలో 27.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రికి పలు జిల్లాల్లో వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి వర్షం కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

