
Youtuber Nandu | యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ.. నా భర్తే చూసుకుంటారు...
Youtuber Nandu | యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ.. నా భర్తే చూసుకుంటారు...
© 2026 nimisham.in

Youtuber Nandu | యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ.. నా భర్తే చూసుకుంటారు...

Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న గ్యాంగ్స్ నిత్యం పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టినా ఈ ఫేక్ కరెన్సీ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు. వీరిలో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.91 లక్షల విలువ జేసే నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్రింటర్, స్కానర్, లామినేటర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కుటుంబం నకిలీ రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు తయారీ చేస్తున్నారని.. ఎక్కువగా రాత్రివేళల్లోనే నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణాలు, పాన్ డబ్బాల వద్ద నకిలీ నోట్లు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుల్ని చింతల్ తండా, వడ్డిపట్లకు చెందిన రమావత్ రాము అలియాస్ మహ్మద్ (36), రమావత్ మోతీలాల్ (35), రమావత్ గాంధీ (19) లుగా గుర్తించారు. వీరిలో రాము ఫుడ్ డెలివరీ ఉద్యోగి కాగా మోతీలాల్ ర్యాపిడో డ్రైవర్ గా, గాంధీ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే వీరికి సహకరించిన మరో నిందితుడు నాగోల్- బండ్లగూడకు చెందిన సుధీర్ జాన్ చెలా అలియాస్ వంశీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇక షామీర్ పేట్, బాలాపూర్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (షామీర్ పేట జోన్) పోలీసులు, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల తయారీ వ్యవహారం బయటపడింది. మరోవైపు నకిలీ కరెన్సీ తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా..? ఈ నోట్లు ఎక్కడెక్కడ చలామణి

ఐదు కోట్ల వ్యూస్.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్ అంకిత్ బాల్యన్ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్ ఊహించి ఉండడు. గ్యాంగ్స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల ప్రకారం ఏకంగా 16 రౌండ్లు కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే’ అనే పాటలో అంకిత్ నటించాడు. అది యూట్యూబ్‌లో 54 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. అయితే ఈ పాటలోని సాహిత్యం ..2021లో రోహిణి కోర్టులో హత్యకు గురైన తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్ భావించింది. అంతేకాదు, ప్రత్యర్థి గ్యాంగ్‌కు అంకిత్ మద్దతు ఇస్తున్నాడన్న కక్షతోనే గోగి గ్యాంగ్ , అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపింది. ఈ హత్య తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. గత నెల 31న దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా, ఎదురుకాల్పుల్లో మోహిత్, సుమిత్ అనే నిందితులు హతమయ్యారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే సీఎం ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటామని అంకిత్ భార్య హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్ లోను ఉంటే ఎవరు కట్టాలి? H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్ Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి

Singer Hemachandra: శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర! Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ, మీడియాలో జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్‌బైట్, సంచలనాల కోసం దారుణమైన థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తున్నాయని హేమచంద్ర మండిపడ్డారు.ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన: తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీ చూపించడాన్ని పక్కన పెడితే, కుటుంబ సభ్యులతో పంచుకోలేని, సమాజంలో సిగ్గుపడే పనులను ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రొలాంగ్ చేయకుండా, కొంత సమయం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చేసే ఇటువంటి చర్చలు, పబ్లిక్ స్పేస్‌లో లేని వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి తన ‘ADHD’ ఆల్బమ్ వినాలని హేమచంద్ర సూచించారు.ఈ ఆల్బమ్‌లోని "యు ఆర్ మైన్" అనే పాట తన నిజమైన భావోద్వేగాల ప్రవాహమని చెప్పారు. కొంచెం తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే నా మనసులోని సమాధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక అద్భుతమైన

యూట్యూబ్.. వీడియోల వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ: యూట్యూబ్.. వీడియోల వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో లాంగ్ ఫార్మాట్ వీడియోలతో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉంటాయి. కొత్త విధానం ప్రకారం.. వీడియో ప్లే అయిన వెంటనే, అంటే ‘వెరీ ఫస్ట్ ఫ్రేమ్’ కనిపించిన క్షణం నుంచే ఒక వ్యూగా లెక్కించనుంది. వ్యూ నమోదు కావడానికి ఇకపై కనీస వాచ్‌టైమ్ అవసరం ఉండదు. ఈ మార్పుతో వ్యూస్ వేగంగా పెరుగుతాయని యూట్యూబ్ తెలిపింది. అన్ని వీడియో ఫార్మాట్లలో క్రియేటర్లకు లభించే ఎక్స్పోజర్ను ఒకే ప్రమాణంతో చూపించడం ద్వారా, బ్రాండ్ డీల్స్‌లో వారి విలువను మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడమే ఈ మార్పు ఉద్దేశమని యూట్యూబ్ పేర్కొంది. ఈ వ్యూ కౌంటింగ్ మార్పు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్(YPP)లో క్రియేటర్లకు చెల్లించే ఆదాయ విధానాన్ని నేరుగా మార్చదని యూట్యూబ్ స్పష్టం చేసింది. అదే సమయంలో.. క్రియేటర్లకు ‘ఎంగేజ్డ్ వ్యూస్’ అనే మెట్రిక్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తద్వారా వీడియోను ప్లే చేసిన తర్వాత ఎంతమంది ప్రేక్షకులు నిజంగా వీడియోను చూడటం కొనసాగించారో క్రియేటర్లు తెలుసుకోవచ్చు. యూట్యూబ్ కొత్త నిర్ణయంపై క్రియేటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూస్ సంఖ్య పెరిగినా.. సగటు వాచ్ డ్యూరేషన్ తగ్గే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం బ్రాండ్ డీల్స్ కోసం వ్యూస్ కీలకమైన మెట్రిక్ కావడంతో కొత్త విధానం క్రియేటర్లకు ప్రయోజనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అలాగే RPM, పేఔట్స్పై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హోమ్‌పేజ్‌లో వీడియో ఆటోప్లే అయినప్పటికీ వ్యూ లెక్కించే అవకాశం

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. కొత్త రూల్స్ ప్రకారం.. వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే.. అంటే మొదటి ఫ్రేమ్ కనిపించిన క్షణం నుంచే దాన్ని ఒక వ్యూగా లెక్కించనున్నారు. దీంతో యూట్యూబ్‌లోని అన్ని వీడియో ఫార్మాట్లకు వ్యూస్ లెక్కింపులో ఒకే ప్రమాణం అమలవుతుంది. గతంలో షార్ట్స్‌కు మాత్రమే అమలు చేసిన ఈ నిబంధనను ఇప్పుడు అన్ని వీడియో ఫార్మాట్లకు విస్తరించారు. క్రియేటర్లు తమ కంటెంట్‌కు వస్తున్న అసలైన ఎక్స్పోజర్ను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా ఈ మార్పు చేస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. వేర్వేరు ఫార్మాట్లలో ఉన్న వ్యూ కౌంటింగ్ విధానాల వల్ల ఏర్పడుతున్న గందరగోళానికి కూడా ఇది పరిష్కారం చూపుతుందని తెలిపింది. ఈ మార్పు వల్ల క్రియేటర్ల ఆదాయం లేదా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) అర్హతలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. మానిటైజేషన్ ఆదాయం యథావిధిగా ఎంగేజ్డ్ వాచ్ అవర్స్, ఎంగేజ్డ్ షార్ట్స్ వ్యూస్ ఆధారంగానే లెక్కిస్తారు. YPP అర్హతకు సంబంధించిన పేర్లను 'Qualified Shorts views', 'Qualified watch hours'గా మార్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి యూట్యూబ్‌లో వ్యూస్ కనిపించే అన్ని ప్రాంతాల్లో కొత్త వ్యూ మెట్రిక్ అమల్లోకి వస్తుంది. వీడియో ప్లే అయిన మొదటి క్షణం నుంచే వ్యూ లెక్కించడంతో.. గతంతో పోలిస్తే క్రియేటర్లకు కనిపించే మొత్తం వ్యూ కౌంట్ వేగంగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వీడియో ఫార్మాట్లలో ఒకే విధమైన వ్యూ మెట్రిక్ అందుబాటులోకి రావడం ద్వారా తమ కంటెంట్‌కు లభిస్తున్న మొత్తం ఎక్స్పోజర్పై క్రియేటర్లకు మరింత స్పష్టత వస్తుందని యూట్యూబ్ తెలిపింది. అంతేకాకుండా బ్రాండ్ పార్ట్నర్స్, స్పాన్సర్లకు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. YouTuber Akhil Wife: యూట్యూబర్ అఖిల్, ఆయన భార్య మేఘకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేఘ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నో ఆశలతో అఖిల్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే పెళ్లి తర్వాత అతడి ప్రవర్తన గురించి తనకు అనేక విషయాలు తెలిసాయని పేర్కొంది. తన భర్తకు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ విషయంపై తాను అఖిల్‌ను ప్రశ్నించినప్పుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె చెప్పినట్లు సమాచారం. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చినప్పటి నుంచి తనకు సంతోషం లేకుండా పోయిందని మేఘ పేర్కొంది. తనను సరిగ్గా చూసుకోకుండా తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ పరిస్థితులతో తాను ఎంతో బాధపడ్డానని, చివరకు ఆ జీవితాన్ని వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తాను ఓ కండక్టర్‌తో వెళ్లిపోయిన విషయంపై కూడా మేఘ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలని, అందుకే అఖిల్‌ను వదిలి వెళ్లినట్లు చెప్పింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా అతడితోనే జీవిస్తానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అయితే మేఘ చేసిన ఈ ఆరోపణలపై అఖిల్ వైపు నుంచి ఎలాంటి పూర్తి వివరణ బయటకు వచ్చిందనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను నిర్ధారించేందుకు అధికారిక సమాచారం కూడా అవసరం. మేఘ ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై
సినీ నటి త్రిష కృష్ణన్ పై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ఇటీవల నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన రోజే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ.. ఎంతోమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో సీనియర్ నటీనటుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం విజయ్‌కు విశాల్ ఓ విజ్ఞప్తి చేశారు.గత కొన్ని రోజులుగా ‘మకుటం’ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలు, రాజకీయ నాయకులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నటుడు సీమాన్ పాలిటిక్స్ లో నిజాయితీగా తనవంతు పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి చెబుతూ ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ అది రిజల్ట్స్ లో కనిపించడం లేదన్నారు.ఉదయనిధి స్టాలిన్ గురించి విశాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఉదయ్ అంటే చాలా ఇష్టం. ఉదయ్, ఆయన భార్య కృతికతో మంచి సాన్నిహిత్యం ఉంది. అది ఎప్పటికీ మారదు. ఏం జరిగినా మా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చినా.. నాకు, ఉదయ్ మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు రావు. మేం ఒకరినొకరం తిట్టుకోము. నేను ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను. గతంలో ఒక సినిమా విషయంలో నేను అనుభవించిన బాధ వల్ల, అతడి ప్రొడక్షన్ హౌస్ గురించి కోపంగా మాట్లాడాను. అంతే తప్ప ఉదయ్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అతను చాలా చాలా మంచి వ్యక్తి’’ అని అన్నారు.త్రిషపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్, ఆయన అరెస్ట్‌పై విశాల్ కూడా మాట్లాడారు. “నా స్నేహితుడు ఉదయ్ ఏదో అన్నాడు.. అరెస్ట్ అయి బెయిల్ మీద వచ్చాడు. అదే విధంగా

షిర్డీ సాయిబాబా మరియు ఆయన సంస్థాన్ ట్రస్ట్‌పై ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న అప్రతిష్ఠకర, విద్వేషపూరిత ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆగస్టు 11న ఈ పిటిషన్‌ను విచారించి, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రివెన్స్ అపెలేట్ కమిటీ 7 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో బాబాపై అసభ్యకరమైన పదజాలంతో వీడియోలు ప్రచారం చేయడం మత సామరస్యానికి తీవ్ర ముప్పుగా మారిందని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తుల మత భావాలను పరిరక్షించేందుకు కేంద్రం తక్షణమే చర్యలు వేగవంతం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గతంలోనే యూట్యూబ్ సంస్థకు ఫిర్యాదులు చేసినప్పటికీ, జూలై 17, 18, 19, 24, 26 తేదీల్లో గూగుల్ నుంచి తిరస్కరణ సమాధానాలు వచ్చాయి. దీంతో ట్రస్ట్ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం మరియు గ్రివెన్స్ అపెలేట్ కమిటీని ఆశ్రయించినా ఆ క్రూరమైన కంటెంట్ తొలగింపునకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టు ముందుకు వచ్చి తమ వాదనలను బలంగా వినిపించారు. సామాజిక అశాంతికి దారితీసేలా ఉన్న ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి న్యాయపోరాటం తప్పలేదని పిటిషనర్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఈ అసభ్యకర కంటెంట్ వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భక్తుల మత భావాలు మరింతగా గాయపడకుండా ఉండేందుకు సదరు అభ్యంతరకర వీడియోలలోని విద్వేషపూరిత పదాలను తన అధికారిక ఉత్తర్వుల్లో కూడా ప్రస్తావించకూడదని కోర్టు చాలా జాగ్రత్త వహించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద పౌరులకు లభించిన మత స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రధానంగా గుర్తించింది. దీంతో

యూట్యూబ్ మానిటైజేషన్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా YPPలో చేరే క్రియేటర్లు 8 వేల గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే యూట్యూట్ పార్ట్ నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లకు కొత్త నిబంధన వర్తించదని సంస్థ పేర్కొంది. కొత్తగా వైపీపీ(YPP)లో చేరే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ప్లాట్‌ఫామ్‌పై నిత్యం అంతకంతకు అంచనాలను మించి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది

షిర్డీ సాయిబాబాను అవమానిస్తూ, ఆయనపై ప్రజల్లో విద్వేషం రగిలించేలా ఆన్లైన్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు దృష్టి సారించింది. బాబా అసలు పేరు ‘చాంద్ మియా’ అని, ఆయనో జిహాదీ, హంతకుడు, రేపిస్ట్ అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ఉన్న ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాజంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, అశాంతిని సృష్టించేందుకు ఈ కుట్ర జరుగుతోందని ట్రస్ట్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ విషయంపై తాము ఇప్పటికే యూట్యూబ్‌ను సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించింది.జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. బాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ప్లాట్ఫామ్లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. షార్ట్స్, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే కొత్త కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల వాచ్‌టైమ్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్లో మానిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది వ్యవధిలో 8,000 గంటల వాచ్ టైమ్ లేదా గత 90 రోజుల్లో కనీసం 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1,000 సబ్స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉంటే మానిటైజేషన్‌కు అర్హత లభించేది. అయితే ఇప్పటికే YPPలో భాగమై ఆదాయం పొందుతున్న క్రియేటర్లకు ఈ నిబంధనలు వర్తించవు. 2027 ఫిబ్రవరి 1 నుంచి షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనలు, సబ్స్క్రిప్షన్ ఆదాయాన్ని పొందాలంటే.. గత 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించాలి. ఈ పరిమితిని చేరుకోలేని ఛానళ్లు YPPలో కొనసాగుతాయి. అయితే షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ నిలిచిపోతుంది. మళ్లీ 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ సాధిస్తే యూట్యూబ్ నుంచి ఆదాయం పొందొచ్చు. క్రియేటర్ల ఆదాయ అవకాశాలను పెంచేందుకు యూట్యూబ్ కొత్త ఇన్సెంటివ్ ప్రొగ్రామ్‌లను కూడా తీసుకురానుంది. యూట్యూబ్ షాపింగ్‌లో

Donald Trump: ట్రంప్‌కు ‘ట్రూత్ సోషల్’ దెబ్బ.. ఏకంగా రూ.2,000 కోట్ల నష్టం.. ఇక దానిపైనే ఫోకస్ నూతన మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 1, 2027 నుండి వైపీపీ ద్వారా ప్రకటనల ఆదాయం పొందాలంటే కొత్త క్రియేటర్లకు లక్ష్యాలు రెట్టింపయ్యాయి. ఛానెల్ మోనిటైజ్ కావడానికి గడిచిన 365 రోజుల్లో 8,000 వాచ్ హవర్స్ పూర్తి చేయాలి లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. అయితే 1,000 సబ్స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో సభ్యులుగా ఉన్న దాదాపు 30 లక్షల మంది పాత క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ ఉపశమనం కల్పించారు. పాత, కొత్త క్రియేటర్లు ఇద్దరికీ వర్తించేలా షార్ట్స్ మోనిటైజేషన్పై యూట్యూబ్ మరో కీలక నిబంధన విధించింది. షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనల ఆదాయం పొందాలంటే ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల వ్యూస్ కొనసాగించాల్సిందే, వ్యూస్ తగ్గితే షార్ట్స్ ఆదాయం నిలిచిపోతుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫండింగ్ దిగువ స్థాయి నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కాగా, భారత్‌లో నెలకు కేవలం రూ.89లకే అందుబాటులో ఉన్న ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్‌ను గ్లోబల్‌గా విస్తరిస్తూ, దాని ద్వారా వచ్చే నికర ఆదాయంలో 60 శాతం వాటాను క్రియేటర్లకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది
TG Mohandas Taken Into Custody : నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రైట్‌వింగ్ రాజకీయ విశ్లేషకుడు టీజీ మోహన్‌దాస్‌ను పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద అత్యాచారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న ఆయన.. ఆడవాళ్లు ఆ రేప్‌లను ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం చెలరేగగా.. మట్టంచేరిలోని ఆయన నివాసం నుంచి తిరువనంతపురం సైబర్ పోలీసుల బృందం స్థానిక పోలీసుల సహాయంతో మోహన్‌దాస్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఈ విచారణ ప్రక్రియకు సంబంధించి పోలీసులు ఆయన నివాసంలో పలు కీలక ఆధారాలను సేకరించారు.కేసు విచారణలో భాగంగా తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం మట్టంచేరి సమీపంలోని కూవపడమ్లో ఉన్న మోహన్‌దాస్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో టీజీ మోహన్ దాస్ ఇంటి వద్దే ఉండటంతో అధికారులు నేరుగా విచారించారు. అతడు నిర్వహిస్తున్న 'పత్రిక' అనే యూట్యూబ్ ఛానెల్ ఖాతా వివరాలతో పాటు సదరు వివాదాస్పద వీడియోను రూపొందించి అప్లోడ్ చేసేందుకు ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై అందులోని సమాచారాన్ని విశ్లేషించారు.అసలేం జరిగిందంటే?పత్రిక అనే యూట్యూబ్ ఛానెల్లో ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో టీజీ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థినుల ఆందోళనలు గ్యాంగ్ రేప్‌లకు దారితీసే అవకాశం ఉందంటూ అంచనా వేశారు. అంతేకాకుండా అక్కడికి హాజరయ్యే వారు అలాంటి చర్యలను ఇష్టపడతారంటూ అత్యంత అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఆ పరిస్థితిని నియంత్రించే బాధ్యత తన చేతుల్లో ఉంటే గనక, వెంటనే కర్ఫ్యూ విధించి నిరసనకారులను చెదరగొడతానని పేర్కొన్నారు. వారు వినకపోతే నేరుగా 'ఓపెన్ ఫైరింగ్' జరపాలని ఆదేశిస్తానని అన్నారు. ఆ కాల్పుల్లో కొందరు మరణించినా