న్యుమోనియా నుంచి రిలీఫ్ కలిగించే చిట్కాలు
న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఓ వ్యాధి. ఈ సమస్య ఉంటే గొంతులో కఫం, దగ్గు, జ్వరం, చలి వణుకు, ఛాతిలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినపుడు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండి ఊపిరితిత్లుల్లోని కఫం పల్చగా మారి బయటకు పోతుంది. అందుకే శ్వాస నాళాలు, లంగ్స్ ఆరోగ్యంగా ఉండేందుకు వాటర్ ఎక్కువగా తాగాలి. గొంతు, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన కఫం తగ్గించి శ్వాస సమస్యలు తగ్గించడానికి ఆవిరి పట్టడం చాలా అవసరం. వేడి నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆవిరి పడితే దగ్గు, ఛాతి బిగుతుగా మారడం వంటి న్యుమోనియా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతు, శ్వాస నాళాలను శుభ్రంగా ఉంచి న్యుమోనియా లక్షణాల నుంచి ఉపశమనం కల్పించడంలో హెర్బల్ టీలు సహాయపడతాయి. గోరువెచ్చని అల్లం టీ, పెప్పరమింట్ టీ, గ్రీన్ టీ వంటివి తాగడం ద్వారా లంగ్స్ హెల్తీగా మారతాయి. గోరువెచ్చని చికెన్ సూప్, వెజ్ సూప్ తాగడం ద్వారా శ్వాస నాళాలు శుభ్రం అవుతాయి. గొంతులో కఫం తగ్గుతుంది. న్యుమోనియా నుంచి ఉపశమనం పొందవచ్చు. న్యుమోనియా లక్షణాలు అయిన దగ్గు, గొంతులో సమస్యలను తగ్గించేందుకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. దీనికోసం గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. గాలిలో సరిపడా తేమ లేకపోతే ముక్కు దిబ్బడ, గొంతులో మంట, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు హ్యుమిడిఫయర్ ఉపయోగించడం మేలు. గొంతును క్లియర్ చేయడానికి ఉప్పు నీళ్లతో పుక్కిలించడం మంచిది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, జలుబు, గొంతులో కఫం సమస్యను తగ్గిస్తాయి. ఎలాంటి రకమైన పొగ అయినా కూడా