
Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
© 2026 nimisham.in

Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు!

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..

AP Weather: రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు- అక్కడ పిడుగులు కూడా..!

Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

ఆగస్టు 26న నేపాల్‌లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్‌ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

మన భూగోళంపై ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో మండిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం అనుకున్న ప్రమాద ఘంటికలు దాదాపు దగ్గరపడ్డాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) సరికొత్త నివేదిక ద్వారా అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిస్ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం దాటిపోతుండటం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఇకపై ఉష్ణోగ్రతల పెంపుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. లక్ష్యం దాటినా సరే.. ధైర్యం కోల్పోకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే కాలాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తేల్చిచెప్పారు. ఈ వేసవిలో నమోదైన దారుణమైన ఎండలు, భయంకరంగా వ్యాపించిన అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పే నమూనా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అక్కడితో అంతమైపోతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస స్పష్టం చేసింది.వాతావరణంలో ముంచుకొస్తున్న విపత్తులుఒకవేళ ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం కోలుకోలేని నష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులు, కరువులు తీవ్రతరం కావడం, ఆహారం-తాగునీటి కొరత ఏర్పడటం, మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వంటివి తీర ప్రాంత ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకరమైన రీతిలో అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాలు మారిపోవడం వంటి సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!బొగ్గు, పెట్రోల్ వినియోగానికి చెక్.. కార్బన్ నిర్మూలన తప్పనిసరి!భూమి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు. దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో

సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఐఎండీ అంచనాల ప్రకారం, సెప్టెంబర్‌లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.మరోవైపు, దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. దీనివల్ల వాతావరణంలో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ‘ఎల్ నినో’ పరిస్థితులు నెలకొనడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ ఎల్ నినో ప్రభావం మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి ఈశాన్య రుతుపవనాలపై అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఐఎండీ వెల్లడించింది

బంగాళాఖాతంలో కొత్త అల్పపీడన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు గంటకు యాభై కిలోమీటర్ల గాలులు Heavy Rain Alert: ఉత్తర బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారి, రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవన ద్రోణి మరింత బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. Talliki Vandanam: ‘తల్లికి వందనం’ పథకంపై బిగ్ అప్డేట్.. దరఖాస్తుకు మరో ఛాన్స్.. ఖాతాల్లో డబ్బులు పడేది అప్పడే? ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక: ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Heavy Rain Alert) పడనున్నాయి. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వానలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది

ఏపీ, తెలంగాణ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. వేసవి పూర్తయినా రెండో వేసవి మొదలైందా అన్నట్లుగా పరిస్థితి మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో మళ్లీ అందరూ ఏసీలు ఆన్ చేయక తప్పటం లేదు. వడగాల్పులు కొనసాగు తున్నాయి. లోటు వర్ష పాతం తో పాటుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీని పైన వాతావరణ అధికారులు స్పష్టత ఇస్తున్నారు.ఎక్కడా మేఘాల జాడ లేదు. రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప, రుతుపవనాల ప్రభావంతో కాదని చెబుతున్నారు. చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తికాలేదు. బంగాళాఖాతం లో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు వెళుతుండంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, చివరకు ఉత్తరాంధ్రపై కూడా కనిపించడం లేదు.ఈనెల 26వ తేదీ తరువాత అల్పపీడనం అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు. తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!మారుతున్న అంచనాలుదేశవ్యాప్తంగా ఈ రెండు వారాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వరకు చూస్తే ఆగస్టు చివరి రోజుల్లో వర్షాభావమే కొనసాగుతుందని, అందువల్ల కరువు ప్రభావం నెలకొంటుందని ఇస్రో నిపుణులు వెల్లడించారు. వానలు లేకపోవడంతో పాటు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.

Heavy Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూలై చివర్లో మాదిరిగానే ఆగస్ట్ ఎండింగ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు ఇవాళ్టి (ఆగస్ట్ 22, శనివారం) నుండి కాస్త ఊరట లభించనుంది... వానలు మొదలవుతాయని ప్రకటించాయి. ముఖ్యంగా ఆగస్ట్ 22 నుండి 26 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో 2 తుపానులు కొనసాగుతున్నాయి... ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇక ఇదే పసిఫిక్ సముద్రంలో రెండు వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాలను ప్రభావితం చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేరుగా ఉంటుంది... వర్షాలు జోరందుకుంటాయి. ఇలా ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖలు, నిపుణులు చెబుతున్నారు. ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఎండ, ఉక్కపోత కొనసాగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు మొదలవుతాయని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ విషయానికి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP Weather Alert: కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణం ఇలా ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినప్పటికీ, వర్షాలు అక్కడక్కడే కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పగటిపూట కూడా ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయి.. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు పడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలు ఉన్నప్పటికీ, తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైతులకు ఏ పంటలు సాగు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ముందస్తు సూచనలు ఇస్తోంది. నేడు కూడా పోలవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది అంటున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి దగ్గర 20.2 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 16.8, గుంటూరు జిల్లా తెనాలి 16.4, కర్నూలు జిల్లా దేవనకొండలో 13.8, అన్నమయ్య జిల్లా రాజంపేటలో 10.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, నెల్లూరు, అల్లూరి సీతామరామరాజు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.ఏపీలో ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించినా సరిపడా వర్షాలు పడలేదు. వాస్తవానికి జూన్ నెలలోనే నైరుతి పవనాలు ప్రవేశించాయి.. సమయంలో తేలికపాటి వర్షాలు కురిశాయి.. ఆ తర్వాత పెద్దగా వానలు పడలేదు. బంగాళాఖాతంలో ద్రోణి, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా సరిపడా వానలు కురవలేదు. రాష్ట్రంలో సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. చాలామంది రైతులు పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించింది.. ఈ మేరకు రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎల్‌నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ తెలిపిన బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉరుములు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దీంతో హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మబ్బులతో కప్పబడి సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ నగరవాసులు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం బలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రమాదం తీవ్రంగా ఉన్నందున వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన నిర్మాణాల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రోడ్డు ప్రయాణికులు మరియు పొలాల్లో

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది . ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటి సమయం ప్రశాంతంగా గడిచినా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం లేదా చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గాను నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. రాజధాని అమరావతి - విజయవాడ ప్రాంతాల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తవాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచనలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా.. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు

తెలంగాణలో ఆగస్టు 20 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరం అని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు 20 నుంచి 25 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ వ్యవధిలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణ జల్లులు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణ మార్పులను గమనిస్తూ స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 18 రాత్రి నుంచి 20 ఉదయం వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 40

వర్షాకాలం అయినా వర్షాలు కురవని నేపధ్యంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.ఆగ్నేయదిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు రుతుపవన ద్రోణివాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రుతుపవన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్‌పూర్, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, వారణాసి, దెహ్రీ, జార్ఖండ్, ఉత్తర గంగా ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. ఇది దిఘా మీదుగా ఆగ్నేయదిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కూడా కనిపిస్తున్నాయి.కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణలో మంగళవారం మరియు బుధవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి, రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది.వర్షాలపై వాతావరణ శాఖ అలెర్ట్ ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేర ఉపయోగపడినా, నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు వాతావరణ నివేదికలను అప్డేట్గా చూసుకుంటూ ప్రయాణాలు, పనులు ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలపై, వాతావరణంపై అప్డేట్లు ఇస్తూనే ఉంటుందని తెలిపింది.అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్ లకు లక్ష రూపాయలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటనలో తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్‌పూర్, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, వారణాసి, దెహ్రీ, జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం (Depression) కేంద్రం, దిఘా మీదుగా వెళుతూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, దీనిలో ఉత్తర హర్యానా & దాని పరిసర ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్ & దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనాలు (cyclonic circulations) ఇమిడి ఉన్నాయి. సముద్ర మట్టానికి 3.1, 9.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య, మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 22°N అక్షాంశం వెంబడి ఉన్న షియర్ జోన్ (Shear Zone) ఇప్పుడు బలహీనపడింది (less marked). వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజులు. రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా

బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ జేక్ వెదర్లాండ్పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్‌ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జయభేరి మోగించింది. ఆ ఇద్దరూ విఫలం ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లోనే వెదర్లాండ్ అవుటయ్యాడు. ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు. లబుషేన్‌కు మరో అవకాశం కాగా 2023లో చివరిగా ఆసీస్ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్ హెడ్‌తో కలిసి ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. మార్నస్ లబుషేన్ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌ను కూడా తప్పించాలనే

AUS vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టుకు జట్టులో ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ మాథ్యూ రెన్షాను జట్టులోకి తీసుకుంది. ఆగస్టు 22 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో వెదరాల్డ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే రెన్షాను జట్టులోకి తీసుకున్నారు. కాగా.. రెన్షా టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లు అయింది. చివరి సారిగా అతడు 2023లో ఢిల్లీలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆడాడు. IND vs SL : కేఎల్ రాహుల్ బ్రొమాన్స్.. కాపాడాడు అని ముద్దు పెట్టబోయాడు.. వీడియో వైరల్.. సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికి కూడా 30 ఏళ్ల రెన్షా వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. BREAKING: Aussies announce one change to the squad for Mackay Test #AUSvBAN — cricket.com.au (@cricketcomau) August 18, 2026 తొలి టెస్టు మ్యాచ్‌లో విఫలమైన మార్నస్ లబుషేన్ మాత్రం తన ప్లేస్‌ను కాపాడుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్

వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. తలపై దట్టమైన నల్లటి మేఘాలు కనిపిస్తున్నా.. తీరా చూస్తే వర్షం పడకుండానే అలా గాలిలో కొట్టుకుపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఎల్ నినో కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలను ఐఎండీ ప్రస్తావించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావంతో ఆగస్టు 18 నుంచి 23 వరకు అంటే మొత్తం 6 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. ఆగస్టు 17 నుంచి 21 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఆకాశం నిండా మేఘాలు ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల పొడి వాతావరణమే వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడాలంటే గాలిలో కనీసం 70% తేమ ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర జిల్లాల్లో 60% తేమ ఉంటే, మిడిల్, సౌత్ జిల్లాల్లో కేవలం 42% మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 19న ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు కురవవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో తేమ శాతం 40% కంటే తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి 23 వరకు 6 రోజులు పాటూ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అటున్నారు. అలాగే గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వాన పడింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇటు ఒడిశాకు సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టుజి.మాడుగుల, , పెదబయలు, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. హుకుంపేటలో మూడు గంటల పాటూ భారీ వాన కురిసింది. పెద్ద బయలులోనూ భారీ వర్షం పడింది. కొన్ని చోట్లో మట్టి రోడ్లు కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతు రుతుపవనాలు సమయానికి వచ్చినా సరే వర్షాలు మాత్రం పెద్దగా పడలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడా వర్షాలు పడినా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలని అవగాహన కల్పించింది. మొత్తం మీద ఏపీలో ఈ ఏడాది వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain &Thunder storms : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభాంతో ఏపీలో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, పోలవరం, విశాఖ పట్నం, ఏలూరు, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,కృష్ణ,మార్కాపురం, ప్రకాశం,చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగళా ఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం పోలవరంతో పాటు విశాఖ ఏలూరు, నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉందనే వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం వాయువ్య బంగళా ఖాతం దాన్ని రాష్ట్ర విపత్తులో చెప్పేది రానున్నటువంటి ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. కురిసే ఎక్కువగా ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో తేలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందనికి అవకాశంతో పాటు ఇటు రాయలసీమ

బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడెన్‌గా మారిపోయింది. వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. తుపానులు వచ్చే అవకాశాలను కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన

శ్రీలంకలో జరుగుతున్న గాలే టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, చివరకు సెంచరీ మిస్ అయ్యాడు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 82 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్ లో అంతా బాగానే నడిచినా, రాహుల్ అదృష్టం మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మరోసారి మూడంకెల స్కోరుని అందుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ 80s లేదా 90s లో అవుట్ అవ్వడం ఇది ఏడోసారి కావడం విశేషం. ప్రతిసారి నర్వస్ 90s లేదా 80s కి రాగానే ప్రెజర్ ఫీల్ అవుతున్న రాహుల్, చివరికి వికెట్ సమర్పించుకుంటున్నాడు. గాల్ టెస్టు తొలి రోజు కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద కండరాల నొప్పులు రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. గాలే టెస్టు రెండో రోజు ఆట వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించి, రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. రెండో రోజు రిషభ్ పంత్ అవుట్ అయిన తర్వాత రాహుల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కానీ, తన వ్యక్తిగత స్కోరుకు కేవలం ఐదు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్పిన్నర్ కేశర నువానిత బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసిన రాహుల్, తన 13వ టెస్ట్ సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. ఇది కేఎల్ రాహుల్ కెరీర్లో 21వ అర్ధశతకం. 80 దాటాక మైండ్ గేమ్ లో రాహుల్ కింగ్‌లా ఆడలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ లో 80s లేదా 90s మధ్యలో అవుట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ రేంజ్ లోనే పెవిలియన్ దారి పట్టాడు
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటం వల్ల తూర్పు, మధ్య భారతంతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావం వల్ల ఈ కాలంలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారుతుంటాయని చెప్పారు.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, వరంగల్ జిల్లా దుగ్గొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో 2.8 సెం.మీ., హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌లో 2.7 సెం.మీ. వర్షం కురిసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించడంతో.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.అయితే, వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలలో

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొదటి పక్షం రోజుల్లో సాధారణ వర్షపాతం 114 మిల్లీమీటర్లు కాగా.. 79 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ నెలలో ఇప్పటికే 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలై 31 నాటికి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు 12 ఉండగా.. ఆగస్ట్ 15 నాటికి వీటి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో 621 మండలాలకు గాను, 256 చోట్ల 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరో 8 మండలాల్లో 60-99 శాతం తీవ్ర లోటు వర్షపాతం రికార్డు అయింది. కేవలం 4 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవ్వగా, 90 చోట్ల అధిక, మరో 263 మండలాల్లో సాధారణ వర్షం కురిసినట్లు ప్రణాళిక విభాగం గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా గత నెలలో సగటు వర్షపాతం నమోదైనప్పటికీ... ఆగస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. నాగర్‌కర్నూల్, నల్గొండ, ఆదిలాబాద్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, సూర్యాపేట, భువనగిరి, కొత్తగూడెం, మహబూబాబాద్, మేడ్చల్, ఖమ్మం, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం రికార్డు అవ్వగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లిలో అత్యధికంగా 3.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత చురుగ్గా మారనుంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం కూడా వాతావరణ వ్యవస్థ ప్రభావం కొనసాగనుంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల

వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest ఐస్‌క్రీమ్ ను పాల నుంచి తయారు చేస్తారు. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది ఐస్‌క్రీమ్ ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటుంది. ఇంకా వీటిని మితంగా తినడం అవసరం చక్కెర, కొవ్వు అయితే, మీరు దీనిని చలి కాలం, వానా కాలంలో ఎక్కువగా తినకూడదు. ఇతర సమస్యలు వస్తాయి చలి కాలం, వానా కాలంలో ఇంకా ఈ ఐస్‌క్రీమ్‌లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి కొద్దీ నిముషాల్లోనే శక్తిని ఇస్తాయి కార్బోహైడ్రేట్లు ఈ ఐస్‌క్రీమ్‌లో పండ్ల ఫ్లేవర్ కూడా కలుస్తుంది. వీటిలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వర్షంలో ఈ ఐస్ క్రీం తింటే గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా గాలిలో తేమ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది కడుపులో అసౌకర్యంగా ఉంటుందిఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు దీనిని పరిమితంగా తింటే సమస్య ఉండదు జీర్ణశక్తి బలహీనపడుతుంది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

Australia vs Bangladesh Darwin Test: సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన 9 వికెట్ల ఘోర పరాభవం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసింది. చరిత్రలోనే తొలిసారి ఎదురైన ఈ అవమానకర ఓటమిపై ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి రోజే పేకమేడలా కూలిన బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణమంటూ కొందరు సీనియర్ బ్యాటర్లపై తన అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టాడు. కంగారూల గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర.. డార్విన్ వేదికగా ముగిసిన తొలి టెస్టు పోరులో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్, ఈసారి ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! కంగారూలను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి చారిత్రక ఘనతను లిఖించింది. ఈ అనూహ్య పరాభవం ఆస్ట్రేలియా జట్టులో తీవ్ర కలకలం రేపింది. అన్ని రంగాల్లోనూ బలహీనంగా కనిపించిన ఆతిథ్య జట్టు ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు మొదటి రోజే భారీ ఎదురుదెబ్బ తగిలింది. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దీనిపై కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగినప్పుడు క్రీజులో ఎక్కువ సమయం నిలబడాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉందని అతడు స్పష్టం చేశాడు. తొలి రోజు పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ప్రత్యర్థి బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారని, ఒత్తిడిని అధిగమించి భారీ

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలుగు రాష్ట్రాలకు వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం అందిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీకాగా, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా తెలంగాణలో ని పలు జిల్లాలకు వర్షాల పైన అప్డేట్ వచ్చింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Low Rain Fall: అవును తెలంగాణలో మబ్బులు బాగానే వస్తున్నయ్.. కానీ వాన పడినట్టే పడుతుంది. కానీ ఆ వెంటనే మబ్బులు మాయమవుతున్నాయి. ఏదో రెండు చుక్కల వర్షపాతం నమోదు తర్వాత మళ్లీ ఎండ చుర్రమనిపిస్తోంది. ఈ ఊరిలో ఉన్న వర్షం.. పక్క ఊరిలో ఉండదు.. పక్క పక్క మండలాల్లోనూ ఎంతో తేడా! వర్షపాత సగటులోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తే వర్షపాతం సాధారణంగానే ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో భారీ లోటు భారీగా కనిపిస్తున్నది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లోని చాలా మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఒక మండలంలో సాధారణ వర్షపాతముంటే.. దాని పక్కనే ఉండే మరో మండలం లోటులో ఉన్నది. రాష్ట్రంలో ఇదీ వర్షాల మాయ. హనుమకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉన్నది. వాటికితోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉన్నది. అటు భూగర్భ జలాలూ పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1.11 మీటర్లు దిగజారాయి. ఇటు ఏ ప్రాజెక్టులోనూ పూర్తి స్థాయిలో జలాలు లేవు. ఎగువ నుంచి వరదలు రాకపోవడం.. వచ్చినా ప్రాజెక్టులు నిండకలోపే ఆగిపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు నిండలేదు. గోదావరిలో అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్, కృష్ణాలో అతి ముఖ్యమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయకట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలుల వేగం బాగా పుంజుకుంటోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ వాతావరణ మార్పుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు వుంటాయని తెలిపింది. ఆదివారంతో పాటు రాబోయే వారంలో ఏపీ, తెలంగాణలలో వెదర్ ఎలా వుంటుందో ఇక్కడ తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. ఈ అల్పపీడనం ఇవాళ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు తీరం దాటే అవకాశం ఉండటంతో, భయంకరమైన వర్షాలన్నీ అక్కడే కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు లేదు. కానీ, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో చల్లటి బలమైన గాలులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలే పడతాయి. కాబట్టి సండే ప్రయాణాలు చేసేవారికి, టూరిస్ట్ ప్లేసులను విజిట్ చేసేవారికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రుతుపవనాల కాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణం 'ఎల్‌నినో' బలం పెరగడమే. దీనివల్ల నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్రంగా బలహీనపడ్డాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16 నుంచి 21 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురుసే అవకాశాలు కూడా లేకపోలేదు. వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి. తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. IND Vs SL 1st Test Weather: భారత్, శ్రీలంక జట్ల మధ్య లాంగ్ ఫార్మాట్ పోరు ప్రారంభమైంది. శ్రీలంకలోని చారిత్రాత్మక గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనా, వరుణుడి రూపంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయినా మొదటి రోజు ఆటకు అంతరాయం ఏర్పడినా.. రేపటి నుంచి వర్షం మరింతగా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలే వేదికగా తొలి టెస్టు వాతావరణం.. భారత్ - శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాలే స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వర్షం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా దెబ్బతింది. ఆటగాళ్లు మైదానంలో పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయారు. ఉదయం వర్షం తగ్గినప్పటికీ, రోజంతా అప్పుడప్పుడు కురిసిన చినుకులు ఆటకు అడ్డంకిగా మారాయి. వరుణుడి కరుణపైనే మ్యాచ్ భవితవ్యం ఐదు రోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉండటంతో, మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల ప్రదర్శనపైనే కాకుండా వాతావరణంపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. వరుణుడు శాంతిస్తేనే ఈ హోరాహోరీ పోరును పూర్తిస్థాయిలో చూసే అవకాశం లభిస్తుందని క్రికెట్

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఈసారి వర్షాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. అడపా దడపా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది .ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావం వర్షాలకు ఛాన్స్వాయువ్య బంగాళాఖతంపై సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీంతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాలలో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల షియర్ జోన్ విస్తరించి ఉందని, దీనివలన కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.ఈ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుఆదివారం, సోమవారం, మంగళవారం తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.మూడు రోజులు రాయలసీమలో వర్షాలకు అవకాశం రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది

IND vs SL: టీమిండియా చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు సమరానికి సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాళ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. అయితే అభిమానులకు ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే దీనికి కారణం. గాళ్ స్టేడియంలో జరగనున్న ఈ తొలి టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇండియన్ ఓషన్ తీరంలో ఉన్న ఈ మైదానంలో వాతావరణం దారుణంగా మారింది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు గాళ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు ఉదయం 10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ రోజంతా మబ్బులు కమ్మే ఉండే అవకాశం ఉంది. మధ్యమధ్యలో పడే తేలికపాటి చినుకులు మ్యాచ్‌ను పదే పదే అడ్డుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు రోజైన నిన్న కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆటగాళ్లు మైదానంలో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఈ తొలి టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాల్సి ఉండగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అందులో నాలుగు రోజులు వర్షం పడే అవకాశం ఉంది. కేవలం ఒక రోజు మాత్రమే వాతావరణం పొడిగా, ప్రశాంతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల నైపుణ్యంపైనే కాకుండా వరుణుడి కరుణపైనే ఎక్కువగా ఆధారపడి ఉండనుంది. వాతావరణం సహకరిస్తేనే పూర్తి స్థాయిలో ఆట సాధ్యమవుతుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీని చూడాలని ఆశిస్తున్న అభిమానులకు వాతావరణ సూచన ఆందోళన కలిగిస్తోంది. వరుణుడు

ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తలు ఊహించినట్లే పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో (EL Nino)ప్రభావం మొదలైంది. అంతే కాదు ఇది క్రమంగా బలపడుతోంది. దీని వల్ల ప్రపంచ వాతావరణ పరిస్ధితుల్లో పెనుమార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా వివిధ దేశాల్లో రుతుపవనాలు, ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలు ఎల్ నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి అత్యంత బలమైన వాతావరణ పరిణామంగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, లోతైన పొరల్లోకి కూడా విస్తరిస్తోంది. Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..! ఇది ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చడానికి అవసరమైన అదనపు శక్తిని అందిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థల్లో పెను మార్పులు తప్పేలా లేవు. ఈసారి ఏర్పడబోయే ఎల్ నినో అత్యంత శక్తివంతమైన చారిత్రక వాతావరణ పరిణామంగా మారేందుకు 69 శాతం అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆధునిక వాతావరణ పరిశీలనలు ప్రారంభమైన 1950 సంవత్సరం రికార్డుల తర్వాత నమోదైన అత్యంత బలమైన

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో నేడు (ఆగస్ట్ 15, శనివారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు బలపడుతూ వాయుగుండంగా మారిందని ప్రకటించింది. ఇది ఇప్పటికే తీరం దాటి దేశవ్యాప్తంగా భారీ వర్షాలను కురిపిస్తోంది... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగాలు ప్రకటించాయి. వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా మారాయి... ఇలా వాతావరణం అనుకూలంగా మారడంతో గత కొన్నిరోజులుగా నిర్మలంగా ఉన్న ఆకాశం నేడు నల్లని మబ్బులతో నిండిపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్ట్ 15న పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్ పై వాయుగుండం ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ ఒడిశా, చత్తీస్ ఘడ్ తో పాటు గంగానది పరివాహక రాష్ట్రాల్లో గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా వర్షతీవ్రత పెరుగుతుందని IMD హెచ్చరించింది. ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలుంటాయని... గుజరాత్, గోవా, రాజస్థాన్ లో ఇదే పరిస్థితి ఉంటుందట. హిమాచల్ ప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, మిడిల్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. రాబోయే గంటల్లో ఇది గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని చోట్ల ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక జార్ఖండ్‌లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులు మునిగిపోయి రవాణాకు ఆటంకం కలగడం, నదులలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. కేవలం తూర్పు ప్రాంతాలే కాకుండా దేశంలోని మరో 15కు పైగా రాష్ట్రాలు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని భాగాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ ఎంపీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండటంతో పాటు పశ్చిమ అవాంతరం కూడా తోడవడంతో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల

విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వానలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు సక్రమంగా కురవడం లేదు. ఇక అల్పపీడనం, వాయుగుండం వంటివి బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడే వాటి ప్రభావంతో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోందని.. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది. విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!వాతావరణం పై తాజా అలర్ట్స్రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కూడి ఉంటుంది. ఉక్కపోత ఉంటుందని చెప్పింది. కొన్నిచోట్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వానలు కురిసే ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, దీని వల్ల ఆగస్టు 13న ఇరు రాష్ట్రాల్లోనూ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 13 నుండి 18 వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ: ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణ: ఆగస్టు 13 నుండి 16 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 12 నుండి 16 వరకు రెండు రాష్ట్రాల్లో ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉందని ఇదివరకు హెచ్చరించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో చాలా జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో కనిష్ఠ

AP Weather Report Today : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతుండగా.. పలు ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఏపీలో ఈనెల 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ అంచనా ప్రకారం.. ఇవాళ (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. ఆగస్టు 15 (శనివారం), 16 (ఆదివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో గంటకు 30-40 కి.మీ వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులు కొంత ఆందోళనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో కాస్త ఆనందం