
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Heavy Rain &Thunder storms : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభాంతో ఏపీలో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, పోలవరం, విశాఖ పట్నం, ఏలూరు, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,కృష్ణ,మార్కాపురం, ప్రకాశం,చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక రేపు అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగళా ఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం పోలవరంతో పాటు విశాఖ ఏలూరు, నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉందనే వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం వాయువ్య బంగళా ఖాతం దాన్ని రాష్ట్ర విపత్తులో చెప్పేది రానున్నటువంటి ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారనుంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..
కురిసే ఎక్కువగా ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో తేలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందనికి అవకాశంతో పాటు ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఉన్నాయి. తేలికపాటి వర్షాలు కురిసేందకి ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటికి మాత్రం గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో అల్పపీడనం ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంత్రంలో 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఒకవైపు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో పాటు మరోవైపు చూసుకుంటే బలమైన గాలుల వీచే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో దిగువ ప్రాంతాలు లోతట్లు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈదురు గాలులకు కారణంగా వృక్షాలు చెట్టు కొమ్మలు విరిగి పడటంతో పాటు పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేల కూలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు వద్ద నిలబడరాదని అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




