కడుపు ఉబ్బరం తగ్గించే టిప్స్
పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుందని క్లీవ్లాండ్ క్లీనిక్ తెలిపింది. పుదీనా టీ తాగితే మేలు. భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం అదుపులోకి వస్తాయి. గోరు వెచ్చని నూనెతో పొత్తి కడుపు దగ్గర మసాజ్ చేయండి. దీని వల్ల పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ తొలగుతుంది. ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా, బాగా నమిలి తినండి. దీని వల్ల పొట్ట లోకి గాలి చేరదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్య రాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వాకింగ్, యోగా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ తొలగుతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల బాడీలో నీటి నిలుపుదల పెరుగుతుంది. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు తగ్గించండి. ఒకేసారి భారీ మొత్తంలో తినొద్దు. తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు. కడుపులో గ్యాస్ కూడా పేరుకుపోదు. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి. పొటాషియం అనేది శరీరంలో ఉన్న అదనపు ఉప్పును బయటకు పంపపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. కాబట్టి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు