కడుపు ఉబ్బరం తగ్గించే 9 డ్రింక్స్
పుదీనా టీలో మెంథాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణాశయం కండరాలను రిలాక్స్ చేస్తుంది. పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అల్లం టీ తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గుతుంది. సోంపు వాటర్లో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సోంపు వాటర్ తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగు వాపు, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. చామంతి టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు తాగితే కడుపు ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. నిమ్మరసంలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిమ్మరసం తాగితే మలసవిసర్జన సాఫీగా అవుతుంది. వాము నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాము నీరు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నీరు తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు తాగితే అదనపు సోడియం బయటకుపోతుంది. మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం ఉండదు