
కారు డిక్కీలో మహిళ మృతదేహం.. ఎల్కతుర్తిలో కలకలం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కారు డిక్కీని ఓపెన్ చేయగా మహిళ మృతదేహం మూటకట్టి ఉంది. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించారు. కారును మానస స్నేహితుడు వినోద్ అద్దెకు తెచ్చినట్టు సమాచారం. దీంతో వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ‘‘కరీంనగర్లో గదిలో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్, నోట్లో నుంచి నురగలు వచ్చి ఆమె చనిపోయింది. భయంతో మృతదేహాన్ని ఎల్కతుర్తి వద్ద కారులోనే వదిలి వెళ్లిపోయా’’ అని వినోద్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన ఎల్కతుర్తి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వినోద్ చెప్పిన విషయాలు నిర్ధరించుకునే పనిలో ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు














