
Uttar Pradesh | మద్యం మత్తులో సర్జరీ చేసిన డాక్టర్.. బాబుకు జన్మినిచ్చి గర్భిణి మృతి
Uttar Pradesh | మద్యం మత్తులో సర్జరీ చేసిన డాక్టర్.. బాబుకు జన్మినిచ్చి గర్భిణి మృతి
© 2026 nimisham.in

Uttar Pradesh | మద్యం మత్తులో సర్జరీ చేసిన డాక్టర్.. బాబుకు జన్మినిచ్చి గర్భిణి మృతి

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపిక! Ayodhya Ram Mandir: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య శ్రీరామ మందిరానికి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకం ఖరారైంది. రామమందిర తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారతీయ వాయుసేనలో దాదాపు 39 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలు అందించిన జితేంద్ర మిశ్ర, అత్యున్నత రక్షణ రంగ అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామాలయంలో కానుకలు మరియు విరాళాల నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ కీలక పోస్టుకు పారదర్శకతను తీసుకువచ్చేలా నియామక ప్రక్రియను చేపట్టారు. సీఈవో పోస్టు కోసం ఎంపిక కమిటీ అత్యంత కఠినంగా వ్యవహరించి మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం 16 మంది అర్హులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించారు. ట్రస్ట్ పరిశీలన తర్వాత జితేంద్ర మిశ్ర నియామకం అధికారికంగా ఖరారైంది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర (Jeetendra Mishra) ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలందించారు. సీఈవో పోస్టు కోసం ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ 5,585 దరఖాస్తులను పరిశీలించింది. 16 మందిని ఇంటర్వ్యూ చేసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేయగా.. బుధవారం సమావేశమైన ట్రస్టు సభ్యులు జితేంద్ర మిశ్ర పేరును ఖరారు చేశారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కర్ణుడికీ తప్పలేదట! విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సీఈవో నియామకం చేపట్టింది. జితేంద్ర మిశ్ర 1986లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆయన పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

లక్నో: అయోద్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసింది. జరిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు. వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో స్వీపర్ పాత్ర ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన అధికారులు.. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పూర్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ.7.40 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నట్లు ఆడిట్లో తేలినట్టు తెలుస్తోంది. బ్యాంకు భద్రతా వ్యవస్థను దాటి నకిలీ నోట్లు కరెన్సీ చెస్ట్‌లోకి ఎలా వచ్చాయనే విషయం కలకలం రేపుతోంది. కరెన్సీ చెస్ట్‌లో భద్రపరిచిన అసలు నోట్లను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ చెస్ట్ నుంచి బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి పంపిన సొమ్ములో సుమారు రూ.4.30 లక్షల వ్యత్యాసం కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పీఎన్బీ నోడల్ అధికారి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ డివిజనల్ మేనేజర్ సహా ఇద్దరు కరెన్సీ చెస్ట్ మేనేజర్లను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే.. ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? అసలు నోట్ల స్థానంలో వాటిని ఎవరు ఉంచారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. మరోవైపు.. కరెన్సీ చెస్ట్‌లోని నోట్ల కట్టల నుంచి అక్కడి స్వీపర్ నగదు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సదరు నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో బ్యాంకు అధికారులతో పాటు స్వీపర్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కరెన్సీ చెస్ట్‌లోని నగదు లెక్కలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, నగదు తరలింపు వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరనేది దర్యాప్తులో

ఇంటర్నెట్ డెస్క్: హరియాణా సింగర్ అంకిత్ బాల్యన్ హత్య వెనక సంచలన విషయం బయటకు వచ్చింది. అతడి హత్యకు ఓ పాట కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆగస్టు 26న సాయంత్రం అంకిత్ బాల్యన్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అతడిని (Ankit Balyan) దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతడు పాడి నటించిన ఓ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించడం.. దానికి ఏకంగా 54 మిలియన్ల (దాదాపు 5.4 కోట్ల) వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. పాట ఆదరణ పొందడంతో అతడిపై కక్ష పెంచుకున్న ‘గోగి గ్యాంగ్’ అంకిత్ ప్రాణాలు తీసింది. 28 ఏళ్ల అంకిత్ ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే..’ అనే పాటలో నటించాడు. అయితే, ఈ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్ సభ్యులు భావించినట్లు పోలీసులు తెలిపారు. 2021లో ఢిల్లీ రోహిణి కోర్టులో ప్రత్యర్థి ‘టిల్లు తాజ్‌పురియా’ గ్యాంగ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగి చావును ఈ పాట అవహేళన చేసేలా ఉందంటూ భావించింది. అంతేకాకుండా, టిల్లు తాజ్‌పురియా, అంకిత్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ప్రత్యర్థి గ్యాంగ్‌కు మద్దతుగా ఈ పాట తీశాడని గోగి గ్యాంగ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలోనే అంకిత్‌కు బెదిరింపులు రాగా, తాను కేవలం ఆ పాటలో నటించానని, లిరిక్స్, సంగీతంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయినా సరే, అతనిపై అనుమానం వీడని గోగి గ్యాంగ్ షామ్లీకి వచ్చి రెక్కీ నిర్వహించి ఆగస్టు 26న ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం రంగంలోకి దిగిన యూపీ పోలీసులు ఆగస్టు 31న నిర్వహించిన తనిఖీల్లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న

లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 178 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 2381 ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైలట్ వెంటనే గో-అరౌండ్ చేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విమానాన్ని రెండో ప్రయత్నంలో సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన సాధారణ తనిఖీల్లో దాని వెనుక భాగంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) సమీపంలో గీతలు, రాపిడి గుర్తులు కనిపించాయి. దీంతో విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తొలగించారు. ప్రస్తుతం విమానంపై సాంకేతిక తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయని అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన తర్వాత మాత్రమే విమానాన్ని తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురానున్నట్లు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రభావంతో గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E-5013 సుమారు 5 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కాగా ఇటీవల ఇండిగో విమానంలో తరచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోల్‌కతా–చెన్నై 6E-723 విమానంలో ల్యాండింగ్‌కు ముందు ఎడమ ఇంజిన్ పనిచేయకుండా పోయింది. చెన్నైలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా, 224 మంది ఉన్న విమానం ఒక ఇంజిన్‌తో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆగస్టు 13న భువనేశ్వర్–కోల్‌కతా ఇండిగో విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. భద్రతా కారణాలతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరగడం ప్రయాణికులకు ఆందోళన కలిగించే విషయం ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (UP Assembly polls 2027) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు (Bulletproof Jackets) సమకూర్చినట్లు సమాచారం. ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath), సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు నేతలు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని పొందిన నేతల లిస్టులో 11 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మరో 98 మంది నేతలు, ప్రముఖ వ్యక్తులకు వివిధ స్థాయుల్లో భద్రత కల్పించనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఎన్నికల (Assembly polls 2027) సన్నాహాల్లో భాగంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, అభ్యర్థుల అవకాశాలను అంచనా వేయడానికి భాజపా (BJP) సర్వేలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: అత్యాచార కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. సీఎం భార్యపై సంచలన ఆరోపణలు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు చేరడంతో దుకాణదారుడితోపాటు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయవాది శివశంకర్ సింగ్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జల్హుపూర్ మార్కెట్లోని ఓ స్వీట్ దుకాణం వద్దకు వెళ్లాడు. తినేందుకు సమోసాలు ఇవ్వాలని కోరగా.. దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ చల్లటి సమోసాలు ఇచ్చాడు. దీంతో నాకు వేడి సమోసాలు కావాలని న్యాయవాది శివశంకర్ కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై శివశంకర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దుకాణం యాజమాని, అతని సిబ్బంది దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో శివశంకర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. శివశంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేయాలని చౌబేపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది శివశంకర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తాను చందౌలి నుంచి వారణాసికి ప్రయాణిస్తున్నాను. మార్గం మధ్యలో ఆకలి వేయడంతో జల్హుపూర్ మార్కెట్లోని ఒక స్వీట్ షాపులో రెండు సమోసాలు ఇవ్వాలని ఆర్డర్ చేశాను. వారు చల్లటి సమోసాలు ఇవ్వండంతో.. నేను వేడి సమోసాలు కావాలని కోరాను.. కానీ, దుకాణ యాజమాని ఆయన అనుచరులతో కలిసి నాపై దాడి చేశాడని శివశంకర్ సింగ్ ఆరోపించారు. నువ్వు ఏమైనా కలెక్టర్ వా.. వేడి వేడి సమోసాలు ఇచ్చేందుకు అంటూ తనపై వారు దుర్భాషలాడారని పేర్కొన్నాడు. అంతేకాదు.. వారు తన వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, నగదు లాక్కొన్నారని

ఉత్తరప్రదేశ్‌లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్ల వ్యక్తి! ఈ వార్తకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Anu rani meerut Madhya Pradesh sub inspector objectionable video: సమాజంలో పోలీసులను చాలా మంది గౌరవంగా చూస్తుంటారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా డ్యూటీలు చేస్తారు. అందుకు చాలా మంది యువతీ, యువకులు పోలీసులు అవ్వాలని ఎంతో కష్టపడుతారు. ఇదంతా మనం చూస్తుంటాం. కానీ కొంత మంది పోలీసులు మాత్రం ఉద్యోగాలు వచ్చాక తమ పవిత్రమైన ఉద్యోగ ధర్మానికి మాయని మచ్చగా మారుతున్నారు. యూపీలోని మీరట్ లో లేడీ పోలీసు యవ్వారం ప్రస్తుతం డిపార్ట్ మెంట్ లో తీవ్రచర్చనీయాంశంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో లేడీ ఇన్స్పెక్టర్ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో దుమారంగా మారింది. సోషల్ మీడియాలో తన నూడ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తు క్యూఆర్ కోడ్ తో డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపణలు మిన్నంటాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే మహిళ ఇన్ స్పెక్టర్ యానీ కొల్లిస్ ను సస్పెండ్ చేశారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు విచారణ చేపట్టారు.మహిళా ఇన్స్పెక్టర్ అను స్వస్థలం ప్రయాగ్‌రాజ్ అని, ఆమె 2023 బ్యాచ్ సబ్-ఇన్స్పెక్టర్ గా గుర్తించారు. అంతే కాకుండా గతంలో బ్లాడ్రమ్ కేసు సౌరభ్ హత్య జరిగిన సమయంలో ఆమె ముస్కాన్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ఉంచారు. అను బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఆ తర్వాత ఆమెను ఎస్ఎస్పి కార్యాలయానికి బదిలీ చేశారు. లేడీ సబ్-ఇన్స్పెక్టర్ యానీ కొల్లిస్ నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. డే అంతా పోలీసు జాబ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Burqa Dance Controversy: యూపీలో ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినులు బర్ఖాలు ధరించి చేసిన నృత్యం పెను వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారడంతో పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్ మెంట్ బహిరంగంగా క్షమాపణలు కోరింది. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితో గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరిగింది. వేడుకల్లో భాగంగా బుర్ఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్ పురి, హర్యాన్వీ, బాలీవుడ్ పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేశ్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఏ మతాన్ని వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. డ్యాన్స్ చేసిన విద్యార్థులందరూ కూడా హిందూమతానికి చెందినవారేనని..కేవలం సరదా కోసమే అలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. జరిగిన పొరపాటునకు నేను చింతిస్తున్నాను.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం అవ్వగుండా చూసుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.. భారతీయ జనతా పార్టీ. గెలుపే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేసింది. ఇప్పటికే జాతీయ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళణ చేసింది. పలు కొత్త ముఖాలకు ఇందులో చోటు కల్పించింది. సీనియర్లకు కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రాల వారీగా సమీకరణాలను బేరీజు వేసుకుని పాత, కొత్త నేతల కలయికతో ఈ నూతన కార్యవర్గాన్ని పునర్నిర్మించుకుంది.దీనికి కొనసాగింపుగా మరిన్ని నిర్ణయాలను తీసుకుంటోంది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాలకు నూతన ఇన్ ఛార్జీలను నియమించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ కు ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలుగా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు.బీజేపీకి ఆయువుపట్టుగా భావించే ఉత్తర్ ప్రదేశ్ పై ప్రధానంగా దృష్టి సారించింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఇన్ఛార్జ్ పదవి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వినోద్ తావ్డేకు లభించింది. ఆయనకు తోడుగా జగదీష్ ఈశ్వర్భాయ్ పటేల్.. కో ఇన్ఛార్జ్ నియమితులు అయ్యారు. యూపీలో క్షేత్రస్థాయి సమీకరణాలను సమన్వయం చేయడంలో వినోద్ తావ్డే అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తోన్నారు.గంగా ఎక్స్‌ప్రెస్ వే.. గంగార్పణం: ఒక్క వర్షానికే ఢమాల్.. !!వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్న పంజాబ్ లో రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు సతీష్ పూనియా అపాయింట్ అయ్యారు. అదే సమయంలో.. బీజేపీకి తిరుగులేని కోటగా ఉంటూ వస్తోన్న గుజరాత్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్‌ను రంగంలోకి దించారు. గుజరాత్లో సుదీర్ఘకాలంగా ఉన్న పట్టును మరింత పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వాన్ని ఎంచుకుంది పార్టీ హైకమాండ్.నేటి నుంచే.. విశాఖపట్నం కేంద్రంగా బీజేపీ బిగ్ గేమ్ ప్లాన్: ఇక నుంచైనాపార్టీ జాతీయ నూతన కమిటీలో కూడా

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బురఖాలు ధరించిన విద్యార్థినులు చేసిన నృత్యం పెను వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు కోరగా, విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్‌పురి, హర్యాన్వీ, బాలీవుడ్ గీతాలకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవ్వడంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఏ మత వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. నృత్యం చేసిన విద్యార్థులందరూ హిందూ మతానికి చెందినవారేనని, కేవలం వినోదం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. "జరిగిన పొరపాటుకు నేను చింతిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించారు

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఆహార నాణ్యత నిబంధనలపై ఇటీవల ఎఫ్ఎస్డీఏ ఆదేశాలకు అదనంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు యోగి సర్కారు నిర్ణయించింది. గతంలో కల్తీ ఉదంతాలు బయటపడిన సందర్భాల్లో ఆయా సంస్థల్లోని శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించేవారు. కేసులు నమోదు చేసేవారు. ఇందుకు అదనంగా ఇకపై పాలు, పాల ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు, నిషేధిత కొవ్వు పదార్థాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 సెక్షన్ 34 ప్రకారం సంబంధిత తయారీ యూనిట్లో తక్షణం కార్యకలాపాలను నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. ఆయా కేంద్రాల్లోని డెయిరీ ఉత్పత్తులు అన్నిటినీ సీజ్ చేస్తారు. ఇక కల్తీ జరిగినట్టు, హానికారక పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ అయితే నిబంధనల ఉల్లంఘించిన సంస్థల లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఆ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధిస్తారు. పాల విక్రయాలు, పాల ఉత్పత్తుల నాణ్యత కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డా. రోషన్ జేకబ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా పలు చోట్ల పాలు పాల ఉత్పత్తుల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రిఫైన్డ్ ఆయిల్, కొవ్వు, టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్, టైటానియం డైయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యోగి సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో పేలిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Two employees injured gun fire incident in Varanasi airport: ఉత్తర ప్రదేశ్ లోని వారాణాసి ఎయిర్ పోర్టులో గన్ పేలిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. వారాణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది ప్రయాణికుడి వస్తువుల్ని తనిఖీలు చేస్తుంగా ఒక్కసారిగా గన్ పేలింది. ఈ ఘటనతో ఇద్దరు భద్రత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు అజంగఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఉదయం 09:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం IX-1810 ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు చెప్పాడు . ఈ క్రమంలో గన్ పేలడంతో.. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది. ఈ బుల్లెట్ ఒక మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి తగిలి తీవ్ర గాయమైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ క్లారిటీ ఇచ్చారు. Read more: రైల్వే స్టేషన్ నీళ్లు తాగుతున్నారా? కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదకర బాక్టీరియా గుర్తింపు! హైదరాబాద్స్టేషన్లో కూడా!! గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వారిని న్యూలక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. దీనిపై ప్రస్తుతం

ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డెలివరీ ఏజెంట్ల బంద్.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్‌కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్‌కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. జనావాసాల మధ్యకు వచ్చిన పామును మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు పట్టుకున్నాడు. అనంతరం దానితో ఆడుకుంటూ హంగామా చేశాడు. దీంతో కొండచిలువ, యువకుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సమయంలో బారాబంకి ప్రాంతంలోకి ఓ కొండచిలువ వచ్చింది. స్థానికంగా ఉన్న మాంసం దుకాణంలోని మేకను తినేందుకు లోపలికి వెళ్లింది. దీనిని గమనించిన షాపు యజమాని తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అంత పెద్ద పామును ఒక్కసారిగా చూడటంతో షాక్ అయ్యాడు. షాపు యజమాని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా పెద్దఎత్తున గుమిగూడారు. 15 అడుగుల కొండచిలువను వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న సురేశ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. పామును చూసిన వెంటనే ఎలాంటి భయం లేకుండా నేరుగా దాని వద్దకు వెళ్లాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడిని అది రెండు సార్లు కాటు వేసింది. కొండచిలువకు విషం ఉండకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, పాము దాడిని ఏమాత్రం లెక్కచేయని సురేశ్ తన చేతులతోనే దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది అతని చేతిని పలుమార్లు చుట్టేసింది. మద్యం మత్తులో సురేశ్ చేసిన సాహసానికి స్థానికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత పాముతో అతను కాసేపు విన్యాసాలు చేశాడు. దానిని ఏకంగా తన మెడలో వేసుకుని హంగామా చేశాడు. అనంతరం పెద్ద పాత్రలో బంధించి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాగా, ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న యువత తమ

ఉత్తర్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులు జెండాను పాఠశాల భవనంపై ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ స్లాబ్ కూలిపోవడంతో విద్యార్థులు కిందపడ్డారు. అదే సమయంలో శిథిలాల కింద చిక్కుకుని ఆరేళ్ల చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పనీర్, నెయ్యి సహా అనలాగ్ పాల ఉత్పత్తులపై పూర్తి నిషేధం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం
ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో బీజేపీకి చావో రేవో అన్నట్లు మారాయి. కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్ధితుల్లో ఓటర్లు తమవైపే ఉన్నారని చెప్పుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇందులో గెలిస్తేనే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా జరగకపోతే మాత్రం బీజేపీ పతనం ప్రారంభమైనట్లే భావించవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో యూపీ ఓటరు నాడిపై పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ (Opinion Poll)లో సంచలన ఫలితాలు వెలువడ్జాయి.విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!యూపీలో ప్రాంతాల వారీగా పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలను ఇవాళ సాయంత్రం దశల వారీగా ఎక్స్ లో ట్వీట్లు చేస్తోంది. ఇందులో ముందుగా పూర్వాంచల్ ప్రాంతంలోని 133 సీట్లలో నిర్వహించిన సర్వేలో ఇండియా కూటమికి (India Bloc) 73 సీట్లు, ఎన్డీయేకు (NDA)కు 56 సీట్లు దక్కుతాయని తేలింది. బీఎస్పీకి 3 సీట్లు, ఇతరులకు ఒక సీటు దక్కనున్నాయి. అలాగే అవథ్ ప్రాంతంలోని 82 సీట్లలో నిర్వహించిన సర్వేలో ఇండియా కూటమికి 45 సీట్లు, ఎన్డీయే కూటమికి 35 సీట్లు దక్కుతున్నట్లు తేలింది. బీఎస్సీ 2 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఇండియా కూటమికి 44-49 శాతం ఓట్లు, ఎన్డీయేకు 39-45 శాతం ఓట్లు లభిస్తున్నాయి. Poll Tracker: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు ? తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు..!అలాగే పశ్చిమ యూపీ ప్రాంతంలోని 79 సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో ఇండియా కూటమికి 48 సీట్లు, ఎన్డీయేకు 34 సీట్లు, బీఎస్పీకి రెండు సీట్లు రాబోతున్నట్లు తేలింది. ఇక్కడ కూడా రెండు కూటముల ఓట్ల శాతాల్లో మిగతాప్రాంతాలతో పోలిస్తే ఎలాంటి మార్పూ లేదు.మిగతా ఫలితాలు కాసేపట్లో వెలువడాల్సి ఉంది

ఆస్తి కోసం కన్న తండ్రి మృతదేహాన్నే అడ్డంగా పెట్టుకున్నాడో కొడుకు. బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోలేదు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.75 ఏళ్ల ఛత్రపాల్ తన కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మి వేధింపులు భరించలేక కొంతకాలంగా కుమార్తెల వద్ద ఉంటున్నారు. 2023లో మహేంద్ర, లక్ష్మి తన తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఛత్రపాల్ కుమార్తె సుమన్ ఆరోపించారు. దీంతో ఆయన బంధువుల వద్ద, అనంతరం తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ వచ్చారు.ఆస్తిని కుమార్తెలకు పంచిన తండ్రితనను చూసుకున్న ముగ్గురు కుమార్తెలకు ఛత్రపాల్ తనకున్న భూమిని రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను, తన భార్యను వేధించారనే కారణంతో కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మికి తన ఆస్తిలో ఏమాత్రం చెందదని పత్రికలో ప్రకటన కూడా ఇచ్చినట్లు కుటుంబం తెలిపింది.అయితే తండ్రి ఆరోగ్యం విషమించడంతో జులై 7న సుమన్ తన అన్న మహేంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబంతో కలిసి లక్నోకు వచ్చిన మహేంద్ర.. తండ్రికి చికిత్స చేయిస్తానంటూ ఆయన్ను గ్రామానికి తీసుకెళ్లాడు. రెండు రోజులకే ఛత్రపాల్ కన్నుమూశారు.తండ్రి చనిపోయినా..అంత్యక్రియల కోసం సుమన్, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారికి ఊహించని దృశ్యం కనిపించింది. మృతిచెందిన ఛత్రపాల్ చేతి వేలిని పట్టుకున్న మహేంద్ర.. ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్ర తీసుకుంటున్నట్లు బంధువులు

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. వరంగల్ జిల్లా: గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇవాళ (గురువారం) విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31)గా మృతులను గుర్తించారు. అయితే, వారిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. లిఫ్ట్‌లో ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే షార్ట్‌సర్క్యూట్ జరిగిందా? వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఫోన్ కొన్న యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్కు తిరిగి వస్తున్న మజీద్ అనే యువకుడి జేబులో స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. నెల రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఈ ఫోన్.. ప్రయాణంలో ఉండగా విపరీతంగా వేడెక్కింది. బాధితుడు ఫోన్‌ను జేబులోంచి బయటకు తీసేలోపే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మజీద్ దుస్తులకు నిప్పంటుకోవడంతో పాటు అతని రెండు చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫోన్ ముక్కలుముక్కలైంది. బాధితుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి.. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫోన్లోని లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతినడం లేదా తయారీ సమయంలో ఏర్పడిన అంతర్గత లోపం కారణంగా బ్యాటరీలో సమస్య తలెత్తి ఫోన్ పేలి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఛార్జర్లు, ఫోన్‌ని గంటల పాటు వాడటంతో హీట్ కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకూ ఫోన్‌ను ఆఫ్ చేసుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అక్కాచెల్లెళ్లను తండ్రి నిర్బంధించడాన్ని తప్పుబట్టిన అలహాబాద్‌కోర్టు ప్రయాగ్‌రాజ్: ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. యూపీకి చెందిన దియా భాటియా అలియాస్ జోయా (20), అన్షు భాటియా అలియాస్ అమీనా (35) 2021లో ఇస్లాం స్వీకరించారు. ఇది ఇష్టంలేని తండ్రి, ఆ ఇద్దరినీ ఇంట్లోని గదిలో పెట్టి తాళం వేశాడు. అయితే ఆ అక్కాచెల్లెళ్ల తరఫున ఓ వ్యక్తి ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అటు.. ఆ సోదరీమణుల తండ్రి కూడా తన కూతుళ్లను హిందూమతం నుంచి బలవంతంగా, మోసపూరితంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సందీప్ జైన్ విచారించారు. తాము ఎవరి ఒత్తిడితోనో కాకుండా పూర్తి ఇష్టపూర్వకంగానే మానసిక ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరించామని ఆ సోదరీమణులు కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఈ అక్కాచెల్లెళ్లు మతం మారడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ కోర్టులో యూపీ ప్రభుత్వం వాదించింది. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మేజర్లు అని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునేందుకు న్యాయపరమైన స్వేచ్ఛ వారికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అక్కాచెల్లెళ్లకు కోరుకున్న చోట, కోరుకున్న వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి గోరఖ్‌పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్‌పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. విమాన కనెక్టివిటీ మెరుగ్గా ఉండడంతో రవి కిషన్ ఏ రోజు గోరఖ్‌పూర్‌లో ఉంటారో, ముంబైలో ఉంటారో, ఢిల్లీలో ఉంటారో ఎవరికీ తెలియదని చమత్కరించారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గోరఖ్‌పూర్‌లో మెరుగైన విమాన కనెక్టివిటీ గురించి మాట్లాడిన యోగి.. నగరంలో భారీ మార్పు వచ్చిందన్నారు. 10 ఏళ్ల క్రితం రోజుకు ఒక్క విమానం మాత్రమే నడిచేదని, ప్రస్తుతం నగరం నుంచి 14 విమానాలు నడుస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత ప్రేక్షకుల్లో కూర్చున్న రవి కిషన్ వైపు తిరిగి మాట్లాడుతూ.. “రవి కిషన్ గురించి నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన గోరఖ్‌పూర్‌లో ఎప్పుడు ఉంటారో, ముంబైలో ఎప్పుడు ఉంటారో ఎవరికీ తెలియదు. ముంబైలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, గోరఖ్‌పూర్‌లో లంచ్ కూడా చేసేస్తారు. ఇక్కడ ముఖం చూపించి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతారు” అన్నారు. విమాన అనుసంధానం లేకపోతే ఇలాంటి షెడ్యూల్ నిర్వహించడం కష్టమయ్యేదని అన్నారు. యోగి వ్యాఖ్యలపై రవి కిషన్‌తో పాటు అక్కడ ఉన్నవారు కూడా గట్టిగా నవ్వారు. గతంలోనూ ఓ సారి ఇలాగే.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకే వేదికపై కనిపించినప్పుడల్లా ఇటువంటి సరదా సంభాషణలు జరుగుతుంటాయి. 2025 జూలైలో గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో, రామ్‌ఘర్ తాల్ ప్రాంతంలో కాలువపై రవి కిషన్ ఇల్లు కట్టారని యోగి సరదాగా ప్రస్తావించారు. నీరు నిలిస్తే ఆయనపైనా చర్యలు తప్పవని చమత్కరించారు. మురుగు నీటి ప్రవాహం సజావుగా సాగాలంటే కాలువకు కొంత దూరంగా ఇల్లు కట్టాలని సూచించారు. మరో సందర్భంలో అదే ఇంటిని ప్రస్తావిస్తూ, రామ్‌ఘర్ తాల్ ఒడ్డున ఒక “షీషే మహల్” ఉందని వ్యాఖ్యానించారు. అది రవి కిషన్ ఇంటినే ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్

ఓ బ్యాంకు లాకర్లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి. కాన్పూర్: ఓ బ్యాంకు లాకర్లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి. లాకర్ తెరిచి చూసిన బాధితురాలికి తన ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకు యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదైంది. కాన్పూర్‌లోని స్వరూప్‌నగర్‌కు చెందిన రష్మి అరోరా తన భర్తతో కలిసి 2003 ఫిబ్రవరి 26న అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ)లో ఖాతా తెరిచింది. అదే సమయంలో వారికి లాకర్ నంబర్ 23ని బ్యాంకు సిబ్బంది కేటాయించారు. అందులో సుమారు రూ.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను భార్యాభర్తలు భద్రపరిచారు. కొంతకాలం పాటు ఆ దంపతులు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి లాకర్‌ను పరిశీలించేవారు. రష్మి భర్త మరణించిన తర్వాత ఆమె.. లక్నోలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. దూరం కారణంగా బ్యాంకుకు వెళ్లడం తగ్గిపోయింది. అయితే లాకర్ భద్రంగానే ఉంటుందని భావించింది. ఇదిలా ఉండగా ఎస్బీటీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) విలీనమైంది. సుమారు నాలుగు నెలల కిందట కుమార్తెతో కలిసి బ్యాంకుకు వెళ్లగా రష్మి పేరుతో లాకర్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో పాత ఖాతా, లాకర్‌కు సంబంధించిన పత్రాలను తీసుకుని మరోసారి బ్యాంకుకు వెళ్లింది. అప్పుడు ఆమె ఖాతా నుంచి లాకర్ అద్దె ఆటోమేటిక్‌గా కట్ అవుతూ వచ్చిందని, దాంతో ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ కారణంగానే ఖాతా ఇన్‌యాక్టివ్ అయ్యిందని పేర్కొన్నారు. జులై 21న రష్మి

ఇంటర్నెట్ డెస్క్: చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉంటూ.. కోర్టులనే మోసం చేస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల దందాను అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో యూపీ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశవ్యాప్తంగా లాయర్ల విద్యార్హతల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడంతో ఇది వెలుగుచూసింది. ఈ తనిఖీల్లో కేటుగాళ్లు ఎల్ఎల్బీ పట్టాలనే కాకుండా, పదో తరగతి, డిగ్రీ మార్క్షీట్లను కూడా ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఇందులో అలహాబాద్ విశ్వవిద్యాలయం (Allahabad University) పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీలు కూడా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్‌సింగ్ అనే వ్యక్తి ఏకంగా 35 ఏళ్లుగా నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్లు తెలిసింది. ఈ నకిలీల వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ బార్ కౌన్సిల్ అందించిన 105 మంది నిందితుల జాబితా ఆధారంగా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పోలీసులు మూడు రోజుల్లోనే 39 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మిగతా 66 మందిపై త్వరలోనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holiday Tomorrow August 11th: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గత వారం రోజులుగా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే రేపు ఆగస్టు 11న పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనే సందేహం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. IMD వెల్లడించిన తాజా వివరాలు.. పాఠశాలల సెలవుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీ వర్షాలు .. కన్వర్ యాత్ర కారణంగా ఆగస్టు 11, 2026, మంగళవారం నాడు పాఠశాలలు మూసి ఉంటాయా లేదా అనేది కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెక్ చేస్తున్నారు. అయితే రేపటికి ప్రస్తుతం ఎలాంటి పాఠశాల సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ స్థానిక పరిపాలనా ఉత్తర్వులు, వాతావరణ పరిస్థితులు , మతపరమైన కార్యక్రమాల కారణంగా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. తాజా సమాచారం ప్రకారం, కన్వర్ యాత్ర కారణంగా హరిద్వార్‌లోని పాఠశాలలు, కళాశాలలు ఆగస్టు 11 వరకు మూసివేసి ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలు కూడా సెలవులను ప్రకటించాయి. ఉత్తరాఖండ్‌లో, భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో, బాగేశ్వర్‌లోని 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఆగస్టు 10న మూసివేయాలని ఆదేశించారు. అయితే ఆగస్టు 11వ తేదీన పాఠశాలల బంద్ గురించి ఎలాంటి ఉత్తర్వు జారీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు ముందుగానే ప్రారంభం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే, రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ఎక్కువ వాటా పొందడమే పార్టీ లక్ష్యం కాదు. దానికి బదులుగా, సంస్థాగత బలం, అభ్యర్థి సామర్థ్యం, కుల సమీకరణాలు, సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కలిసొచ్చే గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపై చర్చలు జరగాలని పార్టీ కోరుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో కూటమికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పరిమిత ఉనికి మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇరు పార్టీలు కూడా 403 అసెంబ్లీ స్థానాలన్నింటిపైనా సర్వేలు నిర్వహిస్తున్న వేళ భవిష్యత్తులో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న చర్చలకు ఇది పునాది వేయొచ్చు. సీట్ల సర్దుబాటు పరిమితం కాలేదు సీట్ల సర్దుబాటు ప్రధానంగా ఎన్ని స్థానాలు దక్కాయన్న లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు వాస్తవికంగా గెలిచే అవకాశం ఉన్న కొద్దిపాటి స్థానాలపై దృష్టి పెట్టినా, గెలుపు అవకాశాలే ప్రమాణంగా ఉండాలని పార్టీ కోరుతోంది. “ఒక విషయం అంశంలో మేము స్పష్టంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. అయితే అది సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం. రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవాలని కోరుతున్నాం. అందుకోసం మంచి స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యం” అని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. “ఒక పార్టీ వరుసగా మూడు సార్లు ఓడిపోయిన స్థానాన్ని మళ్లీ అదే పార్టీకి ఇవ్వడం వల్ల కూటమికి ఉపయోగం ఉండదు. మరో పార్టీ అభ్యర్థి తన ఓట్లతో పాటు భాగస్వామ్య పార్టీ ఓట్లను కూడా కలిపి తెచ్చుకోగలిగితే అది మరింత బలమైన అవకాశం అవుతుంది” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. కాంగ్రెస్

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్‌గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్‌గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం ఉమర్ తన అనుచరులతో 28 కార్లలో లఖ్‌నవూ నుంచి ప్రయాగ్‌రాజ్ బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో నావాబ్‌గంజ్ టోల్ ప్లాజా వద్ద ఉమర్ అనుచరులు టోల్ ఫీజు చెల్లించుకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టోల్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. టోల్ ఫీజు చెల్లించి అక్కడినుంచి వెళ్లమన్నారు. ఆగ్రహానికి గురైన ఉమర్ అనుచరలు హల్చల్ చేశారు. టోల్ సిబ్బందితో తప్పుగా ప్రవర్తించారు. అక్కడినుంచి వెళ్లిపోయే సమయంలో టోల్ బ్యారియర్‌ను ధ్వంసం చేశారు. బూత్ నంబర్ 3 వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ జైప్రకాశ్ యాదవ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమర్ అనుచరులు తమను కారుతో తొక్కించి చంపుతామని బెదిరింపులకు దిగినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడిపోయిన టోల్ సిబ్బంది అక్కడినుంచి పక్కకు వచ్చేశారని తెలిపారు. యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు 28 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

ఇంటర్నెట్ డెస్క్: తన కుమార్తె వివాహ బంధానికి సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ భాజపా ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక మంది మహిళలను మోసం చేసిన వ్యక్తితో తన కుమార్తెకు వివాహం జరిపించారని (Marriage Fraud) అన్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో అనేక పెళ్లిళ్లు చేసుకొని డబ్బులు దండుకున్నట్లు తెలిసిందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. యూపీలోని సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ (MLA Gyan Tiwari) కుమార్తె ప్రజ్ఞాకు సీతాపుర్ జిల్లాకు చెందిన అనూజ్ త్రివేది కుమారుడు ప్రఖార్ త్రివేదితో 2024లో వివాహం జరిగింది. ముంబయిలో పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనూజ్ పరిచయం చేసుకోవడం, ఆ కుటుంబానికి స్థానికంగా మంచి పేరుందని తెలియడంతో జ్ఞాన్ తివారీ ఈ సంబంధానికి అప్పట్లో ఓకే చెప్పారు. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం కానీ, ఇటీవల అల్లుడి కార్యకలాపాలు, మోసాలకు సంబంధించిన కేసులు వెలుగులోకి రావడంతో అతడి చరిత్రపై ఎమ్మెల్యే ఆరా తీశారు. తప్పుడు ఐడీ కార్డులతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అనేక మంది మహిళలను ప్రలోభపెట్టి కోట్లాది రూపాయలు కాజేసినట్లు తెలుసుకున్నారు. అంతేకాదు.. ఇప్పటికే తన అల్లుడు దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలియడంతో కంగుతిన్నారు. ఈ విషయాలు తెలిసిన వెంటనే నిందితుడి కుటుంబంతో సంబంధాలు తెంచుకొని తన కుమార్తెను తమ ఇంటికి తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రఖార్ నేర చరిత్ర, కేసుల వివరాలను దాచిపెట్టి వివాహం జరిపించారని, దీంతో తన కుటుంబం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఓ ప్రజాప్రతినిధిగా తన పరువుకూ నష్టం కలిగిందన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ప చీటింగ్ కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు..తండ్రీకొడుకులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇదిలాఉంటే, ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో

ప్రియుడిపై ప్రేమ.. తండ్రి భయం.. చివరకు జైలు గేటు ముందు జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఖైదీని కలిసేందుకు వచ్చిన మైనర్ బాలిక దగ్గర 10 బుల్లెట్ తూటాలు దొరకడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డు, కొంత నగదును కూడా ఆమె నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోండా డివిజనల్ జైలులో ఉన్న ఖైదీ హర్షు కశ్యప్‌ను కలిసేందుకు బాలికతో పాటు మరో వ్యక్తి గురువారం జైలుకు వచ్చినట్లు జైలర్ అఫ్తాబ్ ఆలం అన్సారీ తెలిపారు. జైలు ప్రధాన గేటు దగ్గర తనిఖీల సమయంలో బాలిక తప్పుడు గుర్తింపుతో రావడం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె మరో పేరు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను తనిఖీ చేయగా.. జేబులో 10 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్లు బయటపడ్డాయి. వెంటనే జైలు ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్కు సమాచారం అందించి.. బాలికతో పాటు వచ్చిన వ్యక్తితో పాటు వారి దగ్గర ఉన్న వస్తువులను పోలీసులకు అప్పగించారు. విచారణలో బాలిక తన అసలు వివరాలను బయటపెట్టింది. ఆ బుల్లెట్లు తన తండ్రి లైసెన్స్ గన్లోనివని.. తన తండ్రికి కోపం ఎక్కువని.. తాను జైలులో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భయపడి బుల్లెట్లను వెంట తీసుకువచ్చానంటూ చెప్పింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన

ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ శాసనసభ్యుడు దారుణంగా మోసపోయారు. సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ అల్లుడు.. ఓ అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడని, దేశవ్యాప్తంగా నకిలీ గుర్తింపులతో ఏకంగా 25 పెళ్లిళ్లు చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నాడని తేలింది. ఈ దారుణ మోసంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన అల్లుడు ప్రకార్ త్రివేది, అతడి తండ్రి అనుజ్ త్రివేదిని శనివారం అరెస్ట్ చేశారు.ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ 2024లో తన కుమార్తె ప్రజ్ఞ వివాహాన్ని మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన ప్రకార్ త్రివేదితో అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లికి ముందు ప్రకార్ తండ్రి అనుజ్ త్రివేది, తమకు ముంబైలో వందల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని నమ్మబలికారు. స్థానికంగా కూడా మంచి పేరున్నట్లు చిత్రీకరించడంతో ఎమ్మెల్యే ఈ సంబంధానికి అంగీకరించారు. తమ నేర చరిత్రను, కేసులను త్రివేది కుటుంబం ఆ సమయంలో అత్యంత లౌక్యంగా దాచిపెట్టింది.వివాహమైన రెండేళ్ల తర్వాత అసలు నిజం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రకార్ త్రివేది నకిలీ పేర్లు, ఫేక్ ఐడీ కార్డులు వాడుతూ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో సుమారు 25 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల డబ్బు, ఆభరణాలతో పరారవడం అతడికి అలవాటని తేలింది.ఈ మోసం గురించి తెలియగానే ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 6న తన కుమార్తెతో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు