
Drishyam 3 Trailer | అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' ట్రైలర్ విడుదల.. ఈసారైనా విజయ్ చిక్కుతాడా?
Drishyam 3 Trailer | అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' ట్రైలర్ విడుదల.. ఈసారైనా విజయ్ చిక్కుతాడా?
© 2026 nimisham.in

Drishyam 3 Trailer | అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' ట్రైలర్ విడుదల.. ఈసారైనా విజయ్ చిక్కుతాడా?

Street Fighter trailer : జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ . కిటావో సకురాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. Shiva Jyothi : పింక్ శారీ, భారీ హారంతో యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు వైరల్.. నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది

ఆంగ్ల చిత్రం 'స్ట్రీట్ ఫైటర్' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. అక్టోబర్ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ నూ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం విడుదలైంది. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కాంబో ఛాలెంజ్ ద్వారా అభిమానులు ట్రైలర్ ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా విడుదలైంది. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్‌తో సాగింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ కథతో ఈ సినిమా నేపథ్యం ప్రారంభమవుతుంది. జపాన్ దేశంలో నిర్వహించిన ఒక అత్యంత సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్‌లోకి సర్దార్ ప్రవేశించి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడుతాడు. ఇదిలా ఉండగా ఆ మిషన్ తర్వాత ఎదురైన తీవ్ర పరిణామాలు అతడి జీవితాన్ని దశాబ్దాల పాటు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. గతం నుంచి నేటి వరకు సాగే ఈ స్పై డ్రామాలో కథనం ఎంతో వేగంగా పరిగెడుతూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వర్తమానంలో మన దేశానికి ఒక ఊహించని పెద్ద ముప్పు ఎదురైనప్పుడు కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. దీంతో పాత శత్రువులను ఎదుర్కొనేందుకు సర్దార్ మరియు అతని కుమారుడు విజయ్ ప్రకాష్ ఇద్దరూ ఒకే మిషన్‌లో భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్యాగర్ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి కథలో ఉత్కంఠను రెట్టింపు చేశారు. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ చూపించిన బాడీ లాంగ్వేజ్ మరియు నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ మిషన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు

మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ‘మారెమ్మ’ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు, మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు కథానాయిక. వికాశ్, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్‌రెడ్డి కీలక పాత్రదారులు. మయూర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ‘ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా తెలంగాణ పల్లె కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే ఆర్థమౌతుంది

'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది. (ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్) గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) ‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు) పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్ బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్ 'రోడ్డు

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూర్మ అవతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (Shivaraj kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూర్మ అవతార్’ (Kurma avatar). హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సాయికుమార్, రాజ్ తరుణ్, శివాజీ, అతిరా రాజ్, పూజిత కె. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.సేవిత, పూజిత కె. నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ‘కూర్మ అవతార్’ టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ను వీక్షించిన అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. దర్శకుడు హర్ష తనదైన విజన్‌తో సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఇటీవల వచ్చిన ‘పెద్ది’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. దర్శకుడు హర్ష ‘కూర్మ అవతార్’ కథను చెప్పగానే ఎంతో నచ్చి ఈ సినిమా చేస్తున్నా. కథ నచ్చితే దర్శకుడు కొత్తవారా, అనుభవం ఉన్నవారా అనే విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను. మంచి కథ అయితే తప్పకుండా చేయడానికి ముందుకొస్తా. హర్ష ఎంతో గొప్ప విజన్‌తో ‘కూర్మ అవతార్’ను తెరకెక్కించారు. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. సాయికుమార్‌తో కలిసి గతంలో ఎన్నో సినిమాలు చేశాను. మరోసారి ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ 'శివరాజ్ కుమార్ కుటుంబంతో ఎంతోకాలంగా అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు మంచి మనసున్న వారు. శివరాజ్ కుమార్‌తో కలిసి ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాను. ‘కూర్మ అవతార్’లో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అన్నారు. నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్ నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్లో

థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది? 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్‌లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్‌ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @

లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాను విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హాయ్ తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి చిత్రం ఇదే కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్లో 'మగాడి జీవితం మూడు రకాలు.. ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, రెండు పెళ్లి చేసుకున్నాక ప్రేమించటం, మూడు అటు ప్రేమించలేక ఇటు పెళ్లి గాక బేవరసగా తిరగడం అంటూ భాగ్యరాజ్ తిట్టే సీన్ తో మొదలైంది. విష్ణుకు చిన్నతనం నుంచి అమ్మాయిల ప్రేమ దక్కడు. స్కూల్ నుంచి జాబ్ వరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అతనిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ సమయంలోనే అతడి జీవితంలోకి దేవసేన వస్తుంది. కేవలం ఫ్రెండ్స్ గా కూడా లేని వారిద్దరికీ అనుకోకుండా కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారు. అసలు ఈ దేవసేన ఎవరు.. ? విష్ణు జీవితంలోకి ఎందుకు వచ్చింది.. ? ఆమె వచ్చాక విష్ణు జీవితం ఎలా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వినోదం, సెంటిమెంట్. లవ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా కవిన్ - నయన్ సీన్స్ చాలా బావున్నాయని టాక్ నడుస్తోంది. జెన్ మార్టిన్ మ్యూజిక్ చాలా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల

మెగాస్టార్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్లలో రచ్చ చేద్దాం అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ ఇస్తూ 'ముఠా మేస్త్రి' 4K రీ-రిలీజ్ వాయిదా పడింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మాస్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ముఠా మేస్త్రి'. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన సునామీ, ఆ మాస్ మేనియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆల్‌టైమ్ క్లాసిక్‌ను 4K క్వాలిటీలో, అత్యుత్తమ 5.1 ఆడియో సౌండింగ్‌తో థియేటర్లలోకి మళ్ళీ తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్‌కు కూడా మెగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మేస్త్రి మాస్ జాతరను మళ్ళీ రిపీట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో, మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 4K క్వాలిటీ రీ-మాస్టరింగ్ వర్క్‌కు సంబంధించి ఫైనల్ క్వాలిటీ అవుట్‌పుట్ రావడంలో సాంకేతిక జాప్యం జరిగిందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "ముఠా మేస్త్రి అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది తరతరాల మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవర్ ఫుల్ మాస్ క్లాసిక్" అని కొనియాడారు. ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, అభిమానులకు అత్యుత్తమ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నాణ్యత విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల మెగా అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, చిరంజీవి రేంజ్‌కి తగ్గట్లుగా ముఠా మేస్త్రి రీ-రిలీజ్ గ్రాండ్‌గా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇచ్చారు. త్వరలోనే రీ-రిలీజ్ చేయడానికి కొత్త తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. బిగ్గర్, బెటర్, గ్రాండర్ ఎక్స్‌పీరియన్స్‌తో మేస్త్రి మళ్ళీ థియేటర్లలోకి రాబోతున్నాడు

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ యశ్ (Yash)హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’(Toxic Movie). ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది (Toxic English Trailer ). ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్‌తో అదరగొట్టారు. ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఘట్టమనేని జయకృష్ణ. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన అతను 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. రోటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే శ్రీనివాస మంగాపురం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 అంటే రేపటి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అజయ్, శామ్, నరేష్, బ్రహ్మాజీ, మహేంద్రన్, వాసుకీ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్

గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. మన ఆడియన్స్‌కు హాలీవుడ్ మేకింగ్, అక్కడి విజువల్స్ విపరీతంగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకైతే మన దగ్గర ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన పలు హారర్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. 'ది కంజూరింగ్: ది లాస్ట్ రైట్స్', అలానే 'ఈవిల్ డెడ్ బర్న్' లాంటి సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ సినిమాలు కేవలం భయపెట్టడమే కాకుండా, థియేటర్లకు భారీగా జనాలను రప్పించి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి. లోకల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ సైతం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ఇండియన్ సినిమా లవర్స్ ఇప్పుడు సరికొత్త హారర్ వరల్డ్‌ను ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఈ కలెక్షన్లే నిరూపించాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు మరో భయంకరమైన మూవీ సిద్ధమైంది. అదే ఇన్సీడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out of the Further). హారర్ సినిమా ప్రియులకు ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దెయ్యాలు, ఆత్మలు తిరిగే ది ఫర్దర్ అనే డార్క్ డైమెన్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన మునుపటి భాగాలు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా, మన ఇండియాలోనూ కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి. జంప్ స్కేర్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో కూర్చున్న

యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రధాన తారాగణం లుక్స్‌తో కూడిన పూర్తి పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో నటీనటులు పోషిస్తున్న పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రంలో యష్ ‘రాయా’ మరియు అతని కుమారుడు ‘రూమి అలియాస్ టికెట్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ ‘నాడియా’ (రూమి తల్లి)గా, నయనతార రాయా సోదరి ‘గంగ’ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో హుమా ఖురేషి ‘ఎలిజబెత్’గా, తారా సుతారియా ‘రెబెక్కా’గా, రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా కనిపించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్ (టోనీ), డారెల్ డిసిల్వా (సాల్వడార్), సుదేవ్ నాయర్ (కర్మాడి), బాలాజీ మనోహర్ (భీర) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఇంగ్లీష్ ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 8:30 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

కికు యనమల, కాశీష్ ఖాన్ జంటగా నటించిన ‘కికు చిరంజీవి’ ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది. కికు యనమల (Kiku Yanamala), కాశీష్ ఖాన్ (Kashish Khan) జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కికు చిరంజీవి’ (Kiku Chiranjeevi). ఈశ్వరరావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నడిమింటి దీప్తి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా మేకర్స్ ‘కికు చిరంజీవి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌కు కొనసాగింపుగా ట్రైలర్ కూడా ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్లో హీరో కోసం పలువురు వెతకడం, అతడిపై వరుసగా హత్యాయత్నాలు జరగడం ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా హీరో తిరిగి ప్రాణాలతో బయటపడటం చుట్టూ వచ్చే సన్నివేశాలు, ఎలివేషన్లు అదిరిపోయాయి. సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేదిగా ఉంది. మరోవైపు తన కుమారుడి కోసం తల్లి పడే తపన, ప్రేమించిన యువతితో పెళ్లి, హీరో పాత్రలో కనిపించే విభిన్న కోణాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గుండె కుడివైపున ఉండే యువకుడి నేపథ్యం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఆగస్టు 28న ‘కికు చిరంజీవి’ థియేటర్లలో సందడి చేయనుంది

Khalifa Trailer: ఒక స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, చివరికి రక్తపాత ప్రతీకారం. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా ‘ఖలీఫా’ (Khalifa) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa) ట్రైలర్ ను నిన్న రాత్రి (ఆగస్టు 16) 8:30 గంటలకు ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. వైశాఖ్ దర్శకత్వంలో జిను వి. అబ్రహం కథ అందించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో పృథ్వీరాజ్ ‘మాంబరక్కల్ ఆమిర్ అలీ’ అనే పవర్ఫుల్ గోల్డ్ స్మగ్లింగ్ డాన్ పాత్రలో గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. ఈ హై-వోల్టేజ్ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సరసన మాలవిక శర్మ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘మాంబరక్కల్ అహ్మద్ అలీ’ అనే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ ఓనమ్ (Onam) పండుగ కానుకగా ఈ వారంలోనే అంటే 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. పృథ్వీరాజ్ గతంలో విడుదల చేసిన ఆమిర్ అలీ చిన్ననాటి లుక్, గ్లింప్స్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో, ఓణం సందర్భంగా ఖలీఫా బాక్సాఫీస్

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ

ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్లూ భక్తి ఎక్కువగా ఉంటుంది.. రవితేజ పూర్తిగా క్లాస్ రూట్లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. కానీ లోపల అదే మాస్.. అదే రచ్చ.. అని ట్రైలర్ చూసాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్లో చాలా చూపించారు.. చాలా ప్రశ్నించారు.. ఎన్నో అనుమానాలు కూడా పెట్టేసారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్.. పైగా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇరుముడి కూడా అలాగే ఉంటుందనుకున్నారంతా. ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్‌లో కూడా పెద్దగా మాస్ చూపించలేదు మేకర్స్. కానీ ట్రైలర్లో మొత్తం ఒకేసారి చూపించారు.. సినిమా ఎలా ఉండబోతుందో 3 నిమిషాల ట్రైలర్లో కళ్లకు కట్టేసారు. ఇరుముడి అనేది కేవలం భక్తి సినిమా మాత్రమే కాదని ట్రైలర్‌తోనే అర్థమైపోయింది. ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్.. ఇంకోవైపు భక్తి.. మరోవైపు థ్రిల్లర్ ఇలా అన్నింటినీ మిక్స్ చేసారు శివ నిర్వాణ. కాసేపు మందు లేకపోతే పిచ్చెక్కిపోయే ఒక తండ్రి.. కూతురు కోసం ఎంత మారిపోయాడు.. ఏం చేసాడు అనేదే ఇరుముడి కథ. ఈ సినిమాతో శివ కూడా తన రూట్ మార్చేసారు. ఇరుముడి కోసం రవితేజ కూడా మారిపోయారు. ఇదివరకు మాస్ యాక్షన్ అంటూ రొటీన్ కథల వెంట పడ్డ మాస్ రాజా.. ఇరుముడిలో ఓ మంచి గ్రిప్పింగ్ కథతో వస్తున్నారని అర్థమైపోతుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కూతురుగా బేబీ నక్షత్ర అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఆగస్ట్ 21న విడుదల కానుంది ఇరుముడి. మరి ఈ చిత్రంతో రవితేజ ఏం మాయ చేయబోతున్నారో..? భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా

యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో యశ్ స్పందించారు. టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన యశ్.. బోల్డ్ కంటెంట్ విమర్శలపై మాట్లాడారు. అసభ్యత తప్పేనని.. కానీ నేను ఇందులో కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. దానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. అది మాకు తెలుసని స్పష్టం చేశారు. ఇక్కడ సినిమా అంటే దృశ్యపరంగా ఆకట్టుకునేలా కనిపించాలని.. అదే ఒక క్రియేటర్ గొప్పతనం అని అన్నారు. ప్రస్తుతం మీ సినిమాలపై జెన్ జీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని యశ్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ప్రతి పాత తరం వారు యువతరం తప్పు చేస్తోందని భావిస్తుంటారని తెలిపారు. తన చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ సమాధానమిచ్చారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే... జాతీయ జెండాకు అవమానం.. జెండాను తిరగేసి కట్టిన టీడీపీ నేతలు

ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. డిస్నీ డీ23 ఈవెంట్లో విడుదల చేసిన ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఒకప్పుడు ఐరన్ మ్యాన్‌గా ప్రపంచాన్ని కాపాడిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి భయంకరమైన విలన్ ‘డాక్టర్ డూమ్’ పాత్రలో కనిపించడం ఈ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డూమ్ పాత్ర ఎంత శక్తిమంతమైనదో, అతని గతం ఎంత భావోద్వేగభరితమైనదో ఈ ట్రైలర్ స్పష్టంగా చూపించింది.రెండు నిమిషాల పది సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, విక్టర్ వాన్ డూమ్ (డాక్టర్ డూమ్) గతాన్ని, ఫెంటాస్టిక్ ఫోర్‌తో అతనికి ఉన్న సంబంధాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా ఫెంటాస్టిక్ ఫోర్‌లోని సూ స్టార్మ్ (వనెస్సా కిర్బీ), మిగతా హీరోలకు డూమ్ గురించి వివరిస్తున్న డైలాగ్స్ అతని పాత్రకు లోతును అద్దాయి. "విక్టర్ ఒకప్పుడు చాలా తెలివైనవాడు, దయగలవాడు. కానీ, తను ప్రేమించిన వాళ్లందరినీ కోల్పోయాడు. అతను దారి తప్పాడని నాకు తెలుసు, కానీ ఇంతగా విరిగిపోయాడని నేను గ్రహించలేదు" అని ఆమె చెప్పే మాటలు డూమ్ ట్రాన్స్ఫర్మేషన్కు కారణాలను సూచిస్తున్నాయి.ట్రైలర్లో డూమ్‌ను ఎదుర్కొన్న రీడ్ రిచర్డ్స్ (పెడ్రో పాస్కల్), "ఇదంతా నువ్వే చేశావా?" అని ప్రశ్నించగా.. "మీరంతా దొంగిలించబడిన జీవితాలను గడిపారు. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వాలి" అని డూమ్ చెప్పిన డైలాగ్ సినిమా కథపై క్యూరియాసిటీని పెంచుతోంది. తన భార్య, కొడుకు ఉన్న ఒక చిత్రాన్ని డూమ్ చూస్తున్న దృశ్యం

Awarapan 2 Review || చిత్రం: ఆవారాపన్ 2; నటీనటులు: ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ, షబానా అజ్మీ, సువీందర్ విక్కీ, విజయంత్ కోహ్లీ తదితరులు; నిర్మాత: విశేష్ భట్; రచన: బిలాల్ సిద్ధిఖీ; దర్శకత్వం: నితిన్ కక్కర్ 2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ‘ఆవారపన్’. (Awarapan) బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, టెలివిజన్, ఇతర ఛానళ్ల ద్వారా సినిమా చూసి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాదాపు 19ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా ‘ఆవారాపన్2’ వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? Awarapan 2 story || అలియా హమిద్ (శ్రియ) మరణం శివమ్ పండిట్‌ను (ఇమ్రాన్ హష్మి) బాధపెడుతూనే ఉంటుంది. పుట్టినరోజు సందర్భంగా నివాళి అర్పించేందుకు ఆమె సమాధి దగ్గరకు వెళ్లగా, అక్కడ పసికందు కనిపిస్తుంది. ఆ పాపకు అలియా అని పేరు పెట్టి అనాథాశ్రమంలో చేరుస్తాడు. ఆ పాపకు కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. పాపకు దాదాపు పదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటను హత్య చేసి, పాపను ఎత్తుకెళ్లిపోతారు. అలియాతో పాటు, మరి కొంతమంది పిల్లలను కూడా కిడ్నాప్ చేసి బ్యాంకాక్ తరలిస్తారు. ఆ గ్యాంగ్‌ను అధికారికంగా పట్టుకోలేమని అందుకు సాయం చేయమని శివమ్‌ను కోరతాడు ఇంటర్‌పోల్ ఆఫీసర్ సమ్రత్ (అతుల్ కుమార్). మరి బ్యాంకాక్ వెళ్లిన శివమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ ముఠా నుంచి అలియా సహా చిన్నారులను శివమ్ విడిపించడానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? ఈ క్రమంలో పరిచయమైన జారా (దిశా పటానీ) ఎవరు?మానవ అక్రమ రవాణా చేస్తున్న సికిందర్ (అనిరుధ్ రావల్)కు జారాకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! Awarapan 2 review Telugu || ఒక మూవీకి సీక్వెల్ వస్తుందంటే, దానిపై

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ (Sai Marthand) మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చాయి. సాయి స్మరణ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. హరి నాకు మంచి మిత్రుడు. రమణా రెడ్డి పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఇది చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్లో ఈ సినిమా విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఆగస్ట్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరారు. ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఆర్టిస్టులందరూ సహజంగా అనిపిస్తున్నారు. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. హరి మంచి ఆర్టిస్ట్, సింగర్. ట్రైలర్ చాలా బాగుంది. మంచి బిర్యానీ వాసన వస్తోంది. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంకరేజ్ చేయండని అన్నారు. దర్శకుడు రమణా

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. ఇప్పటివరకు నాలుగైదు భాగాలుగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను సొంతం చేసుకున్న అనకొండ తరహా చిత్రాల మాదిరి ‘బివేర్ బోయునా’ (BEWARE BOIÚNA) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైక్ పి. నెల్సన్ (Mike P. Nelson) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెస్సికా రోతే, కియానా మదీరా, లోగాన్ మార్షల్-గ్రీన్, జాక్సన్ బ్యూస్, జువాన్ పాబ్లో షుక్, విల్ క్లోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఆక్టోబర్ 2న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఓ వైద్య బృందం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌కు వెళ్లగా అక్కడ అతి భయంకరమైన భారీ బోయునా సర్పం వారి వెంటాడుతుంది. ఈ క్రమంలో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితుల నడుమ వారు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారనేది ప్రధానాంశం. ఆ బోయినా వారి వెంట ఎందుకు పడింది చివరకు వారు బయట పడ్డారా లేదా అనే ఆసక్తికరమైన కథతో ఉత్కంఠభరిత సన్నివేశాలు, భయపెట్టే విజువల్స్‌తో సర్వైవల్ అంశాలను హారర్‌తో మిళితం చేస్తూ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది

తెలుగమ్మాయి శాన్వీ మేఘన కథానాయికగా, ఎలాన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ తెరకెక్కిచ్చిన తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కళ్యాణం. తెలుగమ్మాయి శాన్వీ మేఘన (Saanve Megghana) కథానాయికగా, ఎలాన్ (Elan) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ తెరకెక్కిచ్చిన తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కళ్యాణం (Pyaar Prema Kalyanam). డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రం తమిళంతో పాటు ఏక కాలంలో తెలుగు ఇతర భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిట్రైలర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫన్, ఫ్యామిలీ కథతో రూపొందించనట్లు అర్థమవుతోంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయం కాదని కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో అమ్మాయి అత్తగారింటికి వెళ్లే బదులు అబ్బాయే అత్తగారింటికి ఇల్లరికం వెళ్లడం అక్కడ అతను ఎదుర్కొన్న అనుభవాల నేపత్యంలో ఈ సినిమా సాగనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మీరూ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన కెరీర్లో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తనకు అలవాటైన మాస్ ఇమేజ్‌కు క్రమంగా దూరమవుతూ, తన వయసుకు తగ్గ పాత్రలు, కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న చిత్రమే ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘ఇరుముడి’ చిత్రం ట్రైలర్ బుధవారం విడుదల అయింది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో రవితేజను గతంలో కంటే భిన్నంగా, మరింత సహజమైన, తన వయసుకు తగ్గ పాత్రలో చూపించారు. కుటుంబం, భక్తి చుట్టూ సాగే కథ క్రమంగా యాక్షన్ వైపు మలుపు తిరుగుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో రవితేజ కొత్త లుక్, పాత్రలో కనిపించిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. తన మాస్ మహారాజా ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కొత్త తరహా పాత్రలను ఎంచుకోవాలనే రవితేజ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ఇరుముడి అఫీషియల్ తెలుగు ట్రైలర్ ఈరోజు ఘనంగా విడుదల అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 2 నిమిషాల 59 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల కావడం విశేషం. ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒక తండ్రి మరియు కూతురి మధ్య ఉండే బలమైన భావోద్వేగాల చుట్టూ ఈ కథ సాగుతుంది. శబరిమల ఐయప్ప స్వామి ఇరుముడి భక్తి నేపథ్యం ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రియా భవానీ శంకర్ మరియు బేబీ నక్షత్ర తమ నటనతో ఆకట్టుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విష్ణు శర్మ ఛాయాగ్రహణం మరియు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితంగా ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద రవితేజ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ద హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన అఫీషియల్ ట్రైలర్ ప్రమోషన్స్‌కు మరింత ఊపునిచ్చింది. జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ ప్లాన్ చేస్తున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ సినిమాలో కీలక

ఏ ఆడకూతురిలోనైనా నా కూతుర్ని చూసుకునే బలహీనత నాది.. దాని జోలికి రాకండి' అంటూ విలన్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇస్తున్నారు మాస్ మహారాజా రవితేజ 'ఏ ఆడకూతురిలోనైనా నా కూతుర్ని చూసుకునే బలహీనత నాది.. దాని జోలికి రాకండి' అంటూ విలన్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇస్తున్నారు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా భీమవరంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ తన పాత్ర, సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘నాకు ఒక బలహీనత ఉంది.. ఏ ఆడకూతురులోనైనా నా కూతురిని చూసుకుంటా' ఈ డైలాగ్‌లోనే కథ మొత్తం అర్థమైపోతుంది. ఎమోషనల్ గా సాగే కథ ఇది. భీమవరంలో ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. మీతో పాటు నేనూ ఈరోజే ట్రైలర్ చూశాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ‘ఇరుముడి’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇక భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలలు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం’’ అని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ఇరుముడి’లో మూడు ప్రధానమైన ముడులు ఉంటాయి. ‘‘ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి.. అలాగే సినిమాలో ఉన్న

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుడి కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 21న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పూర్తిగా ఇది శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తో, ఇంటెన్సిటీతో సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్ లో ఏం చూపించారనేది చూస్తే, రవితేజ కూతురు స్కూల్‌కి వెళ్తుంటుంది. ఆమెనే ప్రాణంగా బతుకుతుంటాడు రవితేజ. ఆయన ఆటో నడిపిస్తుంటాడు. ఆయన భార్య ప్రియా భవానీ శంకర్ నటించింది. రవితేజ ప్రతి ఏడాది అయ్యప్పస్వామి మాల ధరిస్తుంటాడు. అదే సమయంలో మాల లేనప్పుడు ఆల్కహాల్ బాగానే తీసుకుంటాడు. అదే ఓ సమస్యగా మారుతుంది. అయితే తన కూతురు ఐదో తరగతి పూర్తి చేసిందని చెప్పి ఫంక్షన్ కూడా చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆడపిల్లలకు ఆ ఊర్లో భద్రత లేదు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. వారి నుంచి రవితేజ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. తన ఒక్క కూతురునే కాదు, ఊర్లో అందరు ఆడపిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటాడు. మరి ఈ క్రమంలో చోటు చేసుకునే ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మాల వేసినప్పుడు పద్ధతిగా, భక్తితో ఉండే రవితేజ మాల తీస్తే మాత్రం శత్రువులకు యముడిగా మారిపోతుంటాడు. అయితే తండ్రిని చూసి ఓ దశలో కూతురు కూడా భయపడుతుంది. ఇలాంటి ఎమోషనల్ అంశాలు, యాక్షన్ అంశాలు, సెంటిమెంట్, ఫ్యామిలీ అంశాల మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. రవితేజ ఇటీవల నటిస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఓ వైపు భక్తిరస చిత్రంగా, మరోవైపు కూతురుని కాపాడుకోవడం కోసం తండ్రి పడే ఆరాటం, పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుంది. ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది

రవితేజ 'ఇరుముడి' ట్రైలర్ విడుదల. భక్తి, యాక్షన్ మేళవింపు కథ. ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్. Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం ‘ఇరుముడి(Irumudi Trailer)’. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకొని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు మేకర్స్ అధికారిక ట్రైలర్ ను విడుదల చేశారు. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ కంటెంట్ తో వచ్చిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. Chris Froggatt-Ileana: బ్రిటిష్ డ్రైవర్ ను పెళ్లి చేసుకున్న మలేసియా యువరాణి.. కౌలాలంపూర్‌లో రాయల్ వెడ్డింగ్.. పిక్స్ వైరల్ భక్తి, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు: తాజాగా విడుదలైన ట్రైలర్‌ను పరిశీలిస్తే.. శబరిమల అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యానికి పవర్ ఫుల్ యాక్షన్, బలమైన కుటుంబ భావోద్వేగాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. రవితేజ తనదైన మాస్ అప్పీల్‌తో పాటు ఒక భక్తుడిగా భిన్నమైన షేడ్స్‌లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ లిరికల్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆగస్టు 21న థియేటర్లలో సందడి: భక్తి వాతావరణం, శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ సమపాళ్లలో కుదిరిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హంగామా చేస్తుందో చూడాలి

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజయ్ సర్కారు నిఘా

ఇంటర్నెట్ డెస్క్: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఓటీటీలో పాపులారిటీ సొంతం చేసుకున్న ‘మీర్జాపూర్’ (Mirzapur).. ఇప్పుడు సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ‘మీర్జాపూర్ ది మూవీ’ (Mirzapur The Movie) పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఫర్హాన్ అక్తర్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ వల్లే దీన్ని సినిమాగా రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు స్పష్టం చేశారు. ‘‘2018లో మొదటి సీజన్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకులు దీనికి ఎంతో మద్దతుగా నిలిచారు. అమెజాన్ ప్రైమ్ దీనిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది. నేను ఎక్కడికి వెళ్లినా ‘మీర్జాపూర్’ కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందని అందరూ నన్ను అడిగేవారు. సినిమా ప్రకటన వచ్చిన తర్వాత కూడా విడుదల తేదీ గురించి ఆరా తీశారు. నిజానికి అభిమానుల కోరిక మేరకే ఈ సినిమాను తీసుకొస్తున్నాం. పాత తారాగణంతో పాటు కొత్త నటీనటులతో కలిసి దీనిని రూపొందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prabhas Kalki 2 Casting Call: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంచలన విజయం సాధించిన చిత్రం 'కల్కి 2898 AD'. సోషియో-ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కల్కి 2' అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే సువర్ణావకాశాన్ని కల్పిస్తూ మేకర్స్ ఒక కీలక ప్రకటన చేశారు. 'కల్కి సినిమాటిక్ యూనివర్స్' కోసం చిత్ర బృందం అధికారికంగా కాస్టింగ్ కాల్ ప్రకటించింది. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ బిగ్ స్క్రీన్ పై కనిపించే అద్భుతమైన అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు లేవు.. ప్రతిభే ముఖ్యం! ఈ కాస్టింగ్ కాల్‌కు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "నటులుగా రాణించాలనుకునే వారందరికీ ఇదొక చక్కని అవకాశం. 'కల్కి సినిమాటిక్ యూనివర్స్'లో భాగం అవ్వండి" అని పిలుపునిచ్చారు. ఈ ఆడిషన్‌కు సంబంధించి ఎలాంటి వయసు లేదా లింగ ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. కేవలం ప్రతిభ ఉంటే చాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పంపించాలని వైజయంతీ మూవీస్ పేర్కొంది. గతంలోనూ అదే పద్ధతి.. మొదటి భాగం 'కల్కి' సమయంలోనూ మేకర్స్ ఇలాగే కాస్టింగ్ కాల్ నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు

మాస్ మహారాజా రవితేజ, విజయవంతమైన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రబృందం ప్రమోషన్ల స్పీడు పెంచింది.ఈ క్రమంలో, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' థియేట్రికల్ ట్రైలర్ ను ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది."తన కుటుంబాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి విశ్వాసాన్నే తన అతిపెద్ద ఆయుధంగా మార్చుకుని చేసే ప్రయాణమే ఈ సినిమా" అంటూ విడుదల చేసిన ట్యాగ్‌లైన్, 'ఇరుముడి' అనే టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్‌తో కలిసి నిర్మిస్తోంది. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి

అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్‌తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్‌కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్‌తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్‌కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో.. మౌత్ టాక్‌తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్ నీకు ఫోన్ చేయలేదా? ఫ్రెండ్ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్. ఫ్రెండ్ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు నైట్ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్‌పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్ రోహిణి. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884831" align="alignnone" width="1280"] Gunde Ninda Gudi Gantalu Se[/caption] మనోజ్ ఫ్రెండ్ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్ స్టేషన్లో మనోజ్ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్‌కి వెళతాడు. ఎస్ఐ అరుణ్ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్‌ని అరెస్ట్ చేసారా అని

వాసవి గణేశ్, అన్ష్ తోరట్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'హుషారు పిట్టలు'. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం సందడి జరిగింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా.. బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం

యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ , పంపిణీ సంస్థలైన ఏషియన్, సురేష్ ఫిలింస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువతను మెప్పించే లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాన జోడీ అన్షు , వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, నటన, అలాగే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంభాషణలు చాలా సజీవంగా, యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. ఈ చిత్రానికి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగినట్లుగా ఉండి, సన్నివేశాల

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్ నీకు ఫోన్ చేయలేదా? ఫ్రెండ్ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్. ఫ్రెండ్ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు నైట్ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్‌పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్ రోహిణి. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884831" align="alignnone" width="1280"] Gunde Ninda Gudi Gantalu Se[/caption] మనోజ్ ఫ్రెండ్ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్ స్టేషన్లో మనోజ్ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్‌కి వెళతాడు. ఎస్ఐ అరుణ్ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్‌ని అరెస్ట్ చేసారా అని

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం టాక్సిక్ అధికారిక తెలుగు ట్రైలర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల కావడం జరిగింది. ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక డార్క్ స్టైలైజ్డ్ క్రైమ్ వరల్డ్ లో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. సుమారు 4 నిమిషాల 39 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో అత్యంత ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు మరియు లోతైన పాత్రల భావోద్వేగాలను చూపించారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న ఉత్సుకత రెట్టింపైంది. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ రయా మరియు టికెట్ అలియాస్ రుమి అనే తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో కనిపిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి రాజీవ్ రవి ఛాయాగ్రహణం అందించగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. దీనికి అదనంగా విశాల్ మిశ్రా మరియు తనిష్క్ బాగ్చీ కూడా స్వరాలు అందించారు. ఫలితంగా ట్రైలర్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ చాలా పవర్ఫుల్ గా వచ్చాయి. ఈ నేపథ్యంలో నేర ప్రపంచంలో సాగే పవర్ స్ట్రగుల్స్, ద్రోహం మరియు తండ్రీకొడుకుల మధ్య ఉండే విభిన్నమైన సంబంధాలను గీతు మోహన్‌దాస్ చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఈ కథను గీతు మోహన్‌దాస్ తో కలిసి యశ్ స్వయంగా సహ రచయితగా అందించడం చిత్ర ప్రత్యేకతను మరింత పెంచింది. పెద్దల కోసం రూపొందించిన ఫెయిరీ టేల్ అనే సబ్‌టైటిల్ కి తగ్గట్టుగానే ట్రైలర్ లోని ప్రతి దృశ్యం అత్యంత విభిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన కొత్త సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ లాంచ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆగస్టు 8, 9 తేదీలలో నిర్వహించిన ఈ వేడుకలో ఆయన చిత్రంలో నటించిన నటీనటులందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ చిత్రంలో నటి కియారా అద్వాణీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్‌లతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ వేడుకలో మాట్లాడిన యశ్, ఈ సినిమా కోసం నటీనటులను తీవ్రంగా శ్రమపెట్టినందుకు తానంతట తాను క్షమాపణ కోరుకుంటున్నట్లు వేదికపై నుంచి ప్రకటించారు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యశ్ కథా రచయితగా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు ఆంగ్ల భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు. చిత్రం కోసం నటీనటులందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారని యశ్ ఈ వేదికపై కొనియాడారు. ముఖ్యంగా 'తబాహి' పాట విషయంలో నటి కియారా అద్వాణీ ప్రదర్శనపై వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి నటుడు కూడా సినిమా కోసం తమవంతు ఉత్తమ ప్రతిభను కనబరిచారని చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులందరినీ చాలా కష్టపెట్టామని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. "టాక్సిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి నేను ఒక మాట ఇస్తున్నాను. ఈ సినిమా విడుదలైన తర్వాత మీ అందరినీ ప్రేక్షకులు సరికొత్త కోణంలో చూస్తారు. మిమ్మల్ని షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పెట్టినందుకు నిజంగా క్షమించండి" అని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అహంకారాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చారని యశ్ ప్రశంసించారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nayanthara:యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోంది. తాను సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌కు ఎందుకు హాజరుకానో నయనతార ఈ కార్యక్రమంలో వివరించారు. ప్రమోషన్స్ అంటే తనకు ఇష్టం లేదని కాదు.. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు అంత సౌకర్యంగా అనిపించదని చెప్పారు. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం యష్ కారణంగా తాను ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చానని నయనతార చెప్పారు. యష్ తనకు ఫోన్ చేసి అడిగిన తర్వాత ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యష్‌ను మొదటిసారి కలిసిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన నయనతార.. యష్‌ను కలిసినప్పుడు మాత్రం అతని వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా అనిపించిందన్నారు. అతని లార్జర్-దెన్-లైఫ్ ఇమేజ్ చూసి, తాను ‘రాకీ భాయ్ రాజ్యంలోకి వెళ్తున్నానా?’ అని అనుకున్నానని సరదాగా చెప్పారు. అంతేకాదు, యష్ కష్టపడి పనిచేసే విధానాన్ని నయనతార ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఇంతగా శ్రమించే నటుడిని చూడలేదని అన్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు యష్ తన సమయం, శక్తిని ‘టాక్సిక్’ సినిమాకు కేటాయించారని చెప్పారు. చివర్లో తన మనసులోని మాటలన్నీ చెప్పేశానని గుర్తించిన
బ్లాక్‌బస్టర్ 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న వేళ మేకర్స్ తాజాగా బెంగళూరులో గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్లో 'టాక్సిక్' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్లకు, బహిరంగ వేడుకలకు దూరంగా ఉండే నయన్.. ఊహించని విధంగా 'టాక్సిక్' ఈవెంట్‌కు హాజరుకావడం చర్చనీయాంశమైంది.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్ఈవెంట్లకు రాకపోవడానికి కారణం ఇదేఈ వేదికపై నయనతార మాట్లాడుతూ... తానెందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంటానో వివరించారు. వేదికలపై సరిగ్గా మాట్లాడటం రాకపోవడమే అందుకు ప్రధాన కారణమని, అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉంటానని ఆమె తెలిపారు. అయితే 'టాక్సిక్' చిత్రం తనకు అత్యంత ప్రత్యేకమైనదని, హీరో యష్ కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ చేసి ఆహ్వానించడంతో ఆయన మాటను కాదనలేక వచ్చానని పేర్కొన్నారు. అలాగే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కథను మలిచిన తీరు, ప్రొడక్షన్ విజన్, నటీనటులను సెట్స్‌లో చూసుకున్న విధానం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. తోటి నటీమణులు కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ల ప్రతిభను కూడా నయన్ అభినందించారు.యష్ డెడికేషన్‌పై ప్రశంసలుహీరో యష్ శ్రమను కొనియాడుతూ నయనతార ఎమోషనల్‌కు గురయ్యారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎందరో సూపర్స్టార్లతో కలసి పనిచేసినప్పటికీ, యష్ అంతటి కష్టపడే మనస్తత్వం ఉన్న నటుడిని చూడలేదని అన్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం యష్ తన జీవితంలో దాదాపు నాలుగున్నరేళ్ల కాలాన్ని, కుటుంబంతో గడిపే అమూల్య సమయాన్ని త్యాగం చేశారని తెలిపారు. యష్ కష్టానికి ఆయన సతీమణి రాధిక అందించిన

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vishal Makutam: ఇప్పటికే ‘మకుటం’ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్లో యాక్షన్, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను కలిపి చూపించారు. ట్రైలర్ మొదట్లోనే విశాల్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. ఆ తర్వాత కథ కుటుంబ భావోద్వేగాల వైపు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా విశాల్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ప్రతి పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్ సన్నివేశాలు ఉండగా, యువతను మెప్పించేలా లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు కూడా సినిమాలో మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో విశాల్ చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లింగా, కృపాకర్ పాత్రల్లో ఆయన చెప్పే డైలాగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చే సన్నివేశం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో ప్రత్యేకంగా కనిపించింది. రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరా పనితనం యాక్షన్ సన్నివేశాలను మరింత గ్రాండ్‌గా చూపిస్తోంది. దిలీప్ సుబ్బరాయన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Toxic trailer review: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్ సినిమాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ ప్రారంభం నుంచే టాక్సిక్ ప్రపంచం ఎంత డార్క్‌గా ఉండబోతుందో చూపించారు. దిస్ వాస్ సపోజ్డ్ టు బి మై ఫెయిరీ టేల్ అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. యశ్ స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్లో భారీ గన్ ఫైట్స్, అగ్నిప్రమాదాలు, ఛేజింగ్ సన్నివేశాలు, సర్కస్ బ్యాక్‌డ్రాప్, మంచుతో నిండిన లొకేషన్స్ వంటి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను దర్శకురాలు గీతు మోహన్‌దాస్ చాలా డార్క్ టోన్‌లో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్ కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన టోన్‌ను తీసుకొచ్చాయి. ఇక కియారా అద్వానీ కూడా ట్రైలర్లో తన గ్లామరస్ లుక్‌తో పాటు కీలకమైన పాత్రలో కనిపించారు. యశ్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా పెరిగింది. మరోవైపు నయనతార పాత్ర సినిమాకు మరో కీలక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఆమెను పవర్ఫుల్ డాన్ పాత్రలో

హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్నతొలి చిత్రం ‘మకుటం’పై ఏర్పడిన హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఫుల్ యాక్షన్ మోడ్‌తో ట్రైలర్ ఓపెన్ చేయడం.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్‌కి షిఫ్ట్ అవ్వడం.. మూడు డిఫరెంట్ గెటప్స్‌లో విశాల్ తన మాడ్యులేషన్‌ను చూపిస్తుండటం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. మాస్‌కి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్, యూత్‌కి కావాల్సిన లవ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ‘ఆ సరుకుని నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వను రా’ అనే డైలాగ్‌ను లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పిన తీరు అద్బుతంగా ఉంది. ట్రైలర్లో చివరి షాట్ మాత్రం హైలెట్ అయ్యేలా ఉంది. రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం కెమెరా వర్క్ అదిరిపోయింది. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక జీవీ ప్రకాష్ పాటలు, ఆర్ఆర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేట్టు ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది. ఇక ఆగస్ట్ 14న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప’రామాయణ: పార్ట్ 1′ (Ramayana: Part 1) ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ‘రామాయణ’ ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్టార్ కాస్టింగ్ ట్రైలర్‌కు మరో పెద్ద బలంగా మారింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి VFX, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ‘రామాయణ: పార్ట్ 1’ పై అంచనాలు మరింత పెరిగాయి. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్ఈజీ (DNEG), యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది

Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా యశ్‌ను సరికొత్త లుక్, పాత్రలో చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘టాక్సిక్’ ట్రైలర్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ట్రైలర్లో యశ్ పాత్ర ఎలా ఉండబోతుంది? కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే విషయాలపై ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని వెంకట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె నారాయణతో కలిసి హీరో యష్‌కు చెందిన మన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో సోషల్ మీడియాలో #ToxicTrailer ట్రెండ్ అవుతోంది. సాయంత్రం 7:01 గంటలకు ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి