తిరుమలశ్రీవారి మెట్లపై సిగరెట్ తాగినవ్యక్తి.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల కొండ హిందువులకు పరమ పవిత్రమైనది. తిరుమల కు వచ్చే భక్తులు కనీసం ప్లాస్టిక్ కూడా లోపలికి తీసుకురాకూడదు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ప్రతీ వస్తువును చెక్ చేసి మరీ పంపిస్తారు. అయినప్పటికీ కొందరు అక్రమ మార్గంలో నిషేధిత వస్తువులను కొండపైకి తీసుకెళ్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై టీటీడీ కూడా రియాక్ట్ అయింది.తిరుమల కొండపై ధూమపానం, మద్యపానం తీవ్ర నిషేధం. అయినప్పటికీ భద్రతా తనిఖీలు దాటుకుని కొందరు వ్యక్తులు అక్రమ మార్గంలో వాటిని కొండపైకి తీసుకువస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి పవిత్రమైన శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ వెళ్తుంటారు. అదే ప్రాంతంలో ఒక వ్యక్తి కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీన్ని కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ శ్రీవారి భక్తులు కోరారు.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శ్రీవారి మెట్ల మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. దాంతో అధికారులు సిగరెట్ తాగిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం.. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్లు , దేవస్థానానికి చెందిన ఇతర ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించడం పూర్తిగా నిషేధం అని టీటీడీ అధికారులు తెలిపారు.నిషేధం అని తెలిసినప్పటికీ సదరు వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా నడక మార్గంలో ధూమపానం చేయడం హేయమంటూ టీటీడీ పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారి కొండపై