తిరుమలశ్రీవారికి కాసుల వర్షం.. ఒక్కరోజులోనే హుండీకి రికార్డ్‌స్థాయిలో ఆదాయం, ఎన్ని కోట్లంటే
తిరుమల శ్రీవారి దర్శనానికి ఐదారు నెలలుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి నెల నుంచి భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దీ కనిపిస్తోంది. ఐదారు నెలలుగా రోజువారీ 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. చాలా కాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనా సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది. ఈసారి మాత్రం సాధారణ రోజులోనే భారీగా ఆదాయం రావడం విశేషం.మంగళవారం తిరుమల శ్రీవారిని 80,905మంది భక్తులు దర్శించుకున్నారు.. 33,539 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ.6.12 కోట్లు ఆదాయం వచ్చింది. మంగళవారం రోజు 4.16 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా.. అన్నప్రసాదాలను 2.88 లక్షలమంది స్వీకరించారు. తిరుమలలో 3546మంది భక్తులు వైద్య చికిత్స పొందారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది.శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలుతిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది.. భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ధాటీపంచకం అందిస్తుందని భద్రాచలానికి చెందిన స్థలశాయీ స్వామి అన్నారు. దాశరథి