
షావుకారు' జానకి కన్నుమూత
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో నటిగా తనదైన ముద్రవేశారామె. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. ఆమె తల్లి దండ్రులు శచీదేవి, టేకుమళ్ళ వెంకోజీరావు. తండ్రి రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్ పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు. వారిలో ఒకరు ప్రముఖ నటి కృష్ణకుమారి. తండ్రి ఉద్యోగరీత్యా 1944లోనే జానకి కుటుంబంతో మద్రాసు చేరారు. అక్కడ ఆలిండియా రేడియోలో ఆమె చిన్న పిల్లల కార్యక్రమంలో పాల్గొనే వారు. ఆ రకంగా సినిమా రంగంతో జానకి కుటుంబానికి పరిచయాలు ఏర్పడ్డాయి. 1947 నవంబర్ 5న ఆమెకు శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. ఆ తర్వాతే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. విజయవారి 'షావుకారు' సినిమాతో 1950లో సినీరంగ ప్రవేశం చేసిన జానకి వివిధ భాషల్లో దాదాపు 380 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే'. 'షావుకారు' జానకి పేరు వినగానే ముందుగా ఆమె గళం గుర్తుకు వస్తుంది. గాయని కాకపోయినా, ఆమె గాత్రం నుండి జాలువారిన మాటలు వినసొంపుగా ఉండేవి. ఆ గళమహిమతోనే చిత్రసీమలో జైత్రయాత్ర చేశారు జానకి. విజయా సంస్థ ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో నిర్మించిన 'షావుకారు' చిత్రంతో చిత్రసీమలో అడుగు పెట్టిన జానకి, నాటి మేటి నటీనటుల సరసన తొలి సినిమాతోనే దీటుగా నటించి భళా అనిపించుకున్నారు జానకి. అందువల్లే 'షావుకారు' టైటిలే జానకి ఇంటిపేరుగా మారింది. పాత్ర ఏదైనా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం షావుకారు జానకి