
Sun Transit 2026: మరో వారంలో వీరికి జాక్‌పాట్..! కెరీర్లో పురోగతి, చేతిలో డబ్బు
Sun Transit 2026: మరో వారంలో వీరికి జాక్‌పాట్..! కెరీర్లో పురోగతి, చేతిలో డబ్బు
© 2026 nimisham.in

Sun Transit 2026: మరో వారంలో వీరికి జాక్‌పాట్..! కెరీర్లో పురోగతి, చేతిలో డబ్బు

Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్‌లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్‌మార్క్‌లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్‌గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్‌గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!. ఆ సన్‌గ్లాస్ ప్రత్యేకత ఇది.. ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్‌కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్‌గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్‌కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్‌గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్‌ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె. (చదవండి: క్లౌడ్ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్‌ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్‌లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు ఆగస్టు 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చనున్న ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామస్తులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ముందు నుంచే ఆగస్టు నెలాఖరుకు నీళ్లు విడుదల చేస్తామని, గ్రామాలు ఖాళీ చేయాలంటూ ముంపు గ్రామాల ప్రజలకు చెబుతూ వచ్చింది. కానీ, కొందరు ఇంకా ఆ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయలేదు. అయితే, ఇప్పుడు నీటిని విడుదల చేయడంతో ముంపు గ్రామాలకు ప్రభుత్వం రాకపోకలను నిలిపివేసింది.READ ALSO 'వెలిగొండ'లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు! వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల , కలనూతల, గుండంచర్లకు వెళ్లే మార్గాన్ని అధికారులు నిలిపివేశారు. అయితే, గ్రామాల్లోని తమ ఇళ్లల్లో కొన్ని లక్షల రూపాయల సామాన్లు ఉన్నాయని.. బర్రెలు, గొర్రెలు కూడా అక్కడే వదిలేశామని.. వాటిని తీసుకొచ్చుకోవడానికి చివరి అవకాశం ఇవ్వాలంటూ ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. కానీ, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించకపోవడంతో పుచ్చకాయలపల్లి- సుంకేసుల మధ్యలోని కొండవద్దే పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నల్లమల సాగర్‌కు వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 31వ తేదీన రెండు టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి సమయంలో ఒక బొలెరో వాహనం సుంకేసుల - కలనూతల రోడ్డు మార్గం నుంచి వస్తూ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గల్లంతవగా.. అందులోని ముగ్గురు దగ్గరలోని చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు, మరో వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియలేదు.నీటి ప్రవాహానికి బొలెరో కొట్టుకుపోయిందని, నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారన్న వార్తలు రావడంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, మార్కాపురం డీఎస్పీతో పాటు స్థానిక

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు. ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు

Glenn Phillips One Handed Catch Video: క్రికెట్లో క్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. మ్యాచ్ లను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి క్యాచ్ లు పట్టేందుకు ఫీల్డర్లు తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెడుతుంటారు. ఈక్రమంలో కొన్ని క్యాచ్‌లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. పట్టిన ఆటగాడే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అలాంటి అద్భుతమే చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. క్యాచ్ పూర్తయిన తర్వాత ఫిలిప్స్ కూడా కొద్దిసేపు నమ్మలేకపోవడం గమనార్హం. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. గయానా తొలుత 186 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో ట్రిన్‌బాగో 17/0తో ఉన్న సమయంలో డ్వేన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా ఆడాడు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! బంతి డీప్ మిడ్ వికెట్ వైపు వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్‌కు అది సిక్సర్‌గా వెళ్లేలా కనిపించింది. అయితే లాస్ట్ మినిట్ లో అతడు కుడివైపు కదులుతూ ఒక్కసారిగా తన కుడి చేతిని గాల్లోకి చాపాడు. అంతే.. గాల్లో దూసుకెళ్తున్న బంతి అతడి చేతిలో పడిపోయింది..! క్యాచ్ అందుకున్న వెంటనే ఫిలిప్స్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను పట్టిన క్యాచ్‌ను తానే నమ్మలేకపోయినట్లు అతడు కొద్దిసేపు ఆశ్చర్యంగా నిల్చుని చూస్తుండిపోయాడు. క్యాచ్ వీడియోను సీపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అభిమానులు ఈ ఫీట్‌ను చూసి ఫిలిప్స్‌ను మరోసారి ‘సూపర్‌మ్యాన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు.. A

గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రాక్టీస్ సమయంలో అతడికి తాజాగా కాలికి గాయం అయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల భారత్-అఫ్గానిస్తాన్ T20 సిరీస్‌కు అతడు దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తూ పునరావాసం పొందాడు. ఆ తర్వాత అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని క్రికెట్ వర్గాలు కూడా అధికారికంగా నిర్ధారించాయి. అయితే ఇటీవల నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కాలికి ఊహించని రీతిలో మళ్లీ గాయం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించిన హార్దిక్ ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ప్రాక్టీస్ గాయం ప్రభావం వల్ల అతడు రాబోయే T20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13న మొదటి T20, సెప్టెంబర్ 15న రెండో T20, సెప్టెంబర్ 17న మూడో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఫలితంగా అఫ్గానిస్తాన్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వచ్చిన నివేదికల్లో హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈరోజు ప్రాక్టీస్ గాయం వార్త బయటకు రావడంతో ఎంపిక సమీకరణాలు మారాయి. ఈ వారంలోనే అఫ్గానిస్తాన్ T20 సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా లేకపోతే అతడి స్థానంలో మరొక ఆల్ రౌండర్‌ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. భారత జట్టు ముఖ్యమైన సిరీస్‌కు సిద్ధమవుతున్న

వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ఫేజ్-1ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సభా వేదికపై వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య(Poola Subbaiah) కుమార్తెలు విలాసిని ( Vilasini), సునందన (Sunandana)ను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని, చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని పూల సుబ్బయ్య కుమార్తెలు అన్నారు. తన తండ్రిని, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని విలాసిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాళ్లకు వారు నమస్కరించారు. తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు

వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మాజీ గవర్నమెంట్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీలోని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అమెరికా వెళ్లేందుకు పచ్చజెండా ఊపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో ఉండేందుకు కోర్టు కాలపరిమితిని నిర్దేశించింది. దీంతో భాస్కర్ రెడ్డి తన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా, విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు కొన్ని కఠినమైన షరతులను విదేశీ పర్యటన కోసం విధించింది. అమెరికా పర్యటన సమయంలో తాను ఉండే చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలను కోర్టుకు తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందే నిర్ణీత ఫిక్స్డ్ డిపాజిట్లు, సెక్యూరిటీలను కోర్టులో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా, అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు అప్పగించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇదే కేసులో ఉన్న మరో నిందితుడు కారుమూరి సునీల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. గతంలో కూడా అనగా జూలై నెలలో ఏసీబీ కోర్టు జడ్జి ఎల్. తేజోవతి చెవిరెడ్డికి విదేశీ ప్రయాణ అనుమతి ఇచ్చారు. జూలై 27 నుంచి ఆగస్టు 4 మధ్య అమెరికా వెళ్లేందుకు అప్పట్లో అవకాశం కల్పించారు. ఆగస్టు 7వ తేదీ లోపు కోర్టులో

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే
2.75/5తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ - న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ నటీనటులు - సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్, తదితరులు... సినిమాటోగ్రఫీ - నాని ఐయివెల్లి, ఎడిటర్ - ఆనంద్ పవన్ ప్రొడక్షన్ డిజైనర్ - దేవర మధుకర్, సంగీతం - వసంత్ ఇసైపెట్టై పాటలు - శ్రీరామ్ తపస్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరేంద్ర చారి CEO - శ్రీనివాస్ నల్లగంట్ల, రోహిణి స్టూడియోస్ ప్రొడ్యూసర్స్ - ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర స్క్రిప్ట్, డైరెక్షన్ - ఆనంద్ చంద్ర విడుదల తేది : 21.08.2026 నిడివి : 1 ఘంట 57 నిముషాలు సునీల్, 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేం అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఫైట్ మహా". 'కలలు నిజమైతే నిజం ఎవరిది' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నిజజీవిత కథ 'మర్డర్' చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 21న ధియేటర్ లలో విడుదల అయ్యింది

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించి గెస్ట్ లిస్ట్ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లను మాత్రమే ఆహ్వానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇతర ప్రధాన స్టార్లకు ఆహ్వానాలు అందలేదనే వార్త అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి వివాహబంధం గురించిన వార్తలు 2025 నుంచే నిరంతరం ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తలను సాధారణ సరదా పోస్ట్‌తో కొట్టిపారేశాడు. అయితే 2026 జూన్ నెలలో అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టంగా వెల్లడించారు. కావ్య మారన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ వీరి వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ధృవీకరించారు. అనంతరం ఆగస్టు నెలలో పలు సంస్థలు దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే గ్రీస్‌లో పెళ్లి జరగనుందని కథనాలను ప్రచురించాయి. దక్షిణాది చిత్రసీమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనిరుధ్ అతిథుల జాబితాను పరిమితం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విజయ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులతో అనిరుధ్‌కు అత్యంత బలమైన కెరీర్ సంబంధాలు మరియు హిట్లు ఉన్నాయి. దీంతో కొందరికే ఆహ్వానం అందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేవలం రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్‌లను మాత్రమే పిలవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అనిరుధ్‌కు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ విచ్చేశారు. ఇక ఈ వివాహానికి పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరైనప్పటికీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరుకా లేకపోయారు. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్‌లోని బండ్ల గణేష్ నివాసానికి స్వయంగా వెళ్లిన సునీతకు, గణేష్ దంపతులు సాదరంగా ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత నూతన వధూవరులకు ధర్మవరం పట్టు వస్త్రాలు బహుకరించి, వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కాసేపు సరదాగా, ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత నేత పరిటాల రవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నాడు. ఐకానిక్ సినిమా శ్రీరాములయ్య చిత్రంలో నటించే సమయం నుంచే పరిటాల కుటుంబంతో తనకు ఎంతో గాఢమైన బంధం ఏర్పడిందని, పరిటాల రవితో గడిపిన రోజులు ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని గణేష్ భావోద్వేగంగా వెల్లడించాడు. దశాబ్దాలు గడుస్తున్నా తమ కుటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఇలాగే కొనసాగడం పట్ల ఇరు వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా బండ్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీతగారు ఈరోజు ప్రత్యేకంగా మా

హైదరాబాద్ నగరంలోని సున్నం చెరువు రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మురికికూపంగా, దుర్వాసనతో అల్లాడిన ఈ చెరువును 'హైడ్రా' సుందర సరోవరంగా తీర్చిదిద్దుతోంది. త్వరలోనే ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.ఒకవైపు బోరబండ బస్తీ, మరోవైపు ఐటీ కారిడార్ మధ్య ఉన్న ఈ చెరువు గతంలో ఆక్రమణల కారణంగా కేవలం 14.20 ఎకరాలకు కుంచించుకుపోయింది. అయితే, హైడ్రా అధికారులు నివాస గృహాలను ఏమాత్రం ప్రభావితం చేయకుండానే, కేవలం కబ్జాలను తొలగించి చెరువును తిరిగి 30.5 ఎకరాలకు విస్తరించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో పాటు, సుమారు 3 మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ఫలితంగా దుర్వాసన మాయమై, పరిసర ప్రాంత ప్రజలకు ఉపశమనం లభించింది.చెరువు ఆవరణలోని ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను కూడా హైడ్రా చేపట్టింది. ఆలయ కమిటీ ప్రతినిధుల సూచనల మేరకు గోపురం, ప్రదక్షిణ మార్గం, భక్తులు కోసం మార్బుల్ గెజిబో వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. కాగా, ఈ ఆలయాన్ని తొలగిస్తున్నారంటూ కొందరు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను తాము స్వాగతిస్తున్నామని వారు స్పష్టం చేశారు.చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం క్రీడా స్థలాలు, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు బోటింగ్ సౌకర్యం, సోలార్ లైటింగ్, పటిష్ఠమైన ఫెన్సింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో చెరువు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత .. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి వెళ్లారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం గత ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సునీత తనయులు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే కొన్ని కారణాల వలన పరిటాల సునీత బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు.. ఫిల్మ్ నగర్‌లోని బండ్ల గణేష్ నివాసానికి పరిటాల సునీత వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కుటుంబం.. పరిటాల సునీతకు సాదర స్వాగతం పలికింది. అనంతరం బండ్ల గణేష్ కుమార్తె, అల్లుడికి పరిటాల సునీత.. ధర్మవరం పట్టువస్త్రాలు అందించి ఆశీర్వదించారు. బండ్ల గణేష్ కుటుంబసభ్యులతో కాసేపు ఆత్మీయంగా గడిపారు. శ్రీరాములయ్య సినిమా అప్పటి నుంచి పరిటాల కుటుంబంతో బండ్లగణేష్‌కు అనుబంధం ఉంది.పరిటాల సునీత తమ ఇంటికి వచ్చిన విషయాన్ని బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఫోటోలను పంచుకున్నారు. "మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీత ఈరోజు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి, నా కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి వెళ్లడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు చల్లగా, చక్కగా, ఆనందంగా ప్రజా సేవ చేస్తూ, పరిటాల రవన్న పేరును ఇంకా చిరస్థాయిగా నిలిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. వదినమ్మ అని పిలవడంతోనే పరిటాల కుటుంబానికి, బండ్ల గణేష్‌కు ఉన్న అనుబంధం తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్ట్ 16వ తేదీ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల 58 నిమిషాలకు వరుడు సూర్యతేజ.. జననిమూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్-2 చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అలా బోలేలో (Ala Bolelo Lyric Video) అంటూ సాగే ఈ హుషారైన పాటకు శ్రీనివాస మౌళి (Srinivasa Mouli) సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఆలపించాడు. జైలర్ మొదటి భాగంలో తమన్నాపై చిత్రీకరించిన పాట దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా పూర్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఆ పాట అంచనాలను అందుకునేంతగా ఏ కోశానా కనిపించడం లేదు. డ్యాన్స్ మూవ్స్ అన్నీ ఎక్ట్రాన్డినరీగా ఉన్నప్పటికీ ట్యూన్ అంతగా క్యాచీగా లేకపోవడంతో జనాలకు ఆడియన్స్‌కు అంతగా ఎక్కేలా లేదు. ఇదిలాఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీని అక్టోబరు 15వ తేదీన విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా..చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా.. August 21 Jyothi Gadda సరైన నిద్ర అవసరం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా 8 నుంచి 9 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం వల్ల చర్మ కణాలు పునరుజ్జీవనం పొంది ముఖం యవ్వనంగా, ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం: రోజువారీగా తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడి, ఎల్లప్పుడూ తేమగా, సాఫ్ట్‌గా ఉంచుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ వాడకం: ఎండలో బయటకు వెళ్లే సమయంలో కంపల్సరీగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఇది సూర్యుడి హానికరమైన యూవీ (UV) కిరణాల వల్ల చర్మం నల్లబడకుండా, మచ్చలు పడకుండా కాపాడుతుంది. రోజూ వ్యాయామం చేయడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది చర్మానికి తగినంత ఆక్సిజన్, పోషకాలను అందించి సహజమైన మెరుపును తీసుకొస్తుంది. పోషకాహారం తీసుకోవడం: విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, పచ్చని కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం అంతర్గతంగా మెరుగుపడుతుంది. విటమిన్ సీ, ఒమేగా-3: విటమిన్ సీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు చర్మాన్ని మృదువుగా మార్చి, ముడతలు పడకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం: తీవ్రమైన ఒత్తిడి చర్మంపై ముడతలు, పింపుల్స్ తెస్తుంది. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి, చర్మ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది. సహజసిద్ధమైన ప్యాక్‌లు: వంటింట్లో లభించే పసుపు, ఉసిరి, తేనె, కలబంద వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను వాడటం వల్ల ఎలాంటి కెమికల్స్ దుష్ప్రభావాలు లేకుండా ముఖం తాజాగా మారుతుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచడం: రోజుకు రెండుసార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది దుమ్ము, ధూళి, జిడ్డును తొలగించి చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా శ్వాస పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది. ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది. నిజానికి జానకికి తొలి అవకాశం కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన 'గుణసుందరి కథ'కు వచ్చింది. అదెలాగంటే... మద్రాసు ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య, వింజమూరి సీతాదేవి, టి.జి. కమలాదేవి, తెన్నేటి హేమలత, ఎ.పి. కోమల, కొంగర జగ్గయ్య, సిహెచ్. నారాయణరావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి తదితరులతో పిన్న వయసులోనే జానకి పలు కార్యక్రమాలలో పాల్గొనేది. మొదటి నుంచి ఆమె వాచకానికి మంచి గుర్తింపు ఉండేది. ఒకసారి రేడియోలో జానకి వాయిస్ విన్న బి.ఎన్. రెడ్డి డైరెక్ట్ గా రేడియో స్టేషన్ కు వచ్చేశారు. జానకిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ తర్వాత ఒకసారి బుచ్చిబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న బి.ఎన్. రెడ్డి జానకిని చూసి 'నువ్వెవరి పిల్లవు?' అని ప్రశ్నించారు. టేకుమళ్ళ వారమ్మాయిని'ని అని జానకి బదులిచ్చింది. 'సినిమాల్లో వేషం వేస్తావా' అని ఆయన అడిగేతే, మా నాన్నగారు పళ్ళు రాలగొడతారు... అని సమాధానం ఇచ్చింది జానకి. అప్పట్లో ఆయన 'గుణసందరి కథ' సినిమా తీస్తున్నారు. హీరోయిన్ గా అడిగితే, తండ్రి భయంతో ససేమిరా అనేసింది జానకి. అప్పటికి ఆమెకు కేవలం 15 సంవత్సరాల వయస్సే. ఆ తర్వాత ఆ పాత్రను ఎందుకు వదులుకున్నానా? అని బాధపడింది జానకి. 1947 నవంబర్ 5న ఆమె వివాహం శంకరమంచి శ్రీనివాసరావుతో అయ్యింది. ఆయన రేడియో ఇంజనీర్. అయితే ఆస్తిపంపకాలలో జరిగిన అన్యాయంతో శ్రీనివాసరావు వివాహానంతరం ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో జానకి మనసు సినిమాలవైపు మళ్ళింది. దాంతో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నయనతార (Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్.సి. ఇందులో నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో రెజీనా, నయనతార, మీనా, కుష్బూ, తదితరులు ఉన్నారు. నయనతార పాత్రకు ఎదురు నిలిచే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఇప్పటివరకు కనిపించని డార్క్ అవతార్‌లో రెజినా సర్ప్రైజ్ చేయనుందట. దర్శకుడు సుందర్.సి ఆమె పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. రెజీనా కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటిగా నిలవబోతుందని తెలిసింది. గతంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఈ క్యారెక్టర్లో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక నయనతార, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. దీంతో ‘మూకుత్తి అమ్మన్ 2’లో హీరోయిజంతో పాటు హీరోయిన్ వర్సెస్ యాంటీ హీరోయిన్ తరహా ఆసక్తికరమైన కాన్ఫ్లిక్ట్ను కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. నయనతార స్టార్ పవర్‌కు రెజీనా డార్క్ పెర్ఫార్మెన్స్ తోడైతే ‘మూకుత్తి అమ్మన్ 2’ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రెజీనా ఏ రేంజ్లో తన పాత్రను పండించిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి

బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్ రాణి స్వర్ణకర్‌ను రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారంటూ ఓ వార్త బాంబ్లా పేలింది. ఈ బాంబ్ పేల్చింది ఎవరో కాదు.. గోవింద సతీమణి సునీతనే!. ముంబైలో నటి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతున్న గోవిందా భార్య సునీతతో ఫోన్ కలిపారు. ఈ సంభాషణలో తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సునీత ప్రస్తావించారు. ఇదే సమయంలో గోవింద, కోమల్ రాణి పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆమె చెప్పారు. “నేను నిన్నే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాను. అయితే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు” అని సునీత వ్యాఖ్యానించించారు. అదే సమయంలో కోమల్ రాణిని సునీత ‘చికెన్ టిక్కా’ అంటూ సంబోధించడం కూడా చర్చనీయాంశంగా మారింది. సునీతకు రాఖీ సలహా ఈ సందర్భంగా రాఖీ సావంత్ సునీతకు మద్దతుగా మాట్లాడారు. గోవిందకు సంబంధించినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ఆస్తిపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పక్కన పెట్టి ఆస్తులను తన పేరుపై భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు సునీత స్పందించగా.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గోవింద, కోమల్ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని బాంబ్ పేల్చారు. కింగ్ ఆఫ్ కామెడీగా.. బాలీవుడ్ నటుడు గోవిందా 90వ దశకంలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కూలీ నంబర్ 1’, ‘హీరో నంబర్ 1’, ‘రాజా బాబు’, ‘దుల్హే రాజా’ వంటి హిందీ చిత్రాల రీమేక్ వెర్షన్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. 1963 డిసెంబర్ 21న జన్మించిన ఆయన అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. ప్రస్తుతం ఆయన వయసు 62

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన అర్ధాంగి సునీత అహుజాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. విడాకుల కేసును వెనక్కి తీసుకున్న సునీత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త గోవిందా, నటి కోమల్ రాణి స్వర్ణాకర్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో వారి కుటుంబ గొడవ మరోసారి బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే.. ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న నటి రాఖీ సావంత్.. హఠాత్తుగా సునీత అహుజాకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. ఆ సమయంలో సునీత మాట్లాడుతూ.. "గోవిందా, కోమల్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు" అని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఇదే సమయంలో రాఖీ సావంత్ జోక్యం చేసుకుని, "విడాకుల కేసు వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి రూ.200 కోట్లు మీ పేరు మీద రాయించుకోండి, లేదంటే ఇతరులు దాన్ని తీసుకెళ్లిపోతారు" అని సునీతకు సలహా ఇచ్చారు.ఆగస్టు 19న గోవిందాపై పెట్టిన విడాకుల కేసును సునీత వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై గోవిందా మేనేజర్ శశి సిన్హా 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే ఉండాలి. కోర్టు వరకు వెళ్తే ప్రపంచానికి తెలిసిపోతుంది. అసలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఏముంది? కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజే కేసును వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు, అసలు దాన్ని ఎందుకు ఫైల్ చేశారు? ఈ పరిణామం నన్ను బాధిస్తోంది. మనం ఎందుకు నలుగురిలో

దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో... ధరలు పెంచిన రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స చిప్‌ల రేట్లు పెరగడమే ప్రధాన కారణమంటున్న కంపెనీలు న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్సెట్ల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరాఘాతం కారణంగా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనూ మొబైల్ కంపెనీలు రేట్లు పెంచడం గమనార్హం. దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఇప్పటికే మందగించాయని.. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసిక సేల్స్ క్రితం సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే బాగా తగ్గాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నోట్లో వెల్లడించింది. ఈ నెల 18 నుంచి రియల్మీ పలు మోడళ్ల రేట్లను రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. ఒప్పోకు చెందిన రెనో, ఏ సిరీ్‌సలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.5,000 వరకు ఎగబాకాయి. కొన్ని ప్రాంతాల్లో వివోకు చెందిన పలు మోడళ్లు రూ.500 నుంచి రూ.4,000 వరకు ప్రియమయ్యాయి. సామ్సంగ్ తన ఎస్, ఎం, ఎఫ్ సిరీ్‌సలోని ఎంపిక చేసిన ఫోన్ల ధరలను మరింత పెంచేసింది. గెలాక్సీ ఎస్25లో ఒక వేరియంట్ రేటు రూ.12,000 మేర పెరిగింది. వన్ ప్లస్ కూడా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను రూ.2,000-4,000 శ్రేణిలో పెంచింది. మెమొరీ, చిప్సెట్ల ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి అన్నారు. చిప్లతోపాటు మొబైల్ విడిభాగాల ధరలు పెరుగుతూనే పోతున్నాయని.. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల

గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అద్భుత ఫలితాలనిస్తుంటాయి. అలాగే ఆయా రాశులకు సంబంధించిన జాతక నక్షత్రాలు కలిగినవారికి కూడా అదేవిధంగా కలిసివస్తుంది. సెప్టెంబరు నెలలో ప్రధానంగా ఆరుద్ర, పుష్యమి, స్వాతి నక్షత్రాలలో జన్మించిన వారికి సాధారణ గోచార గ్రహ స్థితుల ఆధారంగా వారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.ఆరుద్ర నక్షత్రం (మిథున రాశి)దీనికి అధిపతి రాహువు. సెప్టెంబరు నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఐటీ, సమాచార ప్రసారాలు, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా తెలివితేటలతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ, ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి. చిన్నపాటి మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి ఉండే అవకాశముంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి.కుంభరాశి, మీన రాశి సెప్టెంబరు నెల జాతక ఫలంపుష్యమి నక్షత్రం (కర్కాటక రాశి)దీనికి అధిపతి శని దేవుడు. ఈ నెలలో స్థిరమైన ప్రగతి, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఈ సమయం అనుకూలం. ఆర్థిక స్థితి బలపడుతుంది. పాత బకాయిలు లేదా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ధనుస్సు రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలంస్వాతి నక్షత్రం (తులా రాశి)దీనికి అధిపతి రాహువు. కొద్దిపాటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చివరకు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కలసివస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ లేదా అలసట వంటి సమస్యలు

Hardik Pandya: ఐపీఎల్ 2027 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేసే అవకాశం ఉందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ముంబై ఇండియన్స్ తమ అధికారిక ఖాతాలో హార్దిక్ పాండ్యా నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విశ్లేషణలు మొదలు పెట్టారు. ఒక వర్గం ఈ పోస్ట్ ద్వారా పాండ్యాను జట్టులోనే ఉంచుకుంటున్నారని భావిస్తుంటే, మరో వర్గం మాత్రం ఇది కేవలం వీడ్కోలుకు ముందు ఇస్తున్న సంకేతమని కామెంట్లు పెడుతోంది. ముంబై జట్టుతో హార్దిక్ ప్రయాణంలో హెచ్చుతగ్గులు 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా, 2022 సీజన్ నాటికి గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి తొలి ఏడాదిలోనే ట్రోఫీ సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఆయనకు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. తర్వాతి ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లినప్పటికీ 9వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో కెప్టెన్‌గా హార్దిక్ స్థానంపై నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! ట్రేడింగ్ రూల్స్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లను బదిలీ చేసే ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పత్రిక మిడ్-డేకి రాసిన కథనంలో ఆయన ఐపీఎల్ ట్రేడింగ్ పారదర్శకతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అలా బోలెలో’ పాటను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ గతంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం తాజాగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో షామ్నా కాసిమ్ (పూర్ణ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా, అనిరుధ్ అందించిన మలయాళీ ట్యూన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా’ పాటకు తమన్నా చేసిన డ్యాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘జైలర్ 2’లో ఆ స్థానాన్ని షామ్నా కాసిమ్ భర్తీ చేయడంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫలితంగా ‘అలా బోలెలో’ పాట ఏ స్థాయిలో హిట్ అవుతుందనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రజినీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారని సమాచారం. అక్టోబర్ 2న ఆడియో వేడుకను నిర్వహించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్వ్యాగ్ తో ‘జైలర్ 2’ మరో రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి చెందిన సుంకర జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసులు తాజాగా కోర్టుకు నివేదిక సమర్పించారు. చిన్నారి అదృశ్యమై 70 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ న్యాయవాది జి. శ్రీకాంత్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా పోలీసులు దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించారు.విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసుల తరఫు న్యాయవాది జయంతి స్పందిస్తూ.. చిన్నారిని కనుగొనేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ధర్మాసనానికి వివరించారు.మరోవైపు, తమ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. చిన్నారి తండ్రి గణేశ్ తన కుమార్తె ఫొటోలు, వీడియోలతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి, తన బిడ్డను గుర్తించడంలో సహాయం చేయాలని ప్రజలను వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది

కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు. కాకినాడ: తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నేటికి 70 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నారి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది జి.శ్రీకాంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి కేసు విషయంలో పోలీసుల తీరును కోర్టు దృష్టికి శ్రీకాంత్ తీసుకువచ్చారు. నెలలు గడిచినా చిన్నారి ఆచూకీ కనిపెట్టలేదని పేర్కొన్నారు. మరోవైపు, పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు నివేదికను సమర్పించారు. కాగా, జ్ఞానేశ్వరి అదృశ్యంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. నిత్యం తమ కుమార్తె ఫొటోలు, వీడియోలను చూసుకుంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి తండ్రి గణేశ్ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. అందులో తన కుమార్తెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు. చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా(Raaka)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ భారీ స్థాయిలో అంచనాలు ఉండటానికి అట్లీ ప్లానింగ్‌తో పాటు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వార్తలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కథ అల్లు అర్జున్ కంటే ముందు పలువురు స్టార్ హీరోల వద్దకు వెళ్లిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇదే సమయంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని అట్లీ భావిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతుల్లోకి రావడంతో ఆ ప్రచారం క్రమంగా మరుగున పడింది. ఇప్పుడు మరోసారి విల్ స్మిత్(Will Smith) పేరు రాకాతో ముడిపడి వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. గతంలోనూ ఇదే తరహా ప్రచారం జరగడంతో తాజా రూమర్స్‌ను ఎంతవరకు విశ్వసించాలనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విల్ స్మిత్ నిజంగానే రాకాలో భాగమైతే, అల్లు అర్జున్‌కు ఇది హాలీవుడ్ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చే కీలక అడుగుగా మారే అవకాశం ఉంది. అట్లీ, సన్ పిక్చర్స్(Sun Pictures) టీమ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి సర్ప్రైజ్లు సిద్ధం చేశారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో పాత సినిమాలను తిరిగి థియేటర్లలో ప్రదర్శించే రీరిలీజ్ ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా పాత చిత్రాలు విడుదలవుతున్న ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో రాసిన ఒక లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 35 ఏళ్ల క్రితం అంటే 1989-90 కాలంలో రీరిలీజ్‌ల విషయమై అభిమానులకు ఆయన రాసిన లేఖతో ఈ అంశంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత సినిమాలు మళ్లీ రావడం వల్ల హీరో ఇమేజ్ పాడవుతుందన్న అభిమానుల భయాందోళనలకు అప్పట్లోనే ఆయన ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ సమయంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే వస్తుండటం, అదే సమయంలో సెకండ్ రన్ మరియు థర్డ్ రన్ పేరిట పాత చిత్రాలు ప్రదర్శితం కావడంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చిరంజీవి, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, లంకేశ్వరుడు వంటి భారీ చిత్రాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. ముఖ్యంగా తెరపై రెండు మూడు నిమిషాలు కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కోసం 3 నుండి 4 రోజుల పాటు ప్రత్యేక షూటింగ్ పనులు అవసరమవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు మరియు నాటి సినీ పరిశ్రమ సంక్షోభం కూడా కొత్త సినిమాల ఆలస్యానికి కారణాలని తెలిపారు. రీరిలీజ్ అంశంపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, పాత సినిమాలు సెకండ్ రన్ లో ఆడటం వల్ల ఇమేజ్ పెరుగుతుందే తప్ప దెబ్బతినదని విశ్లేషించారు. దీంతో అప్పట్లో సరిగ్గా ఆడని చిత్రాలు కూడా కాలం మారిన తర్వాత కొత్త దృక్పథంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని స్పష్టం చేశారు. 16 ఏళ్ల వయస్సులో తీయించుకున్న ఫోటోను 26 ఏళ్ల వయస్సులో చూసుకుంటే అసహ్యం వేయదని, ఆశ్చర్యం మరియు ఆనందం మాత్రమే కలుగుతాయని ఉదాహరణగా చెప్పారు. ఇదిలా ఉండగా కాలక్రమంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం మారడం వల్ల పాత

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషీ కాంబినేషన్ లో వచ్చిన 'బట్వారా 1947' చిత్రం కమర్షయల్ సక్సెస్ ను సాధించలేక పోయింది. అయినా ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను ప్రకటించబోతున్నారట. సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ తాజా చిత్రం 'బట్వారా 1947' స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఆమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన 'బట్వారా 1947' కథ బాగున్నా... దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చాలామంది వ్యాఖ్యానించారు. పైగా ఇటీవల వచ్చిన 'మై వాసప్ ఆవూంగా' కథాంశం కూడా దాదాపు ఇలాంటిదే కావడంతో కొత్తదానాన్ని మిస్ అయి భావనను వ్యక్తం చేశారు. దేశ విభజన నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలూ తెరకెక్కాయి. 'మై వాపస్ ఆవూంగా'లో సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తే, 'బట్వారా 1947'లో సీనియర్ నటీమణి షబానా ఆజ్మీ నటించారు. వీరిద్దరి పాత్రలకు మంచి పేరొచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. గతంలో సన్నీ డియోల్ హీరోగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కించిన 'ఘాయల్, దామినీ, ఘాతక్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే మూడు దశాబ్దాల కాలం నాటి ఆ మ్యాజిక్ ను తాజా చిత్రం రీ క్రియేట్ చేయలేకపోయింది. 'బట్వారా' సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా తగ్గేదే లే అంటున్నారు సన్నీ డియోల్ అండ్ రాజ్ కుమార్ సంతోషీ. ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమాను ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి యాక్షన్ మూవీని ఈ సారి వీరు చేయబోతున్నారట. మరి ఈ

సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’. సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’ (Fight Maha ). ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది దీని ఉపశీర్షిక. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించారు. సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏవీఎస్ రాజు మాట్లాడుతూ ‘వైజాగ్, కేరళ, హైదరాబాద్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఇటీవల మేము రిలీజ్ చేసిన టీజర్‌కు మిలియన్ ప్లస్ ప్యూస్తో అద్భుతమైన స్పందన వచ్చింది’ అని చెప్పారు. దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా ఉంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తగా ఉంటుంది. ఒక వినూత్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది’ అని అన్నారు

సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. రెండు మూడేళ్ల తర్వాత వస్తే ఓకే కానీ ఏకంగా 20-30 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్స్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరోలు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా ఆ పాత సినిమాల బ్రాండ్ ఇమేజ్ వర్కౌట్ అవ్వడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. తాజాగా మరో ఔట్ డేటెడ్ హీరో సినిమాకు ఇలాగే కాసుల వర్షం కురుస్తుంది. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు విలన్‌గా సెట్టైపోయారు. ప్రేక్షకులు ఈయన్ని హీరోగా ఎప్పుడో మర్చిపోయారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఆవారాపన్ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో.. ఆ బ్రాండ్‌తో పార్ట్ 2 ఫస్ట్ డే 25 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇమ్రాన్ క్రేజ్ తగ్గినా.. సీక్వెల్ మీద ఉన్న అంచనాలే ఆవారాపన్ 2ను 200 కోట్ల క్లబ్బులో చేర్చేలా కనిపిస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా సరైన హిట్ లేక ఫామ్ కోల్పోయిన సన్నీ డియోల్‌కు గదర్ 2 కళ్లు చెదిరే బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. 25 ఏళ్ళ కింద వచ్చిన గదర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్.. దాని సీక్వెల్ మొన్నొచ్చి మళ్లీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసింది. సన్నీ డియోల్ క్రేజ్ తగ్గినా కూడా.. గదర్ ఫ్రాంచైజీపై ప్రేక్షకులకున్న విపరీతమైన అభిమానమే ఈ సినిమాకు అన్ని వందల కోట్లు తెచ్చింది. దేశభక్తి సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన బోర్డర్‌కు సీక్వెల్ 30 ఏళ్ల తర్వాత వచ్చింది.. బోర్డర్ 2కు టాక్ యావరేజ్‌గానే వచ్చినా.. కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ఏంటని పెదవి విరిచిన వాళ్లే ఆశ్చర్యపోయేలా ఈ చిత్రం ఏకంగా 400 కోట్లు రాబట్టి సత్తా చాటింది. దీన్నిబట్టి హీరోల ఫామ్‌తో సంబంధం లేకుండా.. కేవలం బ్రాండ్ చూసి బాలీవుడ్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ
Sunshine Pictures IPO : ప్రముఖ ఫిల్మ్ అండ్ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా (Vipul Shah) ప్రమోట్ చేస్తున్న సన్‌షైన్ పిక్చర్స్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. రూ.282 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఆగస్టు 18, 2026 మంగళవారం ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 90 నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు (Retail Investors) ఈ ఐపీఓలో షేర్ల కొనుగోలుకు విపరీతంగా పోటీపడ్డారు. సన్‌షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన తొలి 90 నిమిషాల వ్యవధిలోనే బిడ్డింగ్ పూర్తయింది. ఎన్ఎస్ఈలోని డేటా ప్రకారం 54.59 లక్షల షేర్లకు గానూ గంటన్నరలోనే 54.86 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ కోటా 1.49 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.16 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ పొందింది. ఈ కంపెనీ ఇప్పటికే యాంకర్ మదుపరుల నుంచి రూ.84.64 కోట్ల నిధులను సమీకరించింది.షేరు ధరలు ఇలాసన్షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 18వ తేదీన మొదలై ఆగస్టు 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధర రూ.342 నుంచి రూ.360గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.282 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా 48 లక్షల ఫ్రెష్ షేర్లు, 30.37 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. విపుల్ అమృతలాల్ షా, షెఫాలీ విపుల్ షా ప్రమోటర్లుగా తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు ఆగస్టు 25, 2026న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.Read Also: ఎట్టకేలకు లలితా జువెల్లరీ ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 1700 కోట్లు.. ఒక్కో షేరు ధర ఎంతో తెలుసా?కనీసం 41 షేర్లు (ఒక్కో లాట్ విలువ సుమారు రూ.14,760)

కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్, కామెడీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్, శివ్ పండిట్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డా? బిగ్‌బాస్ అవకాశమా? ధనుష్ స్పందన ఇదే.. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద

ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు, కేతువు కూడా అప్పటికే అదే రాశిలో ఉంది, అయితే ఆగస్టు 22న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా అద్భుతంగా గడుస్తుంది. అనుకున్న పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. సింహ రాశి : సింహరాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలోనే మీకు మీ మిత్రులు,శత్రువులు తెలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో దానిని నెరవేర్చుకుంటారు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందకర జీవితాన్ని గడుపుతారు