
© 2026 nimisham.in

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం విషయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది నిజంగా శుభ సమయం.సింహరాశిగత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సింహరాశి జాతకులు బుధాదిత్య రాజయోగం తో లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. ఇది సింహ రాశి వారికి లబ్ధిని చేకూర్చే సమయం.ఆగస్ట్ 27న రాహు చంద్రుల గ్రహణ యోగంతో వీరి జీవితాలలో పెను తుఫాన్!వృశ్చిక రాశిబుధాదిత్య రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సానుకూల ఆలోచనలు ఉంటాయి. కెరీర్ వృద్ధికి అవకాశం ఉంది.ధనుస్సు రాశిధనుస్సు రాశి వారికి బుధాదిత్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. కెరీర్ వృద్ధి జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.