
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
చేపలకు ఆహారం వేస్తామని చెప్పి ఇంటికే టోకరా.. 6 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం. నవీన్ కుమార్ కుటుంబం నివసిస్తోంది. మార్చి 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో వీరు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా భావించిన.. రామశర్మ, అతని భార్య ప్రమీలారాణి దంపతులు రంగంలోకి దిగారు. మీరు ఊరికి వెళ్తే ఇంట్లోని అక్వేరియం ఉంది కదా.. మరి ఆ చేపలకు ఫుడ్ ఎవరు వేస్తారు? అవి చనిపోతాయి కదా.. అంటూ అమాయకపు కన్నీరు కార్చారు. తాము ఎంతో నమ్మకంగా ఉంటామని చెప్పి బాధితుల ఇంటి తాళాలు తీసుకున్నారు. తాళాలు చేతికి చిక్కగానే ఆ దంపతులు తమ అసలు రంగు బయటపెట్టారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బాధితురాలి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్లులను దొంగిలించారు. ఆమె భర్తే తన సొంత ఇంటిని భార్యకు అద్దెకు ఇచ్చినట్లుగా ఫేక్ రెంటల్ అగ్రిమెంట్లు సృష్టించి.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్‌లో ఏకంగా శ్రీ గురుదత్త లక్ష్మీనరసింహ గురువాంబిక శక్తిపీఠం పేరుతో ఓ ఆధ్యాత్మిక పీఠాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వార్తకు సంబంధించిన

ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు. అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని. – యామిజాల జగదీశ్ బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర

దేవుని పూజలో దీపంతో పాటు అగరబత్తులు (ధూపం) వెలిగించడం మన సనాతన ధర్మంలో పూర్వకాలం నుండి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. పూజా సమయాల్లో అగరబత్తి నుంచి వచ్చే పరిమళభరితమైన సువాసన ఇల్లంతా వ్యాపించి, పూజా గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నింపుతుంది. అంతేకాకుండా మనస్సులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అయితే, దేవుని ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. రోజువారీ పూజలో ఒకటి లేదా రెండు అగరబత్తులు వెలిగిస్తే సరిపోతుంది. పూజలో సంఖ్య కంటే మనస్సులోని నిశ్చలమైన భక్తి, శుద్ధత మాత్రమే అత్యంత ముఖ్యం. దేవుడి అనుగ్రహం పొందడానికి ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు లేదా బాహ్య ఆడంబరాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎక్కువ వెలిగిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు వెలిగిస్తేనే ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎక్కడా పేర్కొనలేదు. మోతాదుకు మించి వెలిగించడం వల్ల అధిక పొగ , ఇంటి వాతావరణం మసకబారడమే కాకుండా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఏదైనా మితంగా ఉపయోగించడమే శ్రేయస్కరం. ఆధ్యాత్మికంగా, అగరబత్తి సువాసన మనస్సును ఏకాగ్రత వైపు మళ్లించి, ధ్యానం లేదా జపంలో నిమగ్నమవ్వడానికి సహాయపడుతుంది. అలాగే పరిసరాల్లోని ప్రతికూల (నెగెటివ్) శక్తులను తొలగించి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అగరబత్తులను నేలపై కాకుండా ఎల్లప్పుడూ సురక్షితమైన, స్థిరమైన స్టాండ్‌లోనే అమర్చి వెలిగించాలి. అగరబత్తి వెలిగించిన తర్వాత దాని మంటను ఆర్పేసి, కేవలం పొగ (ధూపం) మాత్రమే వచ్చేలా చూడాలి. వెలిగించిన అగరబత్తులను ఎప్పుడూ అజాగ్రత్తగా వదిలేయకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఘాటైన రసాయనాలు (కెమికల్స్), అధిక పొగను వెలువరించే అగరబత్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. సహజసిద్ధమైన మూలికలతో తయారైన వాటిని ఎంచుకోవడం మంచిది. పూజలో దీపారాధనతో పాటు అగరబత్తి వాడటం శుభప్రదమే అయినప్పటికీ, అగరబత్తి వెలిగించడం తప్పనిసరి నియమమేమీ కాదు. ఒకవేళ అది

Arunachalam Girivalam: అరుణాచలంలో మోక్షమార్గం రహస్యం... గిరి ప్రదక్షిణలో ఈ గుహలోనుంచి ఎందుకు వెళతారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా? Samatha 17 August 2026 Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను పెట్టుకునేవారు. చాలా వరకు ప్రతి పిల్లల పుస్తకంలో ఈ నెమలి ఈకలు అనేవి ఉండేవి. అయితే చాలా మంది పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయి అనేవారు. మరి నిజంగానే పుస్తకంలో నెమలి ఈక పెడితే మార్కులు ఎక్కువ వస్తాయా? దీని గురించి పండుతులు ఏం చెబుతున్నారు అనేది ఇ ప్పుడు చూద్దాం. పుస్తకంలో నెమలి ఈక పెట్టడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంట. నెమలి ఈకలు కృష్ణుడికి, సరస్వతీ మాతకు చాలా ప్రీతికరం అంటారు. అందువలన ఈకలను పుస్తకంలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి, చదువులో వెనకబడిన వారు కూడా మళ్లీ చదువులో రాణించే అవకాశం ఉన్నదం ట. పుస్తకంలో నెమలి ఈకను ఉంచడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగడంవలన అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండ ితులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమన ించాలి. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్లి, అభిషేకం చేసి, బిల్వదళాలతో స్వామి వారిని పూజించి, ఓం నమ:శివాయా అని 108 ససార్లు జపించడం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో 16 రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేయడం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవున్నారో వారు వాటి నుంచి త్వరగా బయపటడతారంట. అంతే కాకుండా శ్రావణ మాసంలో అన్నదానం చేయడం వలన కూడా అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఈ మాసంలో ఎవరు అయితే అన్నదానం చేస్తారో వారికి ఉన్న పితృదోషాలు తొలిగిపోయి, కోరిన కోర్కెలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేరుతాయంట. అలా చేసినప్పుడే సరైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

మనం రోజూవారి సంభాషణల్లో 'చిదంబర రహస్యం' అనే మాటను వింటుంటాం. ఏదైనా అంతుచిక్కని విషయం ఉన్నా, లేదా బాగా దాచిపెట్టిన గుట్టు ఉన్నా దానిని చిదంబర రహస్యంతో పోలుస్తాం. కాలక్రమంలో ఇది ఒక ప్రసిద్ధ సామెతగా మారిపోయింది. కానీ, ఈ పదబంధం వెనుక అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావన, ఒక గొప్ప పురాణ నేపథ్యం దాగి ఉన్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయం నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. అసలు ఈ రహస్యం ఏంటి? గర్భగుడిలోని తెర వెనుక ఏముంది? శివుడు అక్కడ ఎందుకు నృత్యం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ తత్వశాస్త్రంలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం చాలా ముఖ్యమైనవి. తమిళనాడులోని చిదంబరం ఆలయం పంచభూత క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన నాలుగు క్షేత్రాలలో స్వామివారు పృథ్వి, ఆపస్, తేజస్సు, వాయు రూపాల్లో అంటే మన కంటికి కనిపించే లింగ రూపాల్లో దర్శనమిస్తారు. కానీ చిదంబరంలో మాత్రం శివుడు అరూప రూపంలో అంటే ఆకాశం లేదా శూన్య రూపంలో కొలువై ఉంటారు. ఈ ఆలయంలో శివుడు ప్రధానంగా ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామి రూపంలో కనిపిస్తారు. అయితే గర్భగుడిలో నటరాజ స్వామికి కుడి వైపున ఒక పరదా ఉంటుంది. పూజారి ఆ తెరను తొలగించి దీపారాధన చేసినప్పుడు అక్కడ భౌతికంగా ఎలాంటి విగ్రహం లేదా శివలింగం కనిపించవు. కేవలం బంగారంతో చేసిన మారేడు ఆకుల మాల వేలాడుతూ కనిపిస్తుంది. కంటికి ఏమీ కనిపించకపోవడమే ఇక్కడి అసలైన రహస్యం. కంటికి ఏమీ కనిపించని ఆ శూన్య స్థలమే 'చిదంబర రహస్యం'. దీని అర్థం భగవంతుడు కేవలం ఒక నిర్దిష్ట రూపానికే పరిమితం కాలేదని, ఆయన నిరాకారుడు, సర్వవ్యాపి, ఆకాశంలా అనంతమైనవాడని చెప్పడమే. "చిత్" అంటే చైతన్యం లేదా జ్ఞానం అని, "అంబరం" అంటే ఆకాశం అని అర్థం. అంటే జ్ఞానమే ఆకాశ రూపంలో ఉందనే

ఘనంగా గంగాజల్ కావడి యాత్ర కాషాయ వస్త్రాల్లో శివభక్తుల కోలాహలం చార్మినార్ నుండి సరూర్‌నగర్ వరకు Gangajal Kawad Yatra: భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. పవిత్రమైన శ్రావణమాసపు వేళ శివనామ స్మరణతో నగర వీధులు ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయాయి. భాగ్యనగర్ కావడి సేవా సంఘం అత్యంత శ్రద్ధా సక్తులతో నిర్వహించిన ఈ మహా యాత్ర, నగరవాసులకు ఒక దివ్యానుభూతిని అందించింది. సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు భక్తిమార్గాన్ని అందించే లక్ష్యంతో ఈ మహత్కార్యాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. Monsoon Alert: దేశంలో జోరందుకున్న రుతుపవనాలు.. ఎల్ని నో ప్రభావానికి చెక్.. 15 రోజులు భారీ వర్షాలు చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక మహాదేవ మందిరం వద్ద పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ కావడి యాత్ర(Gangajal Kawad Yatra) సరూర్‌నగర్‌లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వరకు కోలాహలంగా సాగింది. కాషాయ వస్త్రాలు ధరించిన 1250 మంది శివభక్తులు కావడులతో భజనలు, హరహర మహాదేవ నినాదాల మధ్య నడుస్తూ స్వామివారికి పవిత్ర గంగాజలాన్ని సమర్పించారు. భక్తిప్రపత్తులతో సాగిన ఈ శోభాయాత్ర నగరంలో శివతత్వాన్ని ప్రసరింపజేసింది

దక్షిణ భారతదేశం అద్భుతమైన దేవాలయ నిర్మాణ శైలికి, ఆధ్యాత్మిక వైభవానికి, సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడ ఉన్న ప్రాచీన ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కావు. ఇవి మన పురాతన సంస్కృతికి, విశిష్ట కళలకు, సమాజ పురోగతికి ప్రాథమిక మూలస్తంభాలుగా నిలిచాయి. చరిత్ర, భక్తి, అద్భుత శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా దక్షిణ భారతదేశంలో వెలసిన, ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన టాప్ 5 దివ్య క్షేత్రాల వివరాలు ఇక్కడ చూద్దాం. తమిళనాడులోని పవిత్ర రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉన్న రామనాథస్వామి ఆలయం పరమశివుడు కోలువైన దేవాలయం.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అఖిల భారత చార్ ధామ్ యాత్రలో ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణ పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి లంకకు వెళ్లడానికి ముందు పరమశివుడిని పూజించడం కోసం స్వయంగా ఈ ఆలయ నిర్మాణాన్ని సూచించాడని, ఇక్కడి ప్రధాన లింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు బలంగా నమ్ముతారు. తరువాతి కాలంలో పాండ్య రాజులు, జాఫ్నా రాజవంశ పాలకులు ఈ ఆలయాన్ని భారీ గోపురాలు, విశాలమైన ప్రాకారాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన వరండాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మధురై నగరంలోని వైగై నది ఒడ్డున వెలసిన శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం దక్షిణ భారత దేవాలయ శిల్పకళా నైపుణ్యానికి ఒక నిలువుటద్దం లాంటిది. పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవారికి, శివుని రూపమైన సుందరేశ్వరునికి ఈ ప్రాచీన ఆలయం ఇది. క్రీస్తు శకం 6వ నుండి 9వ శతాబ్దాల మధ్య కాలం నాటి తమిళ సంగం సాహిత్యంలో కూడా ఈ దివ్య ఆలయ ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఏకంగా 33,000 కంటే ఎక్కువ రంగురంగుల శిల్పాలు, అద్భుతమైన ఆకృతులు ఉన్నాయి. భక్తులను

మన సమాజంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి భౌతిక కాయాన్ని సూచించడానికి వివిధ పదాలు ఉపయోగిస్తుంటారు. సాధారణ సంభాషణల్లో 'శవం' లేదా 'మృతదేహం' అనే పదాలు వింటుంటాం. కానీ ప్రముఖులు, మహనీయులు చనిపోయినప్పుడు మాత్రం వార్తల్లో, అంతిమ యాత్రల సమయంలో 'పార్థివ దేహం' అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు 'మృతదేహం' అనడానికి, 'పార్థివ దేహం' అనడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? 'పార్థివ' అనే పదం వెనుక ఉన్న భారతీయ సంస్కృతి, తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 'పార్థివ' అనే పదం 'పృథివి' (భూమి) అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. అంటే పృథివికి సంబంధించినది, లేదా భూమి నుండి ఉత్పత్తయి అంతిమంగా మళ్లీ ఆ భూమిలోనే లీనమయ్యేది అనడానికి పార్థివ పదం ఉపయోగిస్తారు. ఇక దేహం అంటే ఆత్మ నివసించే భౌతిక శరీరం. కాబట్టి 'పార్థివ దేహం' అంటే "భూసంబంధమైన శరీరం" లేదా "తిరిగి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న భౌతిక కాయం" అని అర్థం. సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం ఏదో ఒక మూలకం నుండి తయారైంది. అలాగే మన శరీరం కూడా ఈ భూమి తత్వంతో ఏర్పడినదే. ప్రాణం ఉన్నంత కాలం ఇది 'జీవ దేహం', ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయిన తర్వాత ఇది పృథివికి చెందే 'పార్థివ దేహం'. భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం పంచభూతాలు (ఐదు మహా భూతాలు)తో నిర్మితమైంది. అవి… పృథివి (భూమి) : మన శరీరంలోని మాంసం, ఎముకలు, చర్మం వంటి ఘన పదార్థాలు. ఆపస్సు (నీరు) : రక్తము, లాలాజలము వంటి ఇతర ద్రవ పదార్థాలు. తేజస్సు (అగ్ని) : శరీరంలో ఉండే వేడి, జీర్ణశక్తి. వాయువు (గాలి) : మనం పీల్చే శ్వాస (ప్రాణవాయువు). ఆకాశం (శూన్యం) : శరీరంలోని ఖాళీ ప్రదేశాలు (అవయవాల మధ్య ఉండే స్థలం). మనుషులు జీవించి

దక్షిణ భారతదేశ దేవాలయాలలో లభించే పులిహోర కేవలం రుచికరమైన ప్రసాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. పులిహోర తయారీలో ఉపయోగించే చింతపండు, పసుపు, ఇంగువ, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ పులిహోర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు పులిహోర ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే.. దక్షిణ భారతీయ భాషల నుంచి వచ్చింది పులిహోర. ఇందులో పులి అంటే చింతపండు రుచి, హోర అంటే అన్నం లేదా వండిన బియ్యానికి సంబంధించిన పదం. ఈ పులిహోరను తమిళంలో పులియోదరై, కన్నడంలో పులియోగరే అని పిలుస్తారు. అందువల్ల పులిహోర అంటే పులుపు అన్నం అని అర్థం. ఇది కేవలం వంటకం కాదు. భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత కలసిన జీవన చిహ్నం. ఆలయాలలో పూజలు ముగిసిన తర్వాత భగవంతునికి నివేదించే నైవేద్యంలో పులిహోరకు అగ్రతాంబూలం ఉంటుంది. ఆయుర్వేద, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం, చింతపండుతో తయారుచేసే ఈ అమ్ల ఆహారం సాత్విక గుణాలను పెంపొందిస్తుంది. మంత్రోచ్ఛారణల మధ్య, పవిత్రమైన వాతావరణంలో తయారుచేసి స్వామివారికి అర్పించడం వల్ల ఈ ప్రసాదంలో సానుకూల శక్తి నిండి ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. చింతపండు : ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు: ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇంగువ, ఆవాలు: కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా

మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది. మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులు దైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి: ‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్‌కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది. సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనం ప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్‌లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది. ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు

అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది. కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది. ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు. ‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు) ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) సాయి కృష్ణ లాకప్ డెత్

అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది శివుడికి చాలా ప్రీతకరమైన మాసం అని కూడా అంటారు. ఇక ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తాయి. ముఖ్యంగా రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం, నాగుల చవితి ఇలా చాలా పండుగలు వస్తాయి. ఈ మాసం మొత్తం అమ్మవారిని, శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక కొంత మంది తులసి చెట్టును పూజించి, ప్రతి రోజూ దీపం వెలిగిస్తారు. ఇక సనాతన ధర్మ ప్రకారం, శ్రావణ మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు, ఉదయం , సాయంత్రం స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, తులసి మాత దగ్గర ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూలత పెరిగి, అనుకున్న పనులు నెరవేరతాయి అంటారు. అయితే ఈ మాసంలో కొంత మంది ప్రతి రోజూ దీపారాధన చేస్తే మరి కొంత మంది మాత్రం సోమవారం, శుక్రవారం, మంగళ వారం మాత్రమే దీపం వెలిగిస్తుంటారు. అయితే వీటన్నింటికంటే, ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన రోజున దీపం వెలిగించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట. ఇంతకీ అది ఏ రోజు అంటే? శ్రావణ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ శ్రావణ పూర్ణిమ రోజు ఇంటి ప్రధాన ద్వారం, తులసి మాత దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. దీని వలన అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలిగిపోయి, సానుకూలత పెరుగుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుందంట. అందుకే శ్రావణ పౌర్ణమి రోజు దీపం వెలిగించడం చాలా మంచిది అంటారు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి

గరుడ పురాణం హిందూ మతంలోని 18 గొప్ప పురాణాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికీ, ఆయన వాహనమైన గరుడ పక్షికి మధ్య జరిగిన సంభాషణగా పరిగణిస్తారు. గరుడ పురాణం జీవితం, మరణం, కర్మ, పునర్జన్మ రహస్యాలను వివరిస్తుంది. జనన మరణ రహస్యాల గురించి మాత్రమే కాదు.. ప్రతిరోజూ కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం పెరగడంతో పాటు, అదృష్టం రెట్టింపు అవుతుంది. విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి, గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజూ కచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఇవే.. ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు.కానీ, తమకు తోచిన సమయంలో చేస్తూ ఉంటారు. కానీ, గరుడ పురాణం ప్రకారం మన రోజుని స్నానంతోనే ప్రారంభించాలి. స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు. స్వచ్ఛమైన శరీరంలోనే స్వచ్ఛమైన మనసు ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయని వారు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలా కాకుండా, ఉదయాన్నే స్నానంతోనే తమ పనులు మొదలుపెట్టేవారి జీవితం ఆనందంగా ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, దైవరాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ దేవతను పూజించేవారు దురదృష్టం తొలగి, అన్ని పనుల్లోనూ విజయం పొందుతారు. గరుడ పురాణం ప్రతిరోజూ దైవ నామాన్ని జపించాలి. క్రమం తప్పకుండా జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి, ధ్యానం చేసి, భగవంతుని జపించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు శాంతి లభించి, అదృష్టం ఆకర్షిస్తుంది. శుభం కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా దానధర్మాలు చేయాలి. అలా చేయడం వల్ల ఒక వ్యక్తి శ్రేయస్సు మెరుగుపడుతుంది. అదృష్టం కలుగుతుంది. సంపద అనేక మార్గాల ద్వారా వస్తుంది. తమ శక్తి మేరకు క్రమం తప్పకుండా దానధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది

ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆలయ పరిసరా ల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరిం చుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకా రంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.భద్రతా విధుల కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్‌లు, క్రైమ్ టీమ్‌లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాలతో పాటు బోనాల ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు లాల్‌దర్వాజా యూనియన్ బ్యాంక్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే : మంత్రి సీతక్క పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..!