
అరగంటకు మించి నలుగురిలో ఉండలేను
నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం కాసేపయ్యాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. బయట జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తానూ అరగంటకు మించి ఉండలేనంటోంది నటి త్రిష. నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం కాసేపయ్యాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. బయట జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తానూ అరగంటకు మించి ఉండలేనంటోంది నటి త్రిష. ఈమధ్య ఏ వేడుకలో పాల్గొన్నా అరగంట తర్వాత తన మనసు ఇంటి వైపు లాగుతోందని ఇటీవలే ఇన్‌స్టా స్టోరీస్‌లో సరదాగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవడంతో పాటు సోషల్ బర్నవుట్ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చింది. మరి, ఇంతకీ ఏంటీ మానసిక పరిస్థితి? తెలుసుకుందాం రండి.. సోషల్ మీడియాలో వైరలయ్యే పోస్టులు, మీమ్స్ రీ-షేర్ చేస్తూ.. వాటికి సరదాగా క్యాప్షన్లు జోడిస్తుంటారు కొందరు అందాల తారలు. ఇటీవల నటి త్రిష కూడా ఇదే చేసింది. ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఓ పోస్ట్‌ను తిరిగి పోస్ట్ చేస్తూ తన అనుభవాల్ని దానికి జోడించింది. ‘నలుగురితో కలిసినప్పుడు నేను కేవలం 32 నిమిషాలు మాత్రమే సరదాగా గడపగలను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచన వస్తుంది..’ అన్న పోస్ట్‌ను పంచుకుంటూ.. ‘ఈ మధ్య ఏదైనా వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నాదీ ఇదే పరిస్థితి..’ అనే వ్యాఖ్యను దీనికి జోడించింది. ఇది నెట్టింట్లో వైరలవడంతో తామూ నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలా సామాజిక వేడుకల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్న కాసేపటికి లేదంటే ఎక్కువ సమయం గడిచే కొద్దీ అక్కడ్నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించడం, ఒంటరిగా గడపాలని అనిపించడాన్ని ‘సోషల్ బర్నవుట్’ లేదా ‘Social Fatigue’గా పేర్కొంటున్నారు నిపుణులు. మనసుపై ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితిని