
భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్
Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత! Sircilla: నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే ఇలా దాడులకు పాల్పడితే.. 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న తాము దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వేములవాడ అర్బన్ మండలం ఆర్ఆర్ చింతల్‌ఠాణా గ్రామానికి చెందిన మల్లవ్వ ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి పక్కింట్లోని బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లింది. మల్లవ్వ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో మల్లవ్వ నోటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన సమయాన్ని దుండగుడు ముందుగానే గమనించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది

Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్‌కు చెందిన మోతె రాజు అన్నంలోకి కర్రీ కోసం పక్కింట్లోని మామిడాల రాజు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని మోతె రాజు తల్లి ఆరోపించారు. గొడ్డలితో దాడి చేయడంతో మోతె రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం

ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్, సుల్తాన్పూర్, జగిత్యాల కాలేజీల్లో హాట్‌కేకుల్లా సీట్ల భర్తీ నేడు మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో.. రేపు వనపర్తి, కోస్గి, మహబూబాద్ కాలేజీల్లో.. హైదరాబాద్ సిటీ: ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. బుధవారం ఉదయం వర్సిటీ అడ్మిషన్ల విభాగంలో జరిగిన కౌన్సెలింగ్‌కు సుమారు 200మంది అభ్యర్థులతోపాటు, వారి తల్లిదండ్రులు తోడు రావ డంతో క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో 26, సుల్తాన్‌పూర్‌లో 8, జగిత్యాలలో 2 సీట్లు ఖాళీగా ఉండగా జగిత్యాలలో ఒక సీటు మినహా మిగిలిన సీట్లన్నీ హాట్ కేకేల్లా భర్తీ అయ్యాయని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. గురువారం మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో, శుక్రవారం మహబూబాబాద్, వనపర్తి, కోస్గి జేఎన్టీయూ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్ క్యాంపస్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. స్పాట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ఎప్‌సెట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరి, ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత మొదట వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు అన్ని సర్టిఫిక్టెలతోపాటు ఫీజు డబ్బులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం పెద్దూరులో మంగళవారం తెల్లవారుజామున మహాలక్ష్మి ఫర్నీచర్ తయారీ గోదాములో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నివాస గృహాలు దూరంగా ఉండటంతో చుట్టుపక్కలకు మంటలు వ్యాపించలేదు. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోదాంలో సుమారు రూ.80 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారు పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు గోదాం గోడలను యంత్రాలతో పగులగొట్టి మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Sircilla: పోలీసులకు సేవా పతకాలు ప్రదానం – అభినందించిన విప్ సిరిసిల్ల: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలను అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ పతకాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన అధికారులను అభినందించారు. రాజేందర్, హెడ్ కానిస్టేబుల్, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఉత్తమ సేవా పతకం లభించింది. నాగేశ్వరరావు, కమ్యూనికేషన్ ఎస్ఐ, సేవా పతకానికి ఎంపికయ్యారు. భూక్య లత, హెడ్ కానిస్టేబుల్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు. శ్రీనివాస్, బోయినపల్లి పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేయడం ద్వారా వారి సేవలకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు

Sircilla: రాజన్న దర్శనంలో జాప్యం వద్దు కలెక్టర్‌కు బీజేపీ డిమాండ్! Sircilla: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో గత 9 నెలలుగా భక్తులకు స్వామివారి దర్శనాన్ని పరిమితం చేయడం లేదా నిలిపివేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. శ్రావణమాసంలోనైనా భక్తులందరికీ రాజన్న దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గత 9 నెలలుగా రాజన్న దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇకపై మరింత జాప్యం చేయకుండా శ్రావణమాసంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలు, విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని దర్శనానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులకు భక్తులు పూర్తిగా సహకరిస్తారని, అయితే అభివృద్ధి పేరుతో భక్తుల ఆధ్యాత్మిక హక్కులు, మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. శ్రావణమాసం అత్యంత పవిత్రమైన మాసమని, ఈ సమయంలో రాజన్నను దర్శించుకోవాలని లక్షలాది మంది భక్తులు కోరుకుంటారని గోపి పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవించి వెంటనే దర్శన ఏర్పాట్లు కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు
మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మహిళా సంఘాలకు అందించే చీరల కోసం మే నెలలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో నీలం రంగు చీరలను పంపిణీ చేయగా.. ఈ ఏడాది చిలకపచ్చ రంగును ఎంపిక చేశారు. చీరల ఉత్పత్తి ద్వారా రాజన్న సిరిసిల్ల పవర్లూమ్, మ్యాక్స్ సంఘాలకు పని లభించడంతో నేతన్నల్లో ఆశలు పెరిగాయి.ఈ ఏడాది మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న చీరల కోసం ప్రభుత్వం రూ.450 కోట్లను కేటాయించింది. ఇందులో ఇటీవల రూ.142 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెస్కోకు నిధులు మంజూరైన వెంటనే చీరల ఉత్పత్తి చేస్తున్న మ్యాక్స్ సంఘాలకు చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. తొలుత 133 మ్యాక్స్ సంఘాలకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించారు. వీటిలో 80 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిన 61 సంఘాలను గుర్తించి ఇటీవల రెండో విడతగా మరో 1.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు.ఉత్పత్తి పూర్తయిన వస్త్రాన్ని టెస్కో సేకరిస్తోంది. ఒక్కో చీరకు జాకెట్ వస్త్రంతో కలిపి 6.6 మీటర్ల మేర తయారు చేస్తున్నారు. ఒక్కో చీర ఉత్పత్తికి సుమారు రూ.238 ఖర్చవుతోంది. దీనికి అదనంగా ప్రాసెసింగ్, ప్రింటింగ్, రవాణా తదితర ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. మొత్తం చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సెప్టెంబరు 20లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబరులో మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో గడువులోగా ఉత్పత్తి పూర్తి చేసేందుకు మ్యాక్స్ సంఘాలు పనులను వేగవంతం చేస్తున్నాయి.మరోవైపు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకరూప దుస్తుల వస్త్రం విషయంలో నెలకొన్న సమస్యకు కూడా పరిష్కారం లభిస్తోంది. ఫిబ్రవరిలో జిల్లా పరిశ్రమకు 63 లక్షల మీటర్ల వస్త్ర

Sircilla: గంభీరావుపేట-సిద్దిపేట మార్గంలో రాకపోకలు బంద్ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎగువ మానేరు నీరు ప్రవహించే లింగన్నపేట వాగు వద్ద రాకపోకలను నిలిపివేశారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం పాత వంతెనను తొలగించడంతో ప్రస్తుతం వాగు గుండా ప్రయాణాలు సాగుతున్నాయి. వరద ఉధృతి పెరిగితే ప్రయాణికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేష్ ఆధ్వర్యంలో గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ గంభీరావుపేట–సిద్దిపేట మార్గంలో భారీ కేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద నివారణ చర్యలను సీఐ వెంకటేష్ పరిశీలించారు. ఈ మార్గంలో ప్రయాణాలు నిలిపివేసి పోలీసులకు సహకరించాలని గంభీరావుపేట మండల తహసీల్దార్ మారుతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు కూడా బస్సుల రూట్లను మార్చారు. సిరిసిల్ల డిపో నుంచి బీబీపేటకు వెళ్లే నైట్ హాల్ట్ బస్సు గంభీరావుపేట వరకు వెళ్లి అక్కడి నుంచి కోరుట్లపేట, మల్లారెడ్డిపేట, లింగన్నపేట, కొత్తపల్లి, శ్రీగాధ, గోసానిపల్లి, ఆకారం, తుజ్జాల్పూర్, మల్కాపూర్ మీదుగా బీబీపేటకు వెళ్లనుంది. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు