
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం పెద్దూరులో మంగళవారం తెల్లవారుజామున మహాలక్ష్మి ఫర్నీచర్ తయారీ గోదాములో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నివాస గృహాలు దూరంగా ఉండటంతో చుట్టుపక్కలకు మంటలు వ్యాపించలేదు. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోదాంలో సుమారు రూ.80 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారు పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు గోదాం గోడలను యంత్రాలతో పగులగొట్టి మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.