
ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్ లో బీఆర్ ఎస్ నిరసనర్యాలీ
Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

ఆర్మీ కాంపౌండ్‌లో ఆయుధాల చోరీ నాలుగు ఏకే-47 రైఫిళ్లు మాయం రంగంలోకి దిగిన బొల్లారం పోలీసులు Madras Regiment Incident: సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్(Madras Regiment Incident) ప్రాంతంలో సంచలన ఘటన వెలుగు చూసింది. ప్రహరీ గోడలు, మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండే ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన దుండగులు ఆయుధాల గది తాళాలు పగలగొట్టి ఏకంగా 12 అత్యాధునిక ఆయుధాలను అపహరించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ సీసీ ఫుటేజ్ పరిశీలన, లోపలి వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు: రక్షణ రంగానికి చెందిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వేగంగా శోధిస్తున్నారు. ఆయుధాల బరువు, పరిమాణం దృష్ట్యా ఈ చోరీలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని, ఆర్మీ కాంపౌండ్ లోపలి వ్యక్తుల సహకారం ఉందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు ఇటీవల లోపలికి వచ్చి వెళ్లిన వారి వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయుధాలు నిజంగానే చోరీ అయ్యాయా లేక రికార్డుల్లో తేడాల వల్ల మిస్సింగ్‌గా కనిపిస్తున్నాయా అనే కోణంలోనూ ఆర్మీ స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేస్తున్నారు

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.సెప్టెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్- హాల్ట్ స్టేషన్లుట్యుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి

హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు. సికింద్రాబాద్‌లో ట్యూషన్ చెప్పి యాక్టివాపై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బధిర అన్నాచెల్లెళ్లు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. వారి తల్లి బంగారు నగలను బ్యాగ్‌లో పెట్టి మర్చిపోయింది. బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం తెలియకుండానే అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా, రోడ్డుపై బ్యాగ్ దొరకడంతో అంకిత్ అనే వ్యక్తి దానిని ట్రాఫిక్ ఏఎస్ఐ జాన్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులు అందులో సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పాటు ఖరీదైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ యజమానులను గుర్తించేందుకు దాదాపు 60కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాధితుల బైక్ నంబర్‌ను గుర్తించి, దాని ద్వారా వారి వివరాలను సేకరించారు. అయితే బాధితులు ఫోన్లో మాట్లాడలేకపోవడంతో పోలీసులు వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించారు. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్లతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడలేరని పోలీసులు గుర్తించారు. అనంతరం బ్యాగ్‌లోని వస్తువులు, బాధితుల వివరాలను నిర్ధారించుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తుకారాంగేట్ సీఐ బషీర్ అహ్మద్, క్రైమ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ చేతుల మీదుగా బంగారు నగల బ్యాగ్‌ను బాధిత కుటుంబానికి తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంతో పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బాధితులకు నగలను తిరిగి అందించడంలో పోలీసు చూపిన చొరవపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తుని

Secunderabad: పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా, జీఓ రద్దు డిమాండ్! Secunderabad: పాల్టెక్నిక్ విద్యను ప్రయివేటు పరం చేసి తమ జీవితాలతో చెలగాటం ఆడవద్దు అంటూ పాల్టెక్నిక్ విద్యార్థులు ధర్నా చేశారు..అల్ ఇండియా డెమోట్రిక్ స్టూడెంట్స్ ఆర్గానేషన్ aidso ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాల్టెక్నిక్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు..రాష్ట్ర ప్రభుత్వం విడుదల 97 జీఓ ను వెనక్కి తీసుకొని శక్తి శాఖను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు..కార్పొరేట్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం తమను కట్టబెట్టి ఎంతో భవిష్యత్ ఉన్న కార్పొరేట్ల సంస్థలకు లేబర్లు అప్పగిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ప్రయాణికుల నుంచి అందుతున్న ఆదరణ నేపథ్యంలో వాటిని రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ గా మార్పు సైతం చేస్తోన్నారు.ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి. తాజాగా మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్దీకరించారు. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి రానుంది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07607 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07608 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.మొత్తం 20 బోగీలతో కూడిన రైలు ఇది. వీటిల్లో 2ఏ- 2, 3ఏ- 8, స్లీపర్- 6, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు- 4 ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. గాయం కారణంగా ఎన్టీఆర్ కు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేరారు. చికిత్స అందించిన వైద్యులు ఎన్టీఆర్ భుజానికి గాయం బాగా లోతుగా అయిందని గుర్తించి సర్జరీ చేసారు. ఎన్టీఆర్ కు దాదాపు ఏడు వారాలు విశ్రాంతి అవసమని సూచించారు. ఎన్టీఆర్ గాయం మరియు శస్త్రచికిత్సపై వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఎన్టీఆర్‌కు విజయవంతంగా చికిత్స మరియు శస్త్రచికిత్స అందించినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్న తీరును డాక్టర్స్ వివరిస్తూ ఎన్టీఆర్ కుడి భుజం పైన దెబ్బ తగిలింది. సర్జరీ విజయవంతంగా చేశాము. 24 గంటల్లోనే డిశార్చ్ కూడా అయ్యారు ఫిజియోథెరపి కూడా మొదలు పెట్టారు. తారక్ గారు ప్యాషినెట్ పర్సన్ మూడు నెలల్లొ పూర్తి ఫిట్నెస్ ను పొందుతారు. ఎన్టీఆర్ సర్జరీ పై మాకు అనేక ఫోన్ కాల్స్ మెసెజ్ లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయన రికవరీ కూడా చాలా వేగంగా మరియు సానుకూలంగా సాగుతోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాము ‘ అని అన్నారు. డాక్టర్ల బృందం పూర్తి పర్యవేక్షణలో కోలుకుంటున్న ఎన్టీఆర్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మరింత జోష్ తో తిరిగి డ్రాగన్ సెట్స్ లో అడుగుపెట్టాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Secunderabad: బాలంరాయి దండు మారెమ్మ ఫలహారం బండి ఊరేగింపు సికింద్రాబాద్: బాలంరాయి దండు మారెమ్మ దేవాలయం ఫలహారం బండి వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలాదారుడు హనుమంతరావు, బాలీవుడ్ నటులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫలహారం బండి విద్యుత్ దీపాల మధ్య వివిధ వేషాధారణలు పోతరాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకునే విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పలహారం బండి ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సలహాదారుడు విహెచ్ హనుమంతరావు బాలీవుడ్ నటులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ నాయకులు ఇతరులు ఫలహారం బండి ఊరేగింపులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు

Jr NTR: సర్జరీ తర్వాత ఎన్టీఆర్ మొదటి ఫోటో.. వైద్యులతో కలిసి కనిపించిన యంగ్ టైగర్ ఈ వార్తకు సంబంధించిన

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీనివాస్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాస్ రావు పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు

తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు నోటిఫికేషన్ విడుదల.. ప్రైవేట్, మైనారిటీ, ఆర్మీ డెంటల్ కాలేజీలకు వర్తింపు హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. రాబోయే నాలుగేళ్ల కాలానికి పాత ఫీజులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2023-26 బ్లాక్ పీరియడ్ కోసం గతంలో జీవో నం. 106,132 ద్వారా నిర్ణయించిన ఫీజులే ఈ కొత్త కాలానికి కూడా వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ర్టార్ వెల్లడించారు. కాగా తెలంగాణ విద్యా సంస్థల చట్టం 1983లోని సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సె్సలోనూ ఇవే ఫీజులు అమలులో ఉంటాయి. ఒకవేళ 2026-29 మధ్య కాలంలో ఏదైనా కొత్త కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తే, ఆ సంస్థలో అప్పటికే అమల్లో ఉన్న కనిష్ట ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. రాష్ట్రంలో మొత్తం 27 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సులో ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా (కేటగీరీ-ఎ) కింద ఏడాదికి రూ.60 వేలు ఫీజును ఖరారు చేశారు. మేనేజ్మెంట్ కోటా (కేటగీరీ-బి) కింద వివిధ కళాశాలల్లో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉండాలని నిర్ణయించారు. అపోలో, చల్మెడ, కామినేని నార్కెట్‌పల్లి, కామినేని

Secunderabad- Divya Dakshin special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ యాత్ర టూర్ ఇది. తమిళనాడులో గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ. అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి పుణ్య క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. అక్టోబర్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు చర్లపల్లి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్తొలుత ఈ ఎక్స్ ప్రెస్ తిరవణ్ణామలైకి చేరుకుంటుంది. అక్కడి అరుణాచలం ఆలయ దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అరుణాచలేశ్వరుడిని దర్శనానంతరం ఈ రైలు చిదంబరానికి చేరుకుంటుంది. అక్కడ వెలిసిన నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. శ్రీరంగనాథస్వామి ఆలయ దర్శనానంతరం తరువాతి గమ్యస్థానం తంజావూరు. బృహదీశ్వర ఆలయాన్ని యాత్రీకులు సందర్శిస్తారు.30-60 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలను షేర్ చేయమని కోరిన ఏపీ ప్రభుత్వం: ఈ హ్యాష్ ట్యాగ్ పైఅక్కడి నుంచి నేరుగా రామేశ్వరానికి బయలుదేరి వెళ్తుందీ ఎక్స్ ప్రెస్. రామనాథస్వామి దర్శనానంతరం మధురైకి చేరుకుంటుంది. అక్కడ ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని యాత్రీకులు దర్శించుకోవచ్చు. దీని తర్వాతి గమ్యస్థానం కన్యాకుమారి. ఇక్కడ రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనం

రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక (Medical Student Priyanka Death) ఈరోజు (ఆదివారం) మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆస్పత్రికి ప్రియాంక మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పోస్టుమార్టానికి పోలీసులు తరలించనున్నారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఓ వైద్యురాలిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంక అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్‌ను ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు.అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కాగా, తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు