కంటెయినర్లను ఇలా కూడా వాడేస్తున్నారా.. ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు పెట్టి మరీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు.. దీంతో ఇసుక రవాణా చేసేందుకు కొత్త మార్గాలు కనిపెడుతున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా ఆంధ్రపరదేశ్ తెలంగాణ సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా కోసం వేసిన కొత్త ప్లాన్ బయటపడింది. విజయవాడ-హైదరాబాద్ హౌవేపై ఈ నెల 15న 22 టైర్ల ఓ భారీ కంటెయినర్, ఎస్కార్ట్‌గా ఓ థార్ వాహనం వెళుతున్నాయి. ఆ కంటెయినర్ చూసి పోలీసులకు అనుమానం వచ్చింది.. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు రైల్వే అండర్‌పాస్ దగ్గర ఆ వాహనాన్ని ఆపారు.పోలీసులు వెంటనే కంటెయినర్ తలుపులు తీసి చూసి అవాక్కయ్యారు.. లోపల భారీగా ఇసుక ఉంది. ఏకంగా 70 టన్నుల వరకూ ఉన్నట్లు గుర్తించారు.. దానిని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు తేలింది. సుమంత్ అనే రాజధాని అమరావతి ప్రాంతంలోని లింగాయపాలెం దగ్గర ఈ కంటెయినర్లోకి ఇసుకను లోడ్ చేసి తీసుకెళుతున్నట్లు తేలింది. వెంటనే పోలీసులు కంటెయినర్ సహా మిగిలిన ఎస్కార్ట్ వాహనాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కొంతకాలంగా కృష్ణానదితో పాటు మునేరు, ఇతర వాగుల్లో ఇష్టం వచ్చినట్లుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరు ఇసుకను పగటిపూట తవ్వి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. రాత్రి కాగానే టిప్పర్లు, కంటెయినర్ లారీల్లో నింపి కంటెయినర్లకు ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో ఇసుకను తెలంగాణలోకి సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, విజిలెన్స్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. లారీల ద్వారా అయితే ఈజీగా దొరికిపోతామని అక్రమార్కులు రూటు మార్చారు.. కంటెయినర్లలో తరలిస్తున్నారు. ఇంతలో ఈ కంటెయినర్ ఇసుక రవాణా వ్యవహారం బయటపడింది. మొన్నటి వరకు గంజాయి, ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించేందుకు ఇలాంటి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కంటెయినర్ ద్వారా ఇసుకను