
మహిళను హత్య చేసి అడవి మృగాలకు ఎరగా పడేసిన ఘాతకుడు.. 7,000 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
రాజస్థాన్‌లో మానవత్వం సిగ్గుపడే అత్యంత కిరాతకమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ అనే మహిళను దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని అడవి మృగాలకు ఎరగా వేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ సాగర్ అలీ అలియాస్ షాబాజ్ ఖాన్‌ను రాజస్థాన్ పోలీసులు సుమారు 7,000 కిలోమీటర్లు వెంటాడి, 6 రాష్ట్రాలు దాటిన తర్వాత బీహార్‌లో అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 19న ముస్కాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే క్రమంలో జూన్ 22న షాబాజ్ ఖాన్, అతని సహచరుడు కలిసి మాట్లాడదామని నమ్మించి ముస్కాన్‌ను రాంపుర కొండ ప్రాంతానికి పిలిపించారు. అక్కడ ఆమె తలపై రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని క్రూర మృగాలు తినివేస్తే ఆనవాళ్లు కూడా మిగలవనే దురాలోచనతో, సమీపంలోని ఒక జంతువుల గుహ వద్ద పడేశారు. అయితే, మృతదేహం పూర్తిగా ధ్వంసం కాకముందే పోలీసులు దానిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అది ముస్కాన్ మృతదేహంగా నిర్ధారించారు.ఈ కేసు విచారణను బివాడి ఎస్పీ బ్రజేష్ ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం చేపట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గాలించారు. దాదాపు 250 సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి, 325 ప్రాంతాలను జల్లెడ పట్టారు. నిరంతరం తన ఫోన్లు, లొకేషన్లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న షాబాజ్‌ను పట్టుకోవడానికి