
Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట!
Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట!
© 2026 nimisham.in

Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట!

భార్యాభర్తల బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం కూడా. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి ఎలా స్పందిస్తున్నారన్నదే ఆ బంధం ఎంత హెల్తీగా ఉందో చెప్పగలదు. సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ ఐదు లక్షణాలు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు కేవలం భార్యే చూసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన ఇతర నిర్ణయాల్లో భర్త కూడా తన వంతు బాధ్యత తీసుకుంటే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. భార్య అలసిపోయినప్పుడు పనిలో సహాయం చేయడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం వంటి పనులు ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమను పెంచుతాయి. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యమైన లక్షణం. కొందరు తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికి భంగం అనుకుంటారు. కానీ హెల్తీ రిలేషన్ షిప్ లో తప్పు ఒప్పుకోవడం, సారీ చెప్పడం, బలహీనత కాదు.. మెచ్యూరిటీ. గొడవ జరిగినప్పుడు ఎవరు గెలిచారనే దానికంటే, సమస్య ఎలా పరిష్కరించారనేదే ముఖ్యం. ప్రేమ అంటే ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రేమను చూపించడం కాదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ కూడా ప్రేమకు సంకేతమే. మీరు అలసిపోయారని గమనించడం, భోజనం చేశారా అని అడగడం, మీకు ఇష్టమైన విషయం గుర్తుపెట్టుకోవడం, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించడం వంటి చిన్న పనులు మీపై అతనికి ఉన్న శ్రద్ధను చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఏ బంధంలోనైనా కోపం, నిరాశ, వాదనలు ఉండొచ్చు. అయితే కోపం

‘‘పిల్లలకు ఏదైనా మంచి చెబితే వినే రోజులు కావు ఇవి..’’ ‘‘అంతా ఫోన్ల వల్లే, ఇలా తయారవుతున్నారు..’’ ‘‘జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు..’’ ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు సంబంధించి ఇలాంటి మాటలు.. తరచూ వింటున్నాం. ఈ మాటలను బలపరుస్తూ... ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్‌ని విద్యార్థులే అతి దారుణంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం, భక్తి.. స్థానంలో కక్షపూరితమైన ఆలోచన ఎలా వచ్చింది? మైనర్ పిల్లల్లో అంతటి హింసాత్మక ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటని.. నివ్వెరపోయారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకోవడానికి గల కారణాలు.. మరో సంఘటనకు తావు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు.. ‘సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల చదువులో ర్యాంకులే చూస్తున్నాం. కానీ, వారి ప్రవర్తన లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామా.. అనేది ప్రశ్నించుకోవాలి. నేటి తరాన్ని మార్చేది శిక్ష రూపంలో కాదు.. ప్రేమ, శ్రద్ధ, అవగాహనయే ప్రధానంగా చూపాల్సింది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు డాక్టర్ జ్యోతిరాజ. ఒకప్పుడు పిల్లల ప్రపంచం చదువు, ఆటలు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయంతో నిండి ఉండేది. కానీ నేటిరోజులు అరచేతిలో రంగుల ప్రపంచాన్ని చూపే సోషల్ మీడియా, ఖరీదైన వస్తువులపై ఆకర్షణ, ఏదో ఒక దారిలో త్వరగా డబ్బు సంపాదించి ఆనందించాలనే ఆలోచన, వ్యసనాలు.. పిల్లల మెదళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. కష్టపడటం కన్నా తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటిని అందుకోవడంవైపే మొగ్గుచూపుతున్నారు. కారణాలు ఏవైనా కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. దీనివల్ల పిల్లల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను పసిగట్టలేకపోతున్నారు. ఫలితంగా సరిదిద్దలేకపోతున్నారు. ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తోటివాళ్లముందు ‘ఈ పిల్లవాడు చెడ్డవాడు’, ‘సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ తప్పదు...’ అనే హెచ్చరికలు సమస్యకు పరిష్కారాన్ని

విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపిస్తున్నారా? అయితే దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉంటాయని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలోకి వస్తున్నారా? దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. విడిపోయిన తర్వాత పరిష్కారం కాని భావాలు, ఒంటరితనం లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల ఇలాంటి కలలు రావచ్చు. అందుకే కలల ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, మీ ప్రస్తుత జీవితం, మానసిక స్థితిపై దృష్టి పెట్టడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. విడిపోయిన తర్వాత మనసులో మిగిలిపోయిన సందేహాలు, సమాధానం లేని ప్రశ్నలు, చెప్పుకోలేకపోయిన విషయాలు ఉపచేతనలో ఉండిపోవచ్చు. అవి రాత్రి కలల రూపంలో బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా, పాత పాటలు వినడం, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదా ఎక్స్ లవర్‌కు సంబంధించిన ఫొటోలు చూడడం వంటివి కూడా ఇలాంటి కలలకు కారణం కావచ్చు. చాలాసార్లు మనసు ఆ వ్యక్తిని కంటే, ఆ సంబంధంలో అనుభవించిన భద్రత, సంతోషం, ప్రేమ, సాన్నిహిత్యం వంటి భావాలను ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. గందరగోళం, అభద్రత లేదా కొత్త సంబంధంలో గతంలో చేసిన తప్పులను మళ్లీ చేస్తానేమోననే భయం కూడా ఎక్స్ లవర్ జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చే అవకాశం ఉంది. ఎక్స్ లవర్ గురించి కలలు పదేపదే వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి గత జ్ఞాపకాలు, భావోద్వేగాల ప్రభావం కావచ్చు. అంతేగానీ, పాత సంబంధాన్ని మళ్లీ ప్రారంభించమని సూచించే సంకేతాలు కావు. గతాన్ని అంగీకరించడం, అపరాధ భావనను వదిలిపెట్టడం, ప్రస్తుత జీవితంపై దృష్టి పెట్టడం, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మనసుకు ప్రశాంతత లభించవచ్చు. జీవితంలో ముందుకు సాగేందుకు ఇవి సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం

‘ప్రేమించడమే నేను చేసిన పెద్ద తప్పా? అస్సలు నా తప్పేమీ లేకపోయినా నాదే తప్పు అని నమ్మించారు. నా వ్యక్తిత్వం కుంచించుకుపోయేలా చేశారు... హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ చేసిన సంచలన వ్యాఖ్యలివి. తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక, అతడిది ఒక 'నార్సిసిస్ట్' (Narcissist) బిహేవియర్ అని ఓపెన్‌గా చెప్పేసింది. అసలు ఇంతకీ అనుపమను అంతగా నరకం చూపించిన ఆ 'నార్సిసిస్ట్ బిహేవియర్' అంటే ఏంటి? ఆ మనస్తత్వం ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.. నార్సిసిజమ్ అంటే మానసిక శాస్త్రంలో తన గురించి తాను విపరీతమైన గొప్పలు ఊహించుకుంటూ, ఎదుటివారి భావాలను పూర్తిగా తొక్కిపడేసే స్వార్థపూరిత మనస్తత్వం. 'అపరిచితుడు' తరహా ప్రవర్తన (Extreme Mood Swings): అనుపమ చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఒకరోజు విపరీతమైన ప్రేమ చూపుతాడు , మరుసటి రోజే ఏ చిన్న విషయానికైనా రాక్షసంగా మారతాడు. ఆ తర్వాత మళ్లీ తన తప్పు లేనట్లే వచ్చి క్షమాపణలు చెప్పి ఏడుస్తాడు. ఈ విధమైన సైకలాజికల్ డ్రామాతో ఎదుటివారిని అయోమయానికి గురిచేస్తారు. తప్పు వారిదే అయినా, మాటల చాతుర్యంతో ఎదుటివారిపైకి నెట్టేస్తారు. "నీ వల్లే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది" అని నమ్మించి, ఎదుటివారినే గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు. అనుపమ "ఆ రిలేషన్షిప్లో నా వ్యక్తిత్వం కుంచించుకుపోయినట్లు అనిపించింది" అని చెప్పారు. నార్సిసిస్ట్లు తమ భాగస్వామి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిని తమపై మాత్రమే ఆధారపడేలా చేస్తారు. సంబంధంలో ఎంత హింసించినా, బయటి ప్రపంచానికి లేదా చివర్లో మాత్రం తామే బాధితులమని కలరింగ్ ఇస్తారు. భాగస్వామి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా వీరికి పట్టింపు ఉండదు. అంతా తమ ఆధిపత్యం, తమ అవసరాల చుట్టూనే తిరగాలని కోరుకుంటారు. నార్సిసిస్ట్ మనస్తత్వం ఉన్నవారితో ప్రేమలో ఉండటం అంటే ప్రతిరోజూ ఒక మానసిక యుద్ధం చేయడమే. ఇలాంటి ప్రవర్తన అమ్మాయిల్లో

మనం సహజంగానే మన గురించి మనకు పూర్తిగా తెలుసని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం మన వ్యక్తిత్వం, సామర్థ్యాలు, బలహీనతలు, భావోద్వేగాలు, నిర్ణయాల గురించి మనం వేసే అంచనాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. మన గత అనుభవాలు, ఇతరుల అభిప్రాయాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అలాగే మనలో పనిచేసే కొన్ని కాగ్నిటివ్ బయాస్ మన సెల్ఫ్ ఇమేజ్ ని ప్రభావితం చేస్తాయి. అప్పుడు మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే అవకాశం ఉంది. అలాంటి 5 సందర్భాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒక పరీక్షలో ఫేయిల్ అయినా, ఉద్యోగంలో పొరపాటు జరిగినా, సంబంధంలో సమస్య వచ్చినా కొంతమంది వెంటనే “నేను ఫెయిల్యూర్”, “నాలో టాలెంట్ లేదు”, “నేను మంచి వ్యక్తిని కాదు” అనుకుంటారు. కానీ ఒక సంఘటన మన మొత్తం వ్యక్తిత్వాన్ని చూపించదు. మన గురించి మన మెదడులో ఏర్పడిన నమ్మకాలు తర్వాత మనం చూసే సమాచారాన్ని కూడా ప్రభావితం చేయగలవు. అందుకే ఒక తప్పును ఆధారంగా చేసుకుని మన సామర్థ్యాలపై తీర్పు ఇచ్చుకోవడం మంచిదికాదు. మన సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు మనం ఎప్పుడూ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండలేము. కొన్ని సందర్భాల్లో తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి తన సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవచ్చు. మరోవైపు, కొందరు తమ సామర్థ్యాలను అవసరానికి మించి తక్కువగా అంచనా వేసుకోవచ్చు. అందుకే వాస్తవ పనితీరు ఆధారంగా మనల్ని మనం అంచనా వేసుకోవడం మంచిది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది నేను పూర్తిగా ఆలోచించి తీసుకున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మన నిర్ణయాల వెనుక ఉన్న అన్ని కారణాలు మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. “నాకు ఇది నచ్చదు” అని చెప్పడం చాలా సులభం. కానీ దాని వెనుక భయం, గత అనుభవం, సామాజిక ఒత్తిడి లేదా విఫలమవుతామనే ఆందోళన ఉండవచ్చు. కాబట్టి మన నిర్ణయాలను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. మనం చేసిన

కోపంతో వెంటనే రియాక్ట్ అవుతున్నారా? ఈ 5 టెక్నిక్స్ ట్రై చేయండి ఈ వార్తకు సంబంధించిన

రూ.500కి బదులుగా రూ.499 ధరను చూస్తే కేవలం ఒక్క రూపాయి మాత్రమే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మన మెదడు ఈ రెండు ధరలను ఒకే విధంగా చూడదు. రూ.500 కంటే రూ.499 తక్కువ ధరగా అనిపిస్తుంది. దీనినే మార్కెటింగ్‌లో ‘చార్మ్ ప్రైసింగ్’ (Charm Pricing) అంటారు. ధర చివరలో 9, 99 వంటి అంకెలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి మరింత చౌకగా ఉందనే భావనను వినియోగదారుల్లో కలిగించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు రూ.799 ధర ఉన్న వస్తువు, రూ.800 కంటే తక్కువ ధరలో ఉందనే భావన కలిగిస్తుంది. వాస్తవానికి తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అయినా, ధరను చూసే విధానంలో మాత్రం మార్పు వస్తుంది. 9తో ముగిసే ధరల వెనుక మరో మానసిక అంశం ‘లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్’. అంటే మనం ధరను చూసేటప్పుడు మొదటి అంకెపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.499 ధరను చూసినప్పుడు మన మెదడు మొదట ‘4’ను గుర్తిస్తుంది. అదే రూ.500 అయితే మొదటి అంకె ‘5’ అవుతుంది. దీంతో రూ.499 ధర రూ.500 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇదే విధంగా రూ.999 ధర కూడా రూ.1,000 కంటే తక్కువగా అనిపిస్తుంది. ఈ చిన్న తేడాను ఉపయోగించుకుని వ్యాపారులు ఉత్పత్తుల ధరలను వినియోగదారులకు ఆకర్షణీయంగా చూపిస్తారు. 9 లేదా 99తో ధరలను ముగించే పద్ధతి కొత్తది కాదు. దీని మూలాలు 1900ల ప్రారంభంలోనే ఉన్నాయని చెబుతారు. ఆ సమయంలో కొన్ని దుకాణాల్లో ప్రొడక్ట్ ల ధరను పూర్తి మొత్తంగా కాకుండా 99 సెంట్లకు ముగించేలా పెట్టేవారు. ఉదాహరణకు ఒక వస్తువు ధర ఒక డాలర్ కాకుండా 99 సెంట్లుగా ఉండేది. దీనివల్ల కస్టమర్‌కు చిల్లర ఇవ్వడానికి క్యాష్ రిజిస్టర్‌ను తెరవాల్సి వచ్చేది. దీంతో ఉద్యోగులు డబ్బును తీసుకుని లావాదేవీ నమోదు చేయకుండా తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని తగ్గించవచ్చని వ్యాపారులు

ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి లేకపోవడం, చిన్న పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే అనుభవమే. అయితే ఇది ప్రతిసారీ బద్ధకం అని అనుకోవడం సరైంది కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. అవేంటో చూద్దాం. సైకాలజీ నిపుణుల ప్రకారం మనకు ఏ పని చేయాలనిపించకపోవడానికి ముఖ్యమైన కారణం మానసిక అలసట. రోజంతా పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మెదడుకు తగిన విశ్రాంతి ఉండదు. బయటకు పెద్దగా శారీరక పని చేయకపోయినా మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణ పనులు కూడా పెద్ద భారంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తున్నప్పుడు “ముందు ఏం చేయాలి?” అనే ఆలోచన కూడా ఒత్తిడిని పెంచి పనిని ప్రారంభించే ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, తరచూ నిద్ర లేవడం లేదా ఎక్కువసేపు నిద్రపోయినా విశ్రాంతిగా అనిపించకపోవడం వల్ల మరుసటి రోజు శక్తి తగ్గిపోవచ్చు. అలసటతో పాటు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. డిప్రెషన్లో కూడా నిద్రలో మార్పులు, శక్తి తగ్గడం, ఆసక్తి కోల్పోవడం, ప్రేరణ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పని పూర్తి చేయాలి, ఈ టైం లోపు అయిపోవాలి, నేను తప్పకుండా విజయం సాధించాలి.. అనే ఒత్తిడి ఎక్కువైతే పని చేయడం హ్యాపిగా కాకుండా భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పెద్ద పనిని మొత్తం ఒకేసారి పూర్తి చేయాలని ప్రయత్నిస్తే మెదడుకు చాలా కష్టమైన లక్ష్యంగా కనిపించవచ్చు. దానివల్ల పని ప్రారంభించడానికే మనసు వెనుకాడుతుంది. అందుకే పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పనిని ఎంచుకోవడం మంచి పద్ధతి