© 2026 nimisham.in

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఒక హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమంగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ‘ది రన్నర్’ (The Runner). ‘వండర్ వుమెన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన గాల్ గాడోట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ తెరకెక్కించిన ది రన్నర్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ది రన్నర్ సినిమా అందుబాటులో ఉంది. ‘ద రన్నర్’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. లండన్‌లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఒక కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను

Nellore: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు 'జై కొట్టు' నినాదం ఆవిష్కరణ నెల్లూరు: యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సమాజంలో మార్పుకు వారిని భాగస్వాములుగా చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజిబాబు అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యువత కోసం ‘జై కొట్టు’ అనే నినాదాన్ని ఆవిష్కరించి ప్రకటించారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన కార్యకర్తలు, యువత నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు జనసేన పార్టీలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ‘జై కొట్టు’ నినాదంతో యువతను పెద్ద సంఖ్యలో రాజకీయాల వైపు ఆకర్షించి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. యువతతోనే సమాజంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని సుజయ్ బాబు అన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువతను సమష్టిగా ముందుకు నడిపించి వైఎస్సార్సీపీని 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పరిమితం చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం పవన్‌కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సుజయ్ బాబు అన్నారు. ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో యువతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం భారీ కేక్ ను కట్ చేసి

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన జైకొట్టు లోగో ఆవిష్కరణ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. చెయ్యొత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్‌ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్‌ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’ పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన నాదెండ్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం Jai Kottu Logo Launch: జనసేన పార్టీ తమ అధికారిక యువజన విభాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ యువజన విభాగానికి 'జై కొట్టు(Jai Kottu Logo Launch)' అనే శక్తివంతమైన పేరును ఖరారు చేస్తూ, దానికి సంబంధించిన లోగోను పిఠాపురంలో ఘనంగా ఆవిష్కరించారు. పార్టీ నాదెండ్ల మనోహర్ ఈ లోగోను విడుదల చేయగా, పెద్ద ఎత్తున జనసైనికులు, యువత హాజరయ్యారు. రాష్ట్ర నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతైనా ఉందని, వారి భావాలను, సమస్యలను వేదికపైకి తీసుకురావడానికే ఈ వేదికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. BRS Charge Sheet: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీఆర్ఎస్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పిఠాపురంలో వేడుకగా కార్యక్రమం: నాదెండ్ల మనోహర్ లోగో ఆవిష్కరణ: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా 'జై కొట్టు' లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి యువశక్తి ఎంతో కీలకమని పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో 'జై కొట్టు' విభాగం చురుగ్గా వ్యవహరిస్తుందని, యువతలోని నాయకత్వ పటిమను బయటకు తీయడమే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం: ఈ ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన ప్రత్యేక ఆడియో మెసేజ్ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సందేశంలో యువతకు దిశా నిర్దేశం చేస్తూ, బాధ్యతాయుతమైన రాజకీయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 'జై కొట్టు' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది యువత ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని

జనసేన పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జై కొట్టు లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. ఈరోజు(బుధవారం) కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నియంత జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పనిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ కాలికి గాయంతో ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. కాసేపటికే

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదల నుంచి అఫ్లికేషన్లు తీసుకోవటంతో పాటు ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ నిర్వహించారు. లాటరీలో ఇళ్లకు ఎంపికైన వారి పూర్తి వివరాలను హౌసింగ్ బోరు వెబ్సైట్లో పెట్టింది. నియోజకవర్గాల వారీగా దరఖాస్తు నంబరు, పేరు, ప్రస్తుతం ఉంటున్న చిరునామాతో సహా ఏర్పాటు చేసింది. ఎంపికైన వారిపై ఇతర దరఖాస్తుదారులకు ఎవైనా అభ్యంతరాలుంటే తెలియజేసేలా ఆ పక్కనే అవకాశం కల్పించారు.ఇక నేటి నుంచి ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన వారి తుది పరిశీలన చేపట్టనున్నారు. మెుత్తం 16 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో.. ఆ కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలోనే ఉంటుందా లేదా అని అధికారులు వచ్చి పరిశీలన చేయనున్నారు. ఇందుకు హౌసింగ్ బోర్డు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 480 ఇళ్లకుగాను 600 మందికిపైగా అధికారులు ఎంపిక చేశారు. వీరందరినీ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నియోజకవర్గానికి 20 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు కనీసం 150 కుటుంబాల వద్దకు వెళ్లి.. వారి నివాసం నిర్ధారించనున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.అధికారులు పరిశీలించే అంశాలు ఇవే.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన వారు స్థానికంగానే ఉంటున్నారా లేదా అని అధికారులు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత సదరు ఇంటిని జియోట్యాగ్ చేస్తారు. అఫ్లికేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవేనా కాదా అనేది చూస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలిస్తారు. గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో ఉంటున్నాడా లేదా అని దర్యాప్తు చేస్తారు. వివరాలన్నీ అక్కడి నుంచే యాప్‌లో అప్లోడ్ చేస్తారు.ప్రస్తుతం నియోజకవర్గానికి 480 ఇళ్లను నిర్మిస్తుంటే.. అంతే మందిని ఎంపిక చేశారు

ఆత్మకూరు ఈటీవీ: ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు ఒంటరిగా ఆత్మకూరులో నివసిస్తున్నాడు. మంగళవారం పింఛను డబ్బులు రావడంతో ఆ డబ్బులు, అతని వద్ద అదనంగా ఉన్న మరో రూ. వెయ్యి మొత్తం రూ.4,500 నగదును అతని వద్ద ఉంచుకుని నిద్రించాడు. ఇలా ఉండగా కొందరు యువకులు ఇతనిపై దాడికి పాల్పడి మొత్తం నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మకూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు చిల్లర దొంగతనాలకు, ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆకతాయిలా ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అలాగే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. టాక్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని తిరవనంతపురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అక్కడ చాలా కాలం క్రితం ఓ రోడ్డు మలుపులో గర్భవతి అయిన ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ మలుపు దగ్గరక వెళ్లిన చాలా మంది కనిపించకుండా పోతారు. మరి ఆ మలుపులో నిజంగానే దెయ్యాలున్నాయా? గర్భవతి అయిన అమ్మాయి ఎలా చనిపోయింది? చివరికి ఈ మిస్టరీని ఛేదించారన్నదే ఈ సినిమా కథ. కేరళలోని తిరువనంత పురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు సుమతి వలవు. ఇదేదో సినిమా కోసంపెట్టిన పేరు కాదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిజంగానే

బుచ్చిరెడ్డిపాలెం: పేదల సంక్షేమానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 62 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో పంచేడు పంచాయతీ పరిధిలో రూ.4.44 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, 108 ఇళ్లకు సోలార్ కనెక్షన్లు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నుడా నిధులతో రూ.7.98 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అర్హులైన పేదలకు సొంతింటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచేడు-బుచ్చిరెడ్డిపాలెం రహదారి నిర్మాణానికి రూ. కోటి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించి మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సర్వేపల్లి(ఈటీవీ): కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పోటాపోటీగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని కామాక్షినగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు తెదేపా అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. తన సొంతూరుతో సమానమైన తోటపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తోటపల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తోటపల్లి పంచాయతీలో ప్రతి నెలా రూ.7.50 లక్షల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. మూడు జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేశామని, త్వరలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించబోతున్నామని తెలిపారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన నీటిపారుదల శాఖకు పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
'పెద్ది' సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. సుకుమార్ దర్శకత్వంలో 'RC 17' అనే వర్కింగ్ టైటిల్ తో అప్పట్లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది క్లారిటీ లేదు. ఇటీవల చరణ్ చేతికి సర్జరీ జరగడంతో, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గుజరాత్లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’. సుమారు రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన వీ ఈ గుజరాతీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీని కోసం రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారనే ఓ వార్త బీటౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మూవీలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంటుంది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. 'గేమ్ ఛేంజర్' స్టోరీ ఐడియా ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్.. ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే.. 'శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్' అనే న్యూస్ మెగా అభిమానులను ఆకర్షిస్తోంది.'గోపాల గోపాల' మూవీలో మోడరన్ శ్రీకృష్ణ అవతార్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. బాబాయ్ పోషించిన అలాంటి పాత్రలోనే ఇప్పుడు అబ్బాయ్ చరణ్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ

పాన్ఇండియా రేంజులో ఆర్భాటంగా విడుదలవుతున్న సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న తరుణంలో, ఓ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రచారానికి కూడా బడ్జెట్ లేక సైలెంటుగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది సాధిస్తున్న విజయం చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? ఆగస్టు 7న ఏమాత్రం హడావుడి లేకుండా విడుదలైంది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). స్టార్లుగానీ, తెలిసిన ముఖాలుగానీ లేని ఆ సినిమాకు తొలిరోజు వసూళ్లు.. కేవలం రూ.10 లక్షలు. ఓపెనింగే ఇంత డల్‌గా ఉంటే ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. తొలివారంలో రూ.1కోటి 8లక్షలు వసూలు చేసింది. రెండో వారం మరింత దయనీయం. రూ.40లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక దీని పనైపోయినట్లే, బొమ్మ తీసేయడమే తరువాయి అని అనుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. తొలి 14 రోజుల్లో రూ.1.48 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, ఒక్క మూడో వారంలోనే ఏకంగా రూ.10.4 కోట్లు రాబట్టింది! నాలుగో వారంలో ఈ సినిమా దూకుడు చూసి ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 22వ రోజు రూ.6.25 కోట్లు, 23వ రోజు రూ.9.25 కోట్లు, 24వ రోజు రూ.12.75 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాల మొత్తం కలెక్షన్ల కన్నా, 24వ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువంటే, ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.47.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్లకు చేరువవుతోంది. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తే రూ.200 కోట్లొచ్చాయ్..! 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రచారానికి కూడా డబ్బుల్లేక

ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా', YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఆలియా భట్, శర్వరి వాఘ్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ స్పై యూనివర్స్‌లో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆలియా, షర్వరిలతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. దీంతో రిలీజ్ కు ముందే 'ఆల్ఫా' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లతో మాత్రమే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు, 'ఆల్ఫా' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన తర్వాత, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆల్ఫా సినిమాకు ఉదయ్ చోప్రా స్టోరీ అందించగా... యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మాజీ ఏజెంట్ కూతురు సీత (ఆలియా భట్). ఆమెను చిన్నప్పటి నుంచి సమాజానికి దూరంగా ఓ ప్రొఫెషనల్ సోల్జర్‌గా పెంచుతాడు. ఇదే సమయంలో ఓ అంతర్జాతీయ తీవ్ర వాద ముఠా దేశ భద్రతకే పెను ముప్పుగా మారుతుంది. ఆ ముఠా లీడర్ (బాబీ డియోల్)ను అణచి

Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు ఈ వార్తకు సంబంధించిన

రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు. తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా

వరుణ్ తేజ్ నటించిన హిట్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్‌ఫుల్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

పొదలకూరు: పొదలకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మూడు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు సంప్రదాయబద్ధంగా తొలి చద్ది కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. తొలి చద్ది కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నెల్లూరు (నగర పాలక సంస్థ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ మొత్తాన్ని అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ రాగానే రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. గత ప్రభుత్వంలా వాయిదాల పద్ధతిలో కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారుల పింఛన్లను ఒకేసారి రూ.4 వేలకు పెంచి అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల కోసం రూ.73,594.44 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నెల్లూరు (నగర పాలక సంస్థ): దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒకచరిత్ర.. వైకాపా ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టంమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైకాపా ఐదేళ్లు ప్రజావ్యతిరేక పాలన సాగించిందన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తుందన్నారు. హిందు మతానికి ఘోర అన్యాయం జరిగిందని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆలయాల్లో రథాలు తగులపడినప్పుడు, విగ్రహాలు తలలు తెగగొట్టినప్పుడు, సింహాలు చోరీకి గురైనప్పుడు మీ నోళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీని అస్థిరం చేయాలని ఓ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపా క్రెడిట్ చోరీ చూస్తుంటే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగన్ అని చెప్పేట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

సెప్టెంబర్ మొదటి వారంలో వినోదాన్ని అందించడానికి వివిధ డిజిటల్ వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వారం సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు మరియు సిరీస్‌లు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. థ్రిల్లర్, కామెడీ, హారర్ మరియు కోర్ట్‌రూమ్ డ్రామా వంటి వైవిధ్యమైన శైలులలో ఈ లైనప్ రూపుదిద్దుకుంది. కుటుంబ సమేతంగా చూడటానికి మరియు ఒకేసారి వరుసగా వీక్షించడానికి అనువైన అనేక శీర్షికలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 3న తాప్సీ పన్ను నటించిన గాంధారి చిత్రం ప్రసారం కానుంది. కిడ్నాప్ అయిన తన కుమార్తెను వెతుక్కుంటూ చూపు కోల్పోయిన ఒక తల్లి చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాతో చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనితో పాటు ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన వరుణ్ తేజ్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు సెప్టెంబర్ 4న రానుంది. అనంతపురం కనకరాజు శరీరంలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇదిలా ఉండగా జూలై 10న థియేటర్లలో సందడి చేసిన అజయ్ దేవగన్ మరియు సంజయ్ మిశ్రా ల కామెడీ చిత్రం ధమాల్ 4 కూడా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. గుప్తనిధి వేట మరియు గందరగోళం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుంది. దీనితో పాటు ద జెంటిల్మెన్ సీజన్ 2 కూడా సెప్టెంబర్ 3న ప్రసారానికి సిద్ధంగా ఉంది. మరొక ప్రముఖ సంస్థ సోనీ లివ్ లో కుంచాకో బోబన్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం సెప్టెంబర్ 4న అందుబాటులోకి రానుంది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక పాత కేసు తిరిగి తెరుచుకోవడంతో ఒక పోలీసు అధికారి జీవితంలో వచ్చే మార్పుల చుట్టూ తిరుగుతుంది. ఫలితంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను

ఇంటర్నెట్ డెస్క్: జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ (Vadala). జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైంది. ‘ఆహా’ వేదికగా సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథేంటంటే..: యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ డాక్టర్. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలే ఆయన ప్రపంచం. 20ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి ప్రవేశిస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడతాడు. అలా అతనిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. ఆ తర్వాత సిద్ధార్థ్‌ను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్రణాళిక రచిస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైందనేది కథ. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

రాజమౌళి (SS Rajamouli) మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్. ఆయన సినిమాల మార్కెట్ ఇండియా దాటి అనేక దేశాలకు పాకింది. ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఆయన పారితోషికం ఉంటుంది కదా. ఐతే “వారణాసి” (Varanasi) సినిమాకి పారితోషికం బదులు ఓటిటి రైట్స్ తీసుకున్నారట. ఓటిటి రైట్స్ ఎంత వస్తే అంత ఆయన పారితోషికం అన్నమాట. అంటే నిర్మాత ఆయనకి ఇచ్చేది ఏమి లేదు. ఓటిటి కంపెనీలు సినిమాకి ఇచ్చే రైట్స్ మొత్తం తానే తీసుకొని నిర్మాత పెట్టుబడిని తగ్గిద్దామనుకున్నారు. తానూ భారీగా తన ఎకౌంట్ లో వేసుకుందామని భావించారు ఈ రైట్స్ తో. ఐతే పాపం, రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు వేసుకున్న లెక్కలు వేరు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వేరు. ‘వారణాసి’ సినిమా మొదలు కాకముందు, ఓటిటి కంపెనీలు భారీ పాన్ ఇండియా చిత్రాలను ఎగబడి వందల కోట్ల రూపాయలు చెల్లించి కొన్నాయి. ‘పుష్ప 2’ సినిమాని 270 కోట్లు పెట్టి కొనుక్కోంది Netflix సంస్థ. ‘పుష్ప 2’కే అంత వస్తే తన సినిమాకి ఈజీగా నాలుగు వందల కోట్లు వస్తాయని రాజమౌళి భావించారు. ఆ లెక్కలతోనే ఈ సినిమా ఓటిటి రైట్స్ (Varanasi OTT Rights) తనకి రాయించుకున్నారు. ఐతే ఈ రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఓటిటి సంస్థలు సినిమాలు కొనడం తగ్గించాయి. అలాగే ఇచ్చే రేట్స్ లో కూడా భారీగా కోత వేశాయి. ‘వారణాసి’ సినిమా ఒటిటి రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అమెజాన్, జియో హాట్ స్టార్ రాజమౌళి అడుగుతున్నా రేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జీ5 కూడా 175 కోట్లకుమించి ఇవ్వలేమని చెప్పిందట. మిగిలింది నెట్ ఫ్లిక్స్ మాత్రమే. ఈ సంస్థ 200 వద్ద బేరం ఆడుతోంది. ఫైనల్ గా 225 విత్ జీఎస్టీ వచ్చేలా ఉంది. అంటే మొత్తంగా 200 నుంచి 225 కోట్లు

ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి. ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్‌లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో

తమిళ సినీ పరిశ్రమలో థియేటర్, ఓటీటీ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో సెప్టెంబర్ 1 నుంచి కార్యకలాపాలు స్తంభించనున్నాయి. కొత్త తమిళ సినిమాల విడుదలలు పూర్తిగా నిలిపివేయడంతో పాటు షూటింగ్‌లు, నిర్మాణానంతర పనులు కూడా ఆపాలని నిర్మాతల సంఘాలు ప్రకటించాయి. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కీలక ప్రకటన చేశాయి. ఆగస్టు 22న చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుంచే తమిళ సినీ పరిశ్రమ కార్యకలాపాలపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్లలో విడుదలైన సినిమాలకు 8 వారాల ఓటీటీ గడువు తప్పనిసరి చేయాలన్న డిమాండ్. తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఈ నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత 8 వారాలు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల చేయబోమని నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాంటి హామీ ఇచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేశాయి. నిర్మాతలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిబంధన విధించడాన్ని నిర్మాతల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినిమాల విడుదలలు నిలిపివేయడం ద్వారా తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని నిర్ణయించాయి. నిర్మాతల వాదన ప్రకారం తమిళనాడులో ప్రతి సంవత్సరం 250కి పైగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వాటిలో అత్యధిక చిత్రాలు ఆశించిన ఆదాయం సాధించలేక నిర్మాతలకు ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిని తిరిగి పొందడంలో ఓటీటీ హక్కులు కీలకంగా మారాయని నిర్మాతల సంఘాలు పేర్కొంటున్నాయి. 8 వారాల గడువును తప్పనిసరి చేస్తే ఓటీటీ ఒప్పందాలపై ప్రభావం పడుతుందని వారి వాదన. ఇదిలా ఉండగా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ఏకపక్ష నిబంధన లేదని నిర్మాతలు

తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సంక్షోభం నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో, 2026 సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ వివాదానికి ప్రధాన కారణం.. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ చేసే కాలపరిమితి. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలు త్వరగా ఓటీటీలో అందుబాటులోకి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందని, తద్వారా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం తమ వాణిజ్యపరమైన వెసులుబాటును కోరుకుంటున్నారు.ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు కొత్త సినిమాలను విడుదల చేయకూడదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అయితే, ఇది పూర్తిస్థాయి బంద్ కాదని, సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం సెప్టెంబర్ నెలతో పాటు ఆ తర్వాత విడుదల కావాల్సిన పలు చిత్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడవు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, అలాగే థియేటర్ల సమస్య.. ఇలా చాలా కారణాలతో కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అలా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని సినిమాలు ఒక్కోసారి ఓటీటీ లేదా యూట్యూబ్‌లో వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. భారీగా వ్యూయర్ షిప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాల విషయంలో తరచూ ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. గతేడాది శంబాల వంటి సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా వ్యూయర్ షిప్ వచ్చింది. ఇప్పుడీ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హీర సంజీవ్ ఓ హాస్పిటల్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటాడు. అదే హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేసే పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయితే అదే సమయంలో సిటీలో పిల్లలు వరుసగా అదృశ్యమవుతారు. అలా సుమారు 23 మంది పిల్లలు మిస్సింగ్ అవుతారు. అయితే అనుకోకుండా ఈ కేసులో సంజీవ్ ఇరుక్కుంటాడు. మరి ఆ పిల్లల వెనక సందీప్ ఉన్నది నిజమేనా? అసలు ఆ పిల్లల కిడ్నాప్ కు సంజీవ్ కు ఉన్న సంబంధమేంటి? చివరకు ఈ కేసు ఎలా పరిష్కారమయ్యింన్నదే ఈ సినిమా కథ. నరుడి బ్రతకు నటన సినిమాతో ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్న నితిన్ ప్రసన్న హీరోగా నటించిన చిత్రం A (ఏడీ ఇన్ఫినిటమ్). మళ్లీ

మెగాస్టార్ చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఎదిగిన తర్వాత తన కష్టాన్ని, మూలాలను మరచిపోలేదు. అందుకే కష్టంలో ఎవరున్నా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ లాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. లెక్కకు మించి ఆర్థిక సహాయాలు చేశారు. గుప్తదానాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేడు ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. సినీ కళాకారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే చిరు వెంటనే స్పందిస్తారు. నటుడు శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఎవ్వరికీ తెలియని, మాకు మాత్రమే తెలిసిన గుప్తదానాలు, సహాయాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. అన్ని విషయాలు ఆయన దృష్టివరకు వెళ్లడం కష్టం. అన్నింటినీ ఆయన పట్టించుకోలేరు. కానీ ఆయన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టారు. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు లాంటి నటులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిరంజీవి మాచేత డబ్బులు ఇచ్చి పంపారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నట్లు చిరంజీవి గారికి సురేఖ గారి ద్వారా తెలిసింది. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు కష్టాల్లో ఉన్నట్లు సురేఖ గారు టీవీలో చూసి చిరంజీవికి చెప్పారు. చిరంజీవి గారు నన్ను వెంటనే ఇంటికి పిలిచి.. శివాజీ రాజా ఇదిగో ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇవ్వు.. ఈ 2 లక్షలు గుండు హనుమంతరావుకు ఇవ్వు అని నాకు డబ్బులు ఇచ్చి వాళ్లకు అందేలా చేశారు. ఒక వేళ దృష్టికి వచ్చినా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ చిరంజీకి గారు అలా చేయరు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కష్టాల్లో ఉన్నా గమనిస్తూనే ఉంటారు. సాయం చేస్తూనే ఉంటారు అని శివాజీ రాజా తెలిపారు

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. హైదరాబాద్ సిటీ: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్సైట్ క్యూర్ స్టేట్సలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది? 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్‌లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్‌ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఓటీటీ ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. కనికా ధిల్లాన్ రచించి, నిర్మించిన ఈ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. సెప్టెబర్ 3, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలతో పాటు హై- యాక్షన్ సన్నివేశాలతో ‘గాంధారి’ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాప్సీ, కనికా ధిల్లాన్, నెట్‌ఫ్లిక్స్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గాంధారి’పై ఆసక్తి నెలకొంది. ఎలా ఉంటుందంటే.. కల్పిత పట్టణం జయ్పుర్రా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ బాణి అనే తల్లి పాత్రలో కనిపించనుంది. తన కుమార్తెను వెతికి, ఆమెను కాపాడేందుకు బాణి చేసే పోరాటమే కథాంశం. కుమార్తెకు దగ్గరవుతున్న కొద్దీ ఆమెకు ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్లు మరింత తీవ్రమవుతాయి. ఈ సినిమా కోసం తాప్సీ అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక తల్లి తన పరిస్థితులకు తలొగ్గకుండా కూతురిని కాపాడుకునేందుకు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు కనికా ధిల్లాన్ తెలిపారు. బాణి ప్రయాణం పచ్చిగా, పట్టుదలతో, వ్యక్తిగత భావోద్వేగాలతో సాగుతుందని ఆమె పేర్కొన్నారు. తాప్సీతో మరోసారి కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పారు. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ

ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. భయానక, జానపద కథల ఆధారంగా తెరకెక్కించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి మరాఠీ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. ఈ చిత్రం కథ, మహారాష్ట్రకు చెందిన జానపద కథలు, రహస్యం, నిధి , భయంల కలయికను చూపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరేంటీ... కథేంటీ అనే వివరాలు తెలుసుకుందామా. ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పేరు 'ఘబడ్కుండ్'. దాగి ఉన్న బంగారం, ఒక భయంకరమైన శక్తి గురించిన పురాణ గాథతో ముడిపడి ఉన్న ఒక రహస్యమైన బావి చుట్టూ దీని కథ తిరుగుతుంది. ఈ బావిలో నిధి ఉందని ఆ గ్రామ ప్రజలకు తెలుసు. అయితే, దానిని పొందడానికి ప్రయత్నించే వారికి ఈ ప్రదేశం ప్రాణాంతకంగా మారుతుంది. ఆ నిధిని కాపాడే అదృశ్య శక్తి కారణంగా బావిలోని రహస్యం మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ చిత్రంలో, దిలీప్ ఒక సాధారణ కుటుంబంలో నివసించే యువకుడు. ఒక సంఘటనలో, అతను అనుకోకుండా ఆ రహస్యమైన బావి వద్దకు చేరుకుంటాడు. అక్కడ, అతను ఒక మహిళ గొంతు విని ప్రమాదంలో పడతాడు. కానీ ఆశ్చర్యకరంగా, అతను ఆ బావి నుండి ప్రాణాలతో బయటపడతాడు. ఈ సంఘటన తర్వాత, అతని పుట్టుకకు, ఆ బావి చరిత్రకు మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి రావడం మొదలవుతుంది. అప్పుడే అసలు కథ ఉంటుంది. దిలీప్ ఈ రహస్య నిధికి వారసుడని వెల్లడైన తర్వాత కథ మరింత మలుపులు తిరుగుతుంది. మరోవైపు, ఖాంగ్రీ అనే తాంత్రికుడు కూడా ఈ నిధిపై కన్నేసి ఉంటాడు. పౌర్ణమి రోజున, బావిలోంచి నిధిని బయటకు తీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే, ఈ పని కోసం ఒక అమ్మాయిని ఉపయోగించుకోవడానికి కుట్ర పన్నుతారు, ఆ తర్వాత సంఘటనలు భయంకరమైన
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ భావోద్వేగ ప్రేమ కథా చిత్రానికి, ప్రముఖ దర్శకుడు మరియు రచయిత సాయి రాజేష్ కథ అందించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. గతనెల 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీతో పాటు సాయి రాజేష్ అందించిన కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్లో అద్భుతమైన వసూళ్లను సాధించి, కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న ఈ ప్రేమకథ, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఫైనల్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఈ సినిమాను నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వీక్షకులు, మళ్లీ చూడాలనుకునే లవర్స్ ఇప్పుడు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ఈ సూపర్‌హిట్ చిత్రాన్ని వీక్షించవచ్చు
2026 ఆగష్టు 16న అమెరికాలోని చార్లెట్ నగరంలో హిల్టన్ ఎయిర్పోర్ట్ రిసార్ట్‌లో 'సిలికానాంధ్ర మనబడి' ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ పారుపూడి కిరణ్, శ్రీ తాళ్ళూరి ప్రత్యూష, శ్రీ గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో అమెరికా, కెనడాల నుంచి 200 పైగా పిల్లలు , 1000 మంది ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి పోటీల్లో దాదాపు 3,500 మంది పాల్గొనగా, గెలిచిన విద్యార్థులు ఇక్కడి తుదిపోరులో పోటీ పడ్డారు. ఈ పోటీలను పదరంగం, తిరకాటం, ఒనిమా అనే ఆటలను బుడతలు, సిసింద్రీలు, చిరుతలు అనే మూడు వయోవర్గాల్లో నిర్వహించారు. పోటీల విజేతలు.. పదరంగం: సిసింద్రీల విభాగంలో పెద్దింటి శ్రీ యోగ అద్వైత (LA) ప్రథమ స్థానాన్ని, దొనకంటి శ్రేయాన్స్ (Edison) ద్వితీయ స్థానాన్ని సాధించారు. అలాగే చిరుతల విభాగంలో దువ్వూరి అజిత్ (Edison) ప్రథమ బహుమతిని, మన్నేమేల లక్ష్మీ (Tampa) ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. తిరకాటం: బుడతల విభాగంలో అక్షర శ్రీనివాస్ (Cary) ప్రథమ స్థానంలో, సిరిసేని శశాంఖ్ (Baltimore) ద్వితీయ స్థానంలో నిలిచారు. సిసింద్రీల విభాగంలో ఈప్సిత కళ్యాణ్ (Atlanta) ప్రథమ స్థానం, నాలం ధారిష్ (Bay Area) ద్వితీయ స్థానం పొందగా, చిరుతల విభాగంలో గుత్తికొండ వంశీ కృష్ణ (Cary) ప్రథమ స్థానాన్ని, కాట్రగడ్డ ప్రణతి (Detroit) ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఒనిమా: బుడతల విభాగంలో నాలం దేవర్ష్ (Bay Area) ప్రథమ స్థానంలో, యార్లగడ్డ ఐరా (Ashburn) ద్వితీయ స్థానంలో నిలిచారు. సిసింద్రీల విభాగంలో దొనకంటి శ్రేయాన్స్ (Edison) ప్రథమ స్థానం, దత్ ఈశ్వర్ (Bay Area) ద్వితీయ స్థానం సాధించగా, చిరుతల విభాగంలో వడ్డిచర్ల ఆశ్రిత స్నిగ్థ (Louisville) ప్రథమ స్థానాన్ని, కాట్రగడ్డ ప్రణతి (Detroit) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విశేషాలు.. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రభల

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు అధికారికంగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చెన్నై లవ్ స్టోరీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథను బేబీ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ అందించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, త్రిగుణ్, దేవి ప్రసాద్, సిరి హనుమంతు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, రొమాంటిక్ అంశాలు థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు అదే చిత్రాన్ని ఇంటి నుంచే చూసే అవకాశం ఓటీటీ ప్రేక్షకులకు లభించింది. చెన్నై లవ్ స్టోరీకి సంబంధించిన మరో ప్రత్యేకత ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కావడం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్‌లో సినిమా అందుబాటులో ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోపాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ రొమాంటిక్ డ్రామాను చూసే అవకాశం ఏర్పడింది. థియేటర్లలో ఒక స్థాయి ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఇప్పుడు డిజిటల్ స్టీజీపై ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కావడం వల్ల సినిమాకు థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గం చేరువ కానుంది. ఈ సినిమాను ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించారు. సినిమాలో ప్రధాన నటీనటులతోపాటు సహాయ పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా కథకు కీలకంగా నిలిచింది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సాయి

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని తనిఖీ చేయగా.. తొలుత నాలుగు కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. విచారణలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి మద్యం తీసుకున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. దాదాపు 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 55 కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఒక్కో బాటిల్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు లాభం పొందుతున్నట్లు తేలింది. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అమీర్‌పేట్ ఎక్సైజ్ సీఐ బానోత్ పటేల్ వెల్లడించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు చేరింది. ఆగస్టు 21 నుంచి సోనీలివ్‌లో ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు అసలు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఓటీటీ విడుదలతో ఇంటి నుంచే చూసే అవకాశం దక్కింది. ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాణిజ్యపరంగా మంచి ఫలితం అందుకోవడంతో కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్ ప్రయాణం పూర్తయిన తర్వాత దాదాపు నెల వ్యవధిలోనే ఈ సినిమా సోనీలివ్ ప్రేక్షకులకు చేరడం విశేషం. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ‘చెన్నై లవ్ స్టోరీ’కి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. చెన్నై నేపథ్యంలో యువత ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలో రెండో అవకాశాల చుట్టూ కథను రూపొందించారు. దీంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ పాత్రలో కనిపించగా, శ్రీ గౌరీ ప్రియ నివేదిత పాత్రలో నటించారు. త్రిగుణ్, దేవి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ పతాకాలపై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణపై కిరణ్ అబ్బవరం కూడా సంతోషం వ్యక్తం చేశారు. మొదటి ప్రేమలోని నిష్కళంకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను చూపించే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఫలితంగా థియేటర్ విజయానంతరం ఓటీటీ ప్రయాణంపై కూడా ఆసక్తి