Krishnudu Elimination: కృష్ణుడు ఎలిమినేట్.. తొలివారం ముగ్గురు కాదు ఒక్కరే!! బిగ్ బాస్ హౌస్‌లో నరాలు కట్ అయ్యేట్విస్ట్
Krishnudu Elimination: కృష్ణుడు ఎలిమినేట్.. తొలివారం ముగ్గురు కాదు ఒక్కరే!! బిగ్ బాస్ హౌస్‌లో నరాలు కట్ అయ్యే ట్విస్ట్
© 2026 nimisham.in
Krishnudu Elimination: కృష్ణుడు ఎలిమినేట్.. తొలివారం ముగ్గురు కాదు ఒక్కరే!! బిగ్ బాస్ హౌస్‌లో నరాలు కట్ అయ్యే ట్విస్ట్
.webp)
Bigg Boss Telugu 10 Chaithra Elimination: చైత్ర ఎలిమినేషన్.. షాక్ ఇచ్చిన బిగ్‌బాస్!

తాజాగా మొదటిసారి ది ప్యారడైజ్ సినిమా యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. (Srikanth Odela)

ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. (Bigg Boss Elimination)
Charan Elimination: చరణ్ బలిపశువు కాదు.. మళ్లీ వస్తాడా? వీకెండ్ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటి?

Elimination | బిగ్‌బాస్ 10లో నాలుగో రోజే ఎలిమినేషన్ .. చరణ్‌కు అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు!
Bigg Boss 10 Telugu Elimination: చరణ్ ఎలిమినేట్.! రోహిత్ మాస్టర్ ప్లాన్‌కి బలి అయ్యాడా? అప్పుడు ఆర్జే బాషా.. ఇప్పుడు ఆర్జే చరణ్

National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Bigg Boss 10 Telugu Nominations: నామినేషన్ విషయంలో బిగ్ బాస్ ట్విస్ట్.. ప్రతీ ఒక్కరికీ గండమే

National Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాల వేదిక మార్చేశారు..

Bigg Boss 1st Week Nominations: తొలి వారమే హోరాహోరీగా.. బిగ్‌బాస్ 10 ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరంటే?

National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

ఉజ్జయిని: శ్రావణ, భాద్రపద మాసాల్లో ఉజ్జయిని మహాకాళి (Ujjain Mahakal) అమ్మవారి వార్షిక ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈసారి వేడుకల్లో అధునాతన సాంకేతికత ప్రతిబింబించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో మానవ రూపంలో ఉన్న ఓ రోబో (Humanoid Robot) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి.. ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన మానవ ఆకారంలో ఉన్న ఓ రోబోను వార్షిక ఉత్సవాలకు తీసుకొచ్చారు. అది స్థానిక రామ్ ఘాట్‌కు చేరుకోగానే అక్కడున్న పూజారులు దాని చేతికి కంకణం, మెడకు రుద్రాక్ష మాలతోపాటు కాషాయ కండువాను కప్పారు. దీంతో ఆ రోబో కొత్త ఆకారం సంతరించుకుంది. అంతేకాదు.. సంస్కృత మంత్రాలు పఠించిన ఆ మమరమనిషి అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చటించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్‌తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్‌ను డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపిక! Ayodhya Ram Mandir: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య శ్రీరామ మందిరానికి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకం ఖరారైంది. రామమందిర తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారతీయ వాయుసేనలో దాదాపు 39 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలు అందించిన జితేంద్ర మిశ్ర, అత్యున్నత రక్షణ రంగ అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామాలయంలో కానుకలు మరియు విరాళాల నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ కీలక పోస్టుకు పారదర్శకతను తీసుకువచ్చేలా నియామక ప్రక్రియను చేపట్టారు. సీఈవో పోస్టు కోసం ఎంపిక కమిటీ అత్యంత కఠినంగా వ్యవహరించి మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం 16 మంది అర్హులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించారు. ట్రస్ట్ పరిశీలన తర్వాత జితేంద్ర మిశ్ర నియామకం అధికారికంగా ఖరారైంది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర (Jeetendra Mishra) ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలందించారు. సీఈవో పోస్టు కోసం ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ 5,585 దరఖాస్తులను పరిశీలించింది. 16 మందిని ఇంటర్వ్యూ చేసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేయగా.. బుధవారం సమావేశమైన ట్రస్టు సభ్యులు జితేంద్ర మిశ్ర పేరును ఖరారు చేశారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కర్ణుడికీ తప్పలేదట! విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సీఈవో నియామకం చేపట్టింది. జితేంద్ర మిశ్ర 1986లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆయన పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

లక్నో: అయోద్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసింది. జరిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు. వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి
ఇంటర్నెట్‌డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్ధుల తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై, భారత్ కు వచ్చేసి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను తిరిగి తమకు అప్పగించాలని స్వదేశం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతకంటే ముందే హసీనాను తమ దేశానికి అప్పగించాలని షరతు పెట్టారు. కానీ భారత్ స్పందించకపోవడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీనిపై హసీనా స్పందించారు.భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటనకు తనను అప్పగించడాన్ని ఒక షరతుగా పెట్టిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని హసీనా ప్రశ్నించారు. తాను డిసెంబర్ నాటికి తన దేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు హసీనా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె.. బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లడం తన సొంత నిర్ణయమని, తాను నిరవధికంగా బంగ్లాదేశ్ బయట ఉండాలనే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. భారత్‌లో తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎందుకు ప్రభావం చూపాలని హసీనా ప్రశ్నిస్తున్నారు. భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!బ్రిటన్‌లో ఉన్నప్పుడు రెహమాన్ చేపట్టిన రాజకీయ కార్యకలాపాల గురించి కూడా హసీనా ప్రస్తావించారు. అప్పట్లో తాను బ్రిటన్ జోక్యాన్ని కోరలేదన్న విషయం ఆమె గుర్తుచేశారు. తన చుట్టూ ఉన్న రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు హసీనా చెప్పారు. డిసెంబర్ నాటికి బంగ్లాకు తిరిగి రావాలని తాను ఇప్పటికే నిర్ణయించుకున్నానని, ఖచ్చితమైన తేదీ, సమయం, ప్రవేశించే స్థలాన్ని తర్వాత ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నిరవధికంగా కొనసాగనివ్వకూడదు కాబట్టి, తాను

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవినీతిపై గతేడాది ఫిర్యాదులు (corruption complaints) భారీగా నమోదయ్యాయి. 2025లో వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 70,584 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదిక వెల్లడించింది. వీటిల్లో 64,905 సమస్యలను అధికారులు పరిష్కరించారు. ఫిర్యాదుల్లో.. బ్యాంకులు, రైల్వేలకు సంబంధించిన సమస్యలే అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. బ్యాంకులకు సంబంధించి 9,933 ఫిర్యాదులు అందగా.. 9,520 పరిష్కరించారు. 413 పెండింగ్‌లో ఉన్నాయి. రైల్వేలకు సంబంధించి 9,381 ఫిర్యాదులు రాగా.. 8,754 పరిష్కరించారు. 627 పెండింగ్‌లో ఉన్నాయి. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖపై 6,531, స్థానిక సంస్థలపై 4,834, బొగ్గు రంగానికి సంబంధించి 4,118, ఆర్థిక శాఖపై 3,107, దిల్లీ ప్రభుత్వంపై 2,804 ఫిర్యాదులు అందాయి. పెట్రోలియం శాఖపై 2,722, దిల్లీ పోలీసులపై 2,633, రహదారులు-రవాణా శాఖపై 2,139, కేంద్ర హోంశాఖపై 2,036 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందిన ఫిర్యాదులపై చీఫ్ విజిలెన్స్ అధికారులు మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సీవీసీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోందని నివేదిక తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది
ఇంటర్నెట్‌డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీపై తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని విజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 2021- 2026 మధ్య సిప్కాట్ పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు (Farmers), ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఆ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుంది. ఇటువంటి చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది’’ అని విజయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభంలోనూ భారత్ పురోగమనం కాగా, ఇటీవల నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపైనా కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ విజయ్‌ని కోరింది. అటు, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై టీవీకే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు జటాయువు. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ జటాయువు జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో జటాయువు అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్‌వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్‌లైఫ్, బీచ్‌లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown). ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్‌లాండ్‌లో చట్టవిరుద్ధం. కానీ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో (Times Square) జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. మంగళవారం క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో టైమ్స్ స్క్వేర్ వద్ద వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకి కూడా దూసుకెళ్లడంతో వారు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఈ దాడిలో మృతిచెందిన ఎరిన్ పియాసెంటి (Erin Piacenti) బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఐదు నెలల మాతృత్వపు సెలవుల అనంతరం ఉద్యోగానికి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త, చిన్నారితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎరిన్ మృతిపై బ్యాంక్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) విమానయాన సంస్థలు, ప్రయాణికులకు హెచ్చరికలు చేశారు. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఏ క్షణమైనా డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉందని.. రష్యా గగనతలం (Russian Airspace) పౌర విమానయానానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించొద్దని సూచించారు. మాస్కోలోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదని.. అందుకే ఈ బహిరంగ ప్రకటన చేశామన్నారు. విదేశీ ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని జెలెన్స్కీ కోరారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందన్నారు. వారు ప్రారంభించిన యుద్ధం వల్లే ఆ దేశానికి ఈ పరిస్థితి ఎదురయ్యిందని పేర్కొన్నారు. జెలెన్స్కీ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మండిపడ్డారు. వారు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పునఃప్రారంభించాలని తమపై ఎంత ఒత్తిడి చేసినా.. ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాత్రి కీవ్‌పై రష్యా చేసిన దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న నిర్మాత అశోక్‌కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. తెలుగు నిర్మాతలమండలికి (Telugu Film Producers Council) రెండేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికలు ఈ ఏడాది ఈ నెల 6న జరుగనున్నాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ (C Kalyan), మరో నిర్మాత బండ్ల గణేశ్ మొదట పోటీ పడ్డారు. చివరి క్షణంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) పోటీ నుంచి తప్పుకోవడంతో సి.కల్యాణ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక కార్యదర్శి పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ పడుతున్న అశోక్‌కుమార్ (Ashok Kumar) నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆయన న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత ఆయన నామినేషన్‌ను స్వీకరించి, ఎన్నికల ప్రక్రియలో కొనసాగేలా చూడమని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అశోక్‌కుమార్ వెల్లడిస్తూ ‘ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. నిజాయితీ, పారదర్శకత, నమ్మకం, ప్రతి సభ్యుడి ఎన్నికల హక్కుకు సంబంధించిన విషయం’ అని చెప్పారు

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. బాబర్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో కీలక మ్యాచ్‌కు ముందు పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే బాబర్ ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని పాక్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా తెలిపారు. బాబర్‌కు జ్వరం ఉన్నప్పటికీ.. ఫిట్‌గానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటాడని వెల్లడించారు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బాబర్ ఆజమ్ బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక తొలి టెస్టుకు గాయం కారణంగా బాబర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సల్మాన్ అలీ అఘా పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో టెస్టులో బాబర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా మూడో టెస్టుకు ముందు మళ్లీ అనారోగ్యం పాలవ్వడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు జట్టు, కోచింగ్ సిబ్బందిలో పీసీబీ భారీ మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు వరుస ఓటములు.. మరోవైపు
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్‌తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్‌లో కశ్మీర్‌కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సును పాకిస్థాన్ మరోసారి భారత్‌పై ఆరోపణలకు వేదికగా మార్చుకుంది. సింధు జలాల (Indus Treaty) ఒప్పందాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif).. నీటిని రాజకీయ ఘర్షణలకు ముడి పెట్టొదంటూ మళ్లీ పాత పాటే పాడారు. దీంతో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ఎంతకైనా దిగజారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజాగా ది హేగ్‌లోని మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తోసిపుచ్చింది. ఆ కోర్టుకు ఈ వ్యవహారంలో అధికార పరిధే లేదని స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ సదస్సుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాద సమస్యను మరోసారి ప్రస్తావించారు. ఉగ్రవాదానికి నిధులు, మద్దతు, సురక్షిత స్థావరాలు కల్పించే వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీవో దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు పాక్ నీటి అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. మరోవైపు ఉగ్రవాదమే ప్రాంతీయ శాంతికి ప్రధాన ముప్పు అని భారత్ బలంగా చాటింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: భారత వైమానిక దళంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయుధ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా దానికి సమానమైన హోదాను పొందిన మొట్టమొదటి మహిళా అధికారిగా (వైద్యేతర విభాగంలో) ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నిలిచారు. వాయుసేన ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. మంగళవారం ఆమె దిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (విద్య)గా బాధ్యతలు స్వీకరించారని తెలిపింది. గతంలో ఆమె ఎయిర్ కమోడోర్ హోదాలో ఉండేవారని పేర్కొంది. ‘నైసర్’ నిద్రపోలేదు.. ముందే సిగ్నల్స్ పంపింది..! శక్తి శర్మ 1994లో ఐఏఎఫ్ విద్యావిభాగంలో నియమితులయ్యారు. వైమానిక దళ శిక్షణ సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లలో విభిన్న బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ కాన్పుర్, పుణె విశ్వవిద్యాలయంలో ‘ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. త్రివిధ దళాల నుంచి సైనిక పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన మొదటి మహిళా అధికారిగానూ గతంలో చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాలకుపైగా విశిష్ట సేవలతో ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వాయుసేన తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు. తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు

ఇంటర్నెట్‌డెస్క్: రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విధుల నుంచి తొలగించారని తెలిపింది. మిగిలిన వారిని కూడా రష్యా సైన్యం నుంచి బయటకు రప్పించి, స్వదేశానికి తీసుకువచ్చేందుకు రెండు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

ఇంటర్నెట్ డెస్క్: గాల్లో ఉన్న సమయంలో ఇండిగో విమానం (IndiGo) ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 9:16 గంటలకు ఇండిగో విమానం గోవా నుంచి దిల్లీ (Goa-Delhi) బయల్దేరింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఇంజిన్‌లో సమస్య (Engine Failure) తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చారు. దీంతో గోవా ఎయిర్‌పోర్టులో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్లు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు. తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు

ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తిఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి samatha 01 september 2026 Pic credit - Pinterest స్టార్ బ్యూటీ, అందా చిన్నది కీర్తి సురేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ మూవీతోనే అందరి మనసు దోచేసుకుంది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. వరసగా సినిమాలు చేసి మంచి ఫే మ్ సంపాదించుకుంది. ముఖ్యంగా మహానటి మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో అచ్చం సావిత్రిలా నటించి, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఇక తర్వాత నాని సరసన దసరా మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఓనం పండుగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా? సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?

పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు. అసలేం జరిగింది? లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు. పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది. జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవి పాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం

Palnati Surya Pratap : గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో కుమారి 21F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ జగమే సంగీతం. ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి.. మెయిన్ లీడ్స్ లో సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి.. పలువురు కీలక పాత్రలలో నటించారు. జగమే సంగీతం సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు మిగతా ఆదేశాల్లో కూడా తెలుగు, తమిళ్ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి రానుంది. కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు. పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. నా దృష్టిలో కుటుంబం, కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. ఈ కథలో సంగీతం ఒక భాషగా పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. దానిపై అవగాహన కూడా ఉంది. అందుకే ఆ కథాంశంతో ఈ సిరీస్ ని తెరకెక్కించాను. ఆ సంగీతం కథలో సహజంగా, వాస్తవికంగా ఇమిడిపోయింది. ఇది నా మొదటి వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఆ సంగీతం కథకు సపోర్ట్ అయ్యేలా చూసాను. సంగీతం కథనానికి ఏ మాత్రం ఆటంకం కలిగించదు. కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక విశేషాలు, సంగీత ప్రపంచం అన్నీ కలిసి తెలుగు ప్రేక్షకులకు నిజాయితీగా, దగ్గరగా అనిపించేలా ఈ సిరీస్ ని తెరకెక్కించాను అని తెలిపారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన

ఇంటర్నెట్ డెస్క్: అవినీతి సంబంధిత కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. రావల్పిండిలోని అడియాలా కారాగారంలో ఉన్న ఈ ఇద్దరిని జైలులో ఒంటరిగా నిర్బంధించకుండా చూడాలని అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని, తన కుమారులతో ఆయన టెలిఫోన్లో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), బుష్రా బీబీలను జైలులో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపిస్తూ.. కుటుంబసభ్యులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఆగస్టు 6న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు రోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదు: పాక్‌కు సూటిగా చెప్పిన మోదీ 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనీయకుండా, తగిన వైద్య సేవలు అందనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన మద్దతుదారులు, బంధువులు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య పరీక్షల అనంతరం ఇమ్రాన్‌ను తిరిగి జైలుకు తరలించింది. అల్ షిపా ఆస్పత్రి డాక్టర్ల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని ప్రకటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

హీరోయిన్ నివేతా థామస్ తాజాగా మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ జరిగిన కెన్యా, టాంజానియా దేశాల్లో ఉన్న మసైమారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళింది. అక్కడ జంతువులను ఫోటోలు తీస్తూ వెకేషన్ ని ఎంజాయ్ చేసింది నివేతా. తాను తీసిన జంతువుల ఫొటోలతో పాటు తన వెకేషన్ కి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది నివేతా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు! Anakapalli: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి వేల్పులవీధి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మాజీ మంత్రి, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో మెగా యూత్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ శ్రీ సురభి హరీష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరానికి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమరశెట్టి రామ్కీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమం.. జన్మదిన వేడుక. రెండింటినీ కలిపిన ఈ కార్యక్రమం అనకాపల్లిలో జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తన ప్రయాణం, అనుభవాలపై మాజీ కంటెస్టెంట్ గాయత్రి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగిన పిల్లల శక్తిని, వారి తల్లిదండ్రుల త్యాగాలను సమాజానికి చాటిచెప్పాలనేదే తన అసలు లక్ష్యమని గాయత్రి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ముందుగా గాయత్రి తన వ్యక్తిగత నేపథ్యాన్ని పంచుకుంటూ, ఖమ్మం స్వస్థలమని, తనకు ఒక సంవత్సరం వయసున్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోయారని తెలిపారు. తన తల్లి ఒక బ్యూటీషియన్ మరియు టైలర్‌గా పనిచేస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనను పెంచిందని చెప్పారు. ఆమె తల్లి చేసిన త్యాగాలు, ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కెనడాలో మాస్టర్స్ చదువు పూర్తి చేయగలిగానని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే తన నిర్ణయాన్ని తల్లి మొదట వ్యతిరేకించినా, తర్వాత అంగీకరించారని, తన ఆరోగ్య సమస్యలు, తల్లి ఒంటరితనం కారణంగా విదేశాల నుండి తిరిగి వచ్చానని తెలిపారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎదురైన సవాళ్ళను, ముఖ్యంగా క్లిప్స్ టాస్క్‌ను గాయత్రి వివరించారు. ఈ టాస్క్‌లో తన చర్మం సున్నితత్వం కారణంగా క్లిప్స్ పెట్టుకోవడం అత్యంత బాధాకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. విపరీతమైన నొప్పి, రక్త ప్రసరణ ఆగిపోవడం, వణుకు వచ్చిందని, దాదాపు ఫిట్స్ వచ్చినంత పని అయిందని తెలిపారు. ఈ క్లిప్స్ తీయడానికి తోటి కంటెస్టెంట్లు అభిజిత్, నవదీప్, శ్రీముఖి తదితరులు ముందుకు వచ్చి సహాయం చేశారని, ముఖ్యంగా అభిజిత్ తన కాళ్ళకు ఉన్న క్లిప్స్ తీయడంలో తోడ్పడ్డారని చెప్పారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ ఈ ఒక్క టాస్క్‌లో గెలవలేకపోయినా, తనను టాప్ 15లో ఎంపిక చేయడానికి కేవలం

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో తల్లిదండ్రులు గల్లంతైనా.. ఆ బాధను అదిమిపెట్టి ఓ యువతి నీట్ పరీక్ష రాసింది. కైలాస మానసరోవర యాత్ర కోసం వెళ్లిన వందలాది మంది భారతీయులు నేపాల్ వరదల్లో (Nepal floods) గల్లంతయ్యారు. ఈ యాత్రకు వెళ్లిన తన తల్లిదండ్రులు కూడా చిక్కుకుపోయారని తన్వి అనే నీట్ అభ్యర్థి (Medical Aspirant Tanvi) సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ 67 మందితో కూడిన బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. వారు నేపాల్‌లోని ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్నప్పుడు చివరిసారిగా తనతో మాట్లాడారని తెలిపింది. ప్రస్తుతం వారు తన పక్కన లేకపోయినా.. వారి కోరిక మేరకు నీట్ పరీక్ష (NEET PG 2026) రాశానని చెప్పారు. ‘మూడు గంటల పరీక్షా సమయంలో దాదాపు సగం సమయం కన్నీళ్లతోనే గడిపాను. అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోను నా తండ్రే తీశారు. పరీక్ష రాస్తున్నప్పుడు అది కనిపించి, ఆయన పదే పదే గుర్తుకు రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. మానసికంగా ఎంతో సంఘర్షణకు గురైనప్పటికీ.. అమ్మానాన్మ కోరిక మేరకు ఈ పరీక్ష తప్పకుండా రాయాలని నిర్ణయించుకున్నా. నా భవిష్యత్తు కోసం వారు ఎన్నో కలలు కన్నారు. నేను ఏ పరీక్షకు వెళ్లినా.. అందులో మంచి మార్కులు సాధించాలని కోరుతూ అమ్మ ప్రతిసారి పెరుగులో పంచదార కలిపి తినిపించేది. కానీ ఇప్పుడు ఆమె నా పక్కన లేకపోవడం నన్ను మరింత కుంగదీసింది. వారు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నా’ అని తన్వి కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో 26 వ తారీఖు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో స్వీపర్ పాత్ర ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన అధికారులు.. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పూర్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ.7.40 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నట్లు ఆడిట్లో తేలినట్టు తెలుస్తోంది. బ్యాంకు భద్రతా వ్యవస్థను దాటి నకిలీ నోట్లు కరెన్సీ చెస్ట్‌లోకి ఎలా వచ్చాయనే విషయం కలకలం రేపుతోంది. కరెన్సీ చెస్ట్‌లో భద్రపరిచిన అసలు నోట్లను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ చెస్ట్ నుంచి బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి పంపిన సొమ్ములో సుమారు రూ.4.30 లక్షల వ్యత్యాసం కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పీఎన్బీ నోడల్ అధికారి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ డివిజనల్ మేనేజర్ సహా ఇద్దరు కరెన్సీ చెస్ట్ మేనేజర్లను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే.. ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? అసలు నోట్ల స్థానంలో వాటిని ఎవరు ఉంచారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. మరోవైపు.. కరెన్సీ చెస్ట్‌లోని నోట్ల కట్టల నుంచి అక్కడి స్వీపర్ నగదు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సదరు నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో బ్యాంకు అధికారులతో పాటు స్వీపర్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కరెన్సీ చెస్ట్‌లోని నగదు లెక్కలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, నగదు తరలింపు వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరనేది దర్యాప్తులో