
ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన కూతురిని కుటుంబ సభ్యులు మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి రథంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి, ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు తరాల తర్వాత తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లోటు తీరిందని ఆమె తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లేని లోటు తీరింది. మా కుటుంబంలోకి కుమార్తె రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఆడపిల్ల లేదనే బాధ ఉండేదని, ఇప్పుడు ఆ లోటు తీరింది. నా ఇద్దరు కోడళ్లను కూడా సొంత కూతుళ్లలా చూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలిని సంగీతం, నృత్యాల మధ్య రథంలో ఇంటికి తీసుకురావడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని అన్నారు. చిన్నారి గార్గి తండ్రి మాట్లాడుతూ.. ‘చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కూతురు పుట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. నా కూతురిని పువ్వులా.. అపురూపంగా పెంచుకుంటా’ అని అన్నారు. మరోవైపు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని వేడుకగా నిర్వహించిన దహిఫాలే కుటుంబాన్ని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అభినందించారు. సమాజంలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఆడపిల్లల జననంపై ప్రతికూల ఆలోచనలు

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్‌తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్‌ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. DA Hike Updates 2026: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపును జనవరి 1, 2026 నుంచి వర్తింపజేస్తూ.. కరువు భత్యాన్ని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు ఉన్న 7 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు అందజేయనుంది. ఆగస్టు నెల వేతనంతో కలిపి నేరుగా నగదు రూపంలో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు అలాగే గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లోని అర్హులైన ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. డీఏ పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు యథావిధిగా వర్తించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఖర్చు రాస్తారో.. ఆయా ఖాతాల పరిధిలోనే మంజూరైన నిధుల నుంచి ఈ పెంపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, జిల్లా పరిషత్ ఉద్యోగుల విషయంలో వారి సహాయక నిధులకు సంబంధించిన నిర్దిష్ట సబ్-హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే ఈ వ్యయాన్ని సర్దుబాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. DA 2 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 శాతం పెంచితే.. ఉద్యోగుల మొత్తం డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకోనుంది. కేంద్రం డీఏ పెంచితే.. దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మందికి

ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్‌షాప్‌లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్‌కు వర్క్‌షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్‌గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో కాలి గజ్జల శబ్దాలు, వింత నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆందోళన రేకిత్తించింది. ఈ ఘటనల నేపథ్యంలో హాస్టల్లోని మొత్తం 608 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. ముఖ్యంగా పలువురు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వింటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. Read Also : 10TV Global Footprints : ఇలాంటి ఈవెంట్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి.. హీరో శ్రీకాంత్ ఫిర్యాదులను అధికారులు సీరియస్‌గా తీసుకుని, కొంతమంది బాలికలను ఆసుపత్రికి తరలించి మానసిక వైద్యుడితో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. పరీక్షల అనంతరం, వారి లక్షణాలు తీవ్రమైన హిస్టీరియా వంటి పరిస్థితికి సంబంధించినవై ఉండొచ్చని వైద్యుడు సూచించినట్లు చౌదరి తెలిపారు. అయితే, దెయ్యాల వదంతులపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. భయాందోళనల కారణంగానే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన సుఖ్బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది. కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్తాప్ను బ్యాట్‌తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు