
ట్రంప్ -కిమ్స్నేహం.. విన్యాసాలకు ముందే ముగింపు
దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ (UFS) సంయుక్త సైనిక విన్యాసాలను వారం రోజుల ముందుగానే ముగించాలని యుఎస్ నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని పెంటగాన్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. కాగా ట్రంప్ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఈ విన్యాసాలు “అనుచితమైనవి, శత్రుత్వపూరితమైనవి” అంటూ వాటిని తగ్గించాలని అమెరికా రక్షణ శాఖను ఆదేశించారు. ఉత్తర కొరియా ఒకవేళ తమ దేశాలపై దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా భాగంగా అమెరికా, దక్షిణ కొరియా ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయి. అయితే ఉత్తర కొరియా వీటిని చాలాకాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై దాడికి దక్షిణ కొరియా, అమెరికాలు చేస్తున్న సన్నాహక చర్యలుగా ప్యాంగ్యాంగ్ వీటిని అభివర్ణిస్తోంది. తనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించే సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఉల్చి ఫ్రీడం షీల్డ్ విన్యాసాల వ్యవధిని దక్షిణ కొరియా సైన్యం కుదించింది. మొదట ఈ విన్యాసాలను ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు వీటిని ఆగస్టు 17 నుంచి 21 వరకు జరపాలని నిర్ణయించారు. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా బుధవారం ఈ సైనిక విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని ఆదేశించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాకు





