
HMTV•General•17 ఆగ
టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
Karimnagar: టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు! Karimnagar: కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు టవర్ సర్కిల్లోని ఫుడ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రాజా టీ స్టాల్లో వినియోగిస్తున్న వంట నూనె నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని నూనెతో తయారు చేసిన తినుబండారాలను తొలగించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ ఏసీపీ వి. సతీష్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్ఐలు సురేందర్, శ్రీకాంత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు