
ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు హైకోర్టు స్పష్టం ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఎలా రూపొందించుకోవాలో మేం చెప్పం అయితే.. పౌరుల హక్కులు, రాజ్యాంగ నిబంధనలు సర్కార్ మరవొద్దు ఏళ్లుగా సర్కార్ నుంచి రావాల్సిన నగదు కోసం భూ నిర్వాసిత రైతుల ఎదురుచూపు స్టే ఎత్తివేతపై నేడు విచారణ.. చెల్లింపుల ప్రాధాన్యం చెప్పాలన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం సంక్షేమ పథ కాలను అమలు చేయడమే కాకుండా తన చట్టబద్ధమైన బాధ్యతలను కూడా సమర్థవoతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సయమంలో ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను ఎలా రూపొందించుకోవాలో తాము నిర్దేశించలేమని, అయితే పౌరుల చట్టబద్ధ హక్కులు, ప్రజాధనం వినియోగ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి భూములిచ్చి పరిహారం కోసం ఏళ్లుగా రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ప్రజలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అవసరం తగ్గే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి లాభాలను కూడా ప్రసావించింది. ప్రభుత్వానికి చెంది న సంస్థలు లాభాలు ఆర్జిస్తే వాటిని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించొచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రాధాన్యం ఏంటో చెప్పాలని సర్కార్ ఆదేశిస్తూ.. స్టేపై గురువారం తేలుస్తామని చెబుతూ, విచార ణ వాయిదా వేసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు చట్టపరమైన, శాసనపరమైన ఆధారం లేదంటూ.. ప్రభు త్వం జారీ చేసిన 8 జీఓలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పథకాలకు మేం వ్యతిరేకం కాదు.. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని, ముఖ్యంగా బాలికల సాధికారతే వీటి లక్ష్యమన్నారు. పథకాల ద్వారా రాష్ట్రంలోని యువతులు ఎలా ప్రయోజనం పొందుతున్నారో










