
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
© 2026 nimisham.in

Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇంట్లో కాఫీ తాగుతూ సరదాగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు నందమూరి దీపికా జానకిరామ్

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 94 ఏళ్ల వయసులో ఇవాళ చెన్నైలో తుది శ్వాస విడిచారు. తొలి చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న జానకి.. వివిధ భాషల్లో 400కి పైగా సినిమాల్లో నటించారు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. దిగ్గజ నటి ఇకలేరని తెలిసి సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.''ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి'' అని చిరంజీవి పోస్ట్ చేశారు.షావుకారు జానకితో తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ''మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా ఎన్టీఆర్ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర పోషించారు''''పాండురంగ మహాత్మ్యం' నుంచీ ఎన్టీఆర్ బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడి వైపున

నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘బఘీరా’ అనే శునకం మృతి చెందడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బఘీరాతో తమకున్న నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “బఘీరా.. నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు. కానీ, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ, నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం” అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. బఘీరాతో దిగిన ఫొటోలతో పాటు, దాని జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆసుపత్రి వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇటీవల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో భుజానికి గాయమవడంతో, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆగస్టు 13న డిశ్చార్జ్ అయిన తారక్, ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్ తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బఘీరా ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో భావోద్వేగమైన సందేశాన్ని రాసుకొచ్చారు తారక్. స్క్రీన్‌పై ఎంతో పవర్ ఫుల్ గా కనిపించే ఎన్టీఆర్.. తన పెంపుడు కుక్క 'బఘీరా' మృతితో ఎమోషనల్ అయ్యారు. తారక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బఘీరాను ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, రాసుకొచ్చిన ఆ ఎమోషనల్ వర్డ్స్ ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తున్నాయి. "బఘీరా, నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ఒక ప్రత్యేకమైన కంఫర్ట్ తో నా రోజులను నింపావు. నువ్వు లేని ఈ లోటు సృష్టించిన నిశ్శబ్దం ఎంత పెద్దదో, నువ్వు మిగిల్చిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్ను ఎంచుకున్నందుకు, నా పక్కనే నడిచినందుకు, ఈ 4 సంవత్సరాల కాలాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్స్ బఘీరా. స్వేచ్ఛగా పరుగెత్తు మై లిటిల్ వన్. నిన్ను ప్రాణంగా ప్రేమించాం, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ ఎన్టీఆర్ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్స్ పెంచుకునే ప్రతి ఒక్కరికీ ఈ బాధ ఎంతో బాగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ ఎమోషనల్ నోట్ చూసి నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు, నెటిజన్లు.. "రెస్ట్ ఇన్ పీస్ బఘీరా" అని ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ! రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం 'బఘీరా' మరణించడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల తమ బంధాన్ని గుర్తుచేసుకుంటూ, బఘీరా లేని లోటు ఇంట్లో చాలా పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. ఈ మేరకు నేడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బఘీరాతో తాను గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. బెర్నీస్ మౌంటెన్ డాగ్ జాతికి చెందిన బఘీరాను ఎన్టీఆర్ ఆప్యాయంగా హత్తుకున్న చిత్రాలు అందులో ఉన్నాయి. బఘీరా జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు."బఘీరా.. నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు. కానీ, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ, నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇటీవలే భుజం గాయం నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. 'డ్రాగన్' సినిమా షూటింగ్లో భాగంగా జులై 27న ఆయన భుజానికి గాయమైంది. దీనికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. ఈ చేదు వార్తను తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్‌ను గుర్తుచేసుకుంటూ ఎంతో హృదయవిదారకమైన పోస్ట్ షేర్ చేశాడు. నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమై ఎనలేని సంతోషాన్ని, అనుబంధాన్ని పంచిన భగీర ఇక లేడనే విషయాన్ని ఆయన అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో వ్యక్తపరిచాడు. ఎన్టీఆర్.. భగీరని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. "నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ భగీర. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ రాసుకొచ్చాడు.ఎన్టీఆర్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులపై ఎన్టీఆర్ చూపించే ప్రేమను, ఆ జంతువుతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని చూసి అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పూర్తి అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTR Health Update: ఎన్.టి.ఆర్. అభిమానులను కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న ఆయన భుజం గాయంపై తాజాగా స్పష్టత వచ్చింది. షూటింగ్ సమయంలో కుడి భుజానికి గాయం కావడంతో తారక్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ, కోలుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తారక్‌కు అందించిన చికిత్స, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. కుడి భుజం జాయింట్ ప్రాంతంలో గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తారక్ ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తారక్ రికవరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన అంకితభావాన్ని చూస్తుంటే త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు రెండు నెలల్లో షూటింగ్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది. తారక్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తారక్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ‘డ్రాగన్’కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, దీని తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీడెడ్, ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద మాస్ రికార్డులను తిరగరాసిన ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను కేవలం ఫ్యామిలీ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా సోషియో-ఫాంటసీ, పౌరాణిక కలయికతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో పాటు దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ను ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయడం విపరీతమైన చర్చకు దారితీసింది. గాడ్ ఆఫ్ వార్ వైరల్ అయినా కూడా దేవసేనాపతి టైటిల్ చాలా బావుందని, దాన్ని ఫైనల్ చేయమని

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవతల సైన్యానికి అధిపతి 'కుమారస్వామి' కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి నుంచి ఈ మూవీకి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ ను హారిక & హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే రెండు టైటిల్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కోసమే ఈ టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అర్థమవుతోంది. మరి ముందు నుంచి ప్రచారం జరుగుతున్న 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ ను ఫైనల్ చేస్తారా? లేక 'దేవసేనాపతి' వైపు మొగ్గుచూపుతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా రూపొందనున్న మూవీ కాబట్టి, అన్ని భాషల వారికి ఈజీగా రీచ్ అయ్యేలా 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే? తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ ది హత్యా.. ఆత్మహత్యా!.. ది గ్రేట్ సిబిఐ ఏం చెప్పిందంటే

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలు, నిర్వహించే పూజలు తరచూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతుంటాయి. కొందరు ఆయన జోస్యాలను తీవ్రంగా విమర్శిస్తే, మరికొందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ భవిష్యత్తు, ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి సారించాడు. అయితే ఆయన మళ్లీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు? టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా? అనే అంశంపై నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎల్లప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు సంబంధించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. 'జూనియర్ ఎన్టీఆర్ అసలైన పుట్టినరోజు వేరు, ఆయన బయట ప్రపంచానికి కనిపించేలా జరుపుకునే పుట్టినరోజు వేరు. ఆయన ఒరిజినల్ బర్త్‌డే డేట్ నా ఒక్కడికే తెలుసు. ఎన్టీఆర్ కచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడు, కానీ ఇప్పట్లో మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. 2030 సంవత్సరం వరకు రాజకీయాల్లోకి రావద్దని నేనే స్వయంగా ఆయనకు చెప్పాను' అంటూ బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అసలు పుట్టినరోజు, 2030 పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్‌తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్‌ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్‌ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. గాయం కారణంగా ఎన్టీఆర్ కు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేరారు. చికిత్స అందించిన వైద్యులు ఎన్టీఆర్ భుజానికి గాయం బాగా లోతుగా అయిందని గుర్తించి సర్జరీ చేసారు. ఎన్టీఆర్ కు దాదాపు ఏడు వారాలు విశ్రాంతి అవసమని సూచించారు. ఎన్టీఆర్ గాయం మరియు శస్త్రచికిత్సపై వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఎన్టీఆర్‌కు విజయవంతంగా చికిత్స మరియు శస్త్రచికిత్స అందించినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్న తీరును డాక్టర్స్ వివరిస్తూ ఎన్టీఆర్ కుడి భుజం పైన దెబ్బ తగిలింది. సర్జరీ విజయవంతంగా చేశాము. 24 గంటల్లోనే డిశార్చ్ కూడా అయ్యారు ఫిజియోథెరపి కూడా మొదలు పెట్టారు. తారక్ గారు ప్యాషినెట్ పర్సన్ మూడు నెలల్లొ పూర్తి ఫిట్నెస్ ను పొందుతారు. ఎన్టీఆర్ సర్జరీ పై మాకు అనేక ఫోన్ కాల్స్ మెసెజ్ లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయన రికవరీ కూడా చాలా వేగంగా మరియు సానుకూలంగా సాగుతోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాము ‘ అని అన్నారు. డాక్టర్ల బృందం పూర్తి పర్యవేక్షణలో కోలుకుంటున్న ఎన్టీఆర్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మరింత జోష్ తో తిరిగి డ్రాగన్ సెట్స్ లో అడుగుపెట్టాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్‌పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్‌లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకే సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే మూడు వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది.. సర్జరీ కాబట్టి కనీసం మరో రెండు నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్‌గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్నా.. 2027, జూన్ 11కి వాయిదా వేసారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్రప్రభావం చూపిస్తుంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నపుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే NBK111 రిలీజ్ ప్లాన్ చేసినా పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమాపైనా బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్-అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్‌ను మార్చేలా ఉన్నాయిప్పుడు. భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై

అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్ ఈవెంట్స్ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్ ఈవెంట్స్ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో సాగిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న ఎంతోమందికి భోజనం అందించారు. ‘ఎన్టీఆర్ మీల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది ఆకలి తీర్చినట్లు, 2,000కిపైగా మీల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఒకే లక్ష్యంతో పనిచేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమం గురించి ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “లక్షలాది మందికి ఆహారం, 2,000కిపైగా మీల్ కిట్లు, అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్.. ఇదే ‘ఎన్టీఆర్ మీల్’ ప్రభావం” అంటూ ప్రశంసించారు. ఇదే స్థాయిలో మరో టాలీవుడ్ హీరో అభిమానులు సేవా కార్యక్రమం నిర్వహించి ఉంటే ఇప్పటికి విస్తృతంగా ప్రశంసలు, గుర్తింపు లభించేవని అభిప్రాయపడ్డారు. ‘ఎన్టీఆర్ మీల్’ చేసిన సేవను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం గురించి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది చేసిన సేవే దాని ప్రభావానికి నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మీల్’ సేవలు నిలిచిపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో “Hope you’ll be back soon, bro” అంటూ సేవా కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో కొట్టిన మాస్ హిట్లు మరే ఇతర హీరోకి సాధ్యం కాలేదు అంటే అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలు తారక్ కి క్రేజ్ తీసుకువచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సింహాద్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క దెబ్బతో తారక్ టాలీవుడ్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పోటీ పడే రేంజ్ సొంతం చేసుకున్నారు. సింహాద్రి రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింహాద్రి తర్వాత తారక్ కి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అప్పటి భారీ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తారక్ నరసింహుడు అనే చిత్రంలో నటించారు. భారీ స్థాయిలో, కనీ వినీ ఎరుగని అంచనాలతో ఆ చిత్రం తెరకెక్కింది. బి గోపాల్ అంటే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. దీనితో నరసింహుడు మూవీపై కూడా ఆ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. నరసింహుడు మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గురించి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తారక్ తో సన్నిహితంగా ఉండే వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. నరసింహుడు సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉండడంతో మేమంతా రిలీజ్ రోజు తారక్ ఇంట్లోనే ఉన్నాం. ఫస్ట్ షో రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నాకు ముందుగా ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది. తారక్ గదిలోకి వెళ్ళా. ఈ విధంగా మన సినిమాకి బ్యాడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పా. కాసేపటికి మరో ఆర్టిస్ట్ లోపలి వచ్చాడు. అతడి పేరు అనవసరం. అతడు వచ్చి.. బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్.. మీరు విలన్ దగ్గరికి వెళ్లి పులిలాగా గాండ్రిస్తుంటే మామూలుగా లేదట అంటూ ఒక రేంజ్ లో చెప్పాడు. కానీ తారక్

Jr NTR: సర్జరీ తర్వాత ఎన్టీఆర్ మొదటి ఫోటో.. వైద్యులతో కలిసి కనిపించిన యంగ్ టైగర్ ఈ వార్తకు సంబంధించిన

తెలుగు సినీ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజం గాయానికి సంబంధించిన ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఆగస్టు 12న హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో వైద్యులు ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో ఆగస్టు 13న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో 2 నుంచి 3 నెలల పాటు రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. ఈ ఘటనకు సంబంధించి జూలై 27న ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో వైద్యులు మొదట 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే తదుపరి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, వేగంగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీయే ఉత్తమ మార్గమని నిర్ణయించారు. దీని ప్రకారం డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. దీంతో ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగుందని, అందరి ప్రేమ మరియు ప్రార్థనలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్ రావు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు గొప్ప ఉపశమనం పొందాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పై పెను ప్రభావం పడింది. ముందుగా అనుకున్న శ్రీలంక షెడ్యూల్ పూర్తిగా వాయిదా పడింది. ఫలితంగా ఎన్టీఆర్ లేని ఇతర భాగాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ 2026 నాటికి ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పాన్ ఇండియా చిత్రం 1960ల నాటి ఒపియం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయన భుజానికి గాయం కాగా, బుధవారం కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ పూర్తయిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయన భుజానికి గాయం కాగా, బుధవారం కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ (Arthroscopic Shoulder Surgery) పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ శస్త్రచికిత్స విజయవంతం కావడం, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో.. గురువారం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కిమ్స్ యాజమాన్యం అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి లీడ్ చేసిన వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు ఈ సర్జరీని సమర్థవంతంగా నిర్వహించింది. ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ భాస్కర్ రావు ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని, వైద్యుల పర్యవేక్షణలోనే పూర్తిస్థాయి రికవరీ కోసం ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ (Structured Rehabilitation Program) ప్రారంభించనున్నారని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌కు జరిగిన ఈ సర్జరీ కారణంగా ఆయన నటిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూట్‌కు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అంతేకాదు, ఎన్టీఆర్ కోలుకుని మళ్లీ షూట్‌లోకి వచ్చే వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్.. మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్ 2’పై దృష్టి పెట్టనున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సర్జరీ పూర్తి చేసుకుని, డిశ్చార్జ్ అవడంతో

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజ శస్త్రచికిత్స సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా పూర్తయింది. ఆగస్టు 12న నిర్వహించిన శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి క్షేమంగా ఉండటంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని కిమ్స్ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ భుజ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అభిమానులకు ఆయన ఆరోగ్యంపై కీలక సమాచారం అందింది. తదుపరి దశలో ప్రత్యేక పునరావాస చికిత్స ప్రారంభించేందుకు వైద్య బృందం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌కు జూలై 27 సాయంత్రం భుజానికి గాయం కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని బృందం ఆయనను పరిశీలించింది. గాయం నుంచి కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల పూర్తి విశ్రాంతి అవసరమని తొలుత వైద్యులు సూచించారు. అయితే తర్వాత నిర్వహించిన సమగ్ర పరీక్షలు, వైద్య అంచనాల ఆధారంగా ఎన్టీఆర్ భుజ శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. గాయం ఎలా జరిగిందనే విషయంపై ఎన్టీఆర్ బృందం నుంచి అధికారిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నలుగురు ఆర్థోపెడిక్ నిపుణుల బృందం ఎన్టీఆర్ భుజ శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ బృందంలో డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని ఉన్నారు. దీంతో శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ చిత్రీకరణ సమయంలో జరిగినట్లు వివిధ నివేదికలు పేర్కొన్నాయి. అయితే గాయం జరిగిన పరిస్థితులపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్టీఆర్ కోలుకోవడానికి దాదాపు 2 నుంచి 3 నెలల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ‘డ్రాగన్’ చిత్రీకరణ షెడ్యూల్‌పై ఎన్టీఆర్ భుజ శస్త్రచికిత్స ప్రభావం చూపే అవకాశం ఉంది. గాయం నేపథ్యంలో

కె.జి.యఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మాస్ కాంబినేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కె.జి.యఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), మాస్ కాంబినేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న చిత్రం డ్రాగన్ (Dragon) . రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడంతో పాటు అంచనాలను భారీగా పెంచేశాయి. శరవేగంగా జరుగుతోన్న డ్రాగన్ షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స జరగడం, ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించడంతో డ్రాగన్ కి ఒక మూడు నెలలు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈలోపు నీల్.. ఎన్టీఆర్ లేకుండా మిగతా వారితో షూటింగ్ ఫినిష్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సంచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తన ప్రాధాన్యతలను మార్చుకోవాల్సి వచ్చిందని టాక్. ఎన్టీఆర్ గాయం వలన లభించిన 3 నెలల కాలాన్ని ఏమాత్రం వృథా చేయకుండా, ప్రశాంత్ నీల్ తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ సలార్ 2 ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడట. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా శౌర్యంగ పర్వం రానుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఆ తరువాత నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండగా.. ప్రభాస్ మిగతా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారాడు. ఇక ఇప్పటికీ నీల్ కి సలార్ 2 పై దృష్టి సారించడానికీ సమయం దొరికింది. ఇప్పటికే

కన్నడ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి రుక్మిణి వసంత్, ఇప్పుడు వరుస సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో సందడి చేస్తున్నారు. విభిన్నమైన పాత్రలు, సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. సప్త సాగరములు దాటి మూవీతో పాపులర్ అయిన ఈ అమ్మడు `కాంతార 2`తో పాన్ ఇండియా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్ కేక్‌గా మారిపోయారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార: చాప్టర్ 1'లో కూడా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో, నిఖిల్ సిద్ధార్థ్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' కూడా ఒకటి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో రుక్మిణి కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ సినిమా ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రుక్మిణి వసంత్ సినీ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఒకవైపు యశ్‌తో 'టాక్సిక్', మరోవైపు జూ.ఎన్టీఆర్‌తో 'డ్రాగన్'... ఇలా వరుసగా పెద్ద సినిమాలు రుక్మిణి చేతికి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. బాలీవుడ్ నుంచి ఆమెకి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. గత వారం ఆయన `డ్రాగన్` చిత్ర షూటింగ్లో గాయపడ్డారు. భుజానికి బలమైన గాయమైంది. ఇన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఎన్టీఆర్‌కి నేడు బుధవారం సర్జరీ చేశారు. కిమ్స్ లో ఆయనకు ఈ సర్జరీ జరిగింది. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సారథ్యంలోని స్పెషలిస్ట్ ల బృందం డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూధన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని.. తారక్‌కి ఆపరేషన్ చేసినట్టు తాజాగా కిమ్స్ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. చాలా డిటెయిలింగ్ సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో రికవరీ కోసం ఈ స్పెషలిస్ట్ ల బృందం సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కోలుకోవడం, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటం అభిమానులకు ఆనందించే విషయమే, కానీ మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ అనేది కొంత కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వామ్ అనేలా ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆసుపత్రి పాలవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయి

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో భుజం శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇటీవల ఆయనకు తగిలిన గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించిన అనంతరం, ఈ శస్త్రచికిత్స అనివార్యమని నిర్ణయించారు. ప్రస్తుతం తారక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన బృందం పేర్కొంది. అభిమానులు ఆందోళన చెందవద్దని, ఆయన త్వరగా కోలుకోవడమే తమ ప్రాథమిక లక్ష్యమని వారు స్పష్టం చేశారు. గత నెల జూలై 27న జూనియర్ ఎన్టీఆర్‌కు గాయమైనట్లు తొలిసారిగా సమాచారం అందింది. మొదట్లో వైద్యులు ఆయనకు 6 నుండి 8 వారాల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, గాయం మెరుగుపడకపోవడంతో పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణులు శస్త్రచికిత్స ఉత్తమమని సూచించారు. ఈ నేపథ్యంలో తారక్ చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. గాయం ఎక్కడ, ఎలా జరిగిందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ, చికిత్సపైనే టీమ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు. 1967 నాటి నల్లమందు వ్యాపార నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన 'లూగర్' అనే పాత్రలో కనిపిస్తారు. ఇదిలా ఉండగా, షూటింగ్ సెట్లో ఈ గాయం జరిగిందా లేదా అనే విషయంపై చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ గాయం ఫలితంగా 'డ్రాగన్' సినిమా చిత్రీకరణ షెడ్యూల్స్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2027 జూన్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు. సర్జరీ తర్వాత తారక్ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స అనంతరం తారక్ సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Jr NTR Key Surgery: టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ రోజు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్లో అతని భుజానికి గాయం అయింది. కొన్ని రోజులుగా చేతికి కట్టుతోనే షూటింగ్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ సందర్భంలో భుజం నొప్పి మరింత కావడంతో.. డాక్టర్ల సలహా మేరకు నేడు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సర్జరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సినిమా షూటింగ్‌కు కాస్త అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ జరగబోతుందనే వార్త తెలియగానే అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్టీఆర్ రెండు మూడు సార్లు షూటింగ్ సందర్భాల్లో గాయపడ్డ సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఈయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ‘దేవర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తారక్.. ఆ తర్వాత తొలిసారి బాలీవుడ్లో ‘వార్ 2’ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మెప్పించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Jr NTR Shoulder Injury:జూనియర్ ఎన్టీఆర్‌కు జూలై 27న భుజానికి గాయం అయినట్లు ఆయన టీమ్ వెల్లడించింది. అయితే ఈ గాయం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఎన్టీఆర్‌ను పరీక్షించిన వైద్యులు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచన ప్రకారం ఎన్టీఆర్ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఈ విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ స్పష్టం చేసింది. తాజా ప్రకటనలో ఎన్టీఆర్‌కు రేపు కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. వైద్య పరీక్షల తర్వాతే ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్ చికిత్సను పర్యవేక్షించనుంది. ఎన్టీఆర్‌కు గాయం గురించి గతంలో కూడా ఆయన టీమ్ అధికారిక ప్రకటన చేసింది. వైద్యుల సూచన మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకునేలా వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు గాయం అయి ఉండొచ్చని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే గాయం షూటింగ్ సమయంలోనే జరిగిందని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయపడ్డారనే సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆయన భుజానికి గాయమైందని, వైద్యులు 6-8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తారక్ టీమ్ వెల్లడించింది. తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేయనున్నారు.హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో రేపు బుధవారం(ఆగస్టు 12) ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స జరగనుంది. వైద్యుల సలహా మేరకు ఆయన సర్జరీ చేయించుకోనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ''భుజానికి గాయం అయిన తర్వాత వైద్యుల సలహా మేరకు, ఎన్టీఆర్ గారు కిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో రేపు భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. వైద్యుల బృందం NTR త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోంది. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాము. ధన్యవాదాలు'' అని ప్రకటనలో పేర్కొన్నారు.ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగనుందని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆయన కార్యాలయం అధికారికంగా తాజా ప్రకటన విడుదల చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ఇటీవల భుజం గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు బుధవారంఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital) లో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే విధంగా వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి డ్రాగన్ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Star Heroes Main Reason For Closing Single Screens: ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రసాద్ మల్టీప్లెక్స్ పేరుతో ఈ ట్రెండ్ మొదలైంది. ఒక మల్టీ అంటే ఎక్కువ ఒక చోట ఎక్కువ వినోద కార్యక్రమాలు లేదా ఒక చోట ఎక్కువ స్క్రీన్స్ ఉండటం అనేదే మల్టీప్లెక్స్ ట్రెండ్. అయితే మల్టీప్లెక్స్ రాకముందు వరకు ఓ వెలుగు వెలిగిన సింగిల్ స్క్రీన్స్ ఇపుడు బోసిపోతున్నాయనే చెప్పాలి. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలు విడుదలనపుడు అక్కడ ఉన్నంత హంగామా మరే చోట ఉండదు. అసలు సిసలు వినోదం కావాలంటే సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూడాల్సిందే. అయితే ఒకప్పుడు ఓ యేడాది ఓ స్టార్ హీరో సినిమా విడుదల కాలేదంటే పెద్ద విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఇపుడు ఒక్కో హీరో ఒక్క సినిమా కోసమే యేళ్లకు యేళ్లు వెచ్చిస్తున్నారు. క్రౌడ్ పుల్లర్ హీరోలు ఇలా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ బడా స్టార్ హీరోల సినిమాలు విడుదలపుడు మాత్రమే కళకళలాడుతున్నాయి. మిగతా సమయాల్లో థియేటర్స్ రెంట్ కట్టడానికి అపసోపాలు పడుతున్నారు. ఇదంతా స్టార్ హీరోలు యేడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేయడం మూలానా సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్ధాకం అవుతుంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణం...స్టార్ హీరో సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి... సింగిల్ స్క్రీన్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.చాలా ప్రాంతాల్లో థియేటర్లలో ఈగలు తోలుకుంటు

బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ తన సోదరి జనని సంగీత్ వేడుకలో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. కుమారుడి డ్యాన్స్ చూసి బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ (Hiresh Bandla) చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగీత్ వేడుకలో హిరేష్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన అతడిని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లతో ప్రోత్సహించారు. ముఖ్యంగా తన సోదరి జనని సైతం తమ్ముడి డ్యాన్స్‌ను చూసి ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. తన కుమారుడిని జీవితంలో ఎంతో ఎత్తులో చూడాలని ఎన్నో కలలు కన్నానని.. మూడు రోజుల క్రితమే ‘డ్యాన్స్ చేయరా?’ అని తన కుమారుడిని అడిగానని, ఇప్పుడు సంగీత్ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి సంతోషంగా ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హిరేష్ డ్యాన్స్‌లో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటతో పాటు రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పాటకు కూడా స్టెప్పులు వేసి స్టేజీని దద్దరిల్లిచ్చాడు. తన సోదరి వివాహ వేడుకను మరింత సందడిగా మార్చిన హిరేష్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే బండ్ల గణేష్.. కుమారుడి డ్యాన్స్‌ను చూసి భావోద్వేగానికి గురైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది

సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను" అని సురేష్ అన్నారు. విజయ్ తండ్రి, ఎస్.ఏ.చంద్రశేఖర్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు విజయ్ చాలా చురుకైన పిల్లవాడని సురేష్ గుర్తుచేసుకున్నారు. పెద్దయ్యాక విజయ్ పెద్ద స్టార్ అయిన తర్వాత, తాను ఒకసారి ఎస్.ఏ.చంద్రశేఖర్‌కు, "మీ అబ్బాయి పెద్ద హీరో అయ్యాడు, అంతా మీ వల్లే" అని సరదాగా చెప్పిన విషయాన్ని పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రంలో సమంత తండ్రి పాత్రలో నటించిన అనుభవాన్ని సురేష్ వివరించారు. "తారక్‌తో అది నా మొదటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్" అని సురేష్ పేర్కొన్నారు. అంతకుముందు కొన్ని మీటింగ్‌లు, పార్టీలలో కలిసినప్పటికీ, కలిసి నటించినప్పుడు మాత్రమే ఒక నటుడి సామర్థ్యం తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, "హి ఈజ్ ఏ వెరీ వెరీ కేపబుల్ యాక్టర్" అని ప్రశంసించారు. తారక్ సినిమాను లోతుగా అర్థం చేసుకోగలడని, ఒక డైలాగ్‌లో పంచ్ ఎక్కడ ఉంది, ఎంత చెప్పాలి, ఎప్పుడు వదిలేయాలి వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుందని సురేష్ తెలిపారు. ఒక సన్నివేశంలో తన డైలాగ్‌లతో పాటు సహనటుల డైలాగ్‌లను కూడా తారక్ గుర్తుంచుకుని, దానికి తగినట్లుగా తన నటనను మార్చుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన చెప్పారు. ఇది చాలా అరుదైన లక్షణమని, "ఏకసంధాగ్రాహి" అని పేర్కొన్నారు. తారక్ వయసులో పెద్దవారైన నటుల పట్ల, ముఖ్యంగా తన తాతగారు, బాబాయ్ జనరేషన్‌కు చెందిన నటుల పట్ల ఎంతో