
Ishan Kishan | దులీప్ట్రోఫీలో రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్ధలు..!
Ishan Kishan | దులీప్ ట్రోఫీలో రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్ధలు..!
© 2026 nimisham.in

Ishan Kishan | దులీప్ ట్రోఫీలో రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్ధలు..!

Ishan Kishan: ఈషాన్ కిషన్ సెన్సేషనల్ కామెంట్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ పోయినప్పుడు అసలు ఏం జరిగిందంటే?

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో 3 రికార్డులు బ్రేక్

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..

Ishan Kishan: ఈషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ.. సోషల్ మీడియాను ఊపేస్తున్న గర్ల్‌ఫ్రెండ్ అదితి పోస్ట్

Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్‌కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్‌కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్‌ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

IPL Trade Deal: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఐపీఎల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జట్టులో లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించే సరైన భారతీయ ఫినిషర్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ బలహీనతను అధిగమించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై సన్‌రైజర్స్ కన్నేసింది. అతడిని ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జితేష్ శర్మను ఇచ్చేందుకు సిద్ధమేనని సూచనలు ఇచ్చిన ఆర్సీబీ, ప్రతిగా ఎస్ఆర్హెచ్ నుంచి స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హైదరాబాద్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ట్రేడ్ చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నారని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం అంటే సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్‌ను ఎస్ఆర్హెచ్ భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. రాబోయే సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇషాన్‌ను వదులుకునే సాహసం హైదరాబాద్ అసలు చేయకపోవచ్చు. గత సీజన్ ప్రదర్శనను పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్సీబీ బ్యాటర్ జితేష్ శర్మ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో లేని ఒక ఫినిషర్ కోసం, ఆరెంజ్ ఆర్మీ తరఫున అత్యధిక పరుగులు చేసిన నిలకడైన ఓపెనర్‌ను ఎలా వదులుకుంటారని సన్‌రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్

Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఆటతీరుతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అనంతరం, జింబాబ్వే సిరీస్‌లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఒక వీడియోలో, నెట్స్‌లో డిఫెన్స్‌తో పాటు భారీ షాట్లు ఆడుతూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించింది. Preparation అనే ఒకే ఒక్క క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో, ఆయన రాబోయే రెడ్ బాల్ క్రికెట్ సవాలుకు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తోంది. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటన వైభవ్‌కు ఎంతో బాగా కలిసివచ్చింది. మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 151 పరుగులు సాధించి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ క్రమంలో 50.33 సగటు, 196.10 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోవడమే కాకుండా, ఒక ఇన్నింగ్స్‌లో 81 రన్స్ బాదారు. ఆయన అందించిన అద్భుతమైన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. భారత్ కూడా కొత్త టీ20 కెప్టెన్సీ నేతృత్వంలో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 15 సంవత్సరాల 99 రోజులు మాత్రమే. దీని ద్వారా భారతదేశం తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 189.21 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు సాధించడమే కాక, అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. వేగంగా దూసుకుపోతున్న వైభవ్ కెరీర్లో మరో మైలురాయి చేరింది. రాబోయే దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీకి వైస్