పిల్లలు నేర్చుకోవాల్సిన లైఫ్‌స్కిల్స్ ఇవే
పిల్లలు వారి పనులు వారే స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దుస్తులను సర్దుకోవడం, తమ వస్తువులను భద్రపరుచుకోవడం ఇలా చిన్న చిన్న పనులు చేయడం తెలియాలి. పిల్లలు చేత తమ వయసుకు తగ్గట్టు చిన్న చిన్న వంటలు చేయించండి. స్కూల్, కాలేజ్ చదివే టైంలో వంటలు ఉపయోగపడతాయి. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయాలి. పిల్లలకు అవసరాలు, కోరికలకు మధ్య తేడా తెలియాలి. పిల్లలకు సమయం విలువ తెలియజేయాలి. టైమ్‌టేబుల్‌ని పాటించడం వల్ల విజయాలు సాధించవచ్చని చెప్పండి. ఇతరులతో గౌరవంగా మాట్లాడడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం వంటివి పిల్లలకు నేర్పించండి. పిల్లలు వారి సమస్యలను వారే పరిష్కరించుకునేలా తీర్చిదిద్దాలి. దీని వల్ల భవిష్యత్‌లో, కష్ట సమయాల్లో మంచిగా నిర్ణయాలు తీసుకోగలరు. స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి పిల్లలకు కచ్చితంగా అలవాటు చేయాలి. పిల్లలకు భద్రతా నియమాలను కూడా తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి, అనేవి పిల్లలకు చెప్పండి. పిల్లలకు భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో తెలియజేయాలి. భయం, బాధ, కోపం వంటివి ఎలా వ్యక్తపరచాలో, ఆ సమయంలో ఎలా ఉండాలో చెప్పండి