
సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3నగ్రాండ్ రిలీజ్
సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన

దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'ఐ యామ్ గేమ్' కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు రాబోతోంది. దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు. దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబకర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు. ‘ఐ యామ్ గేమ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఐదు భాషల్లో విడుదల చేసిన ట్రైలర్లో అదిరిపోయే విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లు నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయని, దుల్కర్ సల్మాన్‌ను స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింద'ని మేకర్స్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోని వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్లో 40వ సినిమా కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అన్బరివ్ మాస్టర్స్

దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'ఐయామ్ గేమ్' విడుదల వాయిదా పడింది. ఓనమ్ కానుకగా ఆగస్ట్ 20న రావాల్సిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. దాంతో అదే రోజు వస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఏర్పడింది. ఈ యేడాది ఓనమ్ బరి నుంచి దుల్కర్ సల్మాన్ మూవీ 'ఐయామ్ గేమ్' తప్పుకుంది. బుధవారం ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వారు చెప్పారు. దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ ఆగస్ట్ 20న విడుదల కావాల్సి ఉండగా, అదే రోజున పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా వైశాఖ్ తెరకెక్కించిన 'ఖలీఫా' కూడా రిలీజ్ కు సిద్థమైంది. ఆ మర్నాడే నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా గిరీశ్ ఎ.డి. తెరకెక్కించిన 'బెత్లహామ్ కుటుంబ యూనిట్' జనం ముందుకొస్తోంది. ఈ మూడు సినిమాలతో ఈ సారి ఓనమ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ప్రేక్షకులు ఆశపడ్డారు. అయితే ఇప్పుడు దుల్కార్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ విడుదల వాయిదా పడటం ఇటు పృథ్వీరాజ్ సుకుమార్, నివిన్ పౌలీ సినిమాలకు కలిసి వస్తుందని మలయాళ చిత్రసీమ భావిస్తోంది. అలానే ఆగస్ట్ 21న రాబోతున్న రవితేజ 'ఇరుముడి'కీ ఇది కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే 'ఐయామ్ గేమ్' మూవీని తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ రంగం సిద్థం చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ అతనికంటూ ఓ వర్గం ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఆ రకంగా దుల్కర్ మూవీ వాయిదా పడటం 'ఇరుముడి' నిర్మాతలైన మైత్రీమూవీ మేకర్స్ కు హెల్ప్ అయ్యిందనుకోవాలి. దుల్కర్ సల్మాన్ నటించిన 40వ చిత్రం 'ఐయామ్ గేమ్'లో కాయదు లోహర్, మిస్కిన్, ఆంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఓనమ్