
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
© 2026 nimisham.in

Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

ఈ రోజుల్లో ఆఫీస్ పనులే కాదు, చాలామంది ఇంటి నుంచి కూడా ల్యాప్‌టాప్‌లపై గంటల తరబడి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కిందకు చూస్తూ ఉండటం మెడ, వెన్ను భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కేవలం ల్యాప్‌టాప్ వాడటం వల్లే వెన్నెముక దెబ్బతింటుందని కాదు… స్క్రీన్ ఎత్తు, కూర్చునే విధానం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం, విరామం లేకుండా పనిచేయడం వంటివే ప్రధాన కారణాలు. ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారికి మొదట్లో పెద్ద సమస్యగా కాకుండా కొన్ని చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మెడ పట్టేయడం, భుజాల నొప్పి, వీపు పైభాగంలో అసౌకర్యం, తలనొప్పి, పని పూర్తయ్యాక అలసటగా అనిపించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ లక్షణాలను పట్టించుకోరు కొందరు. అలా అయితే రోజువారీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా మెడ, వెన్నుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కళ్ల ఎత్తుకు దగ్గరగా ఉండేలా పైకి లేపండి. ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తే, వేరే కీబోర్డ్, మౌస్ వాడండి. వెన్నెముకకు తగిన సపోర్ట్ ఉండేలా కూర్చోండి. ఒకే భంగిమలో కాకుండా అప్పుడప్పుడు పొజిషన్ మార్చండి. ఎక్కువసేపు పనిచేసేటప్పుడు మధ్యలో చిన్న విరామాలు తీసుకుని శరీరాన్ని కదిలించండి. స్క్రీన్‌ను చూడటానికి ముందుకు వంగడం తగ్గించండి. ఎక్కువసేపు పనిచేసిన తర్వాత మెడ కొద్దిగా పట్టేయడం సాధారణమే. కానీ, నొప్పి తగ్గకుండా పెరుగుతున్నా, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు బలహీనపడటం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని వాడే పద్ధతిని మార్చుకోవడం ముఖ్యం. స్క్రీన్‌ను సరైన ఎత్తులో ఉంచడం, వెన్నెముకకు సపోర్ట్ ఇవ్వడం, బయటి కీబోర్డ్, మౌస్ వాడటం, మధ్యమధ్యలో లేచి నడవడం వంటి చిన్న అలవాట్లు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు శారీరక శ్రమను

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని

రోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు. అయితే రోజువారీ జీవితంలో నడక, చిన్న చిన్న కదలికలను పెంచడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.8 గంటలు కూర్చుంటే ఏం జరుగుతుంది?ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలోని కండరాలు పెద్దగా పనిచేయవు. దీంతో శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాదు.. రక్తంలో చక్కెర నియంత్రణ, రక్త ప్రసరణ, కొవ్వు జీవక్రియ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడొచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల వెంటనే వ్యాధి వస్తుందని కాదు. కదలిక తక్కువగా ఉండే జీవనశైలి ఎక్కువకాలం కొనసాగినప్పుడు ఆరోగ్య ముప్పు పెరుగుతుంది.రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?8 గంటలు కూర్చోవడం వల్ల కలిగే అన్ని ప్రభావాలను పూర్తిగా తొలగించే నిర్దిష్ట అడుగుల సంఖ్య ఏదీ లేదు. అయితే రోజుకు 30-40 నిమిషాల మోస్తరు స్థాయి వ్యాయామం, ముఖ్యంగా వేగంగా నడవడం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తి వయసు, ఫిట్నెస్, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 7,000-10,000 అడుగులు మంచి లక్ష్యంగా ఉండొచ్చు.ఒక పరిశోధనలో రోజుకు 8,000 అడుగులు వేసేవారిలో మరణ ప్రమాదం 4,000 అడుగులు వేసేవారితో పోలిస్తే దాదాపు సగం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే కావడంతో 8,000 అడుగులు వేస్తే మరణ ప్రమాదం సరిగ్గా సగానికి తగ్గుతుందని చెప్పలేం.30-40 నిమిషాలు నడిస్తే

హైదరాబాద్‌కు చెందిన స్వరూప అనే మహిళ చర్మంపై మొటిమలు వస్తున్నాయని రసాయనాలతో కూడిన క్రీములను అధికంగా ఉపయోగించారు. ఫలితం లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. స్వరూపను రోజూ తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు సూచించారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రోజూ తీసుకునే ఆహారమే మన చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనశైలి, జంక్ ఫుడ్, పోషకాహార లోపం వంటివి అనేక చర్మ సమస్యలకు దారితీస్తున్నాయి. సమతులాహారం చర్మాన్ని కాపాడటమే కాకుండా, పలు రకాల వ్యాధులనూ నివారిస్తుంది. - డాక్టర్ భూమేశ్‌కుమార్, చర్మవ్యాధుల విభాగాధిపతి, ఉస్మానియా ప్రభుత్వాసుపత్రి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు తగినంత నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సరైన వైద్య సంరక్షణ అవసరం. చర్మంపై వచ్చే మార్పులు శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఈనాడు, అమరావతి ఆహారాన్ని మెల్లగా, బాగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది భోజనం చేస్తున్నప్పుడు, తిన్న వెంటనే నీరు తాగకూడదనే నియమాన్ని పాటిస్తుంటారు. భోజనం తర్వాత వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలుచబడి ఆహారం జీర్ణం కాదని.. కడుపులోనే కుళ్లిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే, దీనివల్ల గ్యాస్ట్రిక్, అల్సర్లు వంటి సమస్యలు తలెత్తుతాయనేది ఓ నమ్మకం. మరి, ఇందులో నిజమెంత? ఈ వాదనలపై ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెబుతోందో గుంటూరు జీజీహెచ్ జీర్ణకోశవ్యాధి నిపుణులు డాక్టర్ నాగూర్‌బాషా మాటల్లో తెలుసుకుందాం..! సాధారణంగా సంప్రదాయ నమ్మకాలకు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చెబుతున్న వాస్తవాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. భోజనంతో పాటు.. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. అపోహ: నీరు తాగితే పొట్టలో ఉత్పత్తయ్యే ఆమ్లాలు, ఎంజైమ్‌లు పలుచబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది. వాస్తవం: జీర్ణాశయం చాలా తెలివైన అవయవం. తీసుకునే ఆహారం, నీటి పరిమాణం ఆధారంగా ఆమ్ల స్థాయులను స్వయంగా నియంత్రించుకుంటుంది. నీరు తాగినంత మాత్రాన హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలుచగా మారి జీర్ణక్రియ ఆగిపోయే పరిస్థితి రాదు. అపోహ: ఆహారం నీటిలో తేలిపోయి, జీర్ణం కాకుండా కుళ్లిపోతుంది. వాస్తవం: జీర్ణక్రియ.. ఒక నిరంతర యాంత్రిక రసాయన ప్రక్రియ. జీర్ణాశయంలో ఉండే బలమైన ఆమ్లాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి ఆహారం ఎప్పుడూ కుళ్లిపోదు. అపోహ: తినేటప్పుడు నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వస్తాయి. వాస్తవం: నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు రావు. హెలికో బాక్టర్ పైలోరీ (హెచ్.పైలోరీ) అనే బ్యాక్టీరియా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ఒత్తిడి, ఆహారం తినేటప్పుడు గాలిని మింగడం, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ఈ సమస్యలు రావొచ్చు. భోజన సమయంలో లేదా తిన్న తర్వాత తగిన మోతాదులో నీరు తాగడం

ప్రతీ ఇంటి ఇష్టపడేది టీ. ప్రస్తుత కాలంలో టీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. చాలా మంది ప్రతిరోజూ ఉదయం మంచం మీద నుండి లేచిన వెంటనే టీ తాగి నిద్రలేవడం ఇష్టపడతారు. అదే సమయంలో, చాలా మంది అల్పాహారం సమయంలో కూడా టీ తాగుతారు. కొంత మంది టీకి ఎంతగా బానిసలయ్యారంటే, రోజుకు 3 నుండి 4 సార్లు టీ తాగుతారు. అయితే, ఇంతగా అలవాటు పడిన వారు 30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్ ప్రక్రియకు లోనవుతుంది. ఊహించని మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.టీ తాగటం ద్వారా చాలా మంది రిలీఫ్ గా భావిస్తారు. టీ ప్రియులకు, ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాలుగా ఉంటుంది. కానీ, టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్నీ పునరుజ్జీవింపజేస్తుంది. కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది. లోలోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు తెలియకుండానే మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. టీలో ఉండే కెఫీన్ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మకణాలకు తగిన తేమ అందుతుంది. రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!నిపుణుల సూచనలుఅయితే, టీ మానేసి నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల లివర్, కిడ్నీలు చురుగ్గా పనిచేసి, రక్తాన్ని సమర్థంగా శుద్ధి చేస్తాయి. టీలో సాధారణంగా కలిపే పాలు, చకెర మొటిమలకు మంచి మిత్రులు. చకెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఒకసారిగా పెరుగుతుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులను ప్రేరేపించి ముఖంపై ఎకువ

ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా?ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా? August 17 Jyothi Gadda జీర్ణక్రియ నెమ్మదించడం: ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు, ఎంజైమ్‌లు పచన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరగక జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్: ఆపిల్‌లో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఆపిల్ తిని వెంటనే నీరు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎసిడిటీ సమస్య పెరగడం: తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడి, ఆహారాన్ని అరిగించడానికి కడుపు ఎక్కువ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు: ఆపిల్‌లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగం మారి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల శోషణ తగ్గడం: ఆపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వల్ల శరీరం ఈ పోషకాలను సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. దీనివల్ల ఆపిల్ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు లభించవు. కడుపులో అసౌకర్యం, నొప్పి: ఆపిల్ తిన్న వెంటనే చల్లని నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది కడుపు పిసికినట్లు ఉండటం, తిమ్మిరి లేదా సన్నని కడుపు నొప్పికి కారణం కావచ్చు. సరియైన సమయం ఎంత? ఆపిల్ తిన్న తర్వాత నీరు తాగడానికి కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం వేచి చూడాలి. ఈ వ్యవధిలో ఆపిల్ జీర్ణాశయంలో ప్రాసెస్ కాబడి, నీటి అవసరం సురక్షితంగా మారుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు: చిన్నపిల్లలు, జీర్ణశక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా విరేచనాలు లేదా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే

హూలాహూప్.. ఫిట్నెస్ను పెంచుకోవడానికి చాలామంది దీనిని వాడుతుంటారు. సాధారణంగా హూలాహూప్‌ని ఎక్కువగా నడుము భాగం ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ ఉంటారు. దీనివల్ల ఆ భాగంలో కండరాలు దృఢంగా మారడమే కాకుండా.. ఫిట్నెస్, ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. హూలాహూప్‌ని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా శరీరం అంతటికీ చక్కని వ్యాయామం అందుతుంది. ఆ రింగ్‌ని బ్యాలన్స్ చేసే క్రమంలో కాళ్లు, నడుము భాగాలకు ఎక్కువగా వ్యాయామం అందితే, రింగ్‌ని పట్టుకుని తిప్పడం, అలాగే బ్యాలన్సింగ్ కోసం చేతులను అటూఇటూ కదపడం ద్వారా శరీర పైభాగాలకు కూడా ఎంతో కొంత వ్యాయామం అందుతుంది. ఇలా శరీరం మొత్తంగా జరిగే కదలికల ద్వారా చక్కని వ్యాయామం లభిస్తుంది. ఈ రింగ్‌ని ఉపయోగించి కరిగించే క్యాలరీల మొత్తం మనం దాన్ని తిప్పే వేగం మీద కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో ఈ రింగ్‌ని తిప్పితే ఎక్కువ క్యాలరీలు, తక్కువ వేగంతో తిప్పితే తక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట! హూలాహూప్‌ని ఉపయోగించి వ్యాయామం చేయడం ద్వారా కండరాల సామర్థ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా గుండె కండరాలకు ఈ వ్యాయామం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది వెన్నుపాముకు సైతం బలాన్ని అందించి దాని కదలికలను మరింత మెరుగయ్యేలా చేస్తుందట. మంచి మ్యూజిక్ వింటూ శరీర బరువును బ్యాలన్స్ చేస్తూ హూలాహూప్‌ని ఉపయోగించి వ్యాయామం చేస్తాం. కాబట్టి హృద్యమైన సంగీతం ద్వారా ఒత్తిడి తగ్గి, మనసుకు కూడా ఎంతో కొంత ప్రశాంతత చేకూరుతుంది. అలాగే కళ్లకు, చేతులకు మధ్య ఉండే సమన్వయం కూడా మరింత మెరుగవుతుంది. ఫలితంగా మనం మరింత ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుందట. హూలాహూప్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మనం సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ వర్కవుట్ ద్వారా సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార

ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి. సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి: సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది. రోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు. అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో

విటమిన్ బీ12 లోపం అనగానే చాలామంది అది కేవలం శాకాహారులకు మాత్రమే వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. రోజూ మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటివి తీసుకునే వారిలోనూ బీ12 లోపం తీవ్రంగా కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోకపోవడం కాదు, తీసుకున్న ఆహారాన్ని శరీరం సరిగ్గా గ్రహించలేకపోవడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.విటమిన్ బీ12 ఎక్కువగా జంతు సంబంధిత ఆహారంలో లభిస్తుంది. శరీరం దీన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుంటుంది కాబట్టి, లోపం బయటపడటానికి కొన్నిసార్లు ఏళ్లు పట్టవచ్చు. శరీరంలో బీ12 జీర్ణమయ్యే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. మనం తిన్న ఆహారం నుంచి బీ12ను కడుపులోని యాసిడ్ వేరు చేస్తుంది. ఆ తర్వాత అది 'ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్' అనే ప్రొటీన్‌తో కలిసి చిన్నపేగు చివరి భాగంలో శోషించబడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ ఆటంకం కలిగినా లోపం తలెత్తుతుంది.లోపానికి దారితీసే ఇతర కారణాలుపెర్నిషియస్ అనీమియా: ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున 'ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్'ను ఉత్పత్తి చేసే కడుపులోని కణాలపై దాడి చేస్తుంది. దీంతో బీ12 విటమిన్ శోషణ పూర్తిగా ఆగిపోతుంది.జీర్ణకోశ సమస్యలు, సర్జరీలు: క్రాన్స్, సీలియాక్ వంటి వ్యాధులు, బరువు తగ్గేందుకు చేయించుకునే బేరియాట్రిక్ సర్జరీలు చిన్నపేగుల పనితీరును దెబ్బతీసి బీ12 లోపానికి దారితీస్తాయి.మందులు, వయసు పైబడటం: టైప్ 2 డయాబెటిస్ కోసం వాడే మెట్ఫార్మిన్, గ్యాస్ లేదా ఎసిడిటీ తగ్గించే మందులను దీర్ఘకాలం వాడటం వల్ల బీ12 స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. వయసు పెరిగే

మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ మెడిసిన్’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఉద్యోగంలో లేదా తమ విధుల్లో భాగంగా మహిళలు చేసే శారీరక శ్రమ వారి గర్భధారణ/గర్భస్రావాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయాలపై చేసిన అధ్యయనంలో భాగంగా డెన్మార్క్‌కు చెందిన అధ్యయనవేత్తలు సుమారు 4.75 లక్షల మంది ఉద్యోగినుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఉద్యోగంలో భాగంగా ఎక్కువసేపు నిలబడటం, నడవడం, ముందుకు వంగి పనిచేయడం వంటి అంశాలు గర్భస్రావం ముప్పును పెంచినట్లుగా ఈ విశ్లేషణలో తేలింది. నిలబడి పనిచేయడం వల్ల మాత్రం ఈ ముప్పు చాలా స్వల్పంగా పెరిగినట్లు తేలింది. (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?) శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) 20 లక్షలిస్తే.. నా కూతురు తిరిగివస్తుందా..! మోసం చేసావ్ చంద్రబాబు.. అభివృద్ధి లేదు కానీ అప్పులు మాత్రం సరిపడా ఉన్నాయి.. వందేమాతరం ఆపండి! సోనియా సైగలపై.. BJP ఫైర్ మిస్టరీ మర్డర్.. రూపా రెడ్డిని చంపిందెవరు! స్థానికులు చెప్పిన సంచలన విషయాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాను బొంబాయికి రాను పాటకి యూనిఫామ్ లోనే పోలీసులు చిందులు

కోపంతో వెంటనే రియాక్ట్ అవుతున్నారా? ఈ 5 టెక్నిక్స్ ట్రై చేయండి ఈ వార్తకు సంబంధించిన

‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): ‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్నపాటి శ్రమకే అలసట, రోజూ చేసే పనులు కూడా చేయలేక పోవడం ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది.. నిద్ర తగ్గింది.. అంటూ కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు నిజం మాత్రం ‘సార్కోపీనియా’ అనే కండరాలను కరిగించే వ్యాధి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా భావించిన ఈ కండరాల క్షీణత.. మారుతున్న జీవనశైలితో 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారిపై దాడి చేస్తోంది. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తోంది. వయసు పెరిగే కొద్ది కండరాలు సాధారణంగానే క్షీణిస్తాయి. కానీ, ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచూ అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, నడక వేగం తగ్గిపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బ తింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల

దోసకాయ చేదుగా ఉందో లేదో కొనేటప్పుడే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: దోసకాయను సలాడ్, రైతా వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొన్ని దోసకాయలు చేదుగా ఉండటం చాలాసార్లు ఇబ్బందిగా మారుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సహజ సమ్మేళనం వల్ల చేదు రుచి వస్తుంది. ఇది దోసకాయ రకం, వాతావరణం, సాగు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దోసకాయను కోసి రుచి చూడకుండా అది చేదుగా ఉంటుందో లేదో వంద శాతం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే కొనేటప్పుడు కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దోసకాయలు కొనేటప్పుడు చాలా పెద్దగా లేదా లావుగా ఉన్న వాటి కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. కేవలం పరిమాణాన్ని బట్టి దోసకాయ చేదుగా ఉందని చెప్పలేం. అయితే మరీ పెద్దగా ఉన్న దోసకాయలు ఎక్కువగా పండిపోయి ఉండొచ్చు. వాటిలో గింజలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సలాడ్ కోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న దోసకాయలను ఎంచుకోవడం మంచిది. తాజా దోసకాయ సాధారణంగా మంచి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రంగు వెలిసిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తే అది పాతదై ఉండవచ్చు. కాబట్టి సహజమైన ఆకుపచ్చ రంగులో, తాజాగా కనిపించే దోసకాయలను ఎంచుకోండి. దోసకాయను కొనేటప్పుడు చేతితో మెల్లగా నొక్కి చూడండి. తాజా దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటుంది. నొక్కినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తే లేదా సులభంగా లోపలికి వంగిపోతే అది పాతదై ఉండవచ్చు. అలాంటి దోసకాయలను కొనకపోవడం మంచిది. దోసకాయ తొక్కపై నల్లటి మచ్చలు, కోతలు, ముడతలు లేదా ఎక్కువగా ఎండిపోయినట్లు కనిపిస్తే దానిని కొనకపోవడం మంచిది. తాజా

రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, అనవసర ఆలోచనలు మనపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు జపాన్‌లో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తుంటారు. అవేంటో చూద్దాం.. ఖాళీగా కాసేపు కూర్చుంటే చాలు.. రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆలోచనలను నియంత్రించేందుకు జపాన్‌లో ‘జాజెన్’ (Zazen) అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు. ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. చేతులను ముందుకు ఉంచుకోవాలి. కళ్లను పూర్తిగా మూసుకోకుండా సగం మూసి, సగం తెరిచి ఉంచాలి. ఇలా కూర్చున్నప్పుడు మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మంచివి, చెడ్డవి అని నిర్ణయించకుండా అలాగే గమనించాలి. అదే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసును వేధించే ఆలోచనలపై వెంటనే స్పందించకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. క్రమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కొంత సమయం ఈ పద్ధతిని సాధన చేస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలామంది తమ లోపాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అందుకే మనలోని లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని జపనీస్ సంస్కృతిలోని ‘కింట్సుగి’ (Kintsugi) భావన చెబుతుంది. జపాన్‌లో పగిలిపోయిన వస్తువులను పడేయకుండా వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో అతికించి, పగుళ్లు కనిపించేలా మరింత అందంగా తయారు చేస్తారు

ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ Prasanna Yadla 11 August 2026 Pic credit - Pinterest వేపాకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వీటి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి వేపాకులు ఈ ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎలాగో ఇక్కడ చూద్దాం.. ఆయుర్వేదంలో ఈ వేప ఆకుల్లో ఉండే సహజ గుణాలు మీ చర్మాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి సహజ గుణాలు మీరు దీనిని ఆకుల రసంగా తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అవుతాయని అంటున్నారు పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అంతేకాదు మీ చర్మంపై ఉన్న మచ్చలను కూడా ఇవి పూర్తిగా తగ్గిస్తాయి. చర్మంపై ఉన్న మచ్చలను వేప చెట్టు మొదలు నుంచి ఆకులు, పువ్వులు ఇలా అన్ని మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడతాయి ఆకులు, పువ్వులు అంతేకాదు ఇది వ్యవసాయానికి కూడా పని చేస్తుంది అందుకే దీనిని సర్వరోగ నివారణిగా చెబుతారు సర్వరోగ నివారణి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Custard Apple Side Effects In Winter: ఎల్‌నినో పుణ్యమా అంటూ ఈ ఏడాది వర్షాలే కరువు అయ్యాయి. అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, దాని తీపి రుచి ఉన్నప్పటికీ, సీతాఫలాన్ని అధికంగా తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలం అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు..కడుపు ఉబ్బరం.. అందులో మొదటిది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదురుకావొచ్చు. సీతాఫలంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగినా.. ఒకేసారి పండును అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా విరేచనాలు కలగొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ రుగ్మతలు - అనోనాసిన్ విషం.. సీతాఫలంలో 'అనోనాసిన్' అనే సహజమైన విషం పదార్థం ఉంటుందట. ఈ క్రమంలో సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుందట. నాడీ సంబంధిత రుగ్మతలు లేదా పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇప్పటికే మందులు వాడుతున్న వారు సీతాఫలాన్ని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సీతాఫలం గింజల విష ప్రభావాలు.. సీతాఫలం గింజలు తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. సీతాఫలం గింజలలో హానికరమైన

Shravan Masam Food Restrictions: శ్రావణ మాసంలో ఈ పొరపాట్లు చేస్తే రోగాల పాలు కావడం ఖాయం.. అవేంటో తెలుసా? Shravan Masam Food Restrictions: పవిత్రమైన శ్రావణ మాసం వస్తూనే ఆధ్యాత్మిక శోభతో పాటు వర్షర్తువును మోసుకొస్తుంది. ఈ కాలంలో భక్తి శ్రద్ధలతో పాటించే ఉపవాసాలు, ఆహార పద్ధతుల వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడే ఈ సమయంలో ఏ ఆహారం తినాలో, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. శ్రావణ మాసంలో పడే వర్షాల కారణంగా మన శరీరంలోని జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో జఠరాగ్ని బలహీనపడటం వల్ల మనం తినే ఆహారం త్వరగా అరగదు. వర్షాల వల్ల నీరు, గాలి కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్ సంక్రమణలు వేగంగా వ్యాపిస్తాయి. ప్రతిఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడకుండా తేలికగా అరిగే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ పవిత్ర మాసంలో కేవలం మతపరమైన విశ్వాసాల కోసమే కాకుండా ఆరోగ్య కారణాల వల్ల కూడా మాంసాహారాన్ని పక్కన పెట్టాలని పెద్దలు చెప్తారు. వర్షాకాలంలో జీవుల సంతానోత్పత్తి కాలం కావడం, చల్లని వాతావరణం వల్ల మాంసం సరిగ్గా అరగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి. మితిమీరిన కారం, నూనె, మసాలాలు నంజు తెచ్చి కడుపులో మంటను పెంచుతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల అతి వినియోగం కూడా శరీరంలో వేడిని పెంచి అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం. ఆకుకూరలు, డైరీ పదార్థాల వినియోగంలో జాగ్రత్తలు.. ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ శ్రావణ మాసంలో కొన్ని రకాల ఆకుకూరలు తినడం ముప్పుగా మారుతుంది. వర్షపు నీటి వల్ల ఆకులపై కంటికి కనిపించని సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు ఆవాసం ఏర్పరుచుకుంటాయి. సరిగ్గా శుభ్రం చేయకుండా ఆకుకూరలు తింటే

ఎక్కువకాలం పాటూ ఆరోగ్యంగా జీవించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యాయామాలు చేయడం ఎక్కువగా చేస్తారు. వ్యాయామంతో మనం తినే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రాత్రిపూట పార్టీల పేరుతో జంక్ ఫుడ్ అధికంగా తినడం, పొట్ట ఖాళీ లేకుండా తినడం వంటి పనులు చేస్తారు. అలా చేయడం నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు. నిజానికి అలాంటి తింటి అలవాట్లు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. రాత్రి భోజనంలో పచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోండి. పాలకూర, సొరకాయ, బెండకాయ, టొమాటో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని రాత్రి భోజనంలో చేర్చుకోండి. ఇవి పొట్టకు చాలా మంచివి. రాత్రిపూట సులభంగా జీర్ణం కూడా అవుతాయి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు రాత్రిపూట తినడం ఏమాత్రం మంచిది కాదు. రాత్రిపూట భారీ భోజనాలు చేయకూడదు. రెండు రోటీలు, గిన్నెడు పప్పు చాలు. లేదా రెండు రోటీలో ఒక కప్పు కూర తింటే సరిపోతుంది. శరీరానికి శక్తినివ్వడానికి, ఆకలిని నియంత్రించడానికి పప్పు, కూరలు అవసరం. పప్పు తినాలనిపించకపోతే దానికి బదులుగా పనీర్ లేదా సోయాబీన్ కూడా తినొచ్చు. కానీ మరీ అధికంగా తినకూడదు. రాత్రి భోజనంలో సలాడ్ తింటే మంచిది. కీరదోస, టొమాటో, క్యారెట్, బీట్రూట్.. ఇలా ఏదో ఒకటి ప్లేట్లో ఉండేలా చూసుకోండి. సలాడ్ తినడం వల్ల పొట్ట త్వరగా నిండుతుంది. నిమ్మరసం పిండుకుంటే ఇంకా మంచిది. రాత్రి పూట పొట్ట నిండా తినకూడదు. తేలికపాటి భోజనం చేస్తే సరిపోతుంది. కాసేపటికి ఆకలిగా అనిపిస్తే యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లతో సరిపెట్టుకోవాలి. కానీ భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకోండి. రాత్రిపూట ఎక్కువగా వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ ఏమాత్రం తినడకూదు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం, నిద్రపోవడం మంచి అలవాటు కాదు. ఓ 30 నిమిషాలు వాకింగ్

ప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుందా అనే అంశంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో... డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఆ సమస్య ఉన్నవారికి వినికిడి లో΄ాలు వచ్చే అవకాశం రెండు రెట్లకు పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న యుక్తవయస్కుల్లో (అడల్ట్స్)లో నాలుగోవంతు మంది (అంటే దాదాపు 25% మంది)లో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ‘డయాబెటిస్ మెటబాలిజమ్ రీసెర్చ్ రివ్యూ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది. సాధారణంగా డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో వారికి ఉన్న ఆ సమస్య కళ్లు, మూత్రపిండాలు, నరాలకు ఏదైనా నష్టం చేసిందా అన్నకోణంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరిశోధనల నేపథ్యం లో ఇకపైపై పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయాలంటూ పరిశోధకులు వైద్యవర్గాలకు ఓ సూచన చేస్తున్నారు. ‘‘ఈ వినికిడి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్తో వచ్చే వినికిడి లోపం చాలాసార్లు 40–50 ఏళ్ల మధ్య వయసులోనే మొదలువుతుంది. దాంతో సంభాషణలు వినడం, ఎదుటివారితో కమ్యూనికేషన్ నెరపడం కష్టమై క్రమంగా ఒంటరితనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడమూ వేగవంతమవుతుంది. అందుకే డయాబెటిస్ అన్నది నెమ్మదిగా దెబ్బతీసే పెద్దసమస్య. అందుకే ఇకపై డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షల్లో వినికిడి పరీక్షనూ చేర్చాల్సిన సమయం వచ్చింద’’నేది ఈ అధ్యయనం తాలూకు ప్రధాన పరిశోధకుల మాట. తక్కువ ఖర్చుతో చేసే వినికిడి పరీక్షల ద్వారా సమస్యను మొదటే గుర్తిస్తే సత్వర చికిత్స సాధ్యమని పరిశోధకులు తెలిపారు. అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించడం లాంటి సకాలంలో చేసే చికిత్సతో సంభాషణ సామర్థ్యం, జీవననాణ్యత మెరుగుపడే అవకాశం ఉందనీ, అలాగే రక్తంలో చక్కెర మోతాదులను

ఎండకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ఎంతో హాయిని ఇస్తుంది. అయితే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో కాస్త అలర్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్ లేదా కీటకాలు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే ఈ సమయంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, గ్యాస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా పనిచేస్తుంది. అందువల్ల ఎప్పుడూ పరిశుభ్రమైన, తాజా, తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సీజన్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు గమనిస్తే.. పాలకూర, మెంతి కూర, బతువా వంటి ఆకుకూరలు శరీరానికి చాలా మంచివి. వీటిలో ఐరన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తం పెరగడానికి సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో ఈ ఆకుకూరలపై మట్టి, చిన్న చిన్న పురుగులు, మురికి ఎక్కువగా అంటుకుని ఉంటాయి. తేమ వల్ల వీటిపై కీటకాలు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలను తినాలనుకుంటే, వాటిని చాలా శుభ్రంగా కడిగి, బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. సగం ఉడికిన లేదా సరిగ్గా కడగని ఆకుకూరలు తింటే కడుపు సమస్యలు తప్పవు. వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, చాట్, గోల్ గప్పా, ఇతర తెరిచి ఉన్న ఆహార పదార్థాలను తినడం అస్సలు మంచిది కాదు. బయట కప్పి ఉంచకుండా ఉంచే ఆహారంపై ఈగలు వాలడం, దుమ్ము ధూళి పడుతుంది. దీని వల్ల ఆహారంలోకి క్రిములు చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది కడుపు పాడవడానికి, వాంతులు లేదా విరేచనాలకు దారితీస్తుంది. కాబట్టి పండ్లను ఇంటికి తెచ్చుకుని, నీటితో బాగా కడిగిన తర్వాతే తినాలి. వర్షాకాలంలో ఐస్‌క్రీమ్‌లు, చల్లని డ్రింక్స్

Healthy Morning Drinks Telugu: మీరు ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తారో మీ రోజంతా ఉండే ఉత్సాహం, శక్తి, ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతుంది. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి ముఖ్యంగా నీరు అవసరం. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే సరైన పానీయాన్ని ఎంచుకోవడం మంచి అలవాటు. పోషకాలు కలిగిన పానీయాలు శరీరానికి హైడ్రేషన్‌తో పాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో అధిక చక్కెర కలిగిన శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం మంచిది కాదు. వీటిలో చక్కెర ఎక్కువగా ఉండి, పోషక విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఉదయాన్ని ప్రారంభించేందుకు 5 ఆరోగ్యకరమైన పానీయాలు నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా సులభమైన అలవాటు. రాత్రంతా నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఏర్పడే ద్రవాల లోటును భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది. రోజును ప్రారంభించేందుకు సాధారణ నీరే మంచి ఎంపిక. ఒక గ్లాసు సాధారణ లేదా గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం కలుపుకుని తాగవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. రుచిని మెరుగుపరచుకోవాలనుకుంటే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఎసిడిటీ లేదా కడుపులో మంట సమస్య ఉన్నవారు నిమ్మరసం తమకు సరిపోతుందో లేదో గమనించాలి. సత్తు ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలను అందించే ఒక మంచి ఎంపిక. ఒక గ్లాసు సాధారణ నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల సత్తు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇది కొంతసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం త్వరగా ఆకలి వేసే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక కావచ్చు. తాజా కొబ్బరి