
దేశభక్తికి డిజిటల్ గుర్తింపు... హర్ ఘర్ తిరంగా సెల్ఫీ దిగండి... సర్టిఫికెట్ పొందండి
Har Ghar Tiranga 2026: దేశభక్తికి డిజిటల్ గుర్తింపు... హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ దిగండి... సర్టిఫికెట్ పొందండి ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Har Ghar Tiranga 2026: దేశభక్తికి డిజిటల్ గుర్తింపు... హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ దిగండి... సర్టిఫికెట్ పొందండి ఈ వార్తకు సంబంధించిన

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఈరోజు (సోమవారం) ఎగురవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలి.. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈరోజు నుంచి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్దఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయాలి.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాపురుషులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Har Ghar Tiranga 2026: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రోగ్రాం పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి “హర్ ఘర్ తిరంగా అభియాన్”కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతి పౌరుడిని మానసికంగా

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్షిప్లో 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన 'తిరంగా యాత్ర' పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని, ఐక్యతను నింపింది. గాంధీధామ్ (గుజరాత్), ఆగస్టు 9: కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (DPA) ఇవాళ (ఆదివారం) గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్షిప్లో 'తిరంగా యాత్ర'ను ప్రారంభించింది. పోర్ట్ ఉన్నతాధికారుల సమక్షంలో DPA చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ (IRSME) ఈ యాత్రకు నాయకత్వం వహించారు. DPA అధికారులు, ఉద్యోగులు, CISF సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, దీన్‌దయాళ్ మహిళా శక్తి కేంద్రం (DMSK) సభ్యులు, భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలు ఇందులో పాల్గొని, దేశభక్తిని చాటారు. త్రివర్ణ రంగులతో అలంకరించిన, దేశభక్తి ఉత్సాహంతో నిండిన పోర్ట్ టౌన్షిప్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. జాతీయ జెండాలు చేతబూని పాల్గొన్న జనసందోహంతో టౌన్షిప్ ప్రాంగణమంతా దేశభక్తి శోభతో విలసిల్లింది. 'వందేమాతరం' నినాదాలు, దేశభక్తి కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పాల్గొన్నవారు యాత్ర అంతటా జాతీయ జెండాను గర్వంగా చేతబూని నడిచారు. దేశం పట్ల గర్వం, ఐక్యత, అంకితభావం ప్రతిబింబించేలా, దేశభక్తి నినాదాలు 'వందేమాతరం' స్ఫూర్తితో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మువ్వన్నెల జెండాను కేవలం ఒక జాతీయ చిహ్నంగానే కాకుండా, భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం, ఉమ్మడి జాతీయ గుర్తింపునకు ప్రతీకగా నిర్వహించడమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ 2022లో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నేపథ్యంలో ఈ పిలుపునిచ్చారు. పౌరులు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ జెండాతో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకోవడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఈ ఏడాది 'వందేమాతరం' 150 సంవత్సరాల వేడుకలు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో తిరంగా ర్యాలీలు, ప్రదర్శనలు, సైకిల్/బైక్ ర్యాలీలు, కాన్సర్ట్‌లు, రంగోలీ పోటీలు నిర్వహించబోతున్నారు