రోహిణి గుట్టు రట్టు చేసిన బాలు.. నీ భార్యే పెద్దఫ్రాడ్.. కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్
ఫర్నీచర్ షాప్‌కి వెళ్లొచ్చు అని ప్రభావతి చెబుతుంది. దీంతో రోహిణిని తీసుకుని వమనోజ్ వెళ్తాడు. నా శపథం నెరవేర్చుకున్నా.. అత్తయ్య నోటితోనే వెళ్లమనేలా చేశా అని రోహిణి అనుకుంటుంది. నాకు ఎక్కడో తేడా కొడుతోంది మీనా అని బాలు అంటాడు. మీకు అన్నీ అనుమానాలే అని మీనా కొట్టి పారేస్తుంది. సరే గానీ నా ఫ్రాడ్ ఫ్రెండ్‌కి కలుద్దాం పదా అని బాలు అంటాడు. నేను రాను అని మీనా అంటే.. నాకు ఇంత అందమైన భార్య ఉందని తెలియాలి కదా అని బాలు అంటాడు. ఆటోకి డబ్బుల్లేక నడుచుకుంటూ వస్తాడేమో అని బాలు అనుకుంటే.. రిచ్ గా కారులోంచి దిగుతాడు ఫ్రాడ్ ఫ్రెండ్. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఇదేంట్రా ఇలా దిగావ్.. అని బాలు అడిగితే.. కూటి కోసం కోటి విద్యలు కదరా అని ఫ్రాడ్ ఫ్రెండ్ అంటాడు. మొన్నే పెద్ద జైలు నుంచి రిలీజ్ అయ్యారా అని అంటాడు ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు. ఎందుకు రా.. దొంగతనాలు సరిగ్గా చేయడం లేదా? ఇంకా దొరికిపోతున్నావా? అని ఇద్దరూ దొంగల కష్టాలు, బాధల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే గజ దొంగలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని మాట్లాడినట్టు ఉందని తిడుతుంది మీనా.ఫర్నీచర్ షాప్‌కి రిచ్ మెన్లా.. అసలు ఏ పని మీద వెళ్తున్నావ్ రా అని బాలు అడుగతాడు. ఓ లేడి కిలాడి ఉందిరా.. ప్రభావతి అనే ఫర్నిచర్ షాప్‌కి వెళ్లి రిచ్ మ్యాన్‌లా నటించాలి.. అందుకు ఆ షాప్ ఓనర్ రోహిణి నాకు ఐదు వేలు ఇస్తుంది.. అసలే సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లాలి.. ఆ డబ్బులు కూడా కావాలి.. కదా.. అందుకే నటించేందుకు వెళ్తున్నా అని అంటాడు. సర వెళ్లు.. నీ వల్ల మా నోటికి, మా ఇంట్లో వాళ్ల చేతికి కూడా పని దొరికింది అని బాలు అంటాడు