
హాస్పిటల్ లో మేకప్.. బయట బర్త్ డే వేడుకలు.. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజుపై వివాదం
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Karnataka MLA controversy:శ్రీరంగపట్నం సమీపంలోని అరేకెరె గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజు సందర్భంగా ఒక వినోద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాటకం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది కళాకారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కళాకారులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా కార్యక్రమానికి ముందు వారు అక్కడే మేకప్ వేసుకుని సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా కళాకారిణి ఆసుపత్రి లోపల నుంచి రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్యం అందించే ప్రదేశం. అలాంటి చోట ప్రైవేట్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో కళాకారులు ఉండేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారికంగా అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు లేదా వైద్య సేవలకు ఇబ్బంది కలిగిందా అనే అంశంపైనా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వైద్య సదుపాయాలను వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఉపయోగించడంపై విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు స్థానికులు అధికార దుర్వినియోగంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ