
El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..
El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..
© 2026 nimisham.in

El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..

Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. పసిఫిక్‌లో మార్పులను గుర్తించిన ఇస్రో ఉపగ్రహం!

El Nino: సెప్టెంబర్ మూడో వారం నుంచి కరువు?

El Nino: ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి

El Nino: కరువు వచ్చేసిందా? 78.3 శాతం వర్షభావంతో టాప్

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక నీటి వినియోగం అవసరమయ్యే వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దని రైతులకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో సాగునీటి పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులకు నీటి కేటాయింపులు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పయ్యావుల.. ఎల్ నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.1994 నుంచి తనకు HLC కాలువతో అనుబంధం ఉందని.. మూడు దశాబ్దాల అనుభవంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పయ్యావుల తెలిపారు. సాగుకు నీరు అందించడంపై ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని, రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు దెబ్బతింటే, చరిత్రలో నిలిచిపోయేలా ఒకే సీజన్లో డ్యామ్‌కు ఉన్న 33 గేట్లను మార్చి రికార్డు సృష్టించామన్నారు. హెచ్ఎల్సీలో ఎనిమిది బ్రిడ్జిలు కూలిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారితే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న పయ్యావుల కేశవ్.. కొత్త బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు.మరోవైపు కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటికి కేటాయింపులు చేసిన తర్వాతే చెరువులకు నీరు అందించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దన్న మంత్రి..ఈసారి వరి, మిర్చి పంటలకు నీరు అందించే అవకాశం లేదని, ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాగునీటి వినియోగం

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఐఎండీ అంచనాల ప్రకారం, సెప్టెంబర్‌లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.మరోవైపు, దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. దీనివల్ల వాతావరణంలో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ‘ఎల్ నినో’ పరిస్థితులు నెలకొనడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ ఎల్ నినో ప్రభావం మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి ఈశాన్య రుతుపవనాలపై అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఐఎండీ వెల్లడించింది

ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో ఎల్‌నినో మబ్బుల్లో మాన్సూన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సగటున 20 శాతం తక్కువగా నమోదు కాగా, తూర్పు ప్రాంతాల్లో మాత్రం లోటు 36 శాతం స్థాయికి చేరుకుందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ చినుకుల తీవ్రత తగ్గి.. 10 నుంచి 20 నిమిషాల వరకే వర్షం పరిమితమవుతోంది. ఫలితంగా భూమి సరిగా తడవకపోవడంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తాయి. ఈ ఏడాది జూన్¯ 8న ప్రవేశించి, 23 నాటికి పూర్తిగా విస్తరించినా.. జూన్‌లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. జూలైలో కొంత మెరుగుదల కనిపించినా ఆగస్టులో మళ్లీ లోటు పెరిగింది. ఈ సీజన్లో మరో 41 రోజులు మిగిలి ఉన్నప్పటికీ సాధారణ లోటుకూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లోతుకు భూగర్భ జలాలు.. ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఊహించని విధంగా 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నాటి వర్షానంతర కాలంతో తాజా నివేదికలను పోల్చి చూస్తే భూగర్భ జలమట్టాలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. అత్యధికంగా తూర్పు ప్రాంతంలో సగటు నీటి మట్టం 6.51 మీటర్లు మాత్రమే ఉండగా, ఆగస్టు నాటికి అది ఏకంగా 14.03 మీటర్లకు పడిపోయింది. బోరుబావుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటమే ఈ తీవ్ర క్షీణతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో మిగిలి ఉన్న రోజుల్లో సుదీర్ఘ, తీవ్రమైన వర్షాలు కురిస్తేనే భూజలాలు పెరిగే అవకాశముంది. లేనిపక్షంలో క్యూర్ పరిధిలో నీటి ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP Weather Alert: కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణం ఇలా ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినప్పటికీ, వర్షాలు అక్కడక్కడే కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పగటిపూట కూడా ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయి.. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు పడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలు ఉన్నప్పటికీ, తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైతులకు ఏ పంటలు సాగు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ముందస్తు సూచనలు ఇస్తోంది. నేడు కూడా పోలవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న

రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల నెలవారి బడ్జెట్ పైన తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఎల్ నినో ప్రభావంతో సాగు తగ్గడం పంటలు సరిగా పండక పోవడం, మరోవైపు రవాణా చార్జీలు పెరగడంతో, ఆ ఛార్జీల భారాన్ని కూడా నిత్యవసర వస్తువుల పైన వేయడం వంటి చర్యలతో సామాన్యులు కుదేలవుతున్నారు.భారీగా పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు తాజాగా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ప్రతిరోజు అవసరమైన ఉల్లిపాయలు సామాన్య మధ్య తరగతి కుటుంబాల ప్రజల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయల ధరలు మళ్లీ భారీగా పెరిగి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. గత నెలలో రూ.20కే లభించిన ఉల్లి ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముడవుతోంది. దీంతో ఇంటి ఖర్చులు మరింత పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి పెరుగుతోంది.రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశంకిలో ఉల్లిపాయల ధరలు 50 రూపాయలకు చేరుకోవడంతో వంటలో ఉల్లిపాయలను వాడడానికి కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో పంట సాగు ఆలస్యం కావడం, ఖరీఫ్ సీజన్లో ఉల్లి దిగుబడి తగ్గడం, అలాగే డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.సామాన్యులకు భారంగా ఉల్లి ధరల పెరుగుదల ఇప్పటికే మార్కెట్లో పంచదార ధరలు పెరుగుతుండగా, ఉల్లి ధరలు కూడా పెరగడం సామాన్యులకు మరో భారం అయ్యింది. ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ప్రస్తుతం టమోటా కిలో రూ.15, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.45, ఉల్లిపాయ రూ.40, ఉల్లిపొర రూ.45, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.45, ఆలుగడ్డ రూ.18 వంటి రేట్లు నమోదవుతున్నాయి.బాసింగబలాలు ఫేమ్ ఈశ్వరసాయి మాధురి రాథోడ్ వ్యవహారం.. సోషల్ మీడియాలో రచ్చధరలను

వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. తలపై దట్టమైన నల్లటి మేఘాలు కనిపిస్తున్నా.. తీరా చూస్తే వర్షం పడకుండానే అలా గాలిలో కొట్టుకుపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఎల్ నినో కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలను ఐఎండీ ప్రస్తావించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావంతో ఆగస్టు 18 నుంచి 23 వరకు అంటే మొత్తం 6 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. ఆగస్టు 17 నుంచి 21 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఆకాశం నిండా మేఘాలు ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల పొడి వాతావరణమే వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడాలంటే గాలిలో కనీసం 70% తేమ ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర జిల్లాల్లో 60% తేమ ఉంటే, మిడిల్, సౌత్ జిల్లాల్లో కేవలం 42% మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 19న ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు కురవవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో తేమ శాతం 40% కంటే తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు.. సభలో ఎల్‌నినో అంశంపై చర్చించాలని సూచించారు. రఘువీరారెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని.. వారు సభకు దూరంగా ఉండటం సరికాదన్నారు.ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎష్ జగన్ అసెంబ్లీకి వెళ్లి ఎల్‌నినోపై సలహాలు ఇవ్వొచ్చన్నారు రఘువీరారెడ్డి. రాష్ట్రంలో రైతులు ఎల్‌నినో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించి కేంద్రం సహకారంతో రైతుల్ని ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో దెబ్బకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని..వర్షాలు లేక రైతులు వేసిన పంటలు కనీసం మొలకెత్తలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్‌నినో గండం నుంచి రైతులను ఆదుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు రఘువీరారెడ్డి.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపేయాలని రఘువీరారెడ్డి కోరారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల వినియోగంపై చర్చిస్తే జలవివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ తుంగభద్రలో నీటి వాటాను అడగకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యా వ్యవస్థలో సమస్యలపై విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తు్న్నామని.. యువత భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ మేధో నక్సల్స్ అన్న మాటను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు మాజీ

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలుగు రాష్ట్రాలకు వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం అందిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీకాగా, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా తెలంగాణలో ని పలు జిల్లాలకు వర్షాల పైన అప్డేట్ వచ్చింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Low Rain Fall: అవును తెలంగాణలో మబ్బులు బాగానే వస్తున్నయ్.. కానీ వాన పడినట్టే పడుతుంది. కానీ ఆ వెంటనే మబ్బులు మాయమవుతున్నాయి. ఏదో రెండు చుక్కల వర్షపాతం నమోదు తర్వాత మళ్లీ ఎండ చుర్రమనిపిస్తోంది. ఈ ఊరిలో ఉన్న వర్షం.. పక్క ఊరిలో ఉండదు.. పక్క పక్క మండలాల్లోనూ ఎంతో తేడా! వర్షపాత సగటులోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తే వర్షపాతం సాధారణంగానే ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో భారీ లోటు భారీగా కనిపిస్తున్నది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లోని చాలా మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఒక మండలంలో సాధారణ వర్షపాతముంటే.. దాని పక్కనే ఉండే మరో మండలం లోటులో ఉన్నది. రాష్ట్రంలో ఇదీ వర్షాల మాయ. హనుమకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉన్నది. వాటికితోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉన్నది. అటు భూగర్భ జలాలూ పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1.11 మీటర్లు దిగజారాయి. ఇటు ఏ ప్రాజెక్టులోనూ పూర్తి స్థాయిలో జలాలు లేవు. ఎగువ నుంచి వరదలు రాకపోవడం.. వచ్చినా ప్రాజెక్టులు నిండకలోపే ఆగిపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు నిండలేదు. గోదావరిలో అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్, కృష్ణాలో అతి ముఖ్యమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయకట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికం

ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తలు ఊహించినట్లే పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో (EL Nino)ప్రభావం మొదలైంది. అంతే కాదు ఇది క్రమంగా బలపడుతోంది. దీని వల్ల ప్రపంచ వాతావరణ పరిస్ధితుల్లో పెనుమార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా వివిధ దేశాల్లో రుతుపవనాలు, ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలు ఎల్ నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి అత్యంత బలమైన వాతావరణ పరిణామంగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, లోతైన పొరల్లోకి కూడా విస్తరిస్తోంది. Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..! ఇది ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చడానికి అవసరమైన అదనపు శక్తిని అందిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థల్లో పెను మార్పులు తప్పేలా లేవు. ఈసారి ఏర్పడబోయే ఎల్ నినో అత్యంత శక్తివంతమైన చారిత్రక వాతావరణ పరిణామంగా మారేందుకు 69 శాతం అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆధునిక వాతావరణ పరిశీలనలు ప్రారంభమైన 1950 సంవత్సరం రికార్డుల తర్వాత నమోదైన అత్యంత బలమైన

Sompeta: ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా విత్తన బంతులు రైతులకు అవగాహన సోంపేట: మండల పరిధి లో పలాస పురం గ్రామంలో N.F.A. శివాజీ సమక్షంలో B R.C. సెంటర్ దగ్గర 300 కేజీల విత్తన బంతులు తయారు చేయడం జరిగింది రానున్న ఎల్ నీ నో ప్రభావం వల్ల విత్తన బంతులు విత్తనాలు దీర్ఘ కాలిక పంటలు అనుములు అలసందలు ఆముదం కందులు బొబ్బర్లు. గోరు చిక్కుడు విత్తన గుళికలు గా తయారు చేసి పొలం లో వేసుకోవడం వల్ల సాధారణ వర్షం కంటే తక్కువ వర్ష 0 ఉన్న మొలకలు వచ్చి పంటలు పండే అవకాసం ఉంటుంది 365 రోజులు భూమి కప్పబడి భూమి ఆరోగ్యం కాపాడే ప్రక్రియ లో పంటలు పండక పోయిన ఈ పంటలు పండించుకుంటే భూమి ఆరోగ్యం కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని శివాజీ రైతులు సమక్షం లో చెప్పడం జరిగింది హాజరు అయినా వారు n.F.A. శివాజీ A.O.నరసింహమూర్తి F.M.T. kumari మేడం menter. లోహిదాస్ గారు రైతు అశోక్ గారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

Komaram Bheem: వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కలెక్టర్ హరిత కొమురం భీం: కొమురం భీం జిల్లాలో రైతులు వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది వరకు వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారని, అయితే రాబోయే రోజుల్లో వరి సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ముందుగానే అంచనా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బోరుబావులు ఉన్న రైతులు సైతం దీర్ఘకాలికంగా నీరు అందుబాటులో ఉంటుందా లేదా పరిశీలించిన తర్వాతే వరి సాగు చేపట్టాలని స్పష్టం చేశారు. అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా సాగు నష్టాలను తగ్గించుకోవడంతో పాటు రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందస్తు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ కె. హరిత తెలిపారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తలెత్తే కరువు సవాళ్లను ఎదుర్కొంటూనే, 15% వృద్ధి రేటును సాధించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆర్థికాభివృద్ధి ఏమాత్రం తగ్గకూడదని, సంక్షోభ సమయాల్లోనూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూలై 2026 నాటి ఆర్థిక నివేదికను ప్లానింగ్ విభాగం సమర్పించగా, దానిపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గత క్వార్టర్ (2025-26) ఫలితాలను విశ్లేషించగా, ఏపీ 10.7% నామినల్ వృద్ధిని నమోదు చేసి జాతీయ సగటును దాటేసింది. వ్యవసాయ రంగంలో 13.5%, పరిశ్రమల్లో 10.6%, సేవా రంగంలో 9.9% వృద్ధి నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని నివేదిక వెల్లడించింది. దీంతో ఎల్ నినో వల్ల వర్షపాతం లోపించినా, సాగునీటి లభ్యతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా, సామాన్య ప్రజలపై ఏమాత్రం భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులలో విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులలో 75.4% గ్రౌండింగ్ పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ముగింపుగా, ప్రకృతి వైపరీత్యాలు అడ్డుపడినా ఏపీ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకూడదని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే లక్ష్యిత 15% వృద్ధి సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నట్లు ఆయన

AP Economic Growth: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉందని పేర్కొంటున్నాయి. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధిరేటు 7 శాతంగా ఉండగా, ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపించింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో వృద్ధి రాష్ట్రంలోని ప్రధాన రంగాల్లోనూ వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పరిశ్రమల రంగంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేయడం సానుకూల పరిణామంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎగుమతుల్లోనూ పెరుగుదల సాధారణ ఎగుమతుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.16,322 కోట్ల విలువైన సాధారణ ఎగుమతులు నమోదై, 10.5 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో రాష్ట్ర ఉత్పత్తులకు డిమాండ్ పెంచే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ వసూళ్లలో 21 శాతం వృద్ధి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, పన్ను వసూళ్లలో మెరుగైన పర్యవేక్షణ కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ పన్ను వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరినట్లు పేర్కొన్నాయి. భారీ ప్రాజెక్టులతో పెట్టుబడులకు ఊతం రాష్ట్రంలో భారీ, మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రూ.2.88 లక్షల కోట్ల విలువైన భారీ, మెగా ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరాయని వెల్లడించింది. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులతో 73.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులు పెరగడం ద్వారా ఉపాధి

పదిహేను శాతం వృద్ధిరేటే లక్ష్యం సామాన్యులపై పడని ధరల భారం పెరిగిన జీఎస్టీ, ఎగుమతులు Chandrababu: సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రాన్ని వేధిస్తున్నప్పటికీ, ఏపీ ఆర్థిక పురోగతి మందగించకుండా 15 శాతం వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. తీవ్ర ఆర్థిక సవాళ్లు, వాతావరణ హెచ్చుతగ్గులు ఎదురైనప్పటికీ, సామాన్య ప్రజలపై ఏమాత్రం ధరల భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ప్రణాళిక విభాగం సమర్పించిన జులై 2026 నాటి సమగ్ర ఆర్థిక నివేదికను ఆయన క్షుణ్ణంగా సమీక్షించి, ప్రతి శాఖ తమ వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. Nara Lokesh: థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువకులు.. స్పందించిన నారా లోకేశ్.. సేఫ్‌గా తీసుకొస్తామని హామీ కంటింజెన్సీ ప్రణాళికలు, నియోజకవర్గ స్థాయి వ్యూహాలు: వ్యవసాయం, ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేందుకు నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపు ప్రతిపాదిత విధానాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీనికోసం జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. సమీక్షా నివేదిక ప్రకారం.. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం సాధారణ వృద్ధి, 9.9 శాతం వాస్తవ వృద్ధిరేటును సాధించి జాతీయ సగటు కంటే ముందుంది. రంగాల వారీగా పరిశీలిస్తే వ్యవసాయంలో 13.5 శాతం, పారిశ్రామికంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదు కావడం సానుకూల పరిణామంగా నిలిచింది. రాబడి, పెట్టుబడులు, మెగా ప్రాజెక్టుల వేగవంతం: సాంకేతిక అనుసంధానంతో పన్నుల వ్యవస్థను బలోపేతం చేయడంతో జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరాయి. సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరుకోగా, ఎస్టీపీఐ (STPI) ద్వారా ఎగుమతులు 32.2 శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6 శాతం మేర విపరీతంగా పెరిగాయి. అలాగే రాష్ట్రంలో మౌలిక

భారత్ పై ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఎల్ నినో (EL Nino) ప్రభావం తీవ్రంగానే పడింది. ఇప్పటికే ఖరీఫ్ పంటలు వేసేసి రైతులు సేద తీరాల్సిన వేళ.. ఇంకా ఎల్ నినో ముప్పు భయపెడుతూనే ఉంది. దీంతో ఇక ఈ వర్షాకాలంలో వర్షాలు లేవనే అంచనాలకు వచ్చేస్తున్న రైతులకు తాజాగా మారుతున్న పరిణామాలు ఊరట కలిగించేలా ఉన్నాయి. దేశంలో రుతుపవనాలు (Monsoon) మళ్లీ పుంజుకోవడంతో వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభిస్తోంది. అయినా త్వరలో ఎల్ నినో ముప్పు పొంచి ఉంది.Super El Nino : ఆగస్టు మొదటి వారంలో కురిసిన అసాధారణ భారీ వర్షాలు దేశవ్యాప్తంగా వర్షపాత లోటును 11 శాతానికి తగ్గించాయని కేంద్రం వెల్లడించింది. దీంతో వెనుకబడిన ఖరీఫ్ సాగు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 2011 తర్వాత ఆగస్టు మొదటివారంలో భారీ వర్షం కురిసింది. దేశంలోని పన్నెండుకు పైగా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు సాధారణ సాగుపై నెలకొన్న ఆందోళనలను తొలగించి, రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి.కేంద్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ఆగస్టు 7 నాటికి దేశంలో ఖరీఫ్ సాగు లోటు 17.96 లక్షల హెక్టార్లకు తగ్గింది. జూలై 24 నాటికి ఈ లోటు దాదాపు 38.82 లక్షల హెక్టార్లుగా ఉంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ వ్యత్యాసం గణనీయంగా తగ్గడం విశేషం. ముఖ్యంగా పప్పుధాన్యాల సాగు వేగంగా మెరుగుపడింది. అయితే వరి, నూనెగింజల సాగు మాత్రం గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. దేశంలో వరి సాగు గతేడాదితో పోలిస్తే 15.90 లక్షల హెక్టార్లు, నూనెగింజల సాగు 5.19 లక్షల హెక్టార్ల మేర తక్కువగా నమోదైందని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా, వర్షపాత విస్తరణలో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారత దేశంలో వర్షపాత లోటు కొనసాగుతోంది. ఈ

తూర్పు చైనాను భారీ వర్షాలు, ఈదురుగాలులతో కుదిపేసిన డాల్ఫిన్ తీవ్ర తుఫాను (Typhoon Dolphin)ప్రభావం భారత్ పై పరోక్షంగా పడుతోంది. ఆగస్టు 9న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహువాన్ సమీపంలో దాదాపు గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన ఈ తుఫాను చైనాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగా, వేల మైళ్ల దూరంలో ఉన్న భారత్‌లో మాత్రం రుతుపవనాలు (Southwest Monsoon)బలహీనపడ్డాయి. చైనా వైపు భారీ కుండపోత వర్షాలకు దారితీసిన వాతావరణ పరిస్థితులు.. భారత ఉపఖండంలో రుతుపవనాల వ్యవస్థను మాత్రం బలహీనపరుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.Super El Nino : పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రమైన అలజడి కొనసాగుతోంది. పసిఫిక్ ఉపరితల వాతావరణంలో సంభవిస్తున్న ఈ భారీ మార్పులు భారత్‌లో వర్షాల వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటిగా ఏర్పడుతున్న చురుకైన తుఫానులు భారత్ లో రుతుపవనాల్ని దెబ్బతీస్తూ తీవ్ర అవరోధంగా మారుతున్నాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతంలో రుతుపవనాల క్రియాశీలత భారీగా తగ్గిపోయే ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AP Weather: రేపు ఈ జిల్లాలో వర్షాలే వర్షాలు..! ఐఎండీ అలర్ట్..!ఈ ఏడాది పసిఫిక్ జోన్లో చోటుచేసుకుంటున్న ఎలినినో పరిస్థితులు భారత్ లో వర్షాల గమనాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీనివల్ల వాతావరణ ప్రసరణ అంతా పసిఫిక్ వైపే కేంద్రీకృతమవుతోంది. ఇలాంటి సమయాల్లో మేఘాలు హిందూ మహాసముద్రం నుండి తూర్పు వైపునకు మళ్లుతాయి. తద్వారా భారత్‌లో సకాలంలో కురవాల్సిన కీలక వర్షాల వ్యవస్థల సృష్టి మందగిస్తుంది. ఇది సాధారణంగా వర్షాలు కురిపించే బంగాళాఖాతంలో ద్రోణుల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే మూడింట ఒక వంతు అల్పపీడనాలు పసిఫిక్ తుఫానుల చలనం ఆధారంగానే ఊపందుకుంటాయి. కానీ ప్రస్తుత క్లిష్టమైన ప్రతికూల గాలుల వల్ల ఈ సానుకూల ప్రభావం భారత్‌కు దక్కడం లేదు.దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మేఘాల సాంద్రత తగ్గిపోవడమే కాకుండా, బంగాళాఖాతంలో వర్షాల ద్రోణులు ఆశించిన స్థాయిలో

ఎల్‌నినో దెబ్బతో ఈసారి వర్షాలు తగ్గుముఖం పడతాయేమోనన్న ఆందోళనల్లో ఉన్న దేశ ప్రజలకు, రైతాంగానికి వాతావరణ శాఖ అత్యంత తీపి కబురుందించింది. వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు రుతుపవనాలను బలహీనపరుస్తున్నప్పటికీ, భారతీయ వాతావరణంలో ఏర్పడిన రెండు శక్తివంతమైన అల్పపీడనాలు వర్షాలకు సరికొత్త ఊపిరిని ఊదాయ్. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షభారీగా దంచికొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అల్పపీడనాల జోడు గుర్రాల స్వారీదక్షిణ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం స్థిరపడగా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒడిశా తీరంలో మరొక అల్పపీడనం బలంగా రూపుదిద్దుకుంది. ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి తోడై వాతావరణంలోకి భారీగా తేమను లాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న ఈ అల్పపీడనాల ప్రభావంతో మధ్య, తూర్పు భారత దేశంలో వర్షాల విస్తృతి భారీగా పెరగనుంది.El Nino: వర్షాల రాజధానికే వానలు కరువు! కరుణించని మేఘమాలికలుఏ ఏ రాష్ట్రాల్లో వర్షాల ఉద్ధృతి?వాతావరణ శాఖ (IMD) ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటి ప్రభావం కేవలం తూర్పు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరాదికి కూడా విస్తరించనుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు తూర్పు రాజస్థాన్‌లో వానలు విపరీతంగా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే, తీరప్రాంత కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ముసురు పట్టి జోరుగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.Super El Nino : ఎల్‌నినోను ఢీకొడుతున్న ఇండియన్ ఓషన్ డిపోల్ఒకవైపు పసిఫిక్ సముద్రంలో ఉద్భవిస్తున్న ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల మందగమనం జరుగుతున్నప్పటికీ, హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న సానుకూల ఇండియన్ ఓషన్ డిపోల్ (Positive IOD)

రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం అంచనాలకు మించి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జల వనరుల పరిరక్షణ కోసం చేపట్టిన 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని ఇకపై ఒక నిరంతర కార్యక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, పంటల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి.. జలధార-జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.39 శాతం లోటు వర్షపాతం.. తీవ్ర నీటి సంక్షోభంఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాధారణంగా 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 525 మి.మీ. మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనాలను నివేదించారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో లోటు 56 శాతానికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రిజర్వాయర్లపై స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బేసిన్లలో కలిపి ప్రస్తుతం 563.05 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేదని పోల్చి చెప్పారు. ఆగస్టు నుంచి భూగర్భ జలమట్టాలు కూడా వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని