
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రకృతి ఒడిలో వేర్వేరు జీవుల ఆయుర్దాయం ఎంతో విచిత్రంగా, అద్భుతంగా ఉంటుంది. కొన్ని జీవులు కొన్ని నెలల వ్యవధిలోనే తమ జీవితచక్రాన్ని ముగించేస్తే, మరికొన్ని జీవులు మానవ నాగరికతల పరిణామాన్ని మౌనంగా వీక్షిస్తూ శతాబ్దాల పాటు జీవిస్తాయి. జంతు ప్రపంచంలో జీవుల సగటు ఆయుర్దాయం వెనుక ఉన్న శారీరక, పర్యావరణ రహస్యాలపై ఒక సమగ్ర విశ్లేషణ. సాధారణంగా చిన్న జీవుల్లో జీవక్రియలు వేగంగా జరగడం వల్ల వాటి ఆయుష్షు తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎలుక సగటున ఒక ఏడాదే జీవిస్తుంది. పావురం 5 ఏళ్లు, కంగారూ 6 ఏళ్లు, కోడి 10 ఏళ్లు బతుకుతాయి. మన విశ్వసనీయ భాగస్వామి అయిన కుక్క ఆయుర్దాయం 13 ఏళ్లు కాగా, క్రూరమృగం పులి 15 ఏళ్లు, పాలు ఇచ్చే ఆవు 20 ఏళ్లు, గుర్రం 25 ఏళ్ల వరకు జీవిస్తాయి. వాతావరణం అనుకూలిస్తే కొన్ని జీవులు నమ్మశక్యం కాని రీతిలో జీవిస్తాయి. గాలాపాగోస్ తాబేలు సులువుగా 100 ఏళ్ల మైలురాయిని చేరుకుంటుంది. సముద్రాల విషయానికి వస్తే జీవుల ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది. బోహెడ్ తిమింగలం 200 ఏళ్లు జీవించగలదు. శీతల జలాల్లో అత్యంత నెమ్మదిగా పెరిగే గ్రీన్ ల్యాండ్ షార్క్ ఆయుర్దాయం ఏకంగా 272 ఏళ్లు కావడం విశేషం. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే సముద్రపు అగాధాల్లో నివసించే జైంట్ బారెల్ స్పాంజ్ సుమారు 2,300 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇక నల్ల పగడాలు (బ్లాక్ కోరల్) దాదాపు 4,309 సంవత్సరాల దీర్ఘకాలిక మనుగడ సాగిస్తూ ప్రకృతి సృష్టిలోని అనంతమైన ఆశ్చర్యాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జీవుల జీవక్రియ వేగం, పర్యావరణ ఉష్ణోగ్రత, జన్యు నిర్మాణం వంటి అంశాలే ఈ ఆయుర్దాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలని జీవశాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 30 సంవత్సరాలు: బర్మీస్ రాక్ పైథాన్ (రాతి కొండచిలువ) 60 సంవత్సరాలు: ఫ్లెమింగో (సముద్రపు చిలుక / నెమలి కోడి) 272 సంవత్సరాలు: గ్రీన్ లాండ్ షార్క్

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఘోర విపత్తు నేపథ్యంలో, ఇస్రో-నాసా సంయుక్తంగా రూపొందించిన 'నైసర్' ఉపగ్రహం పనితీరుపై వచ్చిన విమర్శలు నిరాధారమని తేలింది. విపత్తును ముందుగా హెచ్చరించడంలో ఈ శక్తిమంతమైన శాటిలైట్ విఫలమైందన్న ఆరోపణలను తాజా విశ్లేషణలు పటాపంచలు చేశాయి. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే నైసర్ స్పష్టమైన హెచ్చరిక సంకేతాలను పంపిందని వెల్లడైంది.చైనాలోని చాంగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి జెన్షియాంగ్ లియు, నైసర్ చిత్రాలను విశ్లేషించి ఈ కీలక విషయాలను వెల్లడించాడు. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే ప్రమాదకర ప్రాంతంలోని పర్వత వాలులో భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు అతడు గుర్తించాడు. అక్కడి మంచు, రాతి పొరలు తీవ్ర ఒత్తిడికి గురై, ఆ ప్రాంతం ఏకంగా కొన్ని మీటర్ల మేర పక్కకు జరిగినట్లు తేలింది. ఈ కదలికలు ఒకేచోట కేంద్రీకృతం కావడం, రాబోయే కొండచరియల విపత్తుకు స్పష్టమైన సంకేతమని లియు తన విశ్లేషణలో పేర్కొన్నాడు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా ఈ 'నైసర్' (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసే లక్ష్యంతో దీన్ని గత ఏడాదే ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఒకటి. మేఘాలు, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పగలు, రాత్రి తేడా లేకుండా స్పష్టమైన చిత్రాలను తీయగల రెండు సింథటిక్ అపెర్చర్ రాడార్లను (ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్) కలిగి ఉన్న తొలి శాటిలైట్ ఇదే.ఈ వివరాల

కింగ్హాయ్: ఉత్తర-పశ్చిమ చైనాలోని కింగ్హాయ్ ప్రావిన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. చైనా ఎర్త్‌క్వెక్ నెట్వర్క్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, భూకంప తీవ్రత 5.6 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. దీని కేంద్రం కింగ్హాయ్లోని హైక్సీ ప్రిఫెక్చర్లో భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రకంపనలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రపంచంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో చైనా ఒకటి. దీనికి ప్రధాన కారణం దేశ పశ్చిమ మరియు నైరుతి భాగాలలో ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొనడం, అనేక క్రియాశీల ఫాల్ట్‌లు (సక్రియ పలకలు) ఉండటమే. చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు) అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) హావభావాలతో ఆకట్టుకుంటున్న అందాల తార.. (ఫొటోలు) వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ? ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్ అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత

ప్రకృతి ఇండోనేషియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొద్ది గంటల వ్యవధిలోనే వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ ద్విపకల్పాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన 7.7 తీవ్రత కలిగిన వినాశకర భూకంపం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, పశ్చిమ సుమత్రా ప్రాంతంలో మరోసారి 6.9 తీవ్రతతో భూమి తీవ్రంగా ప్రకంపించింది. ఈ దెబ్బకు కనీసం 38 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.శనివారం తెల్లవారుజామున సుమారు 3:28 గంటల సమయంలో ఫ్లోరెస్ తీర ప్రాంతంలో సంభవించిన తొలి భూకంపం ధాటికి అనేక గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 47 మంది చనిపోగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. శతాబ్దాలలోనే అతిపెద్ద ప్రకంపనగా భావిస్తున్న ఈ ఘటనతో సుమారు 2,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలేసి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. తీరప్రాంత ప్రజలను సునామీ భయం తీవ్రంగా వేధించింది.కొండచరియలు విరిగిపడి నిలిచిన సహాయక చర్యలు!భూకంప ధాటికి పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోయాయి. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న నాగేకియో ప్రాంతానికి వెళ్లే రహదారులు మట్టిదిబ్బలతో మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు.ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!పశ్చిమ సుమత్రాలో మరో భారీ ప్రకంపన!తొలి ప్రమాదం నుంచి కోలుకోకముందే, శనివారం ఆలస్యంగా పశ్చిమ సుమత్రా పరిధిలోని పెమాటాంగ్ సియంతార్ సమీపంలో 183 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతో రెండో భూకంపం సంభవించిందని యూఎస్ జీయోలాజికల్ సర్వే ధృవీకరించింది. అయితే ఈ రెండో భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు ఏవీ జారీ కానప్పటికీ, వరుస భూప్రకంపనలతో భయపడిపోయిన

ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై... రిక్టర్‌స్కేల్‌పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత విరిగిపడ్డ కొండచరియలు.. వందల ఇళ్లు ధ్వంసం.. పలువురికి గాయాలు మౌమెరి(ఇండోనేషియా), ఆగస్టు 15: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపంతో కారణంగా 47 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 2 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భూకంపంతో కొండ చరియలు విరిగి పడడం, రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. తీవ్రమైన భూప్రకంపనల కారణంగా అధికారులు తొలుత సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తర్వాత ఉపసంహరించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం 4.24 గంటలకు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత గల మరో భూకంపం కూడా సంభవించింది. భూ ఉపరితలం నుంచి 172.5 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించడంతో పెద్దగా నష్టం వాటిల్ల లేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. కాగా ఇండోనేషియాలో 1992లో భూకంపం కారణంగా వచ్చిన సునామీతో ఫ్లోరెస్ ద్వీపం వద్ద 2,500 మంది చనిపోయారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Indonesia Earthquake Videos: ఇండోనేషియాలోని ఫ్లోరోసెస్ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్ పై 7.7 గా నమోదయింది. నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వాతావరణ శాఖ ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు బయటకు రాలేదు. ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపంలో 225 మంది మరణించిన సంగతి తెలిసిందే, తాజాగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరోపియన్ మెడిట్రియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం నీటి అడుగున సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:58 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అధికారులు ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ఇతర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సంస్థ పేర్కొంది. ఇండోనేషియాలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి, పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం సముద్ర గర్భంలో సంభవించినందున, భూభాగంపై దాని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇండోనేషియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ప్రభావం వల్ల ఇక్కడ నిరంతరం భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది. జకార్తా, ఆగస్టు 15: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది. దీంతో తూర్పు నుసా తెంగారాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించాయని వివరించింది. దీంతో జనం భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీసినట్లు తెలిపింది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరో వైపు సముద్రంలోని కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రజలను ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు

ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. శనివారం తెల్లవారుజామున దేశ తీరప్రాంతంలో సముద్ర గర్భంలో 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10 నుంచి 30 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా ఏజెన్సీ (బీఎంకేజీ) కూడా ధ్రువీకరించింది. భూ ప్రకంపనల ధాటికి సమీపంలోని ద్వీపాలు, నగరాలు తీవ్రంగా కంపించడంతో.. నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రంలో చాలా తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించారు. 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) కూడా ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను అప్రమత్తం చేసింది.సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌పీబీ) రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. ఈ భూకంపం వల్ల పలు భవనాలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) వచ్చే అవకాశం ఉన్నందున, శిథిలావస్థలో ఉన్న

Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని నుసా తెంగ్గరా ప్రావిన్సు ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఎండే నగరానికి ఉత్తర – వాయవ్య దిశగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో..10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తరువాత.. అదే ప్రాంతంలో 5.6, 5.9, 6.1 తీవ్రతతో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈస్ట్ నుసా టెంగారా, సౌత్ సులవేసి, వెస్ట్ నుసా టెంగారా ప్రావిన్సుల్లో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలలు 0.5 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు ఎత్తు ఉండొచ్చని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. దీంతో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు తెలిసింది. అయితే, వరుస భూకంపాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు

శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీప సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే, ఇండోనేషియా అధికారులు ధ్రువీకరించారు. భూకంప ప్రకంపనలు రావడంతో వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీనితో భయాందోళనకు గురైన వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను, ఆస్పత్రులను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.Independence Day 2026:ఢిల్లీ నుంచి గల్లీ వరకు -భారత్‌లో పండగ వాతావరణం..!!యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. ఈ లోతు తక్కువ భూకంప కేంద్రం ఫ్లోరెస్ ద్వీపంలోని ఎండే పట్టణానికి వాయవ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉత్తర తీరంలో నమోదైంది. ప్రధాన భూకంపం వచ్చిన కొద్ది సేపటికే అదే ప్రాంతంలో వరుసగా భారీ ప్రకంపనలు సంభవించాయి. ఇందులో 5.6, 5.9, 6.1 తీవ్రత కలిగిన భారీ ప్రకంపనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భవనాలు బలంగా ఊగిపోవడంతో ఆస్పత్రుల్లోని రోగులు బయటకు పరుగులు తీశారని.. అనేక చోట్ల గోడలు పగుళ్లు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. ఈ భూకంపం సముద్ర గర్భంలో సంభవించడం వల్ల ఇండోనేషియా మైదాన ప్రాంతాల్లో దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పాలనా యంత్రాంగం నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.సునామీ హెచ్చరికలు జారీఈ భూకంపం కారణంగా సముద్రంలో సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ(BMKG) హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు నుసా తెంగ్గారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా తెంగ్గారా ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే ప్రమాదం ఉందని BMKG డైరెక్టర్ విజయంతో వెల్లడించారు. మౌమేరే పట్టణంలో సముద్ర నీరు వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది సాధారణంగా సునామీకి ముందు కనిపించే ప్రధాన సంకేతం. ప్రస్తుతం తీరంలో 19

భూమిపై ఒకప్పుడు ఏడాదికి 365 రోజులు కాదు, ఏకంగా 372 రోజులు ఉండేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 7 కోట్ల ఏళ్ల క్రితం (క్రెటేషియస్ యుగం చివరిలో) ఒక రోజు నిడివి కేవలం 23 గంటల 31 నిమిషాలు మాత్రమే ఉండేదని, అంటే ఇప్పటికంటే దాదాపు అరగంట తక్కువని తేల్చారు. ఒమన్‌లోని అల్-హజర్ పర్వత ప్రాంతంలో లభ్యమైన ఒకే ఒక్క పురాతన నత్త శిలాజంపై జరిపిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పరిశోధకులు 'టొరైటెస్ సాంచెజీ' అనే జాతికి చెందిన ఈ నత్త శిలాజంపై అత్యంత అధునాతన లేజర్ టెక్నాలజీతో విశ్లేషణ జరిపారు. ఈ జీవి తన తొమ్మిదేళ్ల జీవితకాలంలో దాని కర్పరంపై ఏర్పడిన రోజువారీ పెరుగుదల వలయాలను (గ్రోత్ రింగ్స్) లెక్కించారు. రసాయన విశ్లేషణ, విజువల్ కౌంటింగ్ వంటి మూడు పద్ధతుల్లో పరిశీలించి, సంవత్సరానికి కచ్చితంగా 372 రోజువారీ వలయాలు ఉన్నాయని నిర్ధారించారు.భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య కాలం (సంవత్సరం) దాదాపు స్థిరంగా ఉన్నందున, ఏడాదిలోని 372 రోజులను బట్టి ఒక రోజు నిడివి 23 గంటల 31 నిమిషాలుగా లెక్కించారు. భూభ్రమణం నెమ్మదిగా ఉండటానికి కారణం, అప్పట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటమేనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో ఏర్పడే అలల ఘర్షణ (టైడల్ ఫ్రిక్షన్) కారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం చంద్రుడు ఏడాదికి సగటున 3.82 సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరంగా జరుగుతున్నాడని, ఇదే

లడఖ్ లో గురువారం (ఆగస్టు 13) ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్క సారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంకు సంబంధించిన సమాచారమేదీ లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎస్సీఎస్) అందించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల స్వల్ప లోతులోనే ఈ ప్రకంపనలు ఉద్భవించడంతో ఉపరితలంపై తీవ్రత ఒకింత ఎక్కువగా ఉంది. భూకంపం సంభవించిన వెంటనే స్థానిక పరిపాలనా యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాయి.ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. పర్వత ప్రాంతమైన లడఖ్ భూకంప సీస్మిక్ జోన్ పరిధిలో ఉండటంతో అధికారులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడతాడా? మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్!

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి జనం భయంకపితులు అయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.ఈ తెల్లవారు జామున సరిగ్గా 6:05 నిమిషాలకు భూమి ప్రకోపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5గా రికార్డయింది. లేహ్ కు ఉత్తరం- ఆగ్నేయ దిశగా 302 కిలోమీటర్ల దూరంలో భారత సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించింది. 36.881 అక్షాంశం, 74.402 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల భూకంప తీవ్రత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లల్లోనూ కనిపించింది. ఆయా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వీటి తీవ్రత నమోదైంది.ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల ప్రకంపనలు సంభవించినట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. కార్గిల్, లఢక్, జమ్మూ కాశ్మీర్ లల్లో పలు ప్రాంతాల్లో దీని తీవ్రత కనిపించింది. ఇళ్లల్లోని వస్తువుల కిందపడ్డాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు అందలేదు.తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుకలేహ్లో తాజా ప్రకంపనలు హిమాలయ పర్వత శ్రేణుల్లోని భౌగోళిక మార్పుల తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. జమ్మూ కాశ్మీర్, లఢక్ ఫాల్ట్ లైన్ జోన్ పరిధిలో ఉంటాయి. దీని పరిధిలో ఉండే సెవెన్ ప్లేట్స్ నిరంతరం క్రియాశీలకంగా కదులుతూ ఉండటం, ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం సర్వసాధారణం. ఆ సమయంలో వెలువడే తరంగాలు ఒక్కసారిగా భూ ఉపరితలాన్ని బలంగా తాకుతుంటాయి. ఫలితంగా ఈ

బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందంతో సీఎం చంద్రబాబు ఈరోజు( బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.16 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. బీచ్ శాండ్ మైనింగ్, ఏయే ఉత్పత్తులు వస్తాయో.. వాటిని ఏయే రంగాల్లో వినియోగిస్తారని తెలిపారు. వాటికి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆయా అంశాలను అదానీ ప్రతినిధుల బృందం సీఎంకు వివరించింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

బొగొటా: కొలంబియాలో నిన్న ( సోమవారం) 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 169 మంది మృతి చెందగా, సుమారు 570 మంది గాయపడ్డారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ధాటికి 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు దెబ్బతిన్నాయి. కనీసం 61 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు. ప్రధాన భూకంపం తర్వాత సైతం దాదాపు 21 ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భూకంపం విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెరీరాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన దృశ్యాలు, మనిజాలెస్లోని ప్రసిద్ధ నియో-గోతిక్ కేథడ్రల్ పక్క టవర్ కూలిపోయిన దృశ్యాలు భూకంప తీవ్రతను చూపిస్తున్నాయి. కాలీలో శిథిలాల కింద చిక్కుకున్న ఆరు నెలల చిన్నారిని, ఆమె తల్లిని రక్షకులు సురక్షితంగా బయటకు తీశారు. మరో ఘటనలో ఆసుపత్రి కిటికీల నుంచి తాళ్ల సహాయంతో పలువురిని బయటకు తీసుకొచ్చారు. భూకంప కేంద్రానికి సమీపంలోని కొలంబియా పసిఫిక్ ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన ఈ ప్రాంతంలో ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు సంభవిస్తుంటాయి. కొలంబియా జియోలాజికల్ సర్వీస్ ప్రకారం, ఇది 21వ శతాబ్దంలో దేశంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం. భూకంప కేంద్రం భూగర్భంలో లోతుగా ఉన్నప్పటికీ, 7.4 తీవ్రత కారణంగా జనసాంద్రత ఉన్న లోయ ప్రాంతాల్లో ప్రకంపనలు భారీ నష్టాన్ని కలిగించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా

దక్షిణామెరికా ఖండంలో భూమాత మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నిమిషాల వ్యవధిలోనే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోగా, సజీవంగా ఉన్న నగరాలు క్షణాల్లో ఇటుకల కుప్పలుగా మారిపోయాయి. తీవ్ర ప్రకంపనలతో కొలంబియా దేశం కకావికలమైంది. ప్రకటనల ప్రకారం ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉంటారని భయపడుతున్నారు.రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. 21వ శతాబ్దంలో ఈ దేశం చూసిన అత్యంత దారుణమైన భూకంపంగా ఇది చరిత్రకెక్కింది.క్షతగాత్రుల ఆర్తనాదాలు.. నిశ్శబ్దమైన నగరాలుసోమవారం నమోదైన రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం పశ్చిమ కొలంబియాను పూర్తిగా ఊపేసింది. పెరీరా, కాలీ, మానిజాలెస్, క్విబ్డో వంటి ప్రధాన నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆసుపత్రులు, రహదారులు ధ్వంసమవ్వడంతో అత్యవసర వైద్య సేవలు అందించడం కూడా సవాలుగా మారింది. సుదూర అటవీ ప్రాంతమైన చోకోలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోవడంతో అసలు అక్కడ ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ అంచనాకు అందడం లేదు. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ఆర్మీతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.Earthquake: ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్! సునామీ గండం?అసలు ఈ విపత్తు వెనుక కారణమేంటి?ఇంత పెద్ద భూకంపం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కొలంబియా దేశం భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన టెక్టోనిక్ ప్లేట్ల కలయిక ప్రాంతంలో ఉంది. భూగర్భంలో ఉండే నాజ్కా, సౌత్ అమెరికన్ ప్లేట్లు నిరంతరం ఒకదానినొకటి ఢీకొంటూ ఉంటాయి.భూమి అడుగున దాదాపు 107 కిలోమీటర్ల లోతున ఇరుక్కుపోయిన భారీ రాతి పొరలు ఒక్కసారిగా పక్కకు జరగడం వల్ల తీవ్ర శక్తులు విడుదలయ్యాయి. లోతు ఎక్కువగానే ఉన్నప్పటికీ, భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో భూమి ఉపరితలంపై తీవ్ర విధ్వంసం సంభవించింది. ప్రధాన భూకంపం తర్వాత కూడా మరో 21 సార్లు ఆఫ్టర్ షాక్స్ రావడంతో జనాలు ఇళ్లల్లోకి
Colombia 7.4 Earthquake : దక్షిణాఫ్రికా ఖండంలోని కొలంబియా దేశాన్ని ఓ వినాశకరమైన ప్రకృతి విపత్తు తీవ్రంగా నాశనం చేసింది. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో కూడిన అత్యంత శక్తివంతమైన భూకంపం రాగా.. పలు నగరాలు క్షణాల్లో శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఈ శతాబ్దంలోనే కొలంబియా ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 570 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తీవ్రమైన ఆస్తి నష్టం.. అత్యవసర పరిస్థితి విధింపు !ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ విపత్తు మొదటి పెద్ద సవాలుగా మారింది. జూన్ నెలలో పొరుగున ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే కొలంబియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తొలిసారి వచ్చిన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఈ విధ్వంసంలో కనీసం 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు.కళ్లముందే కుప్పకూలిన నిర్మాణాలుబాధితులకు తక్షణ నిధులు, ఉపశమన చర్యలు వేగవంతం చేసేందుకు అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేయబోం. ప్రజలను కచ్చితంగా ఆదుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు భూకంప ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలగా.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవవుతున్నాయి. ముఖ్యంగా పెరేరా నగరంలో నాలుగు అంతస్తుల భవనం చూస్తుండగానే నేలమట్టమైంది. మానిజాలెస్ నగరంలోని ప్రసిద్ధ నియో-గోథిక్ కేథడ్రల్ పక్క టవర్లు కూలిపోయి వీధులపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.కాలి నగరంలో ఐదు అంతస్తుల భవన శిథిలాల

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఊహించని ఘోర విపత్తు సంభవించింది. సోమవారం ఆగస్టు 10న ఉదయం చోటుచేసుకున్న 7.4 తీవ్రత గల భారీ భూకంపం దేశాన్ని వణికించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా నమోదైన ఈ ఘటన ఆధారంగా కొత్తగా అధికారం చేపట్టిన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా దేశంలో జాతీయ విపత్తు పరిస్థితిని ప్రకటించారు. స్థానిక సమయం ఉదయం 7:34 గంటలకు చోకో ప్రావిన్స్‌లోని సాన్ జోస్ డెల్ పాల్మర్ పట్టణం సమీపంలో ఈ భూకంపం భూమికి 100 నుంచి 107 కిలోమీటర్ల లోతున సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే మరియు కొలంబియా జియోలాజికల్ సర్వీస్ దీని తీవ్రతను ధృవీకరించాయి. ఇది 21వ శతాబ్దంలో కొలంబియాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. పశ్చిమ కొలంబియా ప్రాంతాలైన రిసరాల్డా, వాల్లె డెల్ కాకా, చోకో, కాల్డాస్ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. దీంతో పెరెయిరా ప్రాంతంలో కనీసం 40 మంది, కాలి ప్రాంతంలో 35 మంది వరకు మరణించారు. ముగ్గురు పసిపిల్లలు సహా అనేకమంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. ఇదిలా ఉండగా 1,500కు పైగా నివాసాలు దెబ్బతినడమే కాకుండా 61 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం చేసి కేవలం మూడు రోజులు మాత్రమే పూర్తి చేసుకున్న అధ్యక్షుడు ఎస్ప్రియెల్లాకు ఇది తొలి పరీక్షగా మారింది. ఫలితంగా ఆయన జాతీయ ప్రసంగం చేస్తూ ప్రాణాలను రక్షించడం, బాధితులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రకటనతో అత్యవసర నిధులు విడుదల కాగా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ భూకంప ప్రభావం

బొగోటా: దక్షిణ అమెరికా ఖండంలో వరుస భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం వెనెజువెలాలో సంభవించిన భూకంప ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా పొరుగు దేశమైన కొలంబియాలో సంభవించిన తీవ్ర భూకంపం పెను నాశనాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్‌లో భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈ ప్రకృతి విలయం కారణంగా కనీసం 111 మంది మరణించగా, 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు

ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది.. భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదం లాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్‌లో సుమారు 40 వేల

కొలంబియా దేశంలో సోమవారం ఉదయం ఒక పెద్ద విషాదం జరిగింది. పశ్చిమ కొలంబియా ప్రాంతాన్ని 7.4 తీవ్రతతో భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. వీరిలో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ ఈ అధికారిక లెక్కలను వెల్లడించింది. భూకంపం ధాటికి అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి రెస్క్యూ టీమ్‌లు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో నేషనల్ డిజాస్టర్ ప్రకటించింది. ఆర్మీ సైనికులను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేసింది. ఈ భారీ భూకంప కేంద్రం పశ్చిమ కొలంబియాలోని శాన్ జోసే డెల్ పాల్మర్ ప్రాంతంలో ఉంది. ఇది రాజధాని బొగోటాకు దాదాపు 150 మైళ్ల దూరంలో ఉండే ఒక వెనుకబడిన ప్రాంతం. అయితే, దీని ప్రభావం రాజధాని బొగోటాలో కూడా చాలా తీవ్రంగా కనిపించింది. పెద్ద శబ్దంతో సైరన్లు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల దేశంలో 5 ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 86 భారీ భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అంతేకాకుండా, భద్రతా కారణాల వల్ల 7 విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు. 20కి పైగా మున్సిపాలిటీలపై ఈ ప్రభావం పడింది. పొరుగున ఉన్న ఈక్వెడార్, పనామా దేశాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపంలో కాలి అనే నగరంలో ఒక ప్రధాన ఆసుపత్రికి చెందిన పిల్లల, నవజాత శిశువుల వార్డులు ఉన్న భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు

కొలంబియాలో నిన్న భారీ భూకంపం సంభవించి పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి ఇప్పటివరకు 132 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ శతాబ్దంలో దేశంలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పల్మార్ సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి పెరీరా, కాలీ, మణిజాలెస్ వంటి నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మణిజాలెస్‌లోని ఓ చర్చి టవర్ కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకంపనలు రాగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీ ఈ విపత్తు నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంపం వల్ల 1,500కు పైగా ఇళ్లు దెబ్బతినగా, 61 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు నెలల చిన్నారిని సురక్షితంగా కాపాడారు. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో కొలంబియా ఉండటమే భూకంప తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Earthquake in Colombia: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాను భారీ భూపంకం వణికించింది. ఈ ధాటికి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటికే మృతుల సంఖ్య 140 వరకు చేరుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు దాదాపు వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది భూకంపం ధాటికి నేలమట్టమైన శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యధికంగా రిసరాల్టా ప్రావిన్స్‌లో దాదాపు 40 మందికి పైగా మరణించినట్టు సమాచారం. కాలి సిటీలో ఎక్కువ భవనాలు కుప్పకూలాయి. చోకో ప్రావిన్స్‌లో శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో 107 కిలీమీటర్ల లోతులో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు జియోలాజికల్ సర్వే తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం క్లిక్ చేస్తుండి.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాను భయంకరమైన విపత్తు ముంచెత్తింది. సోమవారం సంభవించిన శక్తివంతమైన భూకంప ధాటికి పలు నగరాలు క్షణాల్లో అతలాకుతలమయ్యాయి. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ రాకాసి భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వందలాది బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో అమాక ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఈ దారుణ విపత్తులో అత్యధికంగా రిసారాల్డా ప్రావిన్స్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వాలే డెల్ కాకా ప్రాంతంలో 27 మంది, చోకో ప్రావిన్స్‌లో నలుగురు, మణిజాలెస్ నగరంలో ముగ్గురు, అంటియోకియా ప్రావిన్స్‌లో ఒకరు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రముఖ నగరాలైన పెరీరాలో 18 మంది, కాలి నగరం ఉన్న వాలే డెల్ కాకా విభాగంలో 27 మంది బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ భూకంపం: 7.4 తీవ్రతతో విలయతాండవం, 3 దేశాలు షేక్..భూమికి 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలురాజధాని బొగోటాకు పశ్చిమంగా దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో రీజియన్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. భూమి అంతర్భాగంలో దాదాపు 107 కిలోమీటర్ల లోతున భారీ మార్పులు రావడం వల్లనే ఈ స్థాయిలో వినాశనం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రకంపనల ధాటికి పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా దేశాలు కూడా తీవ్రంగా ఉలిక్కిపడ్డాయి.శతాబ్దపు మహా ప్రళయం.. 4 వేలు దాటిన శవాల కుప్పలు..యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలువిపత్తు సంభవించిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల హాహాకారాలతో

పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా 69 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణానికి సమీపంలో, భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూకంప తీవ్రతకు పెరీరా, కాలి, క్విబ్డో, మనీజల్స్ వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క పెరీరా నగరంలోనే 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. మనీజల్స్లోని చారిత్రక నియో-గోతిక్ కేథడ్రల్ టవర్ ఒకటి కూలిపోయింది. భూకంపం ప్రభావం పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో కూడా కనిపించింది.భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మనీజల్స్, క్విబ్డో సహా ఆరు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి. రాజధాని బొగోటాలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.రంగంలోకి దిగిన ప్రభుత్వంకొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా వెంటనే సహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగంలో యూనిఫైడ్ కమాండ్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి, నష్టాన్ని అంచనా

సోమవారం ఉదయం లాటిన్ అమెరికా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూమి పొరల్లో చోటుచేసుకున్న తీవ్ర కదలికలతో కొలంబియా దేశం భయంకరంగా వణికిపోయింది. రాజధాని నగరంలో భారీ భవనాలు సైతం ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం ప్రకంపనలు కేవలం కొలంబియాకే పరిమితం కాకుండా.. పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా వరకు వ్యాపించడం అకస్మాత్తుగా నెలకొన్న భయానక వాతావరణానికి అద్దం పడుతోంది.కొలంబియా రాజధాని బొగోటాలో సోమవారం అనూహ్యంగా నేల కంపించింది. చూస్తుండగానే ఇళ్లు, కార్యాలయాల భవనాలు అటూఇటూ ఊగిపోయాయి. ఏ క్షణాన ఏ భవనం కుప్పకూలుతుందోనని భయాందోళనకు గురైన జనం అప్రమత్తమై వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లన్నీ క్షణాల్లో కిక్కిరిసిపోయాయి.తీవ్రత 7.4 గా అమెరికా అంచనాఈ భూకంప తీవ్రతపై వివిధ భూగర్భ శాస్త్ర పరిశోధనా సంస్థలు వేర్వేరు లెక్కలను వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.4గా నమోదు చేయగా.. కొలంబియా స్థానిక జియోలాజికల్ ఏజెన్సీ మాత్రం ఇది 6.6 తీవ్రతతో వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక జర్మనీకి చెందిన GFZ సంస్థ 6.8గా పేర్కొంది. పశ్చిమ కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతానికి సమీపంలో భూమికి దాదాపు 79 నుంచి 100 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు నిపుణులు గుర్తించారు. Earthquake: ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్! సునామీ గండం?సరిహద్దులు దాటిన ప్రకంపనలుఈ విపత్తు ప్రభావం ఒక్క కొలంబియాలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న ఈక్వెడార్ రాజధాని క్విటో నగరంతో పాటు.. సుదూరంగా ఉన్న పనామా దేశంలోనూ ప్రజలు ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అటు వెనిజులా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.శతాబ్దపు మహా ప్రళయం.. 4 వేలు

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సంభవించిన స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జాతీయ భూకంప కేంద్రం నివేదిక ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆదివారం ఉదయం 5.33 గంటలకు 3.3 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప కేంద్రం మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హత్గడ్ పర్వత శ్రేణుల వద్ద, భాన్వాడ్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాసిక్ నగరంతో పాటు సుర్గాణ, కల్వాన్, దేవళ, చాంద్వాడ్, పేట్, దిండోరి, నిఫాడ్ తాలూకాల్లో ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుర్గాణ తాలూకాలోని భదర్, దిండోరి తాలూకాలోని నానాషి ప్రాంతాల్లోని కొన్ని నివాస గృహాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆనకట్టలను తనిఖీ చేయగా, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని నాసిక్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ సూచించారు. అయితే, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా గత జూలై 25 నుండి 28 వరకు, అలాగే ఆగస్టు 6న కూడా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ‘హనీమూన్ హత్యకేసు’: ఇండోర్‌లో సోదరుల అరెస్ట్ టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ పెనమలూరులో పీఎస్ లో కీచక పోలీస్.. బాధిత వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన