Colombia 7.4 Earthquake : దక్షిణాఫ్రికా ఖండంలోని కొలంబియా దేశాన్ని ఓ వినాశకరమైన ప్రకృతి విపత్తు తీవ్రంగా నాశనం చేసింది. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో 7.4 తీవ్రతతో కూడిన అత్యంత శక్తివంతమైన భూకంపం రాగా.. పలు నగరాలు క్షణాల్లో శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఈ శతాబ్దంలోనే కొలంబియా ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఈ భూకంప ధాటికి ఇప్పటి వరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 570 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తీవ్రమైన ఆస్తి నష్టం.. అత్యవసర పరిస్థితి విధింపు !ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ విపత్తు మొదటి పెద్ద సవాలుగా మారింది. జూన్ నెలలో పొరుగున ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే కొలంబియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తొలిసారి వచ్చిన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఈ విధ్వంసంలో కనీసం 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు.కళ్లముందే కుప్పకూలిన నిర్మాణాలుబాధితులకు తక్షణ నిధులు, ఉపశమన చర్యలు వేగవంతం చేసేందుకు అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేయబోం. ప్రజలను కచ్చితంగా ఆదుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు భూకంప ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలగా.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవవుతున్నాయి. ముఖ్యంగా పెరేరా నగరంలో నాలుగు అంతస్తుల భవనం చూస్తుండగానే నేలమట్టమైంది. మానిజాలెస్ నగరంలోని ప్రసిద్ధ నియో-గోథిక్ కేథడ్రల్ పక్క టవర్లు కూలిపోయి వీధులపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.కాలి నగరంలో ఐదు అంతస్తుల భవన శిథిలాల కింద నుంచి ధూళిలో కూరుకుపోయిన ఆరు నెలల పసిపాపను, ఆమె తల్లిని సురక్షితంగా బయటకు తీసిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. స్థానిక ఆసుపత్రి కిటికీల నుంచి రోప్‌ల ద్వారా బాధితులను కాపాడిన వీడియోలు చూసి కూడా ప్రజలు కన్నీరు పెడుతున్నారు. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టివుండే అత్యంత ప్రమాదకరమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ భూకంప మండలంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్ర ప్రభావిత ప్రాంతమైన చోకో రీజియన్.. దట్టమైన అడవులు, తక్కువ మంది ప్రజలతో ఉంది. అయితే ఇక్కడికి కేవలం పడవలు లేదా విమానాల ద్వారా మాత్రమే చేరుకునే వెసులుబాయు ఉండగా.. నష్ట తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారు. సహాయక చర్యలు అందించడం కూడా చాలా కష్టంగా మారింది.శాస్త్రవేత్తల హెచ్చరిక..!భూకంపం భూమి లోపలి పొరల్లో సంభవించినప్పటికీ.. జనసాంద్రత ఉన్న లోయ ప్రాంతాలు కావడంతో కంపనం చాలా ఎక్కువగా వచ్చిందని వాయువ్య విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సుజాన్ వాన్ డెర్ లీ తెలిపారు. ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల కలయిక వల్ల కొలంబియా ప్రాంతాన్ని అంచనా వేయడం సంక్లిష్టమని, ప్రతిధ్వనులు ఇంకా వచ్చే అవకాశం ఉందని కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ హెచ్చరించింది.





