
సిజెపి సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ పై పిటిషన్ డిస్మిస్
కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్‌ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్‌లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి












