
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే
Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలుఅప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి.. రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి.. ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్సైట్ కు తేడా ఉంటే ఈ యాప్‌కు దూరంగా ఉండటమే మంచిది.నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?మీకు రుణం

బెంగళూరులో ఓ 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి డేటింగ్ యాప్ మోసానికి గురయ్యాడు. యాప్ ద్వారా పరిచయమైన మహిళ కలుద్దామని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ నలుగురు వ్యక్తులు బెదిరించి, అతని వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదు కలిపి దాదాపు ₹3.5 లక్షలు దోచుకున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు కొనసాగుతోంది
చేపలకు ఆహారం వేస్తామని చెప్పి ఇంటికే టోకరా.. 6 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం. నవీన్ కుమార్ కుటుంబం నివసిస్తోంది. మార్చి 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో వీరు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా భావించిన.. రామశర్మ, అతని భార్య ప్రమీలారాణి దంపతులు రంగంలోకి దిగారు. మీరు ఊరికి వెళ్తే ఇంట్లోని అక్వేరియం ఉంది కదా.. మరి ఆ చేపలకు ఫుడ్ ఎవరు వేస్తారు? అవి చనిపోతాయి కదా.. అంటూ అమాయకపు కన్నీరు కార్చారు. తాము ఎంతో నమ్మకంగా ఉంటామని చెప్పి బాధితుల ఇంటి తాళాలు తీసుకున్నారు. తాళాలు చేతికి చిక్కగానే ఆ దంపతులు తమ అసలు రంగు బయటపెట్టారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బాధితురాలి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్లులను దొంగిలించారు. ఆమె భర్తే తన సొంత ఇంటిని భార్యకు అద్దెకు ఇచ్చినట్లుగా ఫేక్ రెంటల్ అగ్రిమెంట్లు సృష్టించి.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్‌లో ఏకంగా శ్రీ గురుదత్త లక్ష్మీనరసింహ గురువాంబిక శక్తిపీఠం పేరుతో ఓ ఆధ్యాత్మిక పీఠాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వార్తకు సంబంధించిన

Cyber Crimes | ఇంటర్నెట్ డెస్క్: తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలూ అంతే. మరీ ముఖ్యంగా ఈ మధ్యన టీనేజర్లను లక్ష్యంగా చేసుకొని స్నేహం ముసుగులో సైబర్ నేరగాళ్లు దగ్గరవుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ఆ తర్వాత టీనేజర్లను బెదిరిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పెంకుటింట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు వచ్చిన ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ సభలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

మొబైల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపర్ చేయడం లేదా ఆ నంబర్ మార్పులు చేసిన ఫోన్లను వాడటంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని సోమవారం స్పష్టం చేసింది.దేశంలో మొబైల్, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం పౌరుల భద్రతకు, నెట్‌వర్క్‌ల సమగ్రతకు పెను సవాలుగా మారిందని టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEI నంబర్లతో సహా ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నిషేధం.ఈ నిబంధనలను ఉల్లంఘించడం కాగ్నిజబుల్ (వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగిన), నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికే కాకుండా, దానికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సెక్షన్ 42(6) చెబుతోందని వివరించింది. మోసపూరిత మార్గాల్లో, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి సిమ్ కార్డులు పొందడం కూడా నేరమేనని పేర్కొంది.పౌరులకు పలు కీలక సూచనలు చేసింది. మార్పులు చేసిన IMEI నంబర్లు ఉన్న మోడెమ్‌లు, సిమ్ బాక్సులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం

చీరల వ్యాపారిని మోసగించిన నిందితుడి అరెస్టు బాధితునికి 100% సొమ్ము రీఫండ్ బాధితుడికి రూ.కోటి చెక్కు అందజేస్తున్న సైబరాబాద్ సీపీ రమేశ్, సైబర్ క్రైమ్ డీసీపీ పుష్ప. చిత్రంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్ తదితరులు ఈనాడు, హైదరాబాద్ రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 100% సొమ్ము తిరిగి వచ్చిన ఉదంతమిది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితుడు దీపక్‌కుమార్(37)ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం సైబర్‌క్రైమ్ డీసీపీ పుష్ప, ఏసీపీ రవీందర్‌రెడ్డిలతో కలిసి సీపీ రమేశ్ వివరాలు తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట్‌లోని ఓ రిటైల్ చీరల దుకాణంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఈ నెల 4న యజమాని డీపీతో వాట్సప్ కాల్ వచ్చింది. వెంటనే రూ.కోటి నగదును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని అవతలి వ్యక్తి ఆదేశించారు. వ్యాపార లావాదేవీల్లో భాగమని భావించిన ఆయన... నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో చెప్పినంత సొమ్ము జమచేశారు. నగదు బదిలీ జరగ్గానే అసలు యజమాని ఫోన్‌కు బ్యాంకు నుంచి మెసేజ్ రావటంతో ఆయన అప్రమత్తమయ్యారు. అకౌంటెంట్‌కు ఫోన్ చేసి నగదు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సైబర్ మోసంగా భావించిన బాధితుడు 1930 నంబర్, సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మోహన్ బృందం దర్యాప్తు చేపట్టింది. నగదు జమయిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, అక్కడ లభించిన సమాచారం ఆధారంగా ఆరా తీస్తే మాయగాళ్ల బండారం వెలుగులోకి వచ్చింది. ‘యూపీలోని లఖ్‌నవూకు చెందిన దీపక్‌కుమార్(37) వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అంజు, ఆకాశ్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. కొట్టేసిన నగదు జమ చేసేందుకు కరెంట్ ఖాతా అవసరం కావడంతో దీపక్‌కుమార్‌తో చేతులు కలిపారు. ముగ్గురూ కలిసి రూ.600 కోట్ల టర్నోవర్‌తో వెల్నెస్

బాస్ పేరుతో ఉద్యోగికి రూ.కోటి పంపించాలని ఆదేశం గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడంతో రూ.కోటి సేఫ్ బాధితుడికి రీఫండ్ చేసిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ‘మీ బాస్ పేరుతో వాట్సాప్‌లో ‘అర్జెంట్‌గా మనీ ట్రాన్స్సఫర్ చేయ్’అని మెసేజ్ వచ్చిందా? అయితే కాస్త ఆగండి.. ఆ ఫొటో వెనుక ఉన్నది మీ ఓనర్ కాదు, మిమ్మల్ని ముంచేయడానికి పొంచి ఉన్న సైబర్ కేటుగాడు కావొచ్చు! సరిగ్గా ఇలాగే నమ్మి అక్షరాలా రూ.కోటి పోగొట్టిన ఒక అకౌంటెంట్ కథ ఇది. అయితే పోయిన డబ్బు తిరిగి రాదనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. సైబరాబాద్ పోలీసులు కేవలం పది రోజుల్లోనే రూ. కోటి సొమ్మును వెనక్కి రప్పించారు. ఆ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. యూపీలోని లక్నోకు చెందిన దీపక్‌కుమార్ వాటర్ ప్లాంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఆశించిన లాభాలు లేకపోవడంతో సైబర్ నేరాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఏదైనా ఒక పెద్ద వ్యాపార సంస్థ లేదా దుకాణాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలను గుర్తించాడు. చీరల వ్యాపారిని టార్గెట్ చేసి... అలా సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలోని ఓ చీరల వ్యాపారిని టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా ఖాతాలు, లోకల్ నెట్వర్క్ ద్వారా ఆ సంస్థ యజమాని ఎవరు? అక్కడ అకౌంట్స్ చూసేది ఎవరు? అనే వివరాలను దీపక్ సేకరించాడు. యజమాని ఫోన్‌నంబర్ కాకపోయినా మరో నంబర్‌కు సదరు యజమాని అసలు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్, పేరును వినియోగిస్తూ నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించారు. దీంతో అకౌంటెంట్‌కు మెసేజ్ రాగానే కేవలం ఫొటో, పేరు చూసి అది తన బాస్ నంబరే అని నమ్మేలా భ్రమింపజేయాలనేది నిందితుడి లక్ష్యం. పథకం ప్రకారం ఈ నెల 4న చీరల రిటైల్ వ్యాపార సంస్థ అకౌంటెంట్‌కు ఫోన్ చేసి ‘నేను ఒక ముఖ్యమైన పనిలో

Nacharam: నాచారం ఉర్బేన్ నానో కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన నాచారం: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్బేన్ నానో కాలేజీలో సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ మైబెల్లీ, సైబర్ క్రైమ్ మల్కాజ్గిరి ఎస్ఐ శ్రీనివాస్, సైబర్ వారియర్ అనిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, హానికరమైన ఏపీకే లింకులు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సెక్స్టార్షన్, ఆన్లైన్ ఉద్యోగ మోసాలు, లక్కీ డ్రా స్కామ్‌లు, లోన్ యాప్ మోసాలు, పెట్టుబడి మోసాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని పోలీసులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గ్వాలియర్‌కు చెందిన ఓ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేసి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.98,000 కోల్పోయింది. కేవలం ఒక్క క్లిక్‌తో సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు.పురానీ ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయ ప్రతాప్ సింగ్ బాథమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 11న తన భార్య రచన ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే ఆమె ఉపయోగించే మోటోరోలా ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది.ఆ సమయంలో వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే రోజు అర్ధరాత్రి బ్యాంకు నుంచి ఓ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయగా, మైనస్ రూ.2,970 చూపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ పరిశీలించగా, మూడు వేర్వేరు యూపీఐ లావాదేవీల ద్వారా రూ.70,000, రూ.20,000, రూ.8,000 చొప్పున మొత్తం రూ.98,000 బదిలీ అయినట్లు తేలింది.దీంతో బాధితులు ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును సైబర్ సెల్‌కు అప్పగించారు. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి హానికరమైన ప్రకటనలు ఫోన్లలో మాల్వేర్ను ఇన్స్టాల్ చేస్తాయని, తద్వారా సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే యూపీఐ లావాదేవీలు జరుపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని యాడ్స్‌పై క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద

డేటింగ్ యాప్స్‌లో కల్పిత అమ్మాయిలు నవ్వించి, కవ్వించి లవ్వంటూ వలేస్తారు న్యూడ్ చాటింగ్ అంటూ ప్రేరేపిస్తారు అక్కడి నుంచి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు రోజు రోజుకూ పెరిగిపోతున్న బాధితులు.. అప్రమత్తతే దీనికి మందు రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 569 మంది బాధితులు వారి నుంచి రూ.2.81 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు బాధితుల్లో 61శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే హైదరాబాద్ సిటీ: బాగా రీల్స్ చూసే అలవాటున్న ఓ యవకుడు ఓ డేటింగ్ యాప్ ప్రకటన కనబడితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశాడు. నిమిషాల్లోనే ఓ అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. సో అండ్ సో అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. మాటల సందర్భంగా తన సొంతూరు సమీపంలోని టౌనుకు చెందిన పిల్లనే ఆమె అని అతడు తెలుసుకున్నాడు. ఆ టౌనులో ఫలానా మార్కెట్టు.. ఫలానా కూడలి అంటూ సరిగ్గా వివరాలూ చెప్పడం.. పైగా తన ఫోన్ నంబరు ఇవ్వాలని అడగడంతో వెనుకాముందు ఆలోచించకుండా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమెనే చాటింగ్ మొదలు పెట్టింది. ఇద్దరూ మెసేజ్‌లు ఇచ్చిపుచ్చుకుంటుండటంతో అతడికి సమయమే తెలిసేది కాదు. ఒకసారి ఆమే చొరవ తీసుకొని.. ‘‘ఎన్నాళ్లిలా మాటలు? ఒకసారి కలుద్దాం’’ అనేసరికి అతడు మురిసిపోయాడు. కలిసేందుకు ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి ఆమే ఫోన్ చేసి.. ‘‘సారీ, మా సమీప బంధువు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది’’ అని దాదాపు ఏడుస్తున్న గొంతుతో చెప్పింది. పైగా ‘‘చికిత్స కోసం ఓ యాభై వేలు కావాలి’’ అని ఆమె అడిగితే అతడు ఆన్లైన్లో పంపాడు. రెండ్రోజులకు ఆమే ఫోన్ చేసి.. ‘‘నీ హెల్ప్ మరిచిపోలేను’’ అంటూ డబ్బు పంపినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఆ రోజు రాత్రి అతడికి వీడియో కాల్ చేసి మాటల్లో పెట్టి.. ఒంటిపై ఒక్కో వస్త్రాన్ని తొలగిస్తూ పూర్తిగా నగ్నంగా మారింది. అతడినీ
దేశవ్యాప్తంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి, ఏకంగా రూ. 1,071.5 కోట్లు దోచేసిన మాస్టర్ మైండ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్న 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్ అనే యువకుడ్ని అసోంలోని బార్పేటలో గుజరాత్ సీఐడీ సైబర్ సెల్ అదుపులోకి తీసుకుంది. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలతో బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును వేలాది బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించి, దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి చైనాకు పంపడంలో ఆలమ్ కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.మనీల్యాండరింగ్‌ను తలపించేలా..గాంధీనగర్‌కు చెందిన సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CCE) ప్రకారం.. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి నిఘా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ మోసాల ద్వారా దోచేసిన సొమ్మును దేశవ్యాప్తంగా ఉన్న 1,754 బ్యాంక్ ఖాతాలకు మళ్లించేవాడు. పెద్ద మొత్తంలో నగదును చిన్న చిన్న మొత్తాలుగా విభజించి, కేవలం ఒక గంట వ్యవధిలోనే వేర్వేరు ఖాతాల్లోకి జమ చేసేవాడు.చైనా నేరగాళ్లతో లింకులువాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా చైనా సైబర్ నేరాగాళ్లతో ఆలమ్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక పరమైన సమాచారం (స్కానర్లు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, క్రిప్టో వాలెట్ వివరాలు), నేరాల శైలిని నేరుగా వారితో పంచుకునేవాడు. నిందితుడి మొబైల్ ఫోన్లలో 23 క్రిప్టోకరెన్సీ వాలెట్లను గుర్తించిన పోలీసులు... వీటి ద్వారా దాదాపు రూ. 16 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఇవి క్రిప్టోకరెన్సీకి, చైనా గ్యాంగ్‌కు ఉన్న సంబంధాలను స్పష్టంగా నిరూపిస్తున్నాయి. అలాగే ‘చిప్ సెల్లర్’అనే యాప్ ద్వారా అక్రమ క్రిప్టో ట్రేడింగ్ సాగించినట్లు కూడా ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.సాంకేతిక విశ్లేషణ, బాధితుల వివరాల ఆధారంగా అసోంలోని బార్పేటకు చేరుకున్న గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసుల టీమ్... మూడు రోజుల పాటు నిందితుడి ఇంటి వద్ద మారు వేషంలో నిఘా ఉంచారు. చివరకు అతడిని డిజిటల్ పరికరాలతో సహా

కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ మోసగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకిచ్చిన ముగ్గురు యువకులను పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.25 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన సైబర్ నేరాల్లో కొత్త తరహా మోసాలను వెలుగులోకి తెచ్చింది.వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్, అమిత్, దీపక్ అనే ముగ్గురు యువకులు సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపారు. నిందితుల్లో ఇద్దరు ర్యాపిడో బైక్-ట్యాక్సీ రైడర్లుగా పనిచేస్తుండగా, మరొకరు ఇదే తరహా నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాడు. మోసగాళ్లు దొంగిలించిన డబ్బును వీరి ఖాతాల్లోకి జమ చేసి, అక్కడి నుంచి వేరే ఖాతాలకు బదిలీ చేసేవారు. ఇలా జరిగిన ఒక్కో లావాదేవీకి వీరికి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు కమీషన్ అందేది.ఈ వ్యవహారంపై దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సంగీతా కుమారి నేతృత్వంలో దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించారు. ఇద్దరిని పాట్నాలో, మూడో వ్యక్తిని బీహార్‌లోని బక్సర్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.ఈ లావాదేవీల వెనుక ఉన్న అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ముఠాకు ఇంకా ఎవరెవరు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు

3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ ప్రకటన హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వాయిస్‌తో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయి్‌సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) వీడియోను తయారు చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్, పాన్, బ్యాంకు డిటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్‌లో (యూఎ్‌సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్ మెంట్ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు. ఏపీకే ఫైల్స్‌తో రూ.30 లక్షలు.. ఏపీకే ఫైల్స్ పంపి.. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. నగరంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్ మెసేజ్ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్డేట్ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్డేట్ కోసం లింకును డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్స్టాల్ చేశాడు. అంతే

Thottambedu: తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన తొట్టంబేడు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం BN కండ్రిగ సర్కిల్ సీఐ శ్రీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్సై శ్రీ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది ప్రభాకర్, ప్రతాప్ కలిసి కాసరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రాబోయే వినాయక చవితి పండుగ, పంచాయతీ ఎన్నికలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, బాల్యవివాహాల నిరోధం, నూతన చట్టాలు, డయల్ 112 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయానికి సంబంధించిన సమాచారం, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రజలు పోలీసులతో సమన్వయంతో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు

Tirupati: విప్పమనుపట్టెడలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై పోలీస్ అవగాహన సదస్సు! ఈ వార్తకు సంబంధించిన

జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెస్సేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. జగిత్యాల, ఆగస్టు 15: జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెస్సేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. అశోక్ అనే వ్యక్తి వాట్సాప్‌కు APK ఈ-చలాన్ మెసేజ్ వచ్చింది. స్నేహితుడి నంబర్ నుంచి రావడంతో ఆ లింక్‌ను ఓపెన్ చేశాడు బాధితుడు. ఆ వెంటనే అతడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. రెండుసార్లు దాదాపు రూ.4.15 లక్షలను కేటుగాళ్లు దోచేశారు. ఒకసారి రూ.3.99 లక్షలు, మరోసారి రూ.15వేల చొప్పున సైబర్ నేరగాళ్లు కాజేశారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఖాతా నుంచి డబ్బులు మాయమవడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. APK లింకులు, అనుమానాస్పద మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై తిరుమల తిరుపతి దేవస్థానాలు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. టీటీడీ నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ అకౌంట్లు మరియు సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. టీటీడీ అధికారిక ముద్ర, లోగో, చిత్రాలు మరియు ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా ఉపయోగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో టీటీడీ ఐటీ, విజిలెన్స్ మరియు సైబర్ క్రైమ్ పోలీసు విభాగాల సమన్వయంతో సుమారు 259 టీటీడీ నకిలీ వెబ్సైట్లు గుర్తించి బ్లాక్ చేశారు. మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే వారిపై కాపీరైట్, ట్రేడ్‌మార్క్ మరియు సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కూడా ttddevasthanam.online వంటి నకిలీ పోర్టల్స్ ద్వారా ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రచారం నిర్వహించారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం తక్షణమే స్పందించి సదరు డొమైన్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసి ఆ సైట్లను నిలిపివేసే చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరస్థులపై చట్టపరమైన విచారణ వేగవంతం చేశారు. గతంలో కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ మరియు జిల్లా పోలీసులు సంయుక్తంగా అనేక నకిలీ లింకులను తొలగించారు. ఈ నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనం మరియు వసతి సేవలను కేవలం ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫలితంగా గూగుల్ సెర్చ్‌లో కనిపించే స్పాన్సర్డ్ లింకులు, అనధికారిక సైట్లు మరియు వాట్సాప్ సందేశాలను నమ్మి నగదు పంపవద్దని తేల్చి చెప్పారు

సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘Stay Alert , Stay Aware, Stay Safe & Secure’ నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్లకు మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, కాల్స్ వస్తున్నాయి. వాట్సప్‌లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు (Cyber Crime) మోసానికి పాల్పడుతున్నారు. అలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం, ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి ఈ మెసేజ్‌లు వస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు సరిగా లేవని.. వాట్సప్‌లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు పేర్కొంటున్నారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించాలని మోసం చేస్తున్నారు. లాగిన్ వివరాలు, పాస్వర్డ్, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు అడుగుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మోసపూరిత కాల్స్, ఎస్సెమ్మెస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఈవో సూచించారు. ఎన్నికల సంఘం నుంచి ఓటర్లకు ఎలాంటి ఎస్సెమ్మెస్‌లు రావని.. ఈసీఐ, సీఈవో పేరుతో వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. అలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ తనకేమీ కాదన్నట్టుగా వ్యవహరించాడు. కానీ.. డిజిటల్ ప్రపంచంలో వేసిన ప్రతి అడుగు ఓ ఆనవాలే. చివరకు అతడి ఆన్లైన్ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయి నిఘా సంస్థ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు చిక్కాడు. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) అందించిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గాజులరామారం ప్రాంతానికి చెందిన శానప్ప అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారులకు సంబంధించిన అక్రమ లైంగిక కంటెంట్‌ను వీక్షించడంతో పాటు, వాటికి సంబంధించిన లింకులను ఇతరులకు షేర్ చేస్తున్నట్లు NCMEC గుర్తించింది. నిందితుడి ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని NCMEC తన టిప్‌లైన్ ద్వారా భారతీయ అధికారులకు చేరవేసింది. దీంతో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆన్లైన్ కార్యకలాపాలను విశ్లేషించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా అతడు వినియోగిస్తున్న ఫోన్ నంబర్‌ను గుర్తించినట్లు తెలిసింది. ఆ వివరాలను జీడిమెట్ల పోలీసులకు అందించడంతో పోలీసులు శానప్పపై కేసు నమోదు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు ఎవరెవరికి లింకులు షేర్ చేశాడు..? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా..? అనే కోణాల్లోనూ విచారణ సాగుతున్నది. సోషల్ మీడియాలో తమ కార్యకలాపాలు ఎవరికీ తెలియవని భావించే వారికి.. ఈ ఘటన డిజిటల్ నిఘా ఎంత పకడ్బందీగా ఉందో చెప్పకనే చెబుతోంది. పంద్రాగస్టు వేడుకల వేళ విధ్వంసానికి ఉగ్రకుట్ర.!

ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బ్యాంకాక్‌లో ఉద్యోగాలంటూ నమ్మించి కొందరిని మయన్మార్‌కు తరలించిన నేపథ్యంలో బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు.వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన పలువురు నిరుద్యోగ యువకులు మయన్మార్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి లోకేశ్, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ యువతకు కీలక సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు పన్నే ఉచ్చులో పడొద్దని, ఉద్యోగాల విషయంలో పూర్తిస్థాయిలో ఆరా తీయకుండా ఎవరినీ నమ్మవద్దని హితవు పలికారు. ఇలాంటి మోసాలపై యువత చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు

EPFO alert | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు కీలక సూచనలు చేసింది. ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో నకిలీ వెబ్సైట్ల బారిన పడొద్దని సూచించింది. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్‌లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా పేర్కొంది. వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసే నకిలీ లింకులు, ఈ-మెయిల్స్‌ను క్లిక్ చేయొద్దని కోరింది. ఈపీఎఫ్ఓ ఇటీవల సిస్టమ్ అప్‌గ్రెడేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్న వేళ.. ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు ఈ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 6 సూచనలు చేసింది. అధికారిక వెబ్సైట్ లింకులనూ పంచుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తెలంగాణా పోలీసులు ఇప్పుడు అతిపెద్ద సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఊహించని విధంగా శాంతి భద్రతలను పరిరక్షించటం కంటే అతి పెద్ద సమస్య పోలీసింగ్ కు సవాల్ గా మారుతుంది. ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్‌లో అతిపెద్ద సవాలైతే, ఇప్పుడు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధానసవాళ్లుగా మారాయని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. పోలీసింగ్‌లో సాంకేతికత ఎంత కీలకమైనా మౌలిక పోలీసింగ్‌ను విస్మరించరాదని అధికారులకు సూచించారు.సైబర్ మోసాలతో గతేడాది రూ.1,700 కోట్ల నష్టంగత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ప్రజలు సుమారు రూ.1,700 కోట్లు కోల్పోయారని డీజీపీ వెల్లడించారు. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల డబ్బు రికవరీ అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారు. అధిక లాభాల పేరుతో జరిగే పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో తెలంగాణకు దేశంలోనే తొలి స్థానం లభించిందని డీజీపీ తెలిపారు.మౌలిక పోలీసింగ్‌కే ప్రాధాన్యం సాంకేతికత పోలీసింగ్‌కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.యువత, చిన్నారులను లక్ష్యంగా డ్రగ్స్.. చాక్లెట్లు రూపంలో చిన్నారులను మాదకద్రవ్యాలకు అలవాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి ఆందోళనకరమని డీజీపీ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపేందుకు పని చేస్తున్నాం అన్నారు.హైడ్రాలో ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు ఆగస్టు 11 వరకు పొడిగింపు!రైళ్లలో వచ్చి నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలుబీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి వరంగల్, కాజీపేట కేంద్రంగా చైన్‌స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడి వెంటనే వెళ్లిపోతున్న

రూ.499కే డేట్ అంటూ సైబర్ కేటుగాళ్ల కొత్త వల రెంట్ బాయ్‌ఫ్రెండ్, పర్సనల్ కంపానియన్ పేరుతో కొత్త మోసాలు ‘ఎక్స్’ వేదికగా పోస్టుతో నగర కమిషనర్ సజ్జనర్ హెచ్చరిక Rent Boyfriend Scam : ఒంటరితనం వేధిస్తోందా? మీరు సరైన పార్టనర్ లేదా బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీకు మంచి టైమ్ పాస్ అయ్యేలా బోర్ ఫీల్ కాకుండా అందమైన బాయ్ ఫ్రెండ్ సెట్ చేసి పెడతాం.. మీతో కాఫీ తాగొచ్చు.. హాయిగా సినిమాలకు వెళ్లొచ్చు.. మీకు కావాలంటే 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ రెడీగా ఉంది. ఇలాంటి ఆఫర్లు చూసి టెంప్ట్ అవ్వొద్దు.. ఇదో పెద్ద సైబర్ డేటింగ్ ట్రాప్.. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అట్రాక్టివ్ ఆఫర్ నిజం కాదు. ఇప్పుడు రెంట్ బాయ్‌ఫ్రెండ్, ‘పర్సనల్ కంపానియన్’ పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అందమైన యువకుల ఫొటోలు, భారీ డిస్కౌంట్లతో పోస్టర్లు పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టుతో ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ మోసాల తీరుతో పాటు పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సజ్జనర్ వివరించారు. అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!! "ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది.… — V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 8, 2026 రూ.499కే డేట్.. ఇదో సైబర్ ట్రాప్ : ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో 50 శాతం ఆఫర్, స్పెషల్

సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు ఉత్తరప్రదేశ్‌లో రట్టయింది. టిండర్ వంటి ప్రాచుర్యం పొందిన యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యాచారం, హత్యాయత్నం వంటి తప్పుడు కేసులతో బెదిరించి బాధితుల నుంచి ఏకంగా రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసు కేసు నమోదైంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది అందించిన ఫిర్యాదుతో ఈ దందాను పోలీసులు బయటపెట్టారు. నిందితురాలు పల్లవి ముందుగా డేటింగ్ యాప్‌లలో పురుషులతో పరిచయం పెంచుకుని విందులు, వినోదాల పేరుతో చేరువయ్యేది. ఆ తర్వాత వారితో ఉన్న ప్రైవేట్ క్షణాలను, సంభాషణలను అత్యంత రహస్యంగా రికార్డు చేసేది. వీడియోలు, ఫొటోలు చేతికి దక్కిన వెంటనే తన అసలు రూపం బయటపెట్టేది. బాధితులు అడిగినంత మొత్తం ఇవ్వకపోతే తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెడతానని భయభ్రాంతులకు గురిచేసేది. ఈ సైబర్ బెదిరింపులు, పోలీసు కేసుల భయంతో పలువురు బాధితులు తమ వద్ద ఉన్న సొమ్మును ఆమెకు అప్పగించక తప్పలేదు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితురాలు 'స్వీటీ తివారీ' అనే నకిలీ పేరుతో ఈ మోసాలకు పాల్పడినట్లు తేలింది. ఈ కుట్ర వెనుక ఆమె ఒక్కతే కాకుండా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ముఠా సహకరించిందని గుర్తించారు. ఇప్పటికే ఈమె పెట్టిన తప్పుడు కేసుల కారణంగా ఐదుగురు నిర్దోషులు జైలుపాలు కావాల్సి వచ్చిందని ఫిర్యాదులో వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర నగరాల్లో ఈ ముఠాపై అనేక కేసులు నమోదవడంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. డేటింగ్ యాప్‌లను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా నేరాలపై చట్టపరమైన నిపుణులు, సామాజిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని ఆయుధంగా మలచుకుని ప్రాణభయం కలిగించే క్రిమినల్ గ్యాంగ్‌లపై