
Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివినవ్యక్తి.. వీడియో..!
Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివిన వ్యక్తి.. వీడియో..!
© 2026 nimisham.in

Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివిన వ్యక్తి.. వీడియో..!

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ కూడా తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. తనతో మాట్లాడి వివరణ తీసుకుని ఉండాల్సిందని అన్నారు.తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను తప్పు చేశాననే భావన లేదన్నారు.తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సుస్మిత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.రేవంత్‌రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నా.. తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తామే ముందున్నామని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్‌రెడ్డినేనని చెప్పారు.ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన

న్యాయం కోసమే హైకమాండ్‌ను ఆశ్రయించానని కొండా సురేఖ వెల్లడి సీఎంవో నుంచే నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు బీసీ మహిళా నాయకురాలిననే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన Konda Surekha : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను మంత్రివర్గం నుంచి రేవంత్ సర్కార్ బర్తరఫ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆశ్రయిస్తూ తనకు ఎదురవుతున్న రాజకీయ, పరిపాలనా సమస్యలను వివరిస్తూ లేఖలో ఫిర్యాదు చేశారు. మంత్రి పదవి ఉన్నప్పటికీ తన అధికారాలను తగ్గిస్తున్నారని, కీలక నిర్ణయాలు సీఎంవో నుంచే నేరుగా తీసుకుంటున్నారని ఆమె లేఖలో ఆరోపించారు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా తనను భాగస్వామ్యం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. అందులో నా ఫొటోను తొలగించారు : సమ్మక్క–సారలమ్మ ఆలయ నిధులను ఆర్‌అండ్‌బీకి బదిలీ చేసిన వ్యవహారంలోనూ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటోను తొలగించారనే విషయాన్ని కూడా ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. Read Also : Konda Surekha : కొండా సురేఖ బర్తరఫ్.. హైకమాండ్ సంచలన నిర్ణయం మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కూడా తనను అవమానించారని వాపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపడమే కాకుండా కడియం శ్రీహరి తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అంశాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా ఒంటరి చేయాలనే.. : అదేవిధంగా, వరంగల్‌లో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొందరు నేతలకు రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తున్నారని విమర్శించారు

బర్తరఫ్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై రేవంత్‌కు సూటి ప్రశ్న నేను ఎమ్మెల్యే గా కొనసాగుతా.. నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తా Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను కేబినెట్ నుంచి తొలగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూతురు వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని : “రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని.. నేను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాగుండేది. కానీ, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలగించడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమేనని, గతంలోనూ పదవికి తన చేతులతోనే రాజీనామా చేసిన సందర్భం ఉందని కొండా సురేఖ గుర్తుచేశారు. తాను పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌లోనే పలువురు నేతలు పార్టీపై, అగ్రనేతలపై విమర్శలు చేసిన సందర్భాలను ప్రస్తావించారు. తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. Read Also : Konda Surekha : పదవి ఉంది.. పవర్ లేదు! హైకమాండ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ ఆ నేత వ్యాఖ్యలపై చర్యలేంటి? : మరోవైపు, పార్టీలో ఇతర నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానం తీసుకున్న చర్యలపై కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపైనా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలతో ఈ వివాదం పతాక స్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపడమే తప్పని కొండా సురేఖ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం.పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా అంటారని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేకాకుండా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల సంగతేంటని నిలదీసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి వస్తే తాను పార్టీకి భిన్నమైన వైఖరి తీసుకుంటాననే సంకేతాలు పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా లేక కొండా కుటుంబం వద్ద 'ప్లాన్ బి' ఏదైనా ఉందా అనే కోణంలో పార్టీలో చర్చ మొదలైంది.ఇదే సమయంలో, వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బయటి నుంచి వచ్చిన వారు పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని, తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలన తెస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అటు ఢిల్లీలో సురేఖ, ఇటు తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి ఒకేసారి కీలక వ్యాఖ్యలు చేయడం కాకతాళీయమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి, సీఎంపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ మొదట్లోనే ఖండించి ఉంటే

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధ వాతావరణంలో గడిపారని జగ్గారెడ్డి విమర్శించారు. స్వేచ్ఛ కావాలనే ఆకాంక్షతోనే ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో పోలీసుల నిర్బంధాలు లేవని, మీడియాపై ఆంక్షలు విధించలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సచివాలయానికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని రంగాల్లో నియంతృత్వ ధోరణికి ముగింపు పలికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చామని జగ్గారెడ్డి తెలిపారు. ‘త్యాగాలు విద్యార్థులవి.. పేరు మీకా?’ : జగ్గారెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రేషన్ కార్డులు పంపిణీ చేసి, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకునే కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన ఒక్కరినైనా చూపించాలని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా నష్టమేం లేదు: జగ్గారెడ్డి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తే కేటీఆర్ చెప్పే సమాధానం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ రాజీనామా చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha targets cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం అంశంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. పదేండ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, తొలుత చర్యలు ఆయనపై తీసుకొవాలని ఏకీపారేశారు. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా.. మరల మీడియా సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారన్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారన్నారు. వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదన్నారు. కానీ ఎవరు చెప్పించారో మాకు తెలుసని కొండాసురేఖ పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందన్నారు. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టమన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులమని, మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయన్నారు. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదని గొడవ నడుస్తుందన్నారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని మాట్లాడారు. నన్ను ఏమైనా చేయాలి

ఇల్లెందు, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులకు సంక్షేమం దూరమైందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా ఇల్లెందులో 420 అడుగుల భారీ ప్లెక్సీతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పరిపాలనపై రాష్ట్రంలో వారు చేస్తున్న వికృత చేష్టలను ప్రజలకు వివరించేలా 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీతో జెకె బస్టాండ్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, బుగ్గ వాగు మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ... యువ నేత కేటీఆర్ పిలుపుమేరకు వారం రోజుల పాటు నిర్వహించబోయే సమరభేరి కార్యక్రమాలలో భాగంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఒకటి ఒకటిగా తొలగిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బందులు పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇల్లెందు ఎమ్మెల్యే ఇల్లెందులో చేసిన అభివృద్ధి ఏమి లేదని ఆమె అన్నారు. మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ బిందు మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసియటమే పనిగా ముందుకు సాగుతుంది. రైతు బీమా డబ్బులు ప్రీమియం కట్టక రైతు బీమా పథకం ఆగిపోతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుకు చెందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సిలివేరి సత్యనారాయణ, దాస్యం ప్రమోద్, జెకె శీను,లకావత్

BRS Party | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 : అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది అభ్యాసం కాదు అది భస్మాసుర హస్తమని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి బస్టాండ్ వద్ద మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్య మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున: నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని రాజయ్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతూ అన్ని వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jagga reddy Strong counter on brs ktr: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు పదునైన విమర్శనాస్త్రాల్ని సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పాలనపై బీఆర్ఎస్ చార్జీషీట్ విడుదల చేసింది. దీనిలో కేటీఆర్ కాంగ్రెస్ పాలనను ఉతికి ఆరేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కిండ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో ఉద్యోగాలు భర్తీ జరగలేదన్నారు. 70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదించిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన లో పోలీసుల నిర్బంధాలు లేవన్నారు. పద్దతి లేని కుటుంబం పద్దతిగల కుటుంబం పై మాట్లాడుతుందని కేటీఆర్ పై సెటైర్ లు వేశారు. అసలు.. రాహుల్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ అంటూ ఏకీపారేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

దిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెప్పారు. నా వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. దిల్లీలో మీడియాతో కొండా సురేఖ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పాను. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారు. నా బిడ్డ స్వతంత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నాను. ఆమె జీవితం ఆమె ఇష్టం. నాతో పాటు నా భర్త రాజకీయ జీవితం మా ఇష్టం. నేను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నాను. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరాను. నా బిడ్డ వ్యాఖ్యలపై నేను స్పందించను. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. రోజూ ఎంతో మంది మాట్లాడతారు.. అందులో సుస్మిత కూడా ఒకరు. నా బిడ్డ కాబట్టి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం చేయను. నా వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పాను. అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారు. పార్టీలో కొందరితో నాపై ఆరోపణలు చేయించారు. ఎవరు అలా చేయించారో తెలుసు. పేర్లు చెబితే వివాదం అవుతుంది. నాపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలి. నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నా.. అందుకే ఇక్కడికి వచ్చి నా బాధ చెప్పుకొన్నా. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చా. పార్టీ తీసుకునే నిర్ణయం బట్టి నా ఆలోచన ఉంటుంది’’ అని కొండా సురేఖ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు

BRS party | తొగుట : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తొగుటలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వెయ్యి రోజులు దాటుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తూ జాబ్ కార్డులను ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తి సమాధానం చెప్పే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు ఆటోలో వెళ్తున్న మహిళ బీఆర్ఎస్ ఆందోళన చూసి ఆటో దిగి వొచ్చి రేవంత్ మోసాలపై తూర్పార పట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, బోధనం కనకయ్య, మంగ నర్సింలు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, కుర్మ యాదగిరి, అరుణ్ కుమార్, ఎల్లం, వెంకట్ రెడ్డి, అశోక్, బోయిని శ్రీనివాస్, బిక్షపతి, నరేందర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు

సన్న వడ్లకు రూ.500 బోనస్.. తెలంగాణ రైతులకు భారీ ఊరట రూ.8 లక్షల కోట్ల అప్పులు.. కాంగ్రెస్ పాలనపై పొంగులేటి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే.. పొంగులేటి సంచలన ఆరోపణలు Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 1000 రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిందని తెలిపారు. రాజకీయ బేషజాలకు వెళ్లకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత పాలనలో పేరుకుపోయిన సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ : వ్యవసాయ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోత్సాహకాలతో తెలంగాణ వరి ఉత్పత్తి పంజాబ్‌ను మించి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు. Read Also : Vivo T5 Launch : బడ్జెట్లో బిగ్ బ్యాటరీ బీస్ట్.. 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో ఈ వివో 5G ఫోన్ దుమ్మురేపుతోంది! ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టామని అన్నారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha sensational comments on cm revanth reddy: మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పిలవలేదని కాసేటికి క్రితం చెప్పారు. అయితే.. తాజాగా.. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయన .. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ వేదికగా తిరుగుబావుట ఎగురవేశారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పలేదన్నారు. అంతే కాకుండా వివాదాలల్లో.. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?.. అంటూ ఫైర్ అయ్యారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు?.. ఏం చర్యలు తీసుకుంటారు?.. అంటూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరం వినిపించారు. అంతే కాకుండా తన వివాదంకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కు అన్ని విషయాల్ని రాతపూర్వకంగా తెలియజేసినట్లు మంత్రి కొండాసురేఖ తెల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సీఎం రేవంత్ పై మండిపడిన మంత్రి కొండా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం లేదని ఆయన మీడియా ముందు తీవ్రంగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఒక్క కొత్త సాగునీటి డ్యామ్ లేదా బ్యారేజ్ కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేదని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిరుపయోగంగా మారిన చెక్ డ్యామ్‌లను పేల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల కడుపు కొడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సాగునీటి అవసరాల కోసం అత్యంత ప్రధాన ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన నిర్మాణ సమస్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా విస్మరించి పక్కన పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సంస్థల నివేదికలు మరియు ఎన్డీఎస్ఏ అఫిడవిట్లు ఉన్నప్పటికీ కన్నెపల్లి వంటి కీలక పంప్‌హౌస్‌లను పూర్తి స్థాయిలో నడపడం లేదని ఆయన తెలిపారు. పంపింగ్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టమైనప్పటికీ కావాలనే నీటిని ఎత్తిపోయకుండా రైతన్నలకు ప్రస్తుత పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిన్న కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నీటి సమస్యలపై లేఖలు రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం అలాగే తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. దీంతో పెద్దవాగు ప్రాజెక్టు దెబ్బతినడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం వంటి ఘటనలతో రాష్ట్రంలోని రైతులకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా మృతదేహాలు వెలికితీయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు

భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 02 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి వెళ్లి అధ్యక్షుడి తల్లిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ ఫొటోపై కూడా నల్లరంగు పోశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీపై దాడులు అధికమవుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రదర్స్ అండ్ కంపెనీ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు

కోరుట్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బుధవారం కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ముద్రించిన 160 మీటర్ల ప్లెక్సీని ప్రదర్శించారు. ధర్మపురం: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ మాజీ మంతి కోప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ డివిజన్లోని మార్కెట్ రోడ్డులో 100 మీటర్ల ఫ్లెక్సీతో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరసన చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేతలు మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే… — Telugu Scribe (@TeluguScribe) September 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతం కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని.. ‘పీడన’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు పెద్దగా చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని గుర్తుచేశారు. మాఫీ పూర్తిగా చేయకుండా 70 శాతం మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి మూటలు మోయడం, పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప మరేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేసి రాహుల్ బంధుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ కార్యక్రమాలకు భారీగా నిధులు

కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్దితుల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ప్రధాని అభ్యర్ధిగా ఎవరికి మద్దతిస్తారంటూ ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు జనం మోడీ, రాహుల్ తర్వాత విజయ్ (Vijay) కు ఓటేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న కాంగ్రెస్-టీవీకే (Congress-TVK) మధ్య ఇది చిచ్చు రేపుతోంది. దీనిపై ఇరు పార్టీల నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో గందరగోళం మరింత పెరుగుతోంది. అదే సమయంలో విజయ్, రాహుల్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు.సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ .. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి విజయ్ మద్దతిస్తానని చెప్పినట్లు బాంబు పేల్చారు. దీంతో ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే-కాంగ్రెస్ మధ్య క్లారిటీ వచ్చినట్లు అంతా భావించారు. కానీ అంతలోనే టీవీకే ట్విస్ట్ ఇచ్చింది. టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ విజయ్ ప్రధాని అవుతారని, ఏదో మ్యాజిక్ జరుగుతుందని తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో విజయ్.. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి మద్దతివ్వడం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!విజయ్ ప్రధాన మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారన్న కాంగ్రెస్ వాదనను టీవీకే తిప్పికొట్టింది. ప్రధాన మంత్రి పదవిని ఎవరు చేపట్టాలనే నిర్ణయం ఢిల్లీలో కాకుండా తమిళనాడులోనే జరుగుతుందని, ఆ పదవికి విజయ్ తమ పార్టీ అభ్యర్థి అని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ ( kanimozhi santosh) మరోసారి తేల్చిచెప్పారు. 2029లో విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని,, ఎవరు ప్రధాని కావాలనేది ఢిల్లీ నిర్ణయించదని, తమిళనాడు నిర్ణయిస్తుందని కనిమొళి స్పష్టం చేశారు. 2029లో ఒక అద్భుతం జరగబోతోందని, స్వయంగా రాహుల్ గాంధీయే విజయ్ను

మాగనూరు, సెప్టెంబర్ 2: మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్నా ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాగనూరు మండలం నేరడగం గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు కాంగ్రెస్‌కు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు. “నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?” నేరడగం, బూత్పూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చానని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. [caption id="attachment_2500433" align="aligncenter" width="1280"] Chittem Rammohan Reddy1[/caption] మంత్రి సొంత నియోజకవర్గంలో నేరడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన, వార్డు నెంబర్లు, ఉట్కూరు అశోక్,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక చార్జ్‌షీట్(BRS Charge Sheet)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పీడనగా మారిందని, ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం అభివృద్ధి శూన్యం.. అప్పుల మయం: కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేస్తూ "అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్" తరహాలో ఉందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా రూ. 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతాంగానికి కుచ్చుటోపీ.. రుణమాఫీ, రైతుబంధుపై విమర్శలు: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టువేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే చేసి 70 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టారని

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. నల్లగొండ, సెప్టెంబర్ 2: జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు(గురువారం) మహాధర్నాకు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ప్రధాన ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే రేపు మిర్యాలగూడలో మాజీ మంత్రి ధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు..1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. గత పదేళ్ల వైఫల్యాలపై ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. కేటీఆర్ పర్యటన వేళ ఫ్లెక్సీల ఏర్పాటుతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Government Employees: ఉపాధ్యాయులపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఆర్థిక శాఖ మంత్రి భార్యపై 10శాతం కమీషన్ ఆరోపణలు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రశ్నించారు. సాధారణ ఉపాధ్యాయుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓ రిటైర్డె ఉద్యోగురాలు బహిరంగాంగానే మంత్రి సతీమణిపై ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించలేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరెండున్నరేళ్లలో మొదటి తారీఖున జీతం ఇవ్వడం మినహా చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 2 డీఏలు పెండింగ్ లో ఉంటే ఈ పాలనలో అవి ఏకంగా 6కు చేరుకున్నాయన్నారు. 2023 చివరి నాటికి రూ. 4వేల కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలు.. ఇప్పుడు ఏకంగా రూ. 16వేల కోట్లకు చేరుకున్నాయని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇక ఉద్యోగుల నుంచి 4 దఫాలుగా చందాలు వసూలు చేసినా.. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో సర్కార్ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవిలో కొనసాగాలంటే మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పాలిటెక్నిక్ విద్య విషయంలోనూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తన అభిప్రాయాలను నేరుగా కేసీ వేణుగోపాలకు వివరించారు రేవంత్ రెడ్డి. కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత క్రమశిక్షణ రాహిత్యం పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. బీసీ మహిళపై వేటు వేస్తే పార్టీకి వచ్చే నష్టంపైన కాంగ్రెస్ హై కమాండ్ బెరీజు వేస్తోంది. కొండా సురేఖ వివరణ తీసుకుని నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ అందజేయనున్నారు. ఆ తర్వాత కొండా సురేఖపై నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రకటించనుంది. కాగా, ఇటీవల రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత పలు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Free onions distribution in Warangal: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా మంది వంటింట్లో ఉల్లిపాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వెరైటీగా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన నేపథ్యంలో..ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణిని చేశారు. ట్రాలీలో ఉల్లిగడ్డ సంచులను తీసుకొనివచ్చిసీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిరోడ్డు మీద పంపిణి చేపట్టాడు. దీంతో జనాలు ఉల్లిపాయల ప్యాకెట్ ల కోసం భారీగా క్యూలు కట్టారు. Read more: Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. సుష్మిత వివాదంపై హీటెక్కిన రాజకీయాలు.!. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది.ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నేత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

దిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిమాణాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు, వారు ఇచ్చిన వివరణ తదితర అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పెంకుటింట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు వచ్చిన ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ సభలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత! Sircilla: నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే ఇలా దాడులకు పాల్పడితే.. 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న తాము దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఈ అణచివేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి, నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని నితిన్ నబీన్ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసు యంత్రాంగం... బాధితులకు అండగా నిలిచేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టే నాటకాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై దాడులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు. రాంచందర్ రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ అంశం ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపు మేరకు ఆమె హస్తిన బాట పట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు కూడా ఆమె అపాయింట్మెంట్ కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలను ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ... ఆ వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఆమె ఇప్పటికే తన వివరణను సమర్పించారు. కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు, వనపర్తి వ్యవహారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన సమగ్ర నివేదికను టీపీసీసీ నేరుగా అధిష్ఠానానికి పంపించింది. అధిష్ఠానం వద్దకు నివేదికలు చేరిన వెంటనే కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘన అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయ ఘర్షణలతో యాదాద్రి భువనగిరి జిల్లా అట్టుడికింది. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా?” అంటూ ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ సీనియర్ నేత మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు చండూరులో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే బీజేవైఎం కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ‘ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని వేయి రోజులు గడిచాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, హామీలో నెరవేరిచే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 2 నుంచి 8 వరకు ప్రతి రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 2న 420 హామీలు బ్యానర్లపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, 3న రైతుల హామీలపై కాజీపేట జంక్షన్ లో ధర్నా, 4న హనుమకొండ చౌరస్తాలో వంటా వార్పు, 5న ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ, ధర్నా, 6న ఇంజన్ సెంటర్లో ఆటోలో డ్రైవర్లతో నిరసన, 7న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజావాణిలో వినతులు సమర్పణ, 8న కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయడం పై నిరసన చేయనున్నట్లు తెలిపారు. షాదీ ఖానా స్థలాన్ని మైనార్టీలు సాధించుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మిషన్ హాస్పిటల్ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలి. రీల్స్ చూసి కాదు రియల్ లైఫ్ లా పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదన్నారు. ప్రతిపక్షంపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. నంది పంది, అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana bjp chief ramchander rao fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తార్నాకాకు భారీగా చేరుకున్నారు. బీజేపీ నేతలు సైతం అక్కడకు చేరుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో అక్కడ బీజేపీ కార్యర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు రామ చందర్ రావు ముందుకు వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రామచందర్ రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దాడులు, అడ్డుకొవడాలు ఏంటని మండిపడ్డారు. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హమీలు ఇచ్చి ప్రజలను తీవ్రంగా దగా చేసిందన్నారు. Read more: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! మరోవైపు రానున్న రోజులలో కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో తెలంగాణ

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్‌ను ప్రతిఫలించట్లేదని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి

త్వరలో భారీ రాజకీయ మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వైఎస్సార్ పాలనే మాకు ఆదర్శం Komatireddy Rajagopal Reddy: తెలంగాణ రాజకీయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో త్వరలోనే పెను రాజకీయ మార్పులు రాబోతున్నాయని, ప్రజల కోసం తానొక బలమైన వేదికను నిర్మించబోతున్నానని ఆయన ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఒక సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చకు దారితీశాయి. TTD: సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపే దివ్య వేడుకలు.. తిరుమలలో బ్రహ్మోత్సవాల శోభ.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల తేదీలివే రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు, సంక్షేమ వ్యవస్థలు ధ్వంసం: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టాయని, విద్యా రంగానికి కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతోందని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేతితో రైతు బంధు ఇస్తూ, మరో చేతితో గల్లీగల్లీలో ఉన్న బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు పెంచి ప్రజల డబ్బులు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాన్ని కేవలం వ్యాపారంగా మార్చుకుని, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వచ్చిన వాళ్ళు శాశ్వతంగా నిలబడలేరని, అలాంటి వారు వ్యాపారాలు చేసుకోవచ్చని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా నిప్పులు చెరిగారు. వైఎస్సార్ ఆదర్శం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ: తమకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శమని, కోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy) బ్రదర్స్ ఎప్పటికీ 'వైఎస్ టీమ్' అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ అందించిన స్వర్ణయుగ పాలనను ప్రజలకు మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని, అవసరమైతే నిజాయితీపరులు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. రాబోయే రాజకీయ మార్పుల్లో తన పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని తేల్చిచెప్పడం ద్వారా

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం ఏ. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్-అంబర్‌పేట వంతెన ప్రారంభోత్సవ ప్రజా సమావేశంలో మాట్లాడిన ఆయన, అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించకుండా ఫార్మ్‌హౌస్‌కే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీ జీతం మరియు ఇతర భద్రతా సౌకర్యాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరుకావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కేవలం ఫార్మ్‌హౌస్‌కే పరిమితమై 1000 రోజులు గడిపేశారని ఆరోపించారు. దేశంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ప్రజలకు దూరంగా ఇన్ని రోజులు ఉండలేదని, ప్రజాప్రతినిధిగా ఇది ఏమాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ 1000 రోజుల కాలంలో కేసీఆర్ జీతం రూపంలో రూ.1.24 కోట్లు తీసుకోగా, ఆయన భద్రత మరియు బుల్లెట్ ప్రూఫ్ ల కోసం ప్రభుత్వం మరో రూ.21 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. దీంతో మొత్తం రూ.22.24 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే ఉద్యోగం ఊడుతుందని, మరి అసెంబ్లీకి రాని కేసీఆర్ విషయంలో ఏం చేయాలని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కేసీఆర్ వచ్చి 1000 రోజుల కాంగ్రెస్ పాలనతో పాటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రత్యక్ష చర్చకు రావాలని సీఎం సవాలు విసిరారు. ఫలితంగా సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, బైక్ ర్యాలీలు