
ఆందోళనకూ ఆభరణం’ ఉందండోయ్
ఆభరణాలనగానే... నెక్లెస్, హారం, వడ్డాణం, కాసులపేరు, కంఠాభరణం, గాజులు, ఉంగరాల్లాంటివి కళ్ల ముందు కదలాడతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వాటిని ధరించి, ఆ తర్వాత లాకర్లలో భద్రపరుస్తారు. ఇప్పటిదాకా ఆడంబరాన్ని ప్రదర్శించే ఆభరణాలు మాత్రమే చూశాం. నవతరంలో ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆభరణాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆందోళనను తగ్గించేందుకు ‘యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలు’ జెన్ జీని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఆభరణం అంటే ఆడంబరమే కాదు... ఆరోగ్యం కూడా... పోటీ పరీక్షల్లో ఆన్సర్ షీట్ తీసుకుంటుంటే చేతులు వణకడం, జాబ్ ఇంటర్వ్యూలలో నోట్లో తడి ఆరిపోవడం, స్టేజీ ఎక్కి మైకు పట్టుకోగానే నోరు పెగలక నీళ్లు నమలడం... ఇలా ఆందోళనకు లోనయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. ఆయా సందర్భాలను ఎదుర్కొనేందుకు జెన్ జీ కొన్నిరకాల ఆభరణాలను ఆశ్రయిస్తోంది. అవే ‘యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలు’గా మార్కెట్లో లభిస్తున్నాయి. ఆభరణాలు... ఆటలాగా... ఆధునిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన భాగం అయిపోయాయి. గుండెదడ పెరిగిన ప్రతీసారి మనసులో పది అంకెలు లెక్కబెట్టుకోవడం, కళ్లు మూసుకుని ప్రాణాయామం చేయడం, గట్టిగా నవ్వుకోవడం లాంటి సంప్రదాయ పద్ధతులు మామూలే. ఇంతకు ముందు ఆందోళనను తగ్గించేందుకు ఫిడ్జెట్ స్పిన్నర్స్, స్ట్రెస్ బాల్స్ వంటి సాధనాలు అందుబాటులో ఉండేవి. జెన్ జీలు మాత్రం తమ చేతి వేలి ఉంగరానికి ఉన్న గుండ్లను కదుపుతూ లేదా తమ హారానికి ఉన్న పెండెంట్‌ను నోట్లో పెట్టుకుని ఊదడం లాంటివి చేస్తూ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకుంటున్నారు. ఇలాంటి కొత్తరకం సాధనాలన్నీ సోషల్ మీడియాలో పాపులరై ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఆందోళన తగ్గించే ఆభరణాలలో కొన్ని... స్పిన్నర్ రింగ్‌లు: చూసేందుకు సాధారణ ఉంగరాల్లాగే ఉంటాయి. కానీ ఈ ఉంగరాల పైపొరలో గుండ్లు (రోలింగ్ బీడ్స్) అమర్చుతారు. అలాగే హారాల పెండెంట్లలో కూడా చుట్టూ తిరిగే గుండు పొదుగుతారు. ఈ గుండ్లను ముందుకూ వెనక్కి కదలించడం ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చన్నది సారాంశం. బ్రీతింగ్ పెండెంట్లు: వీటిని ఆయా హారాలలో పెండెంట్లుగా ధరిస్తారు. చిన్న స్ట్రా ఆకారంలో