
రైల్వేస్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా..? కాగ్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు
భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటి షాకింగ్ నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 1.75 కోట్లకు పైగా ప్రయాణికులు రైలు మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో ప్రజలు నమ్ముకున్న రైల్వే స్టేషన్లలో అందించే తాగునీరు, పారిశుధ్య ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించిన కాగ్ , తీవ్ర ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. రైల్వే స్టేషన్లలో లభ్యమయ్యే ఉచిత తాగునీటి నాణ్యత మరియు అక్కడ నిర్వహించే పారిశుధ్యంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అమర్చిన వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫారమ్‌లపై ఉండే తాగునీటి కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాలను అధునాతన పరీక్షలకు పంపగా, వాటిలో ఈ.కోలై (E. coli) మరియు కలెక్టివ్ కోలిఫామ్ బ్యాక్టీరియా లభ్యమైనట్లు ఆడిట్లో తేలింది. వైద్య నిపుణుల ప్రకారం E. coli బ్యాక్టీరియా నీటిలో ఉందంటే అది ప్రధానంగా మల వ్యర్థాల కాలుష్యానికి సూచికగా భావిస్తారు. ప్రతి E. coli స్ట్రెయిన్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగించకపోయినప్పటికీ, ఇటువంటి బ్యాక్టీరియా కలిసిన నీటిని నేరుగా తాగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మరియు ఇతర తీవ్రమైన జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం మెండుగా ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లపై ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు ప్లాట్‌ఫారమ్ షెల్టర్లు వంటి కనీస వసతులు కచ్చితంగా కల్పించాలి. అయితే ఆడిట్ నివేదిక ప్రకారం క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నీటి ట్యాంకులు, వాటర్ కూలర్లు, పైప్లైన్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే నీరు కలుషితమవుతోందని కాగ్ ఎత్తిచూపింది. గతంలో 2021లో వెలువడిన రైల్వే ఆడిట్ నివేదికలో కూడా మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ లోపాలపై హెచ్చరించినప్పటికీ
