
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ ను పునరుద్ధరించే ప్రాతిపాదన విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఈ పెన్షన్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఓపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా యూపీఎస్ ఉందని తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపీఎస్ ఎంపిక విషయంలో మినహాయింపు ఇచ్చింది. అంతేకాదు ఓపీఎస్ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని తెలిపింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఓపీఎస్ విధానం అవలంబిస్తే దీని వల్ల ఆర్థిక భారాలు పెరుగుతాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హెచ్చరించినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించే ఉద్దేశ్యం తమకు లేదని ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింది. ఓపీఎస్ ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపిందని.. దీంతో ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కాపాడుకోవడం కష్టంగా మారిందనేది ప్రభుత్వం వాదనగా ఉంది. అందువల్ల ఈ దిశగా మళ్లీ ఎటువంటి చర్యలు తీసుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు షాక్:
ఆగస్టు 10, 2026న లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయమని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయమై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుచేసుకుంది. పాత పింఛను పథకాన్ని (OPS) అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నివేదిక పేర్కొంది.
NPS పింఛను పథకంపై ఉద్యోగుల అభ్యంతరాలను పరిష్కరించడానికి, ఏప్రిల్ 1, 2025 నుండి ఏకీకృత పింఛను పథకాన్ని (UPS) అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. NPS కంటే UPS ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కింద నెలకు కనీసం రూ. 10,000 పింఛను లభిస్తుంది.
యూపీఎస్ పథకం కింద, కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి, పదవీ విరమణకు ముందు వచ్చే 12 నెలల కాలానికి గాను తన సగటు మూల వేతనంలో 50శాతం హామీతో కూడిన పింఛనును పొందుతారు. 10 నుండి 25 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారి సర్వీసు కాలం ఆధారంగా పింఛను పొందుతారు. ఉద్యోగి మరణించిన తర్వాత, వారి జీవిత భాగస్వామి కూడా కుటుంబ పింఛనులో 60శాతం పొందుతారు. ఓపీఎస్ పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్ వ్యయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెబుతుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





