
BRS Protest | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన
BRS Protest | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన
© 2026 nimisham.in

BRS Protest | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. నల్లగొండ, సెప్టెంబర్ 2: జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు(గురువారం) మహాధర్నాకు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ప్రధాన ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే రేపు మిర్యాలగూడలో మాజీ మంత్రి ధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు..1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. గత పదేళ్ల వైఫల్యాలపై ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. కేటీఆర్ పర్యటన వేళ ఫ్లెక్సీల ఏర్పాటుతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్

Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్ Narsampet: నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల పిలుపు మేరకు నర్సంపేట డివిజన్ బంద్‌కు వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. దీంతో నర్సంపేటలో పలు దుకాణాలు, వ్యాపార, ప్రైవేటు స్కూలు,కాలేజీలు సంస్థలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిక భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అన్ని తాసీల్దార్ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పేదల పెండ్లీళ్లకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్ఠాత్మకం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అని నాయకులు దుయ్యబట్టారు. వెంటనే పేద కుటుంబాలను ఆదుకునే కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. [caption id="attachment_2486045" align="alignnone" width="1200"] భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు[/caption] కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపుతో కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవీపల్లి, పాల్వంచ, జూలూరుపాడు మండలాల్లో భారీ ఎత్తున నాయకులు పాల్గొని నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు అనుదీప్. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్. లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కోటి వెంకటేశ్వర్లు. సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ, పాల్వంచ మండలం అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్. జగన్, కార్పొరేటర్లు సింధు తపస్వి, గుణ చరిత, మధు, చంద్, రాంబాబు, సాగర్, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

నర్సంపేటలో విగ్రహ గద్దె కూల్చివేత బీఆర్ఎస్ నేతల భారీ ధర్నా స్తంభించిన ప్రధాన రహదారుల ట్రాఫిక్ BRS Protest Narsampet: వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు స్థలంలో నిలబెట్టిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన గద్దెను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS Protest Narsampet)పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రతినిధులు నడిరోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడంతో నర్సంపేట పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్ బీఆర్ఎస్ నేతల నిరసన – మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌కు డిమాండ్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో ఈ బృహత్ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళనలో మున్సిపల్ మాజీ ఛైర్మన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడిన నేతలు, ప్రైవేటు స్థలంలో నిర్మించిన గద్దెను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిలిచిపోయిన రాకపోకలు – స్తంభించిన ట్రాఫిక్: మెడికల్ కళాశాల ప్రధాన రహదారిపై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైఠాయించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ధర్నా ప్రభావంతో నర్సంపేట-మహబూబాబాద్, నర్సంపేట-కొత్తగూడ, నర్సంపేట-ములుగు ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, నిరసనకారులను సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు